రెండు రోజుల పాటు అసెంబ్లీ: యనమల
సాక్షి, అమరావతి: వస్తు సేవా పన్ను (జీఎస్టీ) బిల్లుకు ఆమోదం తెలిపేందుకు ఈ నెలాఖరున లేదా వచ్చే నెలలో గానీ రెండు రోజుల పాటు అసెంబ్లీ, మండలి సమావేశాలను నిర్వహిస్తామని ఆర్థిక, వాణిజ్య పన్నుల శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు తెలిపారు. జీఎస్టీ బిల్లులకు రాష్ట్రపతి ఆమోదం లభించగానే కేంద్రం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేస్తుందని, అనంతరం రాష్ట్రం జీఎస్టీ బిల్లుకు ఆమోదం తెలపాల్సి ఉందని చెప్పారు. ఆయన మంగళవారం సచివాలయంలో జీఎస్‌టీ సన్నద్ధత, గత ఆర్థిక సంవత్సరం బడ్జెట్ వ్యయంపై సమీక్ష నిర్వహించారు.