Coaching centers
-
కోటా జోరుకు కళ్లెం
కోటా: రాజస్తాన్‌లోని కోటా. పోటీ పరీక్షలకు శిక్షణ కేంద్రంగా దేశంలోనే అగ్రగామిగా పేరున్న నగరం. విద్యార్థులతో కళకళలాడుతూ కోచింగ్ సెంటర్లు, హాస్టళ్ల నిర్వాహకులకు కాసులు కురిపించే ఈ నగరం కళ తప్పుతోందా? అంటే, అవుననే సమాధానం వస్తోంది. ఇటీవలి కాలంలో కోటాకు శిక్షణ కోసం వచ్చే విద్యార్థుల సంఖ్య తగ్గిపోయింది. ఎందుకు? శిక్షణ కోసం వచ్చే విద్యార్థులు వివిధ కారణాలతో ఆత్మహత్యలకు పాల్పడుతున్న ఘటనలు, కోచింగ్ సెంటర్లకు ప్రభుత్వం కొత్తగా జారీ చేసిన మార్గదర్శకాలు, కోచింగ్ సెంటర్లను వేరే ప్రాంతాలకు విస్తరించడం వంటి కారణాలూ దీని వెనుక ఉన్నాయని చెబుతున్నారు. కోచింగ్ సెంటర్లు 16 ఏళ్ల లోపు వారిని చేర్చుకోరాదనే నిబంధన వల్ల ఈ ప్రభావం మరీ ఎక్కువగా ఉందని పేర్కొంటున్నారు.వివిధ పోటీ పరీక్షలకు శిక్షణ కోసం కోటాకు ఏటా 2 లక్షల నుంచి 2.5 లక్షల వరకు విద్యార్థులు వస్తుంటారు. వీరి వల్ల నగరంలోని అన్ని రంగాలకు కలిపి ఏటా సుమారు రూ.7 వేల కోట్ల వరకు ఆదాయం ఉండేది. అయితే, ఈ ఏడాది విద్యార్థుల సంఖ్య 85 వేల నుంచి లక్ష వరకు తగ్గిపోయింది. ఫలితంగా ఆదాయం కూడా ఈసారి ఒక్కసారిగా సగానికి సగం, రూ.3,500 కోట్లకు పడిపోయింది.నిర్వాహకుల ధీమాఅత్యుత్తమ శిక్షణకు కోటాకు ఉన్న విశ్వసనీయత ఏమాత్రం చెక్కుచెదరలేదని, విద్యార్థులకు ఇతర నగరాల్లో లేనటువంటి అనుకూల వాతావరణం ఇక్కడ ఉన్నందున ఈ తగ్గుదల ప్రభావం స్వల్పకాలమే ఉంటుందని, మున్ముందు తిరిగి పుంజుకుంటామని కోచింగ్ సెంటర్లు, హాస్టళ్ల నిర్వాహకులు ధీమాతో ఉన్నారు. వచ్చే ఏడాదిలో తమ నష్టాలు పూడ్చుకుంటామని రాజస్తాన్ ఇండస్ట్రీస్ యునైటెడ్ కౌన్సిల్ జోనల్ చైర్ పర్సన్ గోవింద్రామ్ మిట్టల్ బల్లగుద్ది చెబుతున్నారు. బెంగళూరులో మాదిరిగా కోటాలోనూ ఐటీ హబ్‌లు ఏర్పాటు చేసేందుకు గల ప్రత్యామ్నాయ అవకాశాలనూ పారిశ్రామిక వేత్తలు పరిశీలిస్తున్నారని వివరించారు. ప్రైవేట్ కంపెనీల్లో మేనేజ్మెంట్ పోస్టుల్లో సగానికి సగం, నాన్ మేనేజ్మెంట్ పోస్టుల్లో 75 శాతం స్థానికులకే ఇవ్వాలంటూ కర్ణాటక ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టంపై దేశవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలోనే రాజస్తాన్ పారిశ్రామికవేత్తలు..ఐటీ హబ్‌లను కోటాకు మార్చాలంటూ బెంగళూరులోని ఐటీ కంపెనీల అధిప తులను కోరడం, కొందరు ఓకే అనడం జరిగిపోయాయని ఆయన అన్నారు. లోక్‌సభ స్పీకర్, కోటా–బుండి ఎంపీ ఓం బిర్లా ఆదేశాల మేరకు కోటాలో ఐటీ హబ్‌ల ఏర్పాటుకు అవసరమైన భూముల కేటాయింపుల ప్రక్రియ మొదలైందని ఆయన వివరించారు.వాయిదాలకు సైతం కష్టంగా ఉంది‘గతేడాది వరకు రోజులో 60 మంది వరకు విద్యార్థులు నా ఆటోలో ప్రయాణించే వారు. మంచి ఆదాయం ఉండటంతో కుటుంబ పోషణ ఏమాత్రం ఇబ్బందిలేకుండా ఉండేది. ప్రస్తుతం విద్యార్థుల సంఖ్య 20కి తగ్గింది. ఆదాయం కూడా పడిపోయింది. రుణంపై కొనుగోలు చేసిన వాహనానికి కిస్తీలు చెల్లించేందుకు సైతం ఇబ్బందవుతోంది’అని స్థానిక ఆటో డ్రైవర్ ఒకరు చెప్పారు.ఇబ్బందుల్లో హాస్టళ్ల యజమానులుకోచింగ్ సెంటర్లు, హాస్టళ్ల పరిశ్రమ సంక్షోభంలో పడిన మాట నిజమేనని కోటా హాస్టల్స్ అసోసియేషన్ అధ్యక్షుడు నవీన్ మిట్టల్ ఒప్పుకున్నారు. ఇతర ప్రాంతాల నుంచి కోటాకు వచ్చే విద్యార్థుల సంఖ్య ఒక్కసారిగా 30 శాతం నుంచి 40 శాతం మేర పడిపోవడం కొన్ని దశాబ్దాల్లో ఇదే మొదటిసారని ఆయన చెప్పారు. బ్యాంకుల్లో రుణాలు తెచ్చి పలు హాస్టళ్లను ఏర్పాటు చేసుకున్న కొందరు యజమానులు వాయిదాలు చెల్లించలేక ఇప్పుడు ఇబ్బందులు పడుతున్నారని ఆయన వివరించారు. నగరంలో ఉన్న 4,500 హోటళ్లలో చాలా చోట్ల విద్యార్థుల ఆక్యుపెన్సీ రేటు 40–50 శాతానికి మధ్య పడిపోయిందన్నారు. ‘నేషనల్ క్రైం రికార్డ్స్ బ్యూరో(ఎన్సీఆర్బీ) గణాంకాల ప్రకారం ఆత్మహత్యల పరంగా చూసే దేశంలోని 50 నగరాల తర్వాత దిగువన కోటా ఉంది. అయితే, ఆత్మహత్య ఘటనల ప్రచారంతో ప్రతికూల ప్రభావం పడింది’అని నవీన్ అన్నారు. హాస్టళ్లలో రూం అద్దెలు నెలకు రూ.15వేలుండగా ఇప్పుడది రూ.9 వేలకు తగ్గిందని, చాలా హాస్టళ్లు ఖాళీగానే ఉన్నాయని స్థానిక కోరల్‌పార్క్ ప్రాంతంలోని హాస్టల్ యజమాని ఒకరన్నారు. -
కోచింగ్ సెంటర్లపై కేంద్రం కొరడా!
‘వంద శాతం జాబ్ గ్యారెంటీ’, ‘100 శాతం సెలెక్షన్’ వంటి అసత్య ప్రకటనలతో, అబద్ధాలతో అభ్యర్థులను తప్పుదోవ పట్టిస్తున్న కోచింగ్ ఇన్స్టిట్యూట్లకు కేంద్ర ప్రభుత్వం షాక్ ఇచి్చంది. ఇలాంటి మోసపూరిత, తప్పుడు ప్రకటనలు ఇస్తే కఠిన చర్యలు తప్పవని పేర్కొంది. ఈ మేరకు వివిధ పోటీ పరీక్షలకు, ఉద్యోగ నియామక పరీక్షలకు శిక్షణ ఇచ్చే కోచింగ్ కేంద్రాలు తప్పుడు హామీలు ఇవ్వకుండా చర్యలు చేపట్టింది. మోసపూరిత హామీలతో అభ్యర్థులను ఏమార్చవద్దని వాటిని హెచ్చరించింది. ఈ మేరకు కొత్త మార్గదర్శకాలను తాజాగా విడుదల చేసింది. – సాక్షి, ఏపీ,సెంట్రల్ డెస్క్ఈ ఏడాది 6,980 ఫిర్యాదులు కేంద్ర వినియోగదారుల పరిరక్షణ సంస్థ (సీసీపీఏ)కు వివిధ పోటీ పరీక్షలకు, ఉద్యోగ నియామక పరీక్షలకు శిక్షణ ఇస్తున్న కేంద్రాలపై అనేక ఫిర్యాదులు వస్తున్నాయని కేంద్రం పేర్కొంది. ఫ్యాకల్టీ లేకపోయినా ఉన్నట్లు మభ్యపెట్టడం, తక్కువే సీట్లే ఉన్నాయని.. త్వరపడకపోతే సీట్లు అయిపోతాయని అభ్యర్థులపై ఒత్తిడి తేవడం, గతంలో వచి్చన ర్యాంకుల ఆధారంగా ఎక్కువ ఫీజులు వసూలు చేయడం, తప్పుడు, మోసపూరిత హామీలు ఇవ్వడం వంటి ఫిర్యాదులు వచ్చాయని తెలిపింది. ఇలా 2021–22లో 4,815, 2022–23లో 5,351, 2023–24లో 16,276, ఈ ఏడాది ఇప్పటివరకు 6,980 ఫిర్యాదులు అందినట్లు కేంద్ర వినియోగదారుల వ్యవహారాల శాఖ వెల్లడించింది. ఈ నేపథ్యంలో ఫిర్యాదులు ఎదుర్కొంటున్న కోచింగ్ సంస్థలకు సీసీపీఏ 54 నోటీసులు పంపింది. వీటికి రూ.54.60 లక్షలు జరిమానా కింద విధించింది. 2023 సెపె్టంబర్ 1 నుంచి ఈ ఏడాది ఆగస్టు 31 వరకు రూ.1.15 కోట్లను విద్యార్థులకు పరిహారంగా ఇప్పించింది.తప్పుడు ప్రకటనలు ఇచ్చే కోచింగ్ సంస్థలపై కఠిన చర్యలు ఉండాలితప్పుడు ర్యాంకుల ప్రకటనలు ఇచ్చే కోచింగ్ సెంటర్ల యాజమాన్యాలపై కఠిన చర్యలు తీసుకోవాలి. వాటికి జరిమానాలు విధించడం వల్ల ప్రభుత్వం ఆశించిన ప్రయోజనం నెరవేరదు. యావజ్జీవ శిక్షకు తగ్గకుండా కోచింగ్ సెంటర్ల యాజమాన్యాలపై చర్యలు ఉండాలి. అలాగే తమ సంస్థల్లో శిక్షణ తీసుకున్నట్టు చెప్పాలని ర్యాంకులు సాధించిన విద్యార్థుల తల్లిదండ్రులకు ఆయా కోచింగ్ సెంటర్ల యాజమాన్యాలు డబ్బులు ఇస్తాయి. క్లాస్ రూం కోచింగ్ ఒకరి వద్ద, ఆన్లైన్ కోచింగ్ ఇంకొకరి వద్ద, మెటీరియల్/బుక్స్ మరొకరి వద్ద తీసుకున్నామంటూ ఆయా సంస్థల డబ్బులకు ఆశపడి అబద్ధాలు చెప్పే విద్యార్థులు, వారి తల్లిదండ్రులపైన కూడా కఠిన చర్యలు తీసుకోవాలి. యాజమాన్యాల డబ్బులకు ఆశపడి అనేక కో చింగ్ సెంటర్లలో శిక్షణ తీసుకున్నామని చెబితే వా రిపై చర్యలు తీసుకోవాలి.మీడియా కూడా తప్పు డు ప్రకటనల పట్ల జాగరూకతతో ఉండాలి. గతంలో ర్యాంకులు సాధించిన అభ్యర్థుల హా ల్టికెట్లను పరిశీలించాకే వారి గురించి ప్రచురించేవి. ఇప్పుడు కూడా ఇలాగే వ్యవహరించాలి. తప్పుడు ప్రకటనలు ఇచ్చే కోచింగ్ సంస్థల యాజమాన్యాలపై చర్యలు తీసుకుంటే అసలు నిజాలు తెలుస్తాయి. – కె.లలిత్ కుమార్, జేఈఈ కోచింగ్ నిపుణులు, ఎడ్యుగ్రామ్360.కామ్ తప్పుదోవ పట్టించే ప్రకటనలకు అడ్డుకట్ట.. కోచింగ్ కేంద్రాలు ఉద్దేశపూర్వకంగా అభ్యర్థుల వద్ద కొంత సమాచారాన్ని దాస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని కేంద్రం తెలిపింది. శిక్షణా కేంద్రాలకు ప్రభుత్వం వ్యతిరేకం కాదని.. అయితే వివిధ పోటీ పరీక్షలకు శిక్షణ తీసుకుంటున్న అభ్యర్థులు నష్టపోకుండా తాజా మార్గదర్శకాలు జారీ చేశామని కేంద్రం వెల్లడించింది. అభ్యర్థులను తప్పుదోవ పట్టించే ప్రకటనలకు అడ్డుకట్ట వేయడమే తమ ఉద్దేశమని స్పష్టం చేసింది. తమ మార్గదర్శకాలు అభ్యర్థులకు గైడెన్స్, విద్యాపరమైన మద్దతు, ట్యూటరింగ్, స్టడీ ప్రోగ్రామ్స్, విద్యకు సంబంధించిన ప్రకటనలకు వర్తిస్తాయని స్పష్టతనిచి్చంది. కౌన్సెలింగ్, థియేటర్ ఆర్ట్స్, క్రీడలు, డ్యాన్స్, ఇతర సృజనాత్మక కార్యక్రమాలకు వర్తించవని తెలిపింది. కోచింగ్ సంస్థలకు మార్గనిర్దేశం చేసేందుకు ఈ మార్గదర్శకాలను జారీ చేస్తున్నామని వివరించింది. కోచింగ్ సెంటర్లు ఖచ్చితత్వంలో వ్యవహరించడం ద్వారా అభ్యర్థుల హక్కులను గౌరవించాలని పేర్కొంది. 50 మంది కంటే ఎక్కువ మందికి శిక్షణ ఇచ్చేసంస్థలకు ఈ మార్గదర్శకాలు వర్తిస్తాయని వెల్లడించింది.కేంద్రం మార్గదర్శకాలు ఇవి..» కోర్సు–వ్యవధి, అధ్యాపకుల వివరాలు, ఫీజులు–వాపసు (రిఫండ్) విధానాలు, ఎంపిక, పరీక్ష ఫలితాలు లేదా ఉద్యోగ నియామకం లేదా జీతం పెరుగుదలకు సంబంధించి మోసపూరిత హామీలను, ప్రకటనలను కోచింగ్ సంస్థలు ఇవ్వకూడదు.» ఉద్యోగాలకు ఎంపికైన లేదా ర్యాంకులు సాధించిన అభ్యర్థుల రాతపూర్వక అనుమతి లేకుండా వారి పేర్లు, ఫొటోలు లేదా ఇతర సమాచారాన్ని శిక్షణ సంస్థలు ఉపయోగించకూడదు. అలాగే వారి సమాచారాన్ని సురక్షితంగా ఉంచాలి.» సివిల్స్ రాసే అభ్యర్థుల్లో కొందరు ప్రిలిమ్స్, మెయిన్స్‌కు వారే సొంతంగా సిద్ధమవుతారు. ఇంటర్వ్యూకు మాత్రమే శిక్షణ తీసుకుంటారు. ఇందుకు సంబంధించి అభ్యర్థులకు కోచింగ్ సెంటర్లు ముందుగానే స్పష్టతనివ్వాలి. » అభ్యర్థులకు వారి కోర్సుల గురించి స్పష్టమైన సమాచారాన్ని అందించాలి. వారి అభ్యంతరాలను తప్పనిసరిగా పరిగణనలోకి తీసుకోవాలి. » అభ్యర్థులకు కోచింగ్ సెంటర్లు తప్పనిసరిగా తమ సేవలు, వనరులు, సౌకర్యాలు, మౌలిక సదుపాయాల గురించి వివరించాలి.» తాము అందిస్తున్న కోర్సులకు అఖిల భారత సాంకేతిక విద్యామండలి (ఏఐసీటీఈ), యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) వంటి సంస్థల గుర్తింపు ఉందని నిర్ధారించాలి. » చట్టబద్ధంగా అనుమతి తీసుకున్న భవనాల్లో మాత్రమే శిక్షణ కేంద్రాలను నడపాలి. » విద్యార్థులు లేదా అభ్యర్థులకు అవసరమైన మౌలిక సదుపాయాలను, ఇతర సౌకర్యాలను శిక్షణ కేంద్రాలు కల్పించాలి. » కోర్సులు, కాలపరిమితి, అధ్యాపకుల అర్హతలు, ఫీజు, రిఫండ్ విధానాలు, ఫలితాలు, జాబ్ గ్యారెంటీ వంటి అంశాలపై తప్పుదోవ పట్టించే ప్రకటనలు ఇవ్వకూడదు. » విద్యార్థులపై ఒత్తిడి తెచ్చేందుకు ‘కొన్ని సీట్లే మిగిలి ఉన్నాయి’ వంటి ప్రకటనలు ఇవ్వడం నిషిద్ధం. » కోచింగ్ సెంటర్లకు ప్రచారం కల్పించే ముందు ఎండార్సర్లు వాటి ప్రకటనలను ధ్రువీకరించుకోవాలి. » కోచింగ్ సెంటర్ల తరఫున ప్రచారం చేసే సినీ నటులు, ఇతర సెలబ్రిటీలు వారు చేసే ప్రకటనలకు బాధ్యత వహించాల్సి ఉంటుంది. » తప్పుడు ప్రకటనలు చేసినా, తప్పుదోవ పట్టించేలా ప్రకటనల్లో నటించినా కోచింగ్ సెంటర్లతోపాటు ప్రచారకర్తలూ బాధ్యత వహించాల్సి ఉంటుంది. » ఇప్పటిదాకా.. ఏవైనా షరతులు ఉంటే చిన్నగా ‘‘స్టార్’’ గుర్తు పెట్టి.. ప్రకటన చివర్లో కనిపించీ, కనిపించకుండా వాటిని చూపించేవారు. ఇకపై ఇలా కుదరదు. ఏవైనా షరతులు ఉంటే ప్రకటన ఏ ఫాంట్ సైజులో ఉంటే అదే సైజులో షరతులను కూడా ప్రచురించాలి. » తప్పుదోవ పట్టించే ప్రకటనలపై ఫిర్యాదు చేసేందుకు వీలుగా కోచింగ్ సెంటర్లు కచి్చతంగా జాతీయ వినియోగదారుల హెల్ప్‌లైన్‌లో నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. -
కోచింగ్ సెంటర్లను నియంత్రించాలి!
భారీ వర్షాల కారణంగా మురుగు కాలువ పొంగిపొర్లి, ఢిల్లీలో ఒక సివిల్ సర్వీస్ శిక్షణా సంస్థలో ఉన్న నేలమాళిగ గ్రంథాలయంలోకి వరద నీరు ఉధృతంగా ప్రవహించిన దుర్ఘటనలో ముగ్గురు విద్యా ర్థులు జల సమాధి కావటం యావత్ దేశాన్ని కలచివేసింది. చని పోయిన ముగ్గురిలో ఒకరు బిహార్ లోని ఔరంగాబాద్‌కు చెందిన తానియా సోనీ తండ్రి మంచిర్యాల సింగరేణిలో సీనియర్ మేనేజర్ కావడంతో తెలంగాణ అంశం తెరపైకి వచ్చింది. దీంతో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తానియా సోనీ మృతదేహాన్ని తరలించడంలో తండ్రి విజయ్ కుమార్‌కు సహాయ సహకా రాలు అందించాల్సిందిగా ఢిల్లీ రెసిడెంట్ కమిషనర్ గౌరవ్ ఉప్పల్‌కు ఆదే శాలు జారీ చేశారు.ఢిల్లీలోని పలు కోచింగ్ సెంట ర్లలో కనీస సౌకర్యాలు లేవనీ, కోచింగ్ సెంటర్లు నరక కూపాలుగా ఉన్నా యనీ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయ మూర్తికి అవినాష్ దూబే అనే సివిల్స్ ఆశావహ అభ్యర్థి లేఖ రాయటంతో అందరి దృష్టి కోచింగ్ సెంటర్లపై పడింది. ప్రధానంగా మన తెలంగాణ రాజధాని హైదరా బాద్‌లో అనుమతి లేని పలు కోచింగ్ సెంటర్లు, స్టడీ హాళ్లు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. ఇవి వరంగల్, ఇతర జిల్లా కేంద్రాలకు కూడా విస్తరించాయి. హైదరాబాద్‌లో కోచింగ్ సెంటర్ల మూలంగా అశోక్ నగర్, దిల్సుఖ్ నగర్, అమీర్ పేట్ నిరుద్యోగుల కూడళ్ళుగా పేరుపొందాయి. దేశవ్యాప్తంగా సుమారు 80 వేల పైచిలుకు కోచింగ్ సెంటర్ ఉన్నట్లు కేంద్ర ప్రభుత్వం వద్ద ఉన్న సమాచారం. సంవత్సరానికి 70 వేల కోట్ల వరకు వ్యాపారం జరుగు తున్నట్లు అంచనా.అడ్డూ అదుపూ లేని కోచింగ్ సెంటర్లపై మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో యూపీఏ ప్రభుత్వం తొలుత దృష్టి పెట్టింది. కోచింగ్ సెంటర్లను సేవారంగంలోకి తెచ్చి వాటిపై పన్నులు వేశారు. 2024 జనవరి 18న కోచింగ్ సెంటర్ల నియంత్రణ కోసం కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ కొన్ని మార్గదర్శకాలు జారీ చేసింది. ఇవి ఎక్కడా అమలు కావడం లేదు. అత్యధిక కోచింగ్ సెంటర్లకు ఎటువంటి అనుమతులు ఉండవు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో నామ మాత్రపు రుసుముతో ఒక వ్యాపార సంస్థగా నమోదు చేసుకుంటారు. భవన యజమానులు అగ్నిమాపక శాఖ విధించిన రక్షణ నిబంధనలు పాటించరు. గృహ అవస రాలకు అని అనుమతి తీసుకుని ఆ భవనాలనే కోచింగ్ సెంటర్లుగా వాడుతూ విద్యుత్ శాఖ ఆదాయానికి గండి కొడుతున్నారు.ఎంతమంది విద్యార్థులు శిక్షణ పొందు తున్నారు, ఎంతెంత ఫీజులు చెల్లిస్తున్నారు అనే లెక్కలు ఉండవు. తరగతి గదిలో శిక్షణ పొందుతున్న ప్రతి విద్యార్థి పైన జీఎస్టీ వంటి పన్నులు చెల్లించకుండా తప్పించుకుంటున్నారు. పైగా వెలుతురు లేని గదుల్లో 100 మంది కూర్చోవాల్సిన చోట 500 మందికి బోధిస్తున్నారు. కనీస మౌలిక సౌకర్యాలు ఉండవు. వీటి కన్నా కన్నా జైళ్ళు నయమనే భావన కలుగుతుంది. జైళ్ళలో మరుగుదొడ్లు, మూత్ర శాలలు పరిశుభ్రంగా ఉండటమే కాకుండా జైలు గదుల్లో వెలుతురు ఉంటుంది. నిబంధనల ప్రకారం గదిలో లెక్కకు మించి ఖైదీలను ఉంచరు.అత్యధిక ఫీజులు వసూలు చేస్తూ సరైన భద్రతా ప్రమా ణాలు పాటించని కోచింగ్ సెంటర్లను నియంత్రించాల్సిన బాధ్యత తెలంగాణ ప్రభుత్వానికి ఉంది. ఇటీవల హరి యాణా ప్రభుత్వం కోచింగ్ సెంటర్ల నమోదు నియంత్రణ బిల్లు–2024ను తెచ్చి ప్రైవేట్ కోచింగ్ సెంటర్లను కట్టడి చేసింది. అట్లాగే రేవంత్ రెడ్డి సర్కార్ కూడా చట్టం తెచ్చి, తల్లిదండ్రులపై ఫీజుల భారం పడకుండా విద్యార్థి నిరు ద్యోగుల శ్రేయస్సుకు పాటుపడాలి.– కోటూరి మానవతా రాయ్, వ్యాసకర్త టీపీసీసీ అధికార ప్రతినిధి; తెలంగాణ విద్యార్థి నిరుద్యోగ జేఏసీ చైర్మన్, 90009 19101 -
13 ఐఏఎస్ కోచింగ్ సెంటర్లు సీజ్
-
ఢిల్లీ కోచింగ్ సెంటర్ ఘటన.. రాహుల్ గాంధీ రియాక్షన్..
ఢిల్లీ: ఢిల్లీ కోచింగ్ సెంటర్ ఘటనపై ఏఐసీసీ అగ్రనేత, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ స్పందించారు. ప్రభుత్వ సంస్థల బాధ్యతారాహిత్యానికి సామాన్య ప్రజలు మూల్యం చెల్లించకుంటున్నారని మండిపడ్డారు. భారీ వర్షాల కారణంగా సివిల్స్ శిక్షణా కేంద్రంలోకి వరద పోటెత్తి ముగ్గురు అభ్యర్థులు మృతిచెందిన విషయం తెలిసిందే. మృతుల కుటుంబాల పట్ల రాహుల్ తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.‘‘ఢిల్లీలోని ఓ భవనం బేస్మెంట్లో నీరు చేరి పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులు మృతి చెందడం చాలా బాధాకరం. గతంలో వర్షాలకు విద్యుత్ షాక్ కారణంగా ఓ విద్యార్థి మృతి చెందాడు. మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా. ఈ ఘటన వ్యవస్థల వైఫల్యం. అసురక్షిత నిర్మాణం, పేలవమైన భవన నిర్మాణ ప్రణాళిక, సంస్థల బాధ్యతారాహిత్యం వల్ల సామాన్య పౌరులు తమ ప్రాణాలను పోగొట్టుకుంటున్నారు. సురక్షితమైన, సౌకర్యవంతమైన జీవితం ప్రతీ పౌరుడి హక్కు. దాన్ని అందించడం ప్రభుత్వాల బాధ్యత’’ అంటూ రాహుల్ ట్విట్ చేశారు. दिल्ली की एक बिल्डिंग के बेसमेंट में पानी भर जाने के कारण प्रतियोगी छात्रों की मृत्यु बहुत ही दुर्भाग्यपूर्ण है। कुछ दिन पहले बारिश के दौरान बिजली का करंट लगने से एक छात्र की मृत्यु हुई थी।सभी शोकाकुल परिजनों को अपनी भावपूर्ण संवेदनाएं व्यक्त करता हूं।इन्फ्रास्ट्रक्चर का ये…— Rahul Gandhi (@RahulGandhi) July 28, 2024 -
పరీక్షల వాయిదాకు గూడుపుఠాణి
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: ఉద్యోగాలు ఇవ్వాలని తమ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంటే.. గ్రూప్స్, డీఎస్సీ పరీక్షల వాయిదాకు దొంగలు గూడు పుఠాణి చేస్తున్నారని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆరోపించారు. కోచింగ్ సెంటర్ల మాఫియా పరీక్షలు వాయిదా వేయించాలని చూస్తోందని, వారి ధనదాహంతో నిరుద్యోగుల జీవితాలతో చెలాగాటమాడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా ప్రగతిపై ప్రజాప్రతినిధులు, అధికారులతో ఆయన మంగళవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. అనంతరం భూత్పూర్ రోడ్డులోని ఏఎస్ఎం కన్వెన్షన్ హాల్లో కాంగ్రెస్‌కు చెందిన ప్రజాప్రతినిధులు, ముఖ్య నాయకులు, కార్యకర్తల సమావేశంలో మాట్లాడారు. పుట్టగతులుండవనే కుట్రలు ‘పార్టీ ఎప్పుడు బలహీనపడితే అప్పుడు కేసీఆర్ విద్యార్థులను ముందుకు తీసుకొస్తారు. విద్యార్థుల శవాలతో రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్నారు. హరీశ్, కేటీఆర్‌కు సవాల్ విసురుతున్నా.. పరీక్షల వాయిదా కోసం మీరు ఆమరణ దీక్షకు కూర్చోండి. మా ప్రభుత్వంలో నిరుద్యోగులకు నష్టం జరుగుతుందని నిజంగా మీరు అనుకుంటే బిల్లా, రంగాలు పరీక్షలు వాయిదా వేసేవరకు ఆర్ట్స్ కాలేజీ ముందు ఆమరణ నిరాహార దీక్షకు దిగాలి.పేదోళ్ల పిల్లల్ని రెచ్చగొట్టుడు కాదు.. మీ వాదన నిజమైతే వారి పక్షాన మీరు దీక్షకు దిగాలి. పరీక్షలు వాయిదా వేస్తే ప్రభుత్వానికి నష్టం లేదు. నిరుద్యోగులు నష్టపోకూడదనేదే ప్రభుత్వ ఆలోచన. కేసీఆర్‌కు, బీఆర్ఎస్కు పుట్టగతులు ఉండవనే వారు కుట్రలు చేస్తున్నారు..’అని సీఎం ఆరోపించారు. బీజేపీ, బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కూల్చాలని చూశాయి ‘కేసీఆర్, కేటీఆర్ ఏదేదో మాట్లాడుతున్నారు.. మేం మీలా దొంగ దెబ్బ తీయడం లేదు. మీలా ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయలేదు. కేసీఆర్.. ముందుంది మొసళ్ల పండగ. మా ఎమ్మెల్యేలను నువ్వు గుంజుకున్నప్పుడు నీకు ప్రజాస్వామ్యం గుర్తుకు రాలే దా? బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటై ప్రభుత్వాన్ని పడగొట్టాలని చూశాయి. కాంగ్రెస్ పారీ్టతో పెట్టుకుంటే నీకు పుట్టగతులు ఉండవని ఆనాడే చెప్పా. కేసీఆర్ ఇక నీకు రాజకీయ మనుగడ లేదు. చేతనైతే అభివృద్ధికి సహకరించు.. లేకపోతే ఫామ్‌హౌస్‌లోనే పడు కో. నాలుగు రోజులుగా హరీశ్, కేటీఆర్ ఢిల్లీ చుట్టూ తిరుగుతున్నారు. తనదాకా వస్తే గానీ వాళ్లకు నొప్పి తెలియలేదు..’అని రేవంత్ విమర్శించారు.ఆగస్టు 15లోపు రుణమాఫీ ‘నేను కార్యకర్తల్లో ఒక కార్యకర్తను. అందుకే ముఖ్య నాయకులను కలవాలని ఇక్కడికి వచ్చా. మిమ్మల్ని కలిస్తే నాకు వెయ్యి ఏనుగుల బలం వస్తుంది. కార్యకర్తల కష్టంతోనే టీపీసీసీ అధ్యక్షుడి నుంచి ఈ రోజు ముఖ్యమంత్రి వరకు ఎదిగా. ఈ ప్రభుత్వం మీది.. మీ సూచనలు, సలహాలను ప్రభుత్వం పాటిస్తుంది. నాయకుల ఎన్నికలు ముగిశాయి.. ఇక స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయి.ఇప్పటివరకు మీరు నాయకుల కోసం కష్టపడ్డారు.. త్వరలో రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో నాయకులు కష్టపడి మిమ్మల్ని గెలిపిస్తారు. ఆగస్టు 15 లోపు రుణమాఫీ చేస్తాం. ఆ తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్తాం..’అని ముఖ్యమంత్రి చెప్పారు. ఈ కార్యక్రమంలో మంత్రి జూపల్లి కృష్ణారావు, ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్‌రెడ్డి, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి, ఎంపీ మల్లు రవి, ఉమ్మడి జిల్లాలోని ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. -
డీఎస్సీ హడావుడి షురూ
సాక్షి, హైదరాబాద్: డీఎస్సీ హడావుడి మొదలైంది. మంచి కోచింగ్ కేంద్రాల కోసం టీచర్ ట్రైనింగ్ పూర్తి చేసినవారు వెతుకుతున్నారు. అయితే వారిని ఆకర్షించేందుకు కోచింగ్ కేంద్రాలు లోతైన మెటీరియల్ ఇస్తామని, సబ్జెక్ట్ నిపుణులతో ప్రత్యేక క్లాసులు చెప్పిస్తామని ప్రచారం చేస్తున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 11,062 పోస్టులతో డీఎస్సీ నిర్వహణకు ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చిన విషయం తెలిసిందే. వచ్చే జూలై 17 నుంచి 31 వరకూ ఆన్లైన్ పద్ధతిలో పరీక్ష జరుగుతుంది. గత ఏడాది డీఎస్సీకి 1.70 లక్షల దరఖాస్తులు వస్తే, ఇవి కాకుండా కొత్తగా ఇప్పటి వరకూ మరో 25 వేల మంది వరకూ దరఖాస్తు చేశారు. డీఎస్సీకి ముందే ఉపాధ్యాయ అర్హత పరీక్ష నిర్వహిస్తున్నారు. దీంతో గడువు ముగిసే నాటికి మరో లక్ష మంది వరకూ డీఎస్సీకి దరఖాస్తు చేసే అవకాశముంది. మొత్తంగా 3 లక్షల మంది ఈ ఏడాది డీఎస్సీకి హాజరవుతారని అధికారులు అంచనా వేస్తున్నారు. కోచింగ్ తీసుకునేందుకు 1.50 లక్షల మందికిపైగా హైదరాబాద్‌కు వచ్చేందుకు సిద్ధమవుతున్నారు. తేలికగా ఉండదని... ఉపాధ్యాయ నియామక ప్రక్రియ ఈసారి కఠినంగా ఉంటుందని కొన్ని కోచింగ్ కేంద్రాలు చెబుతున్నాయి. ఏజెంట్లను నియమించుకుని మరీ ఈ తరహా ప్రచారానికి తెరలేపాయి. 2017 నుంచి డీఎస్సీ నోటిఫికేషన్ లేకపోవడం, టెట్ ఉత్తీర్ణత సాధించినవారి సంఖ్య ఏటా పెరుగుతుండటంతో దరఖాస్తుదారుల సంఖ్య భారీగానే ఉంటుందని అనుకుంటున్నారు. పోటీ పెరిగిన నేపథ్యంలో వడపోత విధానాలపై విద్యాశాఖ కసరత్తు మొదలుపెట్టిందని వారు అంటున్నారు. గతంలో మాదిరి తేలికైన, సూటి ప్రశ్నలు వచ్చే వీల్లేదని అంచనా వేస్తున్నారు. మ్యాథ్స్, సైన్స్ సహా సైకాలజీ సబ్జెక్టుల్లోనూ కఠినమైన రీతిలో ప్రశ్నలు రూపొందించొచ్చని చెబుతున్నారు. నూతన విద్యావిధానం అమలులోకి వస్తున్న తరుణంలో బోధన పద్ధతుల నుంచి లోతైన ప్రశ్నలు ఉంటాయంటున్నారు. జాతీయ, అంతర్జాతీయ బోధన మెళకువలను అభ్యర్థుల నుంచి తెలుసుకునే వ్యూహం డీఎస్సీలో ఉంటుందని నిపుణులూ అంటున్నారు. గత కొంతకాలంగా బీఈడీ, డీఎడ్‌లో ఇవన్నీ లేవని, కాబట్టి కొత్త విషయాలను అవగాహన చేసుకుంటే తప్ప డీఎస్సీ తేలికగా రాయడం కష్టమనే వాదనను కోచింగ్ కేంద్రాలు ప్రచారం చేస్తున్నాయి. అయితే, నిర్దేశించిన సిలబస్ నుంచే ప్రశ్నపత్రం ఉంటుందని, కాకపోతే నవీన బోధన విధానాలు, సైకాలజీ నుంచి సరికొత్త విషయాలతో ప్రశ్నపత్రం రూపొందించే ఆలోచనలో ఉన్నట్టు అధికార వర్గాలు అంటున్నాయి. దీనినిబట్టి అకడమిక్ పుస్తకాలకు అందని రీతిలో డీఎస్సీ ఉంటుందా? అనే సందేహాలు అభ్యర్థుల నుంచి వ్యక్తమవుతున్నాయి. పోటీ పెంచుతున్న కోచింగ్ సెంటర్లు కొత్త స్టడీ మెటీరియల్ రూపకల్పన, ఫ్యాకల్టీ ఎంపికపై కోచింగ్ కేంద్రాలు తీవ్రంగా కసరత్తు చేస్తున్నాయి. మూడు నెలల కాల పరిమితితో కూడిన డీఎస్సీ కోచింగ్ సిలబస్ రూపొందిస్తున్నాయి. సొంతంగా మెటీరియల్ తయారు చేసుకుంటున్నాయి. హైదరాబాద్ కేంద్రంగా ఇప్పటికే 20 ప్రముఖ కోచింగ్ సెంటర్లు విస్తృతంగా ప్రచార కార్యక్రమంలో ఉన్నాయి. మరో వంద వరకూ చిన్నాచితక సెంటర్లు వెలిశాయి. స్వల్పకాలిక కోచింగ్‌కు ఒక్కో అభ్యర్థి నుంచి రూ.1.50 లక్షల నుంచి రూ. 2.50 లక్షల వరకూ డిమాండ్ చేస్తున్నాయి. వివిధ రాష్ట్రాల్లో నూతన విద్యా విధానంలో వచ్చిన మార్పుల ఆధారంగా కోచింగ్ ఉంటుందని చెబుతున్నాయి. డీఎస్సీ రాసేవారిలో నాలుగేళ్ల ముందు బీఎడ్, డీఎడ్ ఉత్తీర్ణులైన వారున్నారు. ఒక్కసారిగా సిలబస్ మారుతోందనే ప్రచారంతో వారంతా ఆందోళన చెందుతున్నారు. కొత్త తరహా ప్రశ్నపత్రం వస్తే కష్టమనే భావన బలపడుతోంది. అయితే, మెథడాలజీ, సబ్జెక్టులపై అవగాహన ఉంటే ఇబ్బంది ఏమీ ఉండదని విద్యాశాఖ అధికారులు అంటున్నారు. ఏదేమైనా కోచింగ్ కోసం ఈ తరహా అభ్యర్థులు హైదరాబాద్‌ను ఆశ్రయిస్తున్నారు. -
ప్రభుత్వ ఉద్యోగమే మీ లక్ష్యమా.. బెస్ట్ ఫ్యాక్టలీతో కోచింగ్
సాక్షి, హైదరాబాద్: గత సంవత్సరం డిసెంబర్లో వచ్చిన SI of Police నోటిఫికేషన్‌కి సంబంధించిన ప్రాథమిక పరీక్షను పూర్తి చేసుకున్న ఎస్సై అభ్యర్థులు దేహదారుఢ్య పరీక్ష(PT)లకు సన్నద్దమౌతున్నారు. అలాగే, త్వరలోనే ఈ దేహదారుఢ్య పరీక్షలు(PT) ప్రారంభం కానున్నాయి. ఎస్సై ఫైనల్ పరీక్షలు కూడా అక్టోబర్ 14, 15 తేదీల్లో నిర్వహించనున్నారు. కావున ఎస్సైకి పరీక్షలకు ప్రిపేరయ్యే అభ్యర్థుల కోసం సాక్షిఎడ్యుకేషన్.కామ్(www.sakshieducation.com) ఆధ్వర్యంలో.. ప్రీమియర్ అకాడమీ సంస్థకు చెందిన బెస్ట్ ఫ్యాకల్టీతో కోచింగ్ ఇవ్వనున్నారు. ఈ క్లాసులు సాక్షి ఎడ్యుకేషన్.కామ్ వారి ఆధ్యర్యంలో నిర్వహించనున్నారు. ఉద్యోగం వచ్చే వరకు.. క్లాసులో పరిమితి సంఖ్యలో విద్యార్థులతో.. ప్రతి విద్యార్థిపైన ప్రత్యేక ఫోకస్ పెడుతూ.. ఉద్యోగం వచ్చే వరకు బాధ్యత వహిస్తూ.. SSC, RRB, Bank, Police పరీక్షల్లో కోచింగ్ ఇవ్వబడుతుంది. ఇక ఆలస్యం చేయకుండా.. ఇప్పుడే అభ్యర్థులు 9000096096 ఫోన్ నెంబర్‌ను సంప్రదించండి.. అలాగే CH V Subrahmanyam, Director, PREMIER ACADEMY, 2 /1, BRODIPET, GUNTUR అడ్రస్ కు మీరు డైరెక్ట్‌గా వచ్చి సంప్రదించండి. ఇది కూడా చదవండి: జేఈఈ–2024కి ఎన్నికల గండం! -
స్టడీ సెంటర్‌గా రైల్వే ఫ్లాట్ ఫారం: ఫోటో వైరల్
కరెంట్ సదుపాయం అంతగా లేని కాలంలో క్యాండిల్ లైట్లు కింద చదువుకుని ఇంత గొప్ప స్థాయికి వచ్చాం అని మన పెద్దలు చెబుతుండేవారు. మరికొంతమంది ఆర్థిక పరిస్థితి దృష్ట్యా కనీస సౌకర్యాలు లేక స్ట్రీట్ లైట్ల కింద చదువుకని పైకి వచ్చిన వాళ్లు ఉన్నారు. ఐతే ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే వాళ్లంతా ఏవేవో కారణాల వల్ల చదువుకోవాలనే తాపత్రయంతో అలా కష్టపడి చదువుకున్నారు. అన్ని సౌకర్యాలు ఉన్న ఈ కాలంలో ఒక విద్యార్థి గ్రూప్ రైల్వే ప్లాట్ ఫారంనే స్టడీ సెంటర్‌గా మార్చేసి మరీ తెగ చదివేస్తున్నారు. వివరాల్లోకెళ్తే...రైల్వే ప్లాట్ ఫారం పై పెద్ద సంఖ్యలో యువకులు చదవుకుంటున్నట్లు ఉన్న ఒక ఫోటో సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తుంది. అసలు ఫోటో వెనక ఉన్న కథ ఏమిటంటే.. బీహార్‌లోని ససారమ్ స్టేషన్ నుంచి వచ్చిన కథనం ఇది. ఆ రైల్వే ఫ్లాట్ ఫారం పై చదుకుకుంటన్న విద్యార్థులంతా బీహార్‌లోని రోహ్తాస్ జిల్లాకు చెందినవారు. వారి గ్రామంలో సరైన కరెంట్ సదుపాయం లేకపోవడంతో ఇలా రైల్వే ఫ్లాట్ ఫారం పై చదువుకుంటున్నారంటూ ఓ వార్త కథనం ప్రచురితమైంది. ఐతే 2002లో ఇలాంటి ఘటనలు చోటు చేసుకున్నాయి గానీ ఇప్పుడూ అలాంటివేం లేవని ఇండియన్ ఎక్స్‌ప్రెస్ తేల్చి చెప్పేసింది. విద్యార్థులు పరీక్ష కోసం బయలుదేరి రైలు కోసం వేచి ఉన్నాప్పుడూ చోటు చేసుకున్న ఘటన అని ఒక రైల్వే అధికారి చెప్పారు. ఐతే రైల్వే ఉద్యోగ పరీక్షలను నిర్వహించడంలో జాప్యం కారణంగా 2018లో విద్యార్థుల చేసిన నిరసన అని అక్కడి స్థానికులు చెబుతున్నారు. కొన్ని నెలలు క్రితమే ఈ ఘటనకు సంబంధించిన ఫోటోను ఐఏఎస్ అధికారి అవనీష్ శరణ్ ఇదే కథనాన్ని ట్విట్టర్లో ..రైల్వే స్టేషన్‌లోని 1, 2 ప్లాట్‌ఫారమ్‌లు సివిల్ సర్వీసెస్‌పై ఆసక్తి ఉన్న యువతకు కోచింగ్ క్లాస్‌గా మారుతున్నాయి అని క్యాప్షన్ జోడించి మరీ ఆ ఫోటోను పోస్ట్ చేశారు. అయితే ఇప్పుడూ కార్పొరేట్ ఎగ్జిక్యూటివ్ హరి సింగ్ షెకావత్ లింక్డ్ఐలో అదే ఫోటోతో పోస్ట్ చేయడంతో మళ్లీ వైరల్ అయింది. ఆ ఫోటో వెనుక నిజమైన కథ ఏమిటన్నది కచ్చితంగా తెలియకపోయినప్పటికీ ఆ ఫోటో మాత్రం నెటిజన్లను తెగ ఆకర్షించింది. (చదవండి: మహిళను బలవంతంగా రైల్వే ట్రాక్‌పైకి తోసేశాడు..!) -
ఈ ఏడాదంతా ఉద్యోగ పరీక్షలు
సాక్షి, సిద్దిపేట: ఉద్యోగ నోటిఫికేషన్ల మధ్య రెండు నెలల సమయం ఉండేలా ఈ ఏడాదంతా పరీక్షలు నిర్వహించేలా ప్రభుత్వం ప్రణాళిక రూపొందించిందని ఆర్థిక మంత్రి హరీశ్‌రావు తెలిపారు. శనివారం సిద్దిపేటలో ‘సాక్షి’మీడియా గ్రూప్, కేసీఆర్ కోచింగ్ సెంటర్ల ఆధ్వర్యంలో పోటీ పరీక్షలపై అభ్యర్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా హరీశ్‌రావు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 98 వేల ప్రభుత్వ ఉద్యోగాలను ఈ ఏడాదిలో భర్తీ చేయాలన్న లక్ష్యంతో ఉన్నామన్నారు. అన్ని ఉద్యోగాలకు ఒకేసారి నోటిఫికేషన్ ఇవ్వడం వల్ల కొందరు అవకాశం కోల్పోయే ప్రమాదం ఉన్నందున దశల వారీగా నోటిఫికేషన్లను విడుదల చేస్తున్నామని తెలిపారు. ప్రతీ రెండు నెలలకు ఒక నోటిఫికేషన్ విడుదల చేసేలా మంత్రివర్గం పచ్చజెండా ఊపిందన్నారు. ప్రభుత్వ ఉద్యోగాలతో పాటు ప్రైవేటులోనూ మంచి అవకాశాలు ఉన్నాయన్నారు. శిక్షణ శిబిరాలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. సిద్దిపేటలో నిరుద్యోగ యువతకు పోటీ పరీక్షల్లో మెరుగైన ఫలితాలను సాధించడానికి దోహదపడే ఓరియంటేషన్ క్లాస్‌ను నిర్వహించడానికి ముందుకు వచ్చిన ‘సాక్షి’ మీడియా గ్రూప్‌నకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. జిల్లా పరిషత్ చైర్పర్సన్ రోజా శర్మ, హుస్నాబాద్ ఆర్డీఓ జయచంద్రారెడ్డి, ఎంపీడీఓ రాములు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. -
చిరిగిన పుస్తకాలు..విరిగిన కుర్చీలు
సాక్షి, హైదరాబాద్: చిరిగిన పుస్తకాలు..విరిగిన కుర్చీలు.. తిరగని పంకాలు.. ఇదీ మన గ్రంథాలయాల్లో నెలకొన్న పరిస్థితి. రాష్ట్రంలో 80 వేల పోస్టుల భర్తీకి ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసిన నేపథ్యంలో పుస్తకాలతో కుస్తీ పడుతున్న నిరుద్యోగ యువతకు గ్రంథాలయాల్లో కుర్చునేందుకు కుర్చీలు కూడా దొరకడంలేదు. ఉన్న కుర్చీలు ఎక్కడ నడ్డివిరుస్తాయోననే ఆందోళన.. ఫ్యాను తిరగక ఉక్కపోత వెరసి ఉద్యోగార్థులకు ఈ లైబ్రరీలు చెమటలు కక్కిస్తున్నాయి. మరోవైపు గ్రంథాలయాలకు రావాల్సిన నిధులకు స్థానిక సంస్థలు గండికొడుతున్నాయి. వసూలు చేసే ఆస్తిపన్నులో 8 శాతం రావాల్సిన సుంకాన్ని సైతం ఇవ్వకుండా ఎగ్గొడుతున్నాయి. నగర గ్రంథాలయ సంస్థకు జీహెచ్ఎంసీ ఏకంగా రూ.800 కోట్ల మేర బకాయిపడింది. ఈ నిధులు సకాలంలో రాకపోవడంతో పాత పుస్తకాలతోనే నెట్టుకురావాల్సిన పరిస్థితి నెలకొంది. ఇదిలా ఉండగా..ఉద్యోగుల వేతనాలు, పారిశుద్ధ్య నిర్వహణ, ఇతర అవసరాల కోసం నెలకు రూ.15 లక్షలకు ఖర్చవుతున్నాయి. గ్రంధాలయాలు కిటకిట పోటీ పరీక్షల శిక్షణ సంస్థలన్నీ గ్రేటర్‌లోనే కేంద్రీకృతమయ్యాయి. కోచింగ్ కోసం ఇక్కడి అభ్యర్థులే కాకుండా తెలంగాణ, ఏపీ, ఇతర రాష్ట్రాలకు చెందిన అభ్యర్థు లు కూడా ఇక్కడికే వస్తుంటారు. వీరిలో చాలా మంది ఆయా కోచింగ్ సెంటర్లు, వర్సిటీ, ఇతర గ్రం«థాలయాలకు సమీపంలోని ప్రైవేటు హాస్టళ్లు, గదులను అద్దెకు తీసుకుని ఉంటూ పరీక్షలకు సన్నద్ధమవుతుంటారు. వాటిలో కంబైన్డ్ స్టడీస్‌కు అవకాశం లేకపోవడం, ఉన్న వాటిలోనూ సరైన మౌలిక సదుపాయాలు లేకపోవడంతో సమీపంలోని నగర, జిల్లా, మండల కేంద్ర గ్రంధాలయాలను ఆశ్రయిస్తున్నారు. అఫ్జల్‌గంజ్‌లోని రాష్ట్ర గ్రంధాలయం సహా చిక్కడపల్లి నగర కేంద్ర గ్రంథాలయం, ఓయూ, తెలుగు విశ్వవిద్యాలయంలోని లైబ్రరీలు అభ్యర్థులతో కిక్కిరిసిపోతున్నాయి. ఎప్పటికప్పుడు అప్‌గ్రేడ్ కావాల్సిన గ్రంథాల యాలు..ఏళ్ల తరబడి తాళపత్ర గ్రంథాలు, ప్రముఖుల జీవిత చరిత్రలు, నవలలు, సాహిత్యం, కథలు, నిఘంటవులు, న్యూస్ పేపర్లు, కరెంట్ ఎఫైర్స్ బుక్స్‌కే పరిమితవుతున్నాయి. కుర్చీ దొరకదు..ఫ్యాన్లు తిరగవు ఆయా గ్రంధాలయాల్లో విద్యార్థుల నిష్పత్తి మేరకు ఫర్నీచర్ లేకపోవడం ఇబ్బందిగా మారింది. అభ్యర్థులే స్వయంగా కుర్చీలు, ప్యాడ్లు కొనుగోలు చేసుకోవాల్సివస్తోంది. మార్కెట్లో రకరకాల పుస్తకాలు అందుబాటులోకి వస్తే..ఆయా గ్రం«థాలయాల్లో మాత్రం ఇప్పటికీ పాత పుస్తకాలే దర్శనమిస్తున్నాయి. పోటీ పరీక్ష ల పుస్తకాలే కాదు మంచినీరు ఇతర మౌలిక సదుపాయాలు లేకపోవడంతో ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఇదిలా ఉంటే విద్యార్థులు అడిగిన పుస్తకాలను కొను గోలు చేసి అందుబాటులో ఉంచుతున్నట్లు గ్రంథపాలకులు చెప్పుతున్నప్పటికీ..