
ప్రస్తుత పోటీ ప్రపంచంలో చదువు పూర్తయిన తరువాత ఉద్యోగం సంపాదించడం కష్టమైపోతోంది. ఒకప్పుడు ఉద్యోగానికి అప్లై చేయాలంటే చదువు, నైపుణ్యాలు వంటివన్నీ చేర్చి రెజ్యూమ్ (సీవీ) క్రియేట్ చేసేవాళ్ళు. అయితే ఇప్పుడు టెక్నాలజీ పెరిగిపోయింది. రెజ్యూమ్ క్రియేట్ చేయడానికి కూడా చాట్‌జీపీటీ వాడేస్తున్నారు. ఇలా చాట్‌జీపీటీ సాయంతో రూపొందిన రెస్యూమ్ చూసి ఇటీవల ఓ కంపెనీ సీఈఓ ఖంగుతిన్నారు.
ఢిల్లీలోని ఎంట్రేజ్ కంపెనీ సీఈఓ 'అనన్య నారంగ్'.. ఒక ఉద్యోగానికి వచ్చిన సీవీ చూసారు. అది చాట్‌జీపీటీ ద్వారా రూపొందించినట్లు తెలిసింది. చాట్‌జీపీటీ ద్వారా సీవీ క్రియేట్ చేయడంలో ఎలాంటి ఇబ్బంది లేదు. కానీ అందులో అన్నీ వివరణాత్మకంగా లేకపోవడంతో ఒక్కసారిగా కంగుతింది.
నిజానికి నువ్వు అడిగే ప్రశ్నకు తగినట్లుగా చాట్‌జీపీటీ ఓ సమాధానం ఇస్తుంది. అందులో కొన్ని మనమే పూరించాల్సి ఉంటుంది. కానీ ఉద్యోగానికి అప్లై చేసిన అభ్యర్థి చాట్‌జీపీటీ ఇచ్చిన సీవీను నేరుగా కంపెనీకి పంపించారు. అందులో పూరించాల్సిన విషయాలు కూడా అలాగే వదిలిపెట్టేసారు.
ఇదీ చదవండి: రెజ్యూమ్ ఇలా క్రియేట్ చేస్తే.. జాబ్ రావాల్సిందే!
ఎక్స్‌పీరియన్స్ కాలమ్ దగ్గర ఉదాహరణ అని ఉండటం చూడవచ్చు. దీనికి సంబంధించిన స్క్రీన్‌షాట్‌ను అనన్య నారంగ్ తన ఎక్స్ ఖాతాలో షేర్ చేస్తూ.. ఇటీవల ఉద్యోగ దరఖాస్తును స్వీకరించారు. ఈరోజు మనకు నిరుద్యోగం ఎక్కువైందంటే ఆశ్చర్యం లేదు అని పేర్కొన్నారు.
అనన్య నారంగ్ షేర్ చేసిన ఈ సీవీ నెట్టింట్లో వైరల్ అవుతోంది. ఇది చూసిన నెటిజన్లు తమదైన రీతిలో స్పందిస్తూ.. కామెంట్ చేస్తున్నారు. స్క్రీన్‌షాట్ చూస్తుంటే అభ్యర్థి సీవీను చదవకుండా.. కాపీ పేస్ట్ చేసినట్లు తెలుస్తోందని అన్నారు. చాలా చోట్ల వ్యక్తిగత సమాచారానికి బదులుగా టెంప్లేట్స్ మాత్రమే ఉన్నాయి. చాట్‌జీపీటీ వచ్చిన తరువాత ఇలాంటి సీవీలు సర్వ సాధారణం అయిపోయాయని కొందరు చెబతున్నారు.
Just received yet another job application. No wonder we have so much unemployment today :’) pic.twitter.com/c0VaGWYrIJ
— Ananya Narang (@AnanyaNarang_) October 15, 2024