నిజామాబాద్ అర్బన్, న్యూస్‌లైన్ : నిరుద్యోగులలో ఆశలు రేకెత్తిస్తూ ఇటీవల ప్రభుత్వం పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు జారీ చేసింది. అరకొరగానే ఉద్యోగాలను భర్తీ చేస్తున్నా.. ఆశావహులు ఆయా ఉద్యోగాల కు భారీ స్థాయిలోనే దరఖాస్తు చేసుకుంటున్నారు. కొందరు స్టడీ మెటీరియల్ కొనుగోలు చేసి ఇంట్లోనే సన్నద్ధం అవుతుండగా.. మరికొందరు కోచింగ్ సెంటర్‌ల బా ట పడుతున్నారు. దీనిని కోచింగ్ సెంటర్‌లు సొమ్ము చేసుకుంటున్నాయి. ఫీజులు, మెటీరియల్ పేరుతో వేలల్లో డబ్బులు గుంజుతున్నాయి.
అరకొరగానే
పోటీ పరీక్షలకు సంబంధించి నిజామాబాద్ నగరం లో సుమారు 25 కోచింగ్ సెంటర్లున్నాయి. బస్టాండ్ సమీపంలో, సుభాష్‌నగర్, ఖలీల్‌వాడి, హమాల్‌వా డీ, గో ల్‌హన్మాన్ తదితర ప్రాంతాలలో ఈ కేంద్రాలున్నాయి. ఒక్కోదానిలో 200 నుంచి 400 వరకు అభ్యర్థులు వివిధ సబ్జెక్టులపై శిక్షణ తీసుకుంటున్నా రు. అన్ని కోచింగ్ సెంటర్‌లలో కలిపి సుమారు ఆరు వేల వరకు అభ్యర్థులున్నారు. నిర్వాహకులు నాలుగు గదులను అద్దెకు తీసుకొని, మూడు నాలుగు వందల మంది అభ్యర్థులను చేర్చుకొని నిరుద్యోగుల జీవితాలతో ఆడుకుంటున్నారు. ఏ కేంద్రంలోనూ సరైన వసతులు లేవు. చాలా చోట్ల ఇరుకు గదులలోనే తరగతులు నిర్వహిస్తున్నారు. రేకుల షెడ్డులో నడుస్తున్న కోచింగ్ సెంటరూ ఉంది. కొన్ని సెంటర్లలో తాగునీటి వసతి సైతం కల్పించడం లేదు. చాలా చోట్ల అనుభ వం ఉన్న శిక్షకులు లేరు. డిగ్రీ పూర్తి చేసినవారితోనే త తంగం నడిపిస్తున్నారు. ప్రకటనల్లో మాత్రం అనుభవజ్ఞులైన శిక్షకులతో ప్రత్యేక కోచింగ్ ఇప్పిస్తామని పేర్కొంటూ బురిడీ కొట్టిస్తున్నారు. ఉద్యోగం కోసం నిరుద్యోగు లు ఈ బాధలను భరిస్తున్నారు.
వేలల్లో ఫీజులు
ప్రస్తుతం వీఆర్‌ఓ, వీఆర్‌ఏ, పంచాయతీ కార్యదర్శి, ఐబీపీఎస్ తదితర పోటీ పరీక్షలకు జిల్లాలో కోచింగ్ ఇస్తున్నారు. ఆయా కోర్సులకు రూ. 3,500 నుంచి రూ. 5 వేల వరకు ఫీజు తీసుకుంటున్నారు. కోర్సులో చేరినప్పుడే పూర్తి ఫీజు వసూలు చేస్తున్నారు. స్టడీ మెటీరియల్ పేరుతో అభ్యర్థులనుంచి అదనపు మొత్తాన్ని గుంజుతున్నారు. హైదరాబాద్ నుంచి ప్రత్యేక శిక్షకులను రప్పిస్తున్నామంటూ ఫీజులు వసూ లు చేస్తున్నారు. అయితే నిర్దేశిత సిలబస్ ప్రకారం ఎక్కడా స్టడీ మెటీరియల్ అందించడం లేదని అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమకు తోచినట్లు గా మెటీరియల్ తయారు చేయించి విక్రయిస్తున్నారని పేర్కొంటున్నారు. కోచింగ్ సెంటర్లపై పర్యవేక్ష ణ లేకపోవడంతో ఆయా సెంటర్ల నిర్వాహకులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. ఉన్నతాధికారులు కోచింగ్ సెంటర్లపై దృష్టి సారించాలని విద్యార్థి సంఘాల నాయకులు కోరుతున్నారు.
పర్యవేక్షణ లేకపోవడంతోనే
అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో కోచింగ్ సెంటర్లు ఆడింది ఆట, పాడింది పాటగా నడుస్తోంది. అభ్యర్థులనుంచి అధిక మొత్తంలో ఫీజులు వసూలు చేస్తున్నారు. న్యాయబద్ధం గా ఫీజులు వసూలు చేయకపోతే ఆందోళన చేస్తాం.
-శ్రీనివాస్‌గౌడ్, విద్యార్థి జేఏసీ జిల్లా చైర్మన్
అభ్యర్థులకు న్యాయం చేయాలి
చాలా చోట్ల సరైన శిక్షకులు లేకున్నా కోచింగ్ సెంటర్లను నడిపిస్తూ నిరుద్యోగుల జీవితాలతో ఆడుకుంటున్నారు. ఇది మంచిది కాదు. నిపుణులతో కోచింగ్ ఇప్పించి అభ్యర్థులకు న్యాయం చేయాలి. కోచింగ్ సెంటర్లలో వసతులు కూడా కల్పించాలి.
- ఎ.ప్రగతి కుమర్, ఎస్సీ, ఎస్టీ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు
‘కోచింగ్’ దందా
Published Mon, Jan 13 2014 4:16 AM | Last Updated on Sat, Sep 2 2017 2:34 AM
Advertisement
Advertisement