లక్షల ఉద్యోగాలు సృష్టిస్తామంటున్న గజల్ అలఘ్.. ఎవరీమె? | Will create lakhs of jobs says Mamaearth Ghazal Alagh | Sakshi
Sakshi News home page

లక్షల ఉద్యోగాలు సృష్టిస్తామంటున్న గజల్ అలఘ్.. ఎవరీమె?

Published Wed, May 22 2024 3:51 PM | Last Updated on Wed, May 22 2024 3:51 PM

Will create lakhs of jobs says Mamaearth Ghazal Alagh

రాబోయే 10 సంవత్సరాలలో తమ కంపెనీ లక్షలాది ఉద్యోగావకాశాలను సృష్టిస్తుందని మామాఎర్త్‌ (mamaearth) సహ వ్యవస్థాపకురాలు గజల్ అలఘ్ చెబుతున్నారు. తమను అభినందించిన ప్రధాని నరేంద్ర మోదీకి కృతజ్ఞతలు తెలుపుతూ ‘ఎక్స్‌’ (ట్విటర్‌)లో పోస్ట్‌ చేశారు.

కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరీ తన నివాసంలో నిర్వహించిన విశేష సంపర్క్ కార్యక్రమంలో మామాఎర్త్ సహ వ్యవస్థాపకుడు వరుణ్ అలఘ్ ప్రసంగించారు. దీన్ని కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరీ ఎక్స్‌లో పోస్ట్‌ చేయగా ప్రధాని నరేంద్ర మోదీ స్పందిస్తూ వరుణ్ అలఘ్‌ను అభినందించారు. స్టార్టప్‌లను, సంపద సృష్టిని తమ ప్రభుత్వం చురుకుగా ప్రోత్సహిస్తోందన్నారు. ముఖ్యంగా టైర్-2, 3 నగరాల్లో యువశక్తిని చూసి గర్విస్తున్నామని ప్రధాని పేర్కొన్నారు.

వరుణ్ అలఘ్ సతీమణి కంపెనీ సహ వ్యవస్థాపకురాలు గజల్ అలఘ్ దీన్ని రీ ట్వీట్‌ చేస్తూ “ధన్యవాదాలు నరేంద్ర మోదీజీ. మీ ఆశీర్వాదం, ప్రభుత్వ మద్దతుతో రాబోయే 10 సంవత్సరాలలో లక్షల ఉద్యోగాలను సృష్టిస్తాం’’ అని ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసలపై స్పందిస్తూ గజల్ అలఘ్ పేర్కొన్నారు. మోదీ అందించిన ప్రోత్సాహం తమలో మరింత అంకిత భావాన్ని పెంపొందిస్తుందన్నారు. భారతీయ అందాలను ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తామని, ప్రతిచోటా భారత జెండా ఎగరేస్తామంటూ రాసుకొచ్చారు.

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement