
ఆర్థిక బిల్లుల చెల్లింపులో రాష్ట్ర ప్రభుత్వ కొత్త సూత్రం
15 రోజులకోసారి సీఎం, డిప్యూటీ సీఎంల భేటీ?
టోకెన్లు వచ్చి పెండింగ్‌లో ఉన్న బీఆర్‌ఎస్ హయాంలోని బిల్లుల చెల్లింపుపై చర్చ
సాక్షి, హైదరాబాద్: బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో పెండింగ్‌లో ఉన్న ఆర్థిక బిల్లుల చెల్లింపులో ప్రాధాన్యం పాటించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ బిల్లుల మంజూ రు క్రమంలో వస్తున్న అపవాదులు, ప్రతిపక్షాలు మోపు తున్న నిందలకు చెక్ పెట్టేలా అందుబాటులో ఉన్న నిధుల ను బట్టి ప్రాధాన్యతల వారీగా మంజూరు చేయాలని భావి స్తోంది. ఇందుకోసం సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కలు ప్రతి 15 రోజులకోసారి సమా వేశం కావాలని, ఈ బిల్లులపై చర్చించి అప్పటి పరిస్థితులకు అనుగుణంగా ముందుకెళ్లాలని నిర్ణయించినట్టు సమాచారం.
గత ప్రభుత్వ హయాంలో చేసిన పనులకుగాను టోకెన్లు వచ్చి పెండింగ్‌లో ఉన్న బిల్లుల గురించి ఈ సమావేశంలో చర్చించి తగిన విధంగా నిర్ణయాలు తీసుకుంటారని తెలుస్తోంది. ప్రతినెలా రాష్ట్ర ఖజానాపై పెద్దభారం పడకుండా, తక్కువ నిధులతో ఎక్కువమందికి ప్రయోజనం కలిగే విధంగా ఉండే బిల్లులకు తొలి ప్రాధాన్యం ఇవ్వాలని, పాఠశాలల్లో పుస్తకాలు, క్రీడా పరికరాల సరఫరా, మెడికల్ బిల్లులు, ఆరోగ్యశ్రీ ట్రస్టు, సర్పంచ్‌లకు రూ.5 లక్షల లోపు బిల్లులను వీలున్నంత త్వరగా క్లియర్ చేయాలనేది ప్రభుత్వ ఉద్దేశంగా కనిపిస్తోంది.
తద్వారా ఇష్టారాజ్యంగా బిల్లులు ఇస్తున్నారన్న విమర్శలకు చెక్ పెట్టాలనేది అటు రాష్ట్ర ప్రభుత్వం, ఇటు కాంగ్రెస్ పార్టీ పెద్దల ఉద్దేశమనే చర్చ ప్రభుత్వవర్గాల్లో జరుగుతోంది.
అంతర్గత విమర్శలకూ తావు లేకుండా
మరోవైపు రాష్ట్ర ప్రభుత్వంలో భాగమైన మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా బిల్లుల మంజూరులో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, తాము చెప్పినా బిల్లులు రావడం లేదనే అసంతృప్తితో వారున్నారనేది కాంగ్రెస్ పార్టీలో బహిరంగ రహస్యమే. ఈ అసంతృప్తికి కూడా చెక్ పెట్టాలని కాంగ్రెస్ అధిష్టానం సూచించినట్టు సమాచారం.
ఈ నేపథ్యంలో పార్టీలో అంతర్గత విమర్శలకు కూడా తావులేకుండా పెండింగ్ బిల్లుల మంజూరులో ప్రాధాన్యం పాటించాలనే నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. మంత్రులు, ఎమ్మెల్యేలు తమ తమ ప్రాధాన్యతల ప్రకారం అడిగే బిల్లులను కూడా వీలున్నంత త్వరగా క్లియర్ చేసేలా 15 రోజులకోసారి జరిగే సీఎం, డిప్యూటీ సీఎంల భేటీలో నిర్ణయాలు తీసుకుంటారని సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment