రోడ్డెక్కిన నిరుద్యోగులు
అనంతపురం సప్తగిరి సర్కిల్ : రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి రెండున్నరేళ్లు కావస్తున్న ఒక్క పోస్టును భర్తీ చేయలేదని ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగుల ఐక్య వేదిక బుధవారం మహాధర్నాను నిర్వహించింది. రాష్ట్రంలో ఉన్న ఖాళీలను భర్తీ చేయడం లో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఏపీ నిరుద్యోగుల ఐక్యవేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామన్న ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సప్తగిరి సర్కిల్ నుంచి టవర్‌క్లాక్ వరకు భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించారు.
రాష్ట్రంలో 1200 ఎస్సై పోస్టులు ఖాళీగా ఉంటే ప్రభుత్వం 707 పోస్టులకు నోటిఫికేషన్ జారీచేయడమేంటని ప్రశ్నించారు. అత్యంత వెనుకబడిన రాయలసీమ ప్రాంతానికి కేవలం 57 పోస్టులను కేటాయించడం దారుణమన్నారు. నిరుద్యోగుల సమస్యలను పరిష్కరించకుంటే దశలవారీగా ఉద్యమాన్ని ఉధతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నిరుద్యోగ ఐక్య వేదిక నాయకులు సుధాకర్, శంకర్, వీరాజీ, లక్ష్మీ, శిరీష, లక్ష్మీ తదితరులు పాల్గోన్నారు.