అనంతపురం సెంట్రల్ : ఇళ్ల స్థలాల కోసం కొన్నేళ్లుగా అధికారుల చుట్టూ తిరుగుతున్నా ఫలితం లేదని మాజీ సైనికుల కుటుంబాలవారు ఆవేదన చెందుతున్నారు. వివరాలిలా ఉన్నాయి. జిల్లా సైనిక సంక్షేమశాఖ ఆధ్వర్యంలో రిజిస్ట్రేషన్ చేసుకున్న సైనిక కుటుంబాలు దాదాపు 3 వేలు ఉన్నాయి. వివిధ ప్రాంతాల్లో స్థిరపడిన వారు, రిజిస్ట్రేషన్ చేసుకోనివారు మరో 2 వేల మంది ఉంటారని అంచనా. వీరిలో దేశం కోసం సేవ చేసి రిటైర్డ్ అయినవారు, దేశ రక్షనలో ప్రాణాలు కోల్పోయిన వారు కూడా ఉన్నారు. వీరి కుటుంబానికి ప్రభుత్వం రూ. 12 వేలు నుంచి రూ. 15 వేలు దాకా పింఛన్ రూపంలో అందజేస్తోంది.
చాలా మందికి సొంతిళ్లు లేకపోవడంతో అద్దె ఇళ్లలో జీవనం సాగిస్తున్నారు. దాదాపు 500 సైనిక కుటుంబాలు సొంతిళ్లు కావాలని అనేక సార్లు ఉన్నతాధికారుల వద్ద మొరపెట్టుకున్నా ఫలితం లేదు.
అనేక మార్లు అర్జీలిచ్చాం..
1970 నుంచి 1988 వరకూ ఆర్మీలో పనిచేశా. పదవీవిరమణ పొందిన తర్వాత పింఛన్‌పై ఆధారపడి బతుకుతున్నా. ఇంటి పట్టాలు మంజూరు చేయాలని అధికారులకు అనేకమార్లు అర్జీలిచ్చాం. ఫలితం లేదు.
- ఈ. నాగిరెడ్డి, మాజీ సైనికుడు
సమస్యలు పరిష్కరించాలి
జిల్లాలో మాజీ సైనికులు అనేక సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారు. ఒకే హోదా.. ఒకే పింఛన్ పథకం కూడా సక్రమంగా అమలుకాక కొంతమందికి పింఛన్‌లోనే కొత పడుతోంది. సొంతిళ్లు లేక నానా అగచాట్లు పడుతున్నారు. మాజీ సైనికుల సమస్యలు పరిష్కరించాలి.
- కెప్టెన్ షేకన్న, మాజీ సైనికుల సంఘం అధ్యక్షుడు
ఇళ్ల స్థలాల కోసం నిరీక్షణ
Published Sun, Dec 25 2016 10:43 PM | Last Updated on Thu, Oct 4 2018 5:35 PM
Advertisement
Advertisement