చదువు పూర్తవ్వగానే అందరూ చేసే పని జాబ్ సర్చింగ్. ఉద్యోగం వెతుక్కునే క్రమంలో తప్పకుండా 'రెజ్యూమ్' తయారు చేసుకోవాల్సి ఉంటుంది. చాలా మందికి ఇది ఓ పెద్ద సవాలుగా అనిపిస్తుంది. చదువు, వ్యక్తిగత వివరాలు వంటి విషయాలతో ఒక డాక్యుమెంట్ రూపొందించుకోవాలి. అయితే చాలామందికి ఎక్కడ నుంచి మొదలెట్టాలి, ఎక్కడ ముగించాలి, అనే చాలా విషయాలు తెలియక పోవచ్చు. చాట్‌జీపీటీ సహాయంతో ఇప్పుడు రెజ్యూమ్ క్రియేట్ చేయడం చాలా సులభమైపోయింది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు క్షుణ్ణంగా ఇక్కడ తెలుసుకుందాం.
చాట్‌జీపీటీలో సైన్ ఇన్ అవ్వడం - రెజ్యూమ్ క్రియేట్ చేయాలనుకునే వ్యక్తి మొదట బ్రౌజర్‌లో 'ఓపెన్ఏఐ' సర్చ్ చేయాలి. సర్చ్ చేసిన తరువాత చాట్‌జీపీటీ హోమ్‌పేజీలో సైన్ ఇన్ చేసుకోవాలి. చాట్‌జీపీటీని ఉచితంగా ఉపయోగించుకోవచ్చు, కాబట్టి సైన్ ఇన్ చాలా సులభంగా ఉంటుంది. ఆధార్, పాన్ వంటి వివరాలు దీనికి అవసరం లేదు.
ఇదీ చదవండి: ఏ ప్రశ్నకైనా సమాధానం 'చాట్‌జీపీటీ' - ఇంటర్వ్యూకి ఇలా సిద్దమైపోండి
టెక్స్ట్ యాడ్ చేయడం - మీరు రెజ్యూమ్ స్టార్ట్ చేయాలనుకున్నప్పటి నుంచి చాట్‌జీపీటీ సర్చ్ బాక్స్‌లో కావలసిన విషయాలను టైప్ చేసి అడగవచ్చు. ఉదాహరణకు నేను రెజ్యూమ్ ఎలా క్రియేట్ చేయాలి అని టైప్ చేయగానే.. మీకు చాట్‌జీపీటీ సమాధానం అందిస్తుంది. అలా మీరు అడిగినదానికి చాట్‌జీపీటీ సమాధానాలు అందిస్తుంది.
చాట్‌జీపీటీ అందించే సమాధానాల్లో మీకు నచ్చినది సెలక్ట్ చేసుకోవచ్చు. సెలక్ట్ చేసుకున్న తరువాత మీకు నచ్చినట్లు ఎడిట్ చేసుకోవచ్చు. దీని కోసం చాట్‌జీపీటీ అందించిన విషయాలను కాపీ చేసి వర్డ్ డాక్యుమెంట్స్ వంటి వాటిలో పేస్ట్ చేసుకోవచ్చు.
చాట్‌జీపీటీ అందించిన విషయాలను కాపీ పేస్ట్ చేసుకున్న తరువాత మీకు నచ్చిన విధంగా ఎడిట్ చేసుకుని, మీ వివరాలను ఫిల్ చేసుకోవచ్చు. ఇలా ఒకదాని తరువాత ఒకటి పూర్తి చేస్తూ మీ రెజ్యూమ్ పూర్తి చేసుకోవచ్చు. దీనికి సంబంధించిన ఫోటోలను ఈ కథనంలో చూడవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment