ఇదిగో జాబ్‌ కేలండర్‌ | Telangana State Govt Releases Job Calendar | Sakshi
Sakshi News home page

ఇదిగో జాబ్‌ కేలండర్‌

Published Sat, Aug 3 2024 2:01 AM | Last Updated on Sat, Aug 3 2024 4:21 AM

Telangana State Govt Releases Job Calendar

శాసనసభకు సమర్పించిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

వివిధ రకాల నోటిఫికేషన్లు, పరీక్షల షెడ్యూల్‌ విడుదల  

గ్రూప్‌ పరీక్షలతో పాటు వివిధ పోస్టుల భర్తీ వివరాలు వెల్లడి 

ఖాళీల సంఖ్యను మాత్రం వెల్లడించని సర్కారు 

ఇచి్చన మాట ప్రకారం జాబ్‌ కేలండర్‌ ప్రకటించామన్న ఉప ముఖ్యమంత్రి 

గత ప్రభుత్వంలో నిరుద్యోగులు ఇబ్బందులు పడ్డారని విమర్శ 

తమకు మాట్లాడే అవకాశం ఇవ్వనందుకు బీఆర్‌ఎస్‌ సభ్యుల నిరసన

సాక్షి, హైదరాబాద్‌:  వివిధ రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లో ఏర్పడే ఖాళీల భర్తీ ప్రక్రియకు సంబంధించిన జాబ్‌ కేలండర్‌ను ప్రభుత్వం ప్రకటించింది. శుక్రవారం సాయంత్రం ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క జాబ్‌ కేలండర్‌ను శాసనసభకు సమరి్పంచారు. రిక్రూట్‌మెంట్‌కు సంబంధించిన నోటిఫికేషన్లు, పోస్టుల కేటగిరీలు, నోటిఫికేషన్లు జారీ చేసే నెలలు, పరీక్షలు నిర్వహించే నెలలు (తాత్కాలిక ఖరారు), రిక్రూటింగ్‌ ఏజెన్సీలు, పోస్టులకు అర్హతలను కేలండర్‌లో సవివరంగా తెలియజేశారు.

ఇప్పటికే నోటిఫికేషన్లు విడుదల చేసిన గ్రూప్‌ పరీక్షల వివరాలతో పాటు భవిష్యత్తులో విడుదల చేయబోయే గ్రూప్‌ పరీక్షల వివరాలు, వివిధ సంస్థల్లో ఇంజనీరింగ్‌ పోస్టులు, టీచర్లు, లెక్చరర్లు ఎస్‌ఐలు తదితర పోస్టుల భర్తీ, టెట్‌ నిర్వహణకు సంబంధించిన వివరాలను ప్రకటించారు. అయితే విభాగాల పేర్లను పేర్కొన్నప్పటికీ ఖాళీల సంఖ్యను మాత్రం వెల్లడించలేదు. కాగా ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సభలో దీనిపై క్లుప్తంగా ప్రకటన చేశారు.  

పబ్లిక్‌ సరీ్వస్‌ కమిషన్‌ను ప్రక్షాళన చేశాం 
‘నిరుద్యోగ యువతీ యువకుల ఆశలు నెరవేర్చేందుకు జాబ్‌ కేలండర్‌ ప్రకటిస్తామని ముందే చెప్పాం. ఆ విధంగానే సీఎం రేవంత్‌రెడ్డి నాయకత్వంలో జాబ్‌ కేలండర్‌ విడుదల చేస్తున్నాం. గత ప్రభుత్వ హయాంలో ఉద్యోగ నియామకాల ప్రకటనలు రావడం, రద్దు కావడం లేదా వాయిదా పడటం, పరీక్షలు జరిగితే ప్రశ్నపత్రాల లీకేజీ, పరీక్షల తేదీలు ఓవర్‌లాప్‌ లాంటి వాటితో అభ్యర్థులు ఇబ్బందులు పడ్డారు. గత ప్రభుత్వ పాలనలో గ్రూప్‌–1 పరీక్ష రెండుసార్లు రద్దయింది.

2023 మార్చి 17న పేపర్‌ లీక్‌ కావడంతో, 2024 ఫిబ్రవరి 19న అభ్యర్థుల బయోమెట్రిక్‌ తీసుకోకపోవడంతో హైకోర్టు తీర్పు మూలంగా రద్దు అయింది. అధికారంలోకి రాగానే రాష్ట్ర పబ్లిక్‌ సరీ్వస్‌ కమిషన్‌ ప్రక్షాళనకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, పౌర సరఫరాల శాఖ మంత్రి.. యూపీఎస్సీ చైర్మన్‌ను సంప్రదించారు. సీనియర్‌ ఐఏఎస్‌ అధికారులతో కూడిన కమిటీ యూపీఎస్సీ, కేరళ పబ్లిక్‌ సరీ్వస్‌ కమిషన్‌ విధానాలను  అధ్యయనం చేíసింది. అనంతరం కమిషన్‌ను ప్రక్షాళన చేశాం. గ్రూప్‌–1 నోటిఫికేషన్‌లో అదనంగా 60 పోస్టులు జోడించి 563 ఖాళీల కోసం కొత్తగా నోటిఫికేషన్‌ జారీ చేశాం.

ఫలితాలు ప్రకటించాం. ఈ ఏడాది అక్టోబర్‌ 21 నుంచి 27 వరకు మెయిన్స్‌ పరీక్షలకు షెడ్యూల్‌ విడుదల చేశాం. మొత్తంగా 32,410 మంది నిరుద్యోగ యువతకు నియామక ఉత్తర్వులు జారీ చేశాం. అదనంగా 13,505 ఉద్యోగాల నియామకం చివరి దశకు చేరుకుంది. 11,022 ఉపాధ్యాయ ఖాళీల భర్తీకి డీఎస్సీ నోటిఫికేషన్‌ విడుదల చేశాం. గ్రూప్‌–1, గ్రూప్‌ 2, గ్రూప్‌–3 పరీక్షల మధ్య తగిన సమయం లేకపోవడంతో నిరుద్యోగుల కోరిక మేరకు ఆగస్టు 7, 8 తేదీల్లో జరగాల్సిన గ్రూప్‌–2 పరీక్షలు డిసెంబర్‌కు వాయిదా వేశాం. ఈ నెల 1వ తేదీన జరిగిన కేబినెట్‌ సమావేశంలో జాబ్‌ కేలండర్‌ గురించి చర్చించి ఆమోదించాం..’ అని డిప్యూటీ సీఎం తెలిపారు. 

 

అబిడ్స్‌లో అమ్మే కేలండర్‌లా ఉంది: బీఆర్‌ఎస్‌  
జాబ్‌ కేలండర్‌ విడుదలపై భట్టి విక్రమార్క ప్రకటన చేయగానే, తమకు స్పందించే అవకాశం ఇవ్వాలంటూ బీఆర్‌ఎస్‌ సభ్యుడు కేటీఆర్‌ స్పీకర్‌ను కోరారు. మంత్రులు చేసే స్టేట్‌మెంట్లపై స్పందించేందుకు వీలుండదంటూ స్పీకర్‌ తిరస్కరించారు. దీంతో జాబ్‌ కేలండర్‌పై తమకు అసంతృప్తి ఉందని, దానిపై కొంత స్పష్టత అవసరముందని, తనకు మాట్లా డేందుకు అవకాశం కలి్పంచాలని కేటీఆర్‌ కోరారు. డిప్యూటీ సీఎం భట్టి లేచి శాసనసభ రూల్‌ బుక్‌లో నిబంధన చదివి వినిపించారు. మంత్రులు స్టేట్‌మెంట్‌ ఇచి్చన తర్వాత దాని పై ప్రశ్నలు, వివరణలకు వీలులేదని చెప్పారు.

దీంతో స్పీకర్‌ తదుపరి అంశాన్ని చేపట్టారు. అయితే బీఆర్‌ఎస్‌ సభ్యులు పలువురు కేటీఆర్‌కు మద్దతుగా పోడియం వద్దకు వెళ్లి తమకు మాట్లాడేందుకు అవకాశం ఇవ్వాలని అడిగా రు. అది జాబ్‌ కేలండర్‌లా లేదని, అబిడ్స్‌లో విక్రయించే సాధారణ కేలండర్‌లా ఉందంటూ ఎద్దేవా చేశారు. అప్పటికే డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కౌన్సిల్‌కు వెళ్లిపోవడంతో ఆయన వచ్చిన తర్వాత అవకాశమిస్తానని స్పీకర్‌ చెప్పారు. బీఆర్‌ఎస్‌ సభ్యులు పట్టించుకోకుండా చాలాసేపు పోడియం వద్దనే నిలబడి నిరసన వ్యక్తం చేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement