అనంతపురం అర్బన్ : యువతకు విద్య, ఉపా«ధి సాధన కోసం పోరుబాట సాగిస్తామని ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు కె.వై.ప్రసాద్, బి.రమణ చెప్పారు. స్థానిక సీపీఐ కార్యాలయంలో శుక్రవారం వారు విలేకరులతో మాట్లాడారు. యువత విద్య, వైద్యం, ఉపాధి హక్కుల సాధనకు దశల వారీగా పోరాటం చేయాలని ఏలూరులో ఇటీవల నిర్వహించిన ఏఐవైఎఫ్ రాష్ట్ర మహాసభల్లో తీర్మానించారన్నారు.
రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 1.50 లక్షల ఉద్యోగాల భర్తీకి నోటిషికేషన్ విడుడదల చేయాలని, పోలీసు కానిస్టేబుల్ అభ్యర్థులకు వయోపరిమితి పెంచాలని డిమాండ్ చేశారు. వీటితో పాటు ఎన్నికల సమయంలో ఇచ్చిన వాగ్ధానాలు, విభజన హామీల అమలకు ఉద్యమిస్తామన్నారు. గత నెలలో నిర్వహించిన రాష్ట్ర మహాసభల్లో ఏఐవైఎఫ్ రాష్ట్ర సహాయ కార్యదర్శిగా తాను ఎన్నికైనట్లు జిల్లా కార్యదర్శి రమణ తెలిపారు. రాష్ట్ర కార్యవర్గ, సమితి సభ్యులుగా కె.వై.ప్రసాద్, కె.చాంద్‌బాషా, జి.సంతోశ్, ఎస్.జమీర్‌బాషాలను ఎన్నుకున్నట్లు వివరించారు.
ఉపాధి కోసం పోరుబాట
Published Fri, Sep 2 2016 10:56 PM | Last Updated on Thu, Oct 4 2018 5:34 PM
Advertisement