సాక్షి, అమరావతి: ఆర్థికంగా వెనుకబడిన వర్గాల ఉద్యోగార్థులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఉద్యోగాల భర్తీలో ఈడబ్ల్యుఎస్ వారికి ఐదేళ్ల వయోపరిమితి పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఏపీ రాష్ట్ర సబార్డినేట్ సర్వీసు రూల్స్‌ను సవరిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. బీసీ,ఎస్సీ,ఎస్టీ తరహాలోనే ఈడబ్ల్యుఎస్‌కు ఐదేళ్ల వయోపరిమితిని ప్రభుత్వం పెంచింది.
ప్రస్తుతం 34 ఏళ్లు ఉన్న వయోపరిమితి 39 ఏళ్లకు పెంచింది. దీంతో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ లో ఈ డబ్ల్యు ఎస్ వర్గాలు మేలు పొందనున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment