Lakhs of jobs
-
లక్షల ఉద్యోగాలు సృష్టిస్తామంటున్న గజల్ అలఘ్.. ఎవరీమె?
రాబోయే 10 సంవత్సరాలలో తమ కంపెనీ లక్షలాది ఉద్యోగావకాశాలను సృష్టిస్తుందని మామాఎర్త్ (mamaearth) సహ వ్యవస్థాపకురాలు గజల్ అలఘ్ చెబుతున్నారు. తమను అభినందించిన ప్రధాని నరేంద్ర మోదీకి కృతజ్ఞతలు తెలుపుతూ ‘ఎక్స్’ (ట్విటర్)లో పోస్ట్ చేశారు.కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరీ తన నివాసంలో నిర్వహించిన విశేష సంపర్క్ కార్యక్రమంలో మామాఎర్త్ సహ వ్యవస్థాపకుడు వరుణ్ అలఘ్ ప్రసంగించారు. దీన్ని కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరీ ఎక్స్‌లో పోస్ట్ చేయగా ప్రధాని నరేంద్ర మోదీ స్పందిస్తూ వరుణ్ అలఘ్ను అభినందించారు. స్టార్టప్‌లను, సంపద సృష్టిని తమ ప్రభుత్వం చురుకుగా ప్రోత్సహిస్తోందన్నారు. ముఖ్యంగా టైర్-2, 3 నగరాల్లో యువశక్తిని చూసి గర్విస్తున్నామని ప్రధాని పేర్కొన్నారు.వరుణ్ అలఘ్ సతీమణి కంపెనీ సహ వ్యవస్థాపకురాలు గజల్ అలఘ్ దీన్ని రీ ట్వీట్ చేస్తూ “ధన్యవాదాలు నరేంద్ర మోదీజీ. మీ ఆశీర్వాదం, ప్రభుత్వ మద్దతుతో రాబోయే 10 సంవత్సరాలలో లక్షల ఉద్యోగాలను సృష్టిస్తాం’’ అని ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసలపై స్పందిస్తూ గజల్ అలఘ్ పేర్కొన్నారు. మోదీ అందించిన ప్రోత్సాహం తమలో మరింత అంకిత భావాన్ని పెంపొందిస్తుందన్నారు. భారతీయ అందాలను ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తామని, ప్రతిచోటా భారత జెండా ఎగరేస్తామంటూ రాసుకొచ్చారు. Thank you @narendramodi ji 🙏Aapke aashirvaad aur Modi sarkaar ke support ke sath lakhon jobs create karenge agle 10 saal mein.This truly fuels our passion and makes us even more determined to succeed. We will take Indian beauty to the world and place the Bharat flag… pic.twitter.com/GzuEU6Qrfc— Ghazal Alagh (@GhazalAlagh) May 22, 2024 -
ఈ రంగంలో 2 లక్షల ఉద్యోగాలు
కోవిడ్ మహమ్మారి కారణంగా హాస్పిటాలిటీ పరిశ్రమ తీవ్ర ఎదురుదెబ్బను ఎదుర్కొంది. ఫలితంగా భారీగా తొలగింపులు జరిగాయి. అయితే ఆర్థిక వ్యవస్థ తిరిగి కోలువడం, ప్రయాణాలు తిరిగి పుంజుకోవడంతో హోటల్స్ వ్యాపారంలో డిమాండ్ మళ్లీ పెరిగింది. దీంతో విస్తరణ ప్రణాళికలకు, గణనీయమైన నియామకాలకు దారితీసింది.రానున్న 18 నెలల్లో 2 లక్షల ఉద్యోగాలుహోటళ్ల వ్యాపారం, హాలిడే ప్రయాణాలలో వృద్ధిని పొందేందుకు సిద్ధమవుతున్న నేపథ్యంలో ఆతిథ్య సంస్థలు తమ కార్యకలాపాలను దూకుడుగా విస్తరిస్తున్నాయి. టీమ్స్‌లీజ్ సర్వీసెస్ అంచనాల ప్రకారం.. హోటల్, రెస్టారెంట్, పర్యాటక రంగం రాబోయే 12-18 నెలల్లో సుమారు 2 లక్షల ఉద్యోగాలను సృష్టించడానికి సిద్ధంగా ఉంది. ఈ ఉద్యోగ అవకాశాలలో దాదాపు సగం హోటల్ పరిశ్రమలోనే ఉంటాయని ఎకమిక్ టైమ్స్ నివేదించింది.దేశీయ, విదేశీ పర్యాటకుల సంఖ్య పెరుగుదలను సూచిస్తున్న అంచనాలతో, హోటల్ పరిశ్రమ గణనీయమైన వృద్ధికి సిద్ధంగా ఉంది. ఫార్చ్యూన్ హోటల్స్ ప్రతిష్టాత్మకమైన విస్తరణ ప్రణాళికల ద్వారా నియామకంలో 8-10 శాతం పెరుగుదలను అంచనా వేస్తోంది. ఇక లెమన్ ట్రీ తమ ఆర్థిక సంవత్సర లక్ష్యాలకు మద్దతుగా వేలాది మందిని నియమించుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది.డిమాండ్ వీరికే..ఫ్రంట్ డెస్క్ ఏజెంట్లు, గెస్ట్ రిలేషన్స్ మేనేజర్లు, హౌస్ కీపింగ్ సిబ్బంది డిమాండ్‌లో అగ్రస్థానంలో ఉన్నారు. అలాగే మెయింటెనెన్స్ టెక్నీషియన్లు, చెఫ్‌లు వంటి నిపుణులకు కూడా అధిక డిమాండ్ ఉంది. ఆతిథ్య రంగంలోని అన్ని విభాగాల్లోనూ ప్రొఫెషనల్స్‌కు డిమాండ్‌లో గణనీయమైన పెరుగుదల ఉన్నట్లు మ్యాన్‌పవర్ ఏజెన్సీలు నివేదించాయి. సేల్స్, మార్కెటింగ్, డిజిటల్ మార్కెటింగ్, టెక్నికల్ ఉద్యోగాలు, మానవ వనరులు ప్రత్యేకించి పరిశ్రమలో విస్తృత ఆధారిత పునరుద్ధరణను సూచిస్తున్నాయి.ఇక్రా ప్రకారం.. 2025 ఆర్థిక సంవత్సరంలో హోటల్ పరిశ్రమ 7-9 శాతం స్థిరమైన ఆదాయ వృద్ధిని సాధిస్తుందని అంచనా. ఇది ఈ రంగం స్థితిస్థాపకత, పునరుద్ధరణ పథాన్ని నొక్కి చెబుతోంది. సాంప్రదాయ హోటల్ ఆపరేటర్లు మాత్రమే కాకుండా, ఆన్లైన్ ట్రావెల్ ప్లాట్‌ఫామ్‌లు కూడా హైరింగ్‌లో స్పీడ్ పెంచనున్నాయి. -
39 లక్షల జాబ్స్.. ఉద్యోగార్థులకు పండగే!
కొత్త సంవత్సరంలో జాబ్స్ కోసం చూస్తున్న ఉద్యోగార్థులకు పండగ లాంటి వార్త ఇది. వచ్చే ఏడాది తొలి ఆరునెలల్లో దేశవ్యాప్తంగా పలు రంగాల్లో 39 లక్షల కొత్త ఉద్యోగాలు రానున్నట్లు తాజాగా ఒక నివేదిక తెలిపింది. స్థూల ఆర్థికపరమైన ఇబ్బందులు కొనసాగుతున్నప్పటికీ 2024 ప్రథమార్థంలో భారతదేశంలో 3.9 మిలియన్ల ఫ్రంట్‌లైన్ ఉద్యోగాలకు డిమాండ్ బలంగా కొనసాగుతోందని సాస్(SaaS), ఫ్రంట్‌లైన్ వర్క్‌ఫోర్స్ మేనేజ్మెంట్ ప్లాట్‌ఫామ్ బెటర్‌ప్లేస్ (BetterPlace) తమ సంవత్సరాంతపు నివేదికలో పేర్కొంది. ఈ పరిశ్రమల నుంచే అత్యధికం ఒక మిలియన్ డేటా పాయింట్లను విశ్లేషించిన బెటర్‌ప్లేస్ నివేదిక.. మొత్తం డిమాండ్‌లో 50 శాతం లాజిస్టిక్స్, మొబిలిటీ పరిశ్రమల నుంచే ఉన్నట్లు వెల్లడించింది. ఇక ఈ-కామర్స్, ఐఎఫ్ఎం, ఐటీ పరిశ్రమలు వరుసగా 27 శాతం, 13.7 శాతంతో రెండు, మూడో స్థానాల్లో ఉన్నాయి. మరోవైపు బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్, ఇన్సూరెన్స్ (BFSI) రంగం నుంచి 0.87 శాతం, రిటైల్, క్విక్ సర్వీస్ రెస్టారెంట్లు(QSR) నుంచి 1.96 శాతం డిమాండ్ కొనసాగుతుందని నివేదిక విశ్లేషించింది. ఇదీ చదవండి: అంబానీ ‘కొత్త’ అడుగు.. ఒకే దెబ్బకు మూడు పిట్టలు! -
యువత ఆశల్ని కేంద్రం చిదిమేసింది
న్యూఢిల్లీ: పెట్టుబడిదారులైన కొందరు మిత్రుల కోసం కేంద్ర ప్రభుత్వం లక్షలాది మంది యువత ఆశల్ని చిదిమేసిందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ధ్వజమెత్తారు. రెండేళ్ల కాలంలో ప్రభుత్వ రంగ సంస్థ(పీఎస్‌యూ)ల్లోని 2 లక్షల ఉద్యోగాలను లేకుండా చేసిందని విమర్శించారు. దేశంలో నిరుద్యోగిత రికార్డు స్థాయికి చేరుకుందని తెలిపారు. దేశానికి గర్వకారణమైన ప్రభుత్వరంగ సంస్థల్లో ఉద్యోగం సంపాదించడం ప్రతి నిరుద్యోగ యువతకు కల..అలాంటి వాటిని ప్రభుత్వం వదిలేసిందన్నారు. రాహుల్ గాంధీ ఆదివారం ఈ మేరకు పలు ట్వీట్లు చేశారు. ‘2014లో పీఎస్‌యూల్లో 16.9 లక్షల ఉద్యోగాలుండగా 2022 వచ్చే సరికి వాటి సంఖ్య 14.9 లక్షలకు పడిపోయింది. బీఎస్ఎన్ఎల్లో 1,81,127 ఉద్యోగాలు, సెయిల్‌లో 61,928, ఎంటీఎన్ఎల్లో 34,997, ఎస్ఈసీఎల్లో 29,140, ఎఫ్‌సీఐలో 28,063, ఓఎన్జీసీలో 21,120 ఉద్యోగాలు తగ్గిపోయాయి. అభివృద్ధి చెందుతున్న దేశంలో ఉద్యోగిత పడిపోతుందా?’అని ఆయన ప్రశ్నించారు. ఏడాదికి రెండు కోట్ల మందికి ఉద్యోగాలిస్తామంటూ తప్పుడు వాగ్దానాలు చేసిన ప్రభుత్వం.. ఉద్యోగాల కల్పనను మరిచిపోయి 2 లక్షల ఉద్యోగాలను లేకుండా చేసిందన్నారు. ఇదే సమయంలో పీఎస్‌యూల్లో కాంట్రాక్టు నియామకాలు పెరిగిపోయాయి. ఇలా కాంట్రాక్టు ఉద్యోగాలకు ప్రాధాన్యం ఇవ్వడం రిజర్వేషన్ హక్కును లాగేసుకోవడం కాదా? ఇది ఈ సంస్థలను ప్రైవేట్‌పరం చేసే కుట్ర కాదా?’అని రాహుల్ ప్రశ్నించారు. ఒక వైపు పారిశ్రామిక వేత్తల రుణాల మాఫీ, మరోవైపు పీఎస్‌యూల్లో ప్రభుత్వ ఉద్యోగాల తొలగింపు! అమృత్కాల్ అంటే ఇదేనా’అని ప్రభుత్వాన్ని నిలదీశారు. -
లక్ష ఉద్యోగాలు ఇచ్చే వరకు పోరాటం
ఏఎస్‌రావునగర్(హైదరాబాద్‌సిటీ) : తెలంగాణ ప్రభుత్వం లక్ష ఉద్యోగాలు ఇచ్చే వరకు భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య (డీవైఎఫ్ఐ) పోరాటం కోనసాగుతుందని సంస్థ రాష్ట్ర అధ్యక్షులు కె. విజయ్‌కుమార్ స్పష్టం చేసారు. మంగళవారం కమలానగర్‌లోని డీవైఎఫ్ఐ కార్యాలయంలో జరిగిన డీవైఎఫ్ఐ కాప్రా జోన్ మహసభకు ముఖ్యఅతిధిగా హజరయ్యారు. ఈ సందర్భంగా విజయ్‌కుమార్ మాట్లాడుతూ కాప్రా జోన్ కమిటీ ఆధ్వర్యంలో ఉచిత స్పోకెన్ ఇంగ్లీష్ తరగతులు నిర్వహించటం అభినందనీయమని అన్నారు. సంస్థ జోన్ కార్యదర్శి ఎన్. బాబారావు మాట్లాడుతూ డీవైఎఫ్ఐ ఆధ్వర్యంలో చేపట్టిన కార్యక్రమాలు వివరించారు. ఈ సందర్భంగా నూతన కమిటీని ఎన్నుకున్నారు. కమిటీ అధ్యక్షుడుగా డి. ప్రవీణ్, కార్యదర్శిగా ఎస్. బాబురావు, ఉపాధ్యక్షులుగా కష్ణ, సహయ కార్యదర్శులుగా సురేష్, బాలకష్ణ, మణికంఠ, సభ్యులుగా రాజు, మనోజ్, పావన్ మందులను ఎన్నకున్నారు. -
నీళ్లు, నిధులు సాధించుకుంటాం
- ప్రాజెక్టులను నిర్ణీత సమయంలో పూర్తి చేస్తాం: సీఎం కేసీఆర్ - పొరుగు రాష్ట్రాలతో బస్తీ మే సవాల్ అంటే నీళ్లు రావు - మన అప్పులు చాలా రాష్ట్రాల కంటే తక్కువే - 2019-20 నాటికి రాష్ట్ర బడ్జెట్ రూ. 2 లక్షల కోట్లు దాటుతుంది - ఇంటికో ఉద్యోగమిస్తామని ఏనాడూ చెప్పలేదు - ఈ టర్మ్‌లోనే లక్ష ఉద్యోగాలు కల్పించే ప్రక్రియ పూర్తిచేస్తాం - గ్రూప్-2లో మరో వెయ్యి పోస్టులకు నోటిఫికేషన్ - 31న సాగునీటిపై అసెంబ్లీలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ - అసెంబ్లీలో ద్రవ్య వినిమయ బిల్లుపై సీఎం సుదీర్ఘ ప్రసంగం సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ఆకాంక్షకు కారణమైన నీళ్లు, నిధులు, నియామకాలను సాధించుకోవడంలో వెనకడుగు వేసేది లేదని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు స్పష్టంచేశారు. నిర్మాణంలో ఉన్న సాగునీటి ప్రాజెక్టులతోపాటు కొత్తగా తలపెట్టిన ప్రాజెక్టులను నిర్ణీత సమయంలో పూర్తిచేస్తామని చెప్పారు. పక్క రాష్ట్రాలతో ‘బస్తీ మే సవాల్’ అనే ధోరణిలో వెళ్లకుండా వాళ్ల ప్రయోజనాలు కూడా కాపాడుతూ ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో సాగునీటిని సాధించుకుంటున్నట్లు పేర్కొన్నారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షను నెరవేర్చేందుకు ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని, తదనుగుణంగా ఫలితాలు కనిపిస్తున్నాయని అన్నారు. మంగళవారం అసెంబ్లీలో ద్రవ్య వినిమయ బిల్లుపై సభ్యులు వ్యక్తం చేసిన సందేహాలకు సీఎం సుదీర్ఘంగా సమాధానమిచ్చారు. ముఖ్యమంత్రి ఏమన్నారో ఆయన మాటల్లోనే.. బడ్జెట్ కేటాయింపులు ఎప్పుడూ ఖర్చు కావు తెలంగాణ కొత్త రాష్ట్రం. ఏడు నెలల వరకు ఐఏఎస్‌లు కూడా లేరు. అయినా పదేళ్ల కాంగ్రెస్ పాలన కంటే, కేంద్ర ప్రభుత్వం ఖర్చు చేసిన బడ్జెట్ కంటే మెరుగైన ఫలితాలు సాధించినం. 2011-12 నుంచి 2014-15 వరకు కేంద్ర ప్రభుత్వం ప్రణాళికా నిధుల్లో 83.23 శాతం మాత్రమే ఖర్చు చేస్తే పదేళ్ల కాంగ్రెస్ పాలనలో 79.52 శాతం ఖర్చు చేశారు. కానీ 2015-16లో టీఆర్ఎస్ ప్రభుత్వం 80.33 శాతం ప్రణాళిక నిధులు ఖర్చు చేసింది. లగ్జరీ జెట్ తీసుకొని చైనా పర్యటనకు వెళ్లి రూ.15 కోట్లు వృథా ఖర్చు చేశారని ఉత్తమ్‌కుమార్ రెడ్డి అన్నారు. అది అవాస్తవం. చైనా ‘గో గ్లోబల్’ కార్యక్రమంలో భాగంగా వరల్డ్ ఎకానమిక్ ఫోరం నుంచి వచ్చిన ఆహ్వానం మేరకు మంత్రులు, అధికారులతో కలసి మొత్తం 17 మంది చైనాకు వెళ్లి తొమ్మిది రోజుల పాటు 13 బిజినెస్ మీటింగుల్లో పాల్గొన్నాం. ఇందుకు విమానం ఖర్చు రూ.2.03 కోట్లు అయితే భోజనాలు, హోటళ్లు, లాడ్జింగులు, వాహనాల రెంటుకు అయిన ఖర్చు రూ.72 లక్షలు. తెలంగాణ అప్పులు 16.1 శాతమే అప్పులకు భయపడాల్సిన అవసరం లేదు. ఎఫ్ఆర్బీఎం చట్టం ప్రకారం ప్రభుత్వం రాష్ట్ర అవసరాలకు అప్పులు తీసుకుంటుంది. కేంద్ర ప్రభుత్వ అప్పులు 47 శాతం ఉంటే తెలంగాణ అప్పులు 16.1 శాతమే. పంజాబ్, గోవా, ఉత్తరప్రదేశ్, కేరళ, బిహార్, మధ్యప్రదేశ్ మొదలుకొని ఆంధ్రప్రదేశ్ వరకు 17 నుంచి 30 శాతం వరకు అప్పుల్లో ఉన్నాయి. పంజాబ్ 36 శాతంతో అగ్రస్థానంలో ఉంటే ఛత్తీస్‌గఢ్, తెలంగాణ తప్ప అన్ని రాష్ట్రాలు 20 శాతంపైనే ఉన్నాయి. రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో వృద్ధి రేటు ఉంటేనే అప్పులు పుడతాయి. 2015-16లో 12.7 శాతం వృద్ధిరేటు తెలంగాణకు ఉంది. బిహార్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ అప్పు పుట్టని రాష్ట్రాల కేటగిరీలో ఉన్నాయి. ఇంటికో ఉద్యోగమని చెప్పలేదు ఇంటికో ఉద్యోగం అని నేనెక్కడా చెప్పలేదు. ఇంటికో ఉద్యోగాన్ని ఏ రాష్ట్రమూ, కేంద్రం కూ డా ఇవ్వలేదు. ప్రభుత్వ ఉద్యోగాల పైనే ఆశలు పెంచుకొని యువకులు భవిష్యత్తును నాశనం చేసుకోవద్దు. అవసరమైన చోట కొత్త పోస్టులు సృష్టించి ఉద్యోగాలు కల్పిస్తాం. రాష్ట్రంలో లక్ష మందికి ఉద్యోగాలు కల్పించే ప్రక్రియను ఈ టర్మ్‌లోనే పూర్తి చేస్తాం. ప్రభుత్వ రంగ సంస్థల విభజన, ఉద్యోగుల విభజన పూర్తి కాలేదు. అయినా 24,500 ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చినం. 10 వేల టీచర్ పోస్టులకు రేపోమాపో నోటిఫికేషన్ వస్తది. ఆర్.కృష్ణయ్య, కె.లక్ష్మణ్ నన్ను కలసి గ్రూప్-2 కింద 400పైచిలుకు పోస్టులకే నోటిఫికేషన్ ఇచ్చారని, ఖాళీలు ఉన్నాయని చెప్పారు. త్వరలోనే మరో వెయ్యి ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇస్తాం. కోటి ఎకరాలకు సాగునీరు.. ఇంటింటికి మంచినీరు తెలంగాణలో నిర్మాణంలో ఉన్న, కొత్తగా ప్రకటించిన సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేయాలి. కొత్తవి, పాతవి కలిపి వచ్చే మూడేళ్లలో లక్షా యాభై వేల కోట్లు ఖర్చు పెడితే ఇవన్నీ పూర్తవుతాయి. ప్రాజెక్టులపై 31న సమగ్రంగా చర్చిద్దాం. మిషన్ భగీరథ పథకం అత్యద్భుతం. దానికోసం ఎంత పెట్టుబడైనా పెట్టాల్సిందే. వచ్చే 50 ఏళ్ల తాగునీటి అవసరాలను దృష్టిలో ఉంచుకొని కృష్ణా, గోదావరి నుంచి వచ్చే నీటిని మదింపు చేసుకొని ఈ ప్రాజెక్టును చేపట్టాం. ప్రతిరోజు ప్రతి ఒక్కరికి మంచినీరు అందిస్తే అంతకు మించిన లక్ష్యాన్ని చేరడం వేరే లేదు. 2016 డిసెంబర్ నాటికి 6,200 గ్రామాలకు తాగునీరు అందించబోతున్నాం. 9 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఏప్రిల్, మే నెలల్లోనే అందిస్తాం. ప్రాజెక్టులకు ఖర్చులు పెట్టడం వల్ల నష్టం లేదు. 2019-20 సంవత్సరం బడ్జెట్ రూ.2 లక్షల కోట్లు దాటుతుంది. ప్రాజెక్టులకు చేసే అప్పులు తనఖా రుణాలుగా ఉంటాయి. వాటిని ఆయా సంస్థలే భరిస్తాయి. నీటి ప్రాజెక్టుల మీద సమగ్ర చర్చ సాగునీటి రంగం పరిస్థితి, పొరుగు రాష్ట్రాలతో ఒప్పందాలు, ఎవరెవరు ఏం చేశారు, ఏం ఒప్పందాలు చేసుకున్నారు? అన్న అంశాలపై 31న అసెంబ్లీలో పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ఏర్పాటు చేస్తాం. గూగుల్ మ్యాప్స్‌తో ఏయే రాష్ట్రాల్లో ఏం ప్రాజెక్టులు, ఎంత నీరు వినియోగం అవుతుందో చూపిస్తాం. మండలి వాళ్లను కూడా పిలుద్దాం. సభ్యులందరికీ పెన్‌డ్రైవ్‌లో ఈ సమాచారం ఇస్తాం. గంటన్నర లంచ్‌బ్రేక్ ఇచ్చి సాగునీటి రంగ నిపుణులతో చర్చించి ఎవరికైనా సందేహాలు ఉంటే వాటిని లేవనెత్తవచ్చు. రాత్రి 11 గంటల వరకైనా సభను నడుపుకుందాం. అప్పటికీ పూర్తికాకపోతే ఒకటో తారీఖున కంటిన్యూ చేద్దాం. ఏప్రిల్‌లో అసెంబ్లీ స్థానాల సంఖ్య పెంపునకు బిల్లు ఈ ఏడాది ఏప్రిల్‌లో జరిగే పార్లమెంటు సమావేశాల్లో.. రాష్ట్రంలో అసెంబ్లీ స్థానాల పెంపునకు సంబంధించిన బిల్లును ప్రవేశ పెట్టే అవకాశం ఉంది. ఈ బిల్లు ఆమోదం పొందితే.. కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియ వేగవంతమవుతుంది. కొత్త జిల్లాల ఏర్పాటుతో కేంద్రం నుంచి వివిధ రూపాల్లో సాయం పెరుగుతుంది. సీఎం తరహాలో.. మంత్రులకు రూ.25 కోట్ల మేర ప్రత్యేక అభివృద్ధి నిధులు (ఎస్డీఎఫ్) మంజూరు చేస్తాం. దర్గా భూములు వక్ఫ్‌కు అప్పగిస్తాం హుస్సేనీ షా వలీ దర్గా భూములతో పాటు ఇతర దర్గా భూముల్లో అన్యాక్రాంతం కాగా మిగిలిన వాటిని వక్ఫ్‌బోర్డుకు అప్పగిస్తాం. దర్గా భూములను పొందిన సంస్థలు చెల్లించే మొత్తాన్ని వక్ఫ్‌బోర్డు ఖాతాకు జమ చేసి మైనార్టీల సంక్షేమానికి వెచ్చిస్తాం. సౌదీ, అజ్మీర్ యాత్రకు వెళ్లే వారి సౌకర్యం కోసం రుబాత్ల నిర్మాణం కోసం డిప్యూటీ సీఎం మహమూద్ అలీ నేతృత్వంలో బృందాన్ని ఏర్పాటు చేస్తాం. కేంద్ర ప్రభుత్వ నిబంధనలతో కరువు మండలాల గుర్తింపులో శాస్త్రీయత లోపించింది. కేంద్రం మంజూరు చేసిన ఇన్పుట్ సబ్సిడీ రూ.770 కోట్లకు అదనంగా రాష్ట్రం కొంత జోడించి ఖరీఫ్‌లోగా రైతులకు అందజేస్తుంది. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను ఏప్రిల్‌లోగా పూర్తిగా చెల్లించి, వచ్చే ఏడాది నుంచి ప్రతీనెలా చెల్లించేలా ఏర్పాట్లు చేస్తాం. ప్రజలు నవ్వుకోకూడదనే: జానారెడ్డి సాక్షి, హైదరాబాద్: ‘మీరు చెప్పేవి విని మౌనంగా వెళ్లిపోయామని ప్రజలు అనుకోకుండా, నవ్వకుండా ఉండేందుకే నేను మాట్లాడుతున్నా’ అని ప్రతిపక్ష నేత జానారెడ్డి వ్యాఖ్యానించారు. ద్రవ్య వినిమయ బిల్లుపై జరిగిన చర్చకు సీఎం కేసీఆర్ సమాధానమిచ్చారు. అనంతరం జానారెడ్డికి వివరణ కోరేందుకు అవకాశమివ్వగా.. ‘వేగవంతమైన అభివృద్ధికి మా సహకారం ఉంటుంది. సీఎంకు ముందుకు వెళ్లాలనే కోరిక బలంగా ఉంది. విమర్శించేందుకు కాదు.. అలర్ట్ చేయడానికే మాట్లాడుతున్నాం. మీ ప్రసంగంలో సాధ్యం కాని అంశాలను గుర్తు చేస్తున్నాం. మీరు అక్కడే (సీఎం స్థానాన్ని చూపిస్తూ) కూర్చోవాలని ఆశిస్తున్నాం. గతంలో అక్కడి నుంచే వచ్చాం. ప్రజలు కోరుకుంటే తిరిగి అక్కడకు వెళ్తాం’ అని వ్యాఖ్యానించారు. ద్రవ్య వినిమయ బిల్లును కాంగ్రెస్ ఆమోదించిందా, వ్యతిరేకించిందా అనే అంశంపై స్పష్టత ఇవ్వకుండానే జానారెడ్డి ప్రసంగం ముగించారు. -
రెండేళ్లలో లక్ష ఉద్యోగాలు
* నోటిఫికేషన్లపై కసరత్తు షురూ: ముఖ్యమంత్రి కేసీఆర్ * అందరూ ఒప్పుకుంటే వయోపరిమితిలో పదేళ్ల సడలింపు * ఉద్యోగుల విభజన పూర్తయితే ఖాళీలపై స్పష్టత * కొత్తగా ఉపాధ్యాయ నియామకాలకు నో * కేంద్ర నిధుల కోసం ఢిల్లీకి అఖిలపక్షాన్ని తీసుకెళ్తాం * ఉభయ సభల్లో తీర్మానాలు చేసి ప్రధాని మోదీకి ఇద్దాం * ప్రస్తుతం కరెంట్ కోతలేదు.. మే నెల తర్వాత కనబడదు * భూములు విక్రయించే యోచనను విరమించుకున్నాం * తెలంగాణ ఇచ్చింది సోనియానే.. కాదంటే మూర్ఖత్వమే * మండలిలో డీఎస్ ప్రశ్నలకు సీఎం సుదీర్ఘ సమాధానం సాక్షి, హైదరాబాద్: రెండేళ్లలో లక్ష ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టిందని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు చెప్పారు. కమల్‌నాథన్ కమిటీ ఉద్యోగుల విభజనను ఇంకా పూర్తి చేయనందున ఖాళీలపై స్పష్టత రాలేదని ఆయన తెలిపారు. ఉద్యోగ ఖాళీల లెక్కతేలిన అనంతరం భర్తీ ప్రక్రియను ప్రారంభిస్తామని పేర్కొన్నారు. కేంద్ర నిధులకు సంబంధించిన అంశంపై శనివారం శాసనమండలిలో ప్రతిపక్ష నేత డి.శ్రీనివాస్ అడిగిన పలు ప్రశ్నలకు సీఎం కేసీఆర్ సుదీర్ఘంగా సమాధానమిచ్చారు. నిధుల కోసం కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకెళతామని.. ప్రధానిని కలిసి విజ్ఞప్తులు చేద్దామని పేర్కొన్నారు. దీంతో పాటు రాష్ట్ర ప్రభుత్వ ప్రాధాన్యాలను కేసీఆర్ వివరించారు. రెండేళ్లతో లక్ష ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇస్తామని చెప్పారు. ఇక రాష్ట్రంలోని పాఠశాలల్లో విద్యార్థులతో పోలిస్తే ఉపాధ్యాయులు ఎక్కువ మంది ఉన్నారని... రేషనలైజేషన్ చేసి అవసరమైన చోట వారిని నియమిస్తామని పేర్కొన్నారు. కొత్తగా డీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ఉర్దూ మాధ్యమంలో కొరత ఉన్నందున ఖాళీగా ఉన్న 1,500 పోస్టులను త్వరలోనే భర్తీ చేస్తామన్నారు. ఉద్యోగాలకు దరఖాస్తు చేసే నిరుద్యోగులకు వయో పరిమితిని ఇప్పటికే ఐదేళ్లు సడలించామని, అన్ని పక్షాలు అంగీకరిస్తే పదేళ్లు పెంచేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని సీఎం పేర్కొన్నారు. గౌరవ వేతనాల్లో మనమే టాప్ కేరళ రాష్ట్రంలో కేవలం 967 గ్రామ పంచాయతీలే ఉన్నాయని, అక్కడి ప్రభుత్వం సర్పంచులకు రూ. 6,600 గౌరవ వేతనంగా అందిస్తోందని సీఎం కేసీఆర్ చెప్పారు. రాష్ట్రం విషయానికి వస్తే స్థానిక సంస్థల ప్రతినిధులు (సర్పంచులు, ఎంపీటీసీలు కలిపి) సుమారు 15 వేల మంది ఉన్నారని... గౌరవ వేతనాల మొత్తంలో అన్నిరాష్ట్రాల కన్నా మనమే ముందు వరసలో ఉన్నామని పేర్కొన్నారు. రాష్ట్రంలో సర్పంచులకు గౌరవ వేతనం ఇచ్చే అంశాన్ని గతంలో ఏ ప్రభుత్వాలు పట్టించుకోలేదన్నారు. తాజాగా ప్రకటించిన రూ. 5 వేలకన్నా పెంచలేమని సీఎం స్పష్టం చేశారు. హైకోర్టు విభజన జరగకుంటే రాష్ట్ర విభజన పూర్తికానట్లేనని ప్రభుత్వం భావిస్తోందని.. ఆ విభజన జరగకుండా కొన్ని శక్తులు అడ్డుకుంటున్నాయని తాము భావిస్తున్నామని చెప్పారు. ఈ విషయమై త్వరలోనే హైకోర్టు ప్రధాన న్యాయమూర్తితో చర్చిస్తామని కేసీఆర్ తెలిపారు. మే తర్వాత కోతలుండవు.. రాష్ట్రంలో ఈ రోజువరకు ఎక్కడా విద్యుత్ కోత లేదని... మే నెల తర్వాత విద్యుత్ కోతలు ఉండబోవని సీఎం చెప్పారు. విభజన చట్టం ప్రకారం ఏపీలోని కృష్ణపట్నం, హిందుజా ప్రాజెక్టుల నుంచి రాష్ట్రానికి రావాల్సిన వాటా ను ఆ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వకున్నా మనకు మేలే జరిగిందని వ్యాఖ్యానించారు. ఏపీ ప్రభుత్వ విద్యుత్‌ను ఇచ్చినట్లయితే యూనిట్‌కు రూ. 7.5 చొప్పున చెల్లించాల్సి వచ్చేదని... రాష్ట్రంలో సింగరేణిలో ఉత్పత్తి ధర యూనిట్‌కు రూ. 3.5 మాత్రమేనని పేర్కొన్నారు. రాష్ట్రంలోని విద్యుత్ ప్రాజెక్టులను క్షణక్షణం పర్యవేక్షిస్తున్నందున 170 మెగావాట్ల విద్యుత్ అదనంగా లభ్యమైందని వెల్లడించారు. పీపీపీ పద్ధతిన గాయత్రి పవర్ ప్రాజెక్టు నుంచి జూన్ నెలలో సుమారు 500 మెగావాట్లు, ఫెర్టిలైజర్ సంస్థ గ్యాస్ ఇవ్వడం ద్వారా మరో 260 మెగావాట్ల విద్యుత్ రాష్ట్రానికి వస్తుందని సీఎం చెప్పారు. ఈ ఏడాది పవర్‌కట్ ఉంటే.. మార్చి 20నుంచి ఏప్రిల్ 20 మధ్య ఒకట్రెండు రోజుల పాటు ఉండవచ్చని పేర్కొన్నారు. వాటర్‌గ్రిడ్‌కు రూ. 13 వేల కోట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వాటర్‌గ్రిడ్, మిషన్ కాకతీయ ప్రాజెక్టులకు బడ్జెట్లో కేటాయించిన నిధులే కాకుండా వివిధ ఆర్థిక సంస్థల నుంచి కూడా భారీగా నిధులు అందనున్నాయని సీఎం చెప్పారు. వాటర్‌గ్రిడ్‌కు హడ్కో ఏడాదికి రూ. 2,500 కోట్ల చొప్పున నాలుగేళ్ళలో రూ. 10 వేల కోట్లు, నాబార్డు నుంచి రూ. మూడు వేల కోట్లు ఇచ్చేందుకు అంగీకారం కుదిరిందని చెప్పారు. మిషన్ కాకతీయకు నాబార్డు రూ. వెయ్యి కోట్లు, జపాన్ ఆర్థిక సంస్థ (జైకా) రూ. 3 వేల కోట్లు ఇస్తున్నాయని సీఎం చెప్పారు. బీసీలను నిర్లక్ష్యం చేయం.. రాష్ట్రంలో బలహీనవర్గాల సంక్షేమాన్ని నిర్లక్ష్యం చేయబోమని కేసీఆర్ చెప్పారు. రాష్ట్రంలో బీసీలు 51 శాతం ఉన్నట్లు సమగ్ర సర్వేలో వెల్లడైందని.. వారి సంక్షేమానికి మరిన్ని పథకాలను ప్రవేశపెడతామని పేర్కొన్నారు. బడ్జెట్లో పేర్కొన్న రూ. 1.15 లక్షల కోట్లలో రాష్ట్ర సొంత రెవెన్యూ(ఎస్‌వోఆర్) రూ. 99 వేల కోట్లు ఉందని.. మిగతా రూ. 16 వేల కోట్లలో కమర్షియల్ ట్యాక్స్ బకాయిల నుంచి రూ. 5 వేల కోట్లు అందే అవకాశం ఉందని సీఎం తెలిపారు. కేంద్ర పథకాలకు నిధులు అందుతాయని ఆశిస్తున్నామన్నారు. నిధుల కోసం గతంలో భూములను అమ్మాలనుకున్న మాట వాస్తవమేనని.. ఇప్పుడు నిధులు పుష్కలంగా ఉన్నందున ఆ యోచనను విరమించుకున్నామని తెలిపారు. భూ క్రమబద్ధీకరణ ద్వారా 3.5 లక్షల పేద కుటుంబాలకు ఉచితంగా పట్టాలను అందజేయనున్నట్లు సీఎం చెప్పారు. 125 గజాలకు పైగా ఉన్న స్థలాలను తక్కువ ధరకు క్రమబద్ధీకరిస్తున్నామన్నారు. 12.5 శాతం రిజి స్ట్రేషన్ ధర ప్రకారం రూ. 133 కోట్లు వచ్చాయని.. ప్రక్రియ పూర్తయితే మరో రూ. వెయ్యికోట్లు ప్రభుత్వానికి వస్తాయని పేర్కొన్నారు. కేంద్రంపై ఒత్తిడి తెద్దాం.. రాష్ట్రానికి నిధుల గురించి కేంద్రంతో కయ్యం పెట్టుకోవడం సబబు కాదని భావిస్తున్నామని, అమల్లో ఉన్న పలు పథకాలకు కేంద్రాన్ని నిధులు అడిగేందుకు ఢిల్లీకి అఖిలపక్షాన్ని తీసుకెళ్లాలనుకుంటున్నామని సీఎం కేసీఆర్ చెప్పారు. నిధులకు సంబంధించి ఉభయ సభల్లో ఏకగ్రీవ తీర్మానాలు చేసి.. ప్రధాని మోదీకి, నీతి ఆయోగ్ చైర్మన్, వైస్ చైర్మన్లకు అందజేద్దామని ఆయన పేర్కొన్నారు. కేంద్రం అమలుచేస్తున్న 122 పథకాలను ఇటీవల 66 కు తగ్గించిందని.. అదే సమయంలో రాష్ట్రానికి రావాల్సిన పన్నుల వాటాను భారీగా పెంచిందని సీఎం చెప్పారు. దేశవ్యాప్తంగా గతేడాది కన్నా ఈ సారి రూ. 1.78 లక్షల కోట్లను నేరుగా రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్రం అదనంగా ఇస్తోందని తెలిపారు. అందులో తెలంగాణకు అదనంగా సుమారు రూ. 4 వేల కోట్లు అందనున్నాయని సీఎం చెప్పారు. ఇచ్చింది సోనియానే... తెలంగాణ ఇచ్చింది ముమ్మాటికీ సోనియాగాంధీయేనని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. కాదని ఎవరు చెప్పినా వాళ్లు మూర్ఖులేనని వ్యాఖ్యానించారు. తెలంగాణ చరిత్ర రాసేవాళ్లెవరైనా సోనియాగాంధీ పేరును తప్పక రాయాల్సిందేనన్నారు. తెలంగాణ ఇచ్చింది సోనియాగాంధీ అయితే.. తెచ్చిన ఘనత తెలంగాణ ప్రజలందరికీ దక్కుతుందని కేసీఆర్ పేర్కొన్నారు.