హైదరాబాద్ : శాసనసభ సమావేశాలు అయిదో రోజు కొనసాగుతున్నాయి. శనివారం సభ ప్రారంభం కాగానే ప్రశ్నోత్తరాలు చేపట్టారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉద్యోగ నియామకాలు ఎప్పుడు చేపడతారని ప్రశ్నించింది. నిరుద్యోగ భృతి ఎప్పటి నుంచి ఇస్తారని ప్రశ్న వేయగా దీనిపై మంత్రి యనమల రామకృష్ణుడు సమాధానం ఇస్తూ అర్హులైన నిరుద్యోగులకు రూ.వెయ్యి భృతి ఇస్తామన్నారు.
అలాగే బడ్జెట్ పాసైన తర్వాత నిరుద్యోగులకు భృతి ఇస్తామని తెలిపారు. ప్రయివేట్, ప్రభుత్వ సెక్టార్లలో నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని యనమల పేర్కొన్నారు. ఏపీపీఎస్సీ ద్వారానే ఉద్యోగాలు చేపడతామని వెల్లడించారు.