చంద్రబాబు దగాకోరు పాలనకు రోజులు దగ్గరపడ్డాయ్‌ | Chandrababu Cheated Unemployees | Sakshi
Sakshi News home page

చంద్రబాబు దగాకోరు పాలనకు రోజులు దగ్గరపడ్డాయ్‌

Published Wed, Aug 8 2018 11:56 AM | Last Updated on Wed, Aug 8 2018 11:56 AM

Chandrababu Cheated Unemployees  - Sakshi

డిమాండ్లు పరిష్కరించాలని కోరుతూ కలెక్టరేట్‌కు వినతిపత్రం అందజేస్తున్న వైఎస్సార్‌ సీపీ యువజన నేతలు, నిరుద్యోగులు  

విజయనగరం మున్సిపాలిటీ : అన్ని వర్గాల ప్రజలను మోసం చేస్తూ సీఎం చంద్రబాబు సాగిస్తున్న దగాకోరు పాలనకు రోజులు దగ్గర పడ్డాయని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ విజయనగరం పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు బెల్లాన చంద్రశేఖర్‌ అన్నారు. 2014 ఎన్నికలకు ముందు నిరుద్యోగ యువతకు చంద్రబాబు ఇచ్చిన ఇంటికో ఉద్యోగం, లేని పక్షంలో రూ.2వేల నిరుద్యోగ భృతి హమీ అమల్లో టీడీపీ నయవంచన తీరును నిరసిస్తూ యువగర్జన పేరిట వైఎస్సార్‌కాంగ్రెస్‌ పార్టీ జిల్లా యువజన, విద్యార్థి విభాగాల ఆధ్వర్యంలో యువత విజయనగరం పట్టణంలో మంగళవారం బైక్‌ ర్యాలీ నిర్వహించారు.

అనంతరం జిల్లా కలెక్టర్‌ కార్యాలయం ఎదుట ధర్నా చేశారు. ఎమ్మెల్సీ కోలగట్ల వీరభద్రస్వామి ఇంటి నుంచి ప్రారంభమైన ర్యాలీకి బెల్లాన చంద్రశేఖర్, నగర పార్టీ కన్వీనర్‌ ఆశపు వేణు, పార్టీ విజయనగరం మండలాధ్యక్షుడు నడిపేన శ్రీనివాసరావు, సీనియర్‌ కౌన్సిలర్‌లు ఎస్‌వీవీ రాజేష్, కేదారశెట్టి సీతారామ్మూర్తిలు జెండా ఊపి ప్రారంభించారు. స్థానిక రింగ్‌రోడ్‌ సాయిబాబా గుడి నుంచి ప్రారంభమైన ర్యాలీ ఐస్‌ఫ్యాక్టరీ జంక్షన్, అయోధ్యామైదానంరోడ్, కోట జంక్షన్,  మూడులాంతర్లు, గంటస్తంభం జంక్షన్, వైఎస్సార్‌ జంక్షన్, రైల్వేస్టేషన్‌ రోడ్, ఎత్తుబ్రిడ్జి మీదుగా కలెక్టర్‌ కార్యాలయం వరకు సాగింది.

అక్కడ  సీఎం చంద్రబాబు డౌన్‌డౌన్‌ అంటూ యువత నినదించారు. అనంతరం యువజన, విద్యార్ధి విభాగం నాయకులు ఎస్‌.బంగారునాయుడు, జి.ఈశ్వర్‌కౌషిక్, ఎంఎల్‌ఎన్‌రాజు, అల్లు చాణక్య, బోడసింగి ఈశ్వరరావు, గండ్రేటి సన్యాసిరావు, తాడ్డి సురేష్, పొట్నూరు కేశవ, కరకవలస అనిల్, బోనేల తరుణ్, తాళ్లపూడి పండు, కరణం రమేష్, తరుణ్‌లు డిమాండ్‌లతో కూడిన వినతిపత్రాన్ని కలెక్టర్‌ డాక్టర్‌ హరిజవహర్‌లాల్‌కు అందజేశారు. 

యువతను మోసం చేశారు... 

2014 ఎన్నికల్లో మోసపూరిత హమీలతో గద్దెనెక్కిన చంద్రబాబు నాలుగున్నరేళ్లపాటు యువతకు ఇచ్చిన నిరుద్యోగ భృతి, ఇంటికో ఉద్యోగం హమీలను విస్మరించి ఇప్పుడు ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో మరో సారి యువతను మోసం చసేందుకు రూ.వెయ్యి నిరుద్యోగ భృతి ఇస్తామంటూ ప్రకటించారని బెల్లాన చంద్రశేఖర్‌ విమర్శించారు. చంద్రబాబు మాటలను యువత నమ్మే పరిస్థితిలో లేరన్నారు. 10 లక్షల మందికి రూపాయి చొప్పున నిరుద్యోగ భృతి ప్రకటించడం, రాష్ట్ర వ్యాప్తంగా 2.12 లక్షల పోస్టులు భర్తీలో నిర్లక్ష్యంగా వ్యవహరించడం  నిరుద్యోగులను మోసగించడమేనన్నారు.

జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు ఎస్‌.బంగారునాయుడు, జిల్లా విద్యార్థి విభాగం అధ్యక్షుడు ఎంఎల్‌ఎన్‌ రాజు, పట్టణ యువజన విభాగం అధ్యక్షుడు అల్లు చాణక్యలు మాట్లాడుతూ ఎన్నికల ముందు ఇచ్చినహమీల ప్రకారం రూ.2వేల నిరుద్యోగ భృతి మొత్తాన్ని నాలుగు సంవత్సరాల మూడు నెలల బకాయిలతో కలిపి విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. ఈ లెక్కన ప్రతి నిరుద్యోగుకి రూ.లక్షా 2వేల మొత్తాన్ని తక్షణమే చెల్లించాలన్నారు.

ఖాళీగా ఉన్న ప్రభుత్వ శాఖల్లో  పోస్టులను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్‌ జారీ చేయాలని, ఔట్‌ సోర్సింగ్‌ నియామకాలను నిలిపివేయాలన్నారు. గ్రూప్‌–2ని గ్రూప్‌–1లో విలీనం చేయాలన్న ప్రతిపాదను విరమించుకోవాలన్నారు. వెంటనే ఏపీపీఎస్సీ రిక్రూట్‌మెంట్‌ క్యాలెండర్‌ను ప్రకటించాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో యువజన,  విద్యార్థి విభాగం నాయకులు జీవీ రంగారావు, జి.ఈశ్వర్‌కౌషిక్, నెలపర్తి రాజ్‌కుమార్, హర్షరాజు, అప్పుపైడి,ఆనంద్, మనోజ్, పి.కృష్ణ, జిక్కరాజు, నాని, కర్రోతు సంతోష్, కంకర్ల శ్రీను తదితరులు పాల్గొన్నారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement