కొత్త సంవత్సరంలో జాబ్స్ కోసం చూస్తున్న ఉద్యోగార్థులకు పండగ లాంటి వార్త ఇది. వచ్చే ఏడాది తొలి ఆరునెలల్లో దేశవ్యాప్తంగా పలు రంగాల్లో 39 లక్షల కొత్త ఉద్యోగాలు రానున్నట్లు తాజాగా ఒక నివేదిక తెలిపింది.
స్థూల ఆర్థికపరమైన ఇబ్బందులు కొనసాగుతున్నప్పటికీ 2024 ప్రథమార్థంలో భారతదేశంలో 3.9 మిలియన్ల ఫ్రంట్‌లైన్ ఉద్యోగాలకు డిమాండ్ బలంగా కొనసాగుతోందని సాస్(SaaS), ఫ్రంట్‌లైన్ వర్క్‌ఫోర్స్ మేనేజ్‌మెంట్ ప్లాట్‌ఫామ్ బెటర్‌ప్లేస్ (BetterPlace) తమ సంవత్సరాంతపు నివేదికలో పేర్కొంది.
ఈ పరిశ్రమల నుంచే అత్యధికం
ఒక మిలియన్ డేటా పాయింట్లను విశ్లేషించిన బెటర్‌ప్లేస్ నివేదిక.. మొత్తం డిమాండ్‌లో 50 శాతం లాజిస్టిక్స్, మొబిలిటీ పరిశ్రమల నుంచే ఉన్నట్లు వెల్లడించింది. ఇక ఈ-కామర్స్, ఐఎఫ్‌ఎం, ఐటీ పరిశ్రమలు వరుసగా 27 శాతం, 13.7 శాతంతో రెండు, మూడో స్థానాల్లో ఉన్నాయి.
మరోవైపు బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్, ఇన్సూరెన్స్ (BFSI) రంగం నుంచి 0.87 శాతం, రిటైల్, క్విక్ సర్వీస్ రెస్టారెంట్లు(QSR) నుంచి 1.96 శాతం డిమాండ్ కొనసాగుతుందని నివేదిక విశ్లేషించింది.
ఇదీ చదవండి: అంబానీ ‘కొత్త’ అడుగు.. ఒకే దెబ్బకు మూడు పిట్టలు!
Comments
Please login to add a commentAdd a comment