ఆచరణలో అది సాధ్యం కావడం లేదు. పుస్తకాలు వితరణకు దాతలు సుముఖంగా ఉన్నప్పటికీ...వాటిని తీసుకుని భద్రపరిచేందుకు అనువైన స్థలం లేకపోవడం గమనార్హం. కనీస సదుపాయాలు లేవు ఇంట్లో చదువుకునేందుకు అనువైన వాతావరణం లేదు. కోచింగ్ సెంటర్లకు వెళ్లే ఆర్థిక స్తోమత కూడా లేదు. గ్రంథాలయంలో ఏకాంతంగా కూర్చొని నచ్చిన పుస్తకాన్ని చదువుకోవచ్చని భావించి ఇక్కడికి వచ్చాం. తీరా ఇక్కడ కూర్చొని చదువుకునేందుకు కుర్చీలే లేవు. మేమే స్వయంగా వీటిని సమ కూర్చుకోవాల్సి వస్తుంది. వేసవి ఉక్కపోత నుంచి ఉపశమనం పొందేందుకు అవసరమైన ఫ్యాన్లు కూడా లేవు. ఉన్నవాటిలోనూ చాలా వరకు పని చేయడం లేదు. –హరికృష్ణ, మెదక్ భోజనం, మంచినీటి వసతి కల్పించాలి వివిధ పోటీ పరీక్షలకు ప్రిపేరవుతున్న అభ్యర్థుల ఆకలి తీర్చేందుకు ప్రభుత్వం రూ.5 భోజనం సరఫరా చేస్తుంది. అయితే నాణ్యత లేకపోవడంతో తినలేకపోతున్నాం. హోటళ్లలో తిందామంటే ఖర్చులకు డబ్బులు కూడా లేవు. ఖాళీ కడుపుతో ఇబ్బంది పడాల్సి వస్తుంది. అంతేకాదు గ్రంధాలయంలో తాగునీరు కూడా లేకపోవడంతో బాటిళ్లను వెంట తెచ్చుకోవాల్సి వస్తుంది. కుర్చీలు లేక చెట్ల కింద కూర్చొని చదువుకోవాల్సి వస్తుంది. –శివకుమార్, సంగారెడ్డి (చదవండి: పక్కాగా లెక్క.. బడి బయట పిల్లలెందరు..?) -
కష్టపడితే నెలలో ‘గ్రూప్స్’ కొట్టొచ్చు
సాక్షి, హైదరాబాద్: పరీక్షల కోసం కాకుండా, పరిశోధనాత్మకంగా అభ్యాసన చేస్తే గ్రూప్స్‌లోనే కాదు సివిల్స్‌లోనూ రాణిస్తారని ఉస్మానియా యూనివర్సిటీ ఉప కులపతి ప్రొఫెసర్ డి.రవీందర్ అభిప్రాయపడ్డారు. కోచింగ్ సెంటర్స్‌కు వెళ్తేనే పోటీ పరీక్షలో విజయం సాధిస్తామనేది భ్రమని చెప్పారు. గ్రూప్స్‌లో ఇంటర్వ్యూ తొలగించినందున పరిజ్ఞానం ఉన్నవాడికి పారదర్శకంగా ఉద్యోగం వస్తుందన్న నమ్మకం ఏర్పడిందన్నారు. గ్రూప్స్ ఉద్యోగాల నోటిఫికేషన్ నేపథ్యంలో అభ్యర్థులు ఏ విధంగా సన్నద్ధమవ్వాలనే అంశంపై రవీందర్ ‘సాక్షి’తో పంచుకున్న అంశాలు ఆయన మాటల్లోనే... లక్ష్య సాధన దిశగా విద్యార్థుల పాత్రేంటి? ఉస్మానియా యూనివర్సిటీ ఈ మధ్య దీనిపై లోతుగా అధ్యయనం చేసింది. చాలామంది విద్యార్థుల్లో అంతర్లీనంగా సామర్థ్యాలున్నాయి. దృష్టి పెడితే పోటీ పరీక్షల్లో విజయం సాధించగల సత్తా ఉంది. కానీ వాళ్లు స్వల్పకాలిక లక్ష్యాలకే ప్రాధాన్య మిస్తున్నారు. ఏదో ఒక ఉద్యోగం తెచ్చుకోవాలనుకుంటున్నారు. దీంతో గ్రూప్స్ పోటీకి దీర్ఘకాలిక ప్రణాళిక రూపొందించుకోలేకపోతున్నారు. దీన్ని గమనిం చిన తర్వాత ఓయూలో సివిల్స్ అకాడమీని అభివృద్ధి చేయాలని నిర్ణయించాం. దీని కోసం రూ.37 లక్షలు ఖర్చు పెట్టాం. కోచింగ్ కేంద్రాలతో ఫలితం ఎలా ఉంటుంది? లక్షల మంది విద్యార్థులు కోచింగ్ కేంద్రాల బాట పడుతున్నారు. అక్కడికి వెళ్తేనే పోటీ పరీక్షల్లో రాణిస్తామని భ్రమ పడుతున్నారు. నా అనుభవం ప్రకారం ఇది శుద్ధ దండగ. అక్కడ కేవలం షార్ట్ కట్ పద్ధతులు మాత్రమే చెబుతారు. ఒకరకంగా ఇది మల్టిపుల్ చాయిస్ లాంటిదే. ఆ మాదిరి ప్రశ్న వస్తేనే అభ్యర్థి సమాధానం ఇవ్వగలడు. కానీ సొంతంగా సబ్జెక్టుపై అవగాహన పెంచుకుంటే మెరుగైన రీతిలో గ్రూప్స్‌లో రాణించే వీలుంది. కాబట్టి కోచింగ్ కేంద్రాలకు వెళ్లి విద్యార్థులు తమ విలువైన కాలాన్ని వృథా చేసుకోవద్దు. ఏం చదవాలి? గ్రూప్స్‌కు సిద్ధమయ్యే విద్యార్థులు ఎన్సీఈఆర్టీ పుస్తకాలు చదవాలి. ముఖ్యంగా 8 నుంచి ఇంటర్ వరకూ ఉన్న పుస్తకాలను అభ్యసించాలి. వీటిల్లో లోతైన విషయ పరిజ్ఞానం ఉంటుంది. ఎన్సీఈ ఆర్టీ, సీబీఎస్సీ ఇంటర్మీడియెట్ పుస్తకాలు.. రాష్ట్ర సిలబస్‌తో పోలిస్తే పోస్ట్‌గాడ్యుయేషన్ పుస్తకాలతో సమానం. ప్రతీ పాఠం తర్వాత పాఠానికి కొనసాగింపు ఉంటుంది. దీనివల్ల సబ్జెక్టుపై పట్టు వస్తుంది. ఫలితంగా గ్రూప్స్‌లో ఏ రూపంలో ప్రశ్న వచ్చినా తేలికగా సమాధానం ఇవ్వగలిగే సత్తా విద్యార్థులకు ఉంటుంది. ఆప్షన్స్ ఎంపిక ఎలా ఉండాలి? ఈ మధ్య గ్రూప్–2లో సోషల్ సబ్జెక్టు ఆప్షన్‌గా తీసుకున్న ఇంజనీరింగ్ విద్యార్థులే మంచి స్కోర్ సాధించారు. కొత్త సబ్జెక్టు అయితే, మూలాల నుంచి తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. కాబట్టి లోతుగా అధ్యయనం చేసే విద్యార్థి ఆప్షన్ విషయంలో ఏది తీసుకున్నా మెరుగైన ఫలితాలే ఉంటాయి. సివిల్స్‌లో కూడా ఇదే ట్రెండ్ కన్పిస్తోంది. తక్కువ సమయంలో ప్రిపరేషన్ ఎలా? సాధ్యమే. రోజూ ఒక గంట ఎన్సీఈఆర్టీ పాఠ్యపుస్తకాలు చదవాలి. ఆ తర్వాత దినపత్రికల్లో సంపాదకీయాలు చదవాలి. నోట్స్ ప్రిపేర్ చేసుకోవాలి. ప్రముఖ రచయితల పుస్తకాలు చదవాలి. పోటీ పరీక్షలకు గ్రూప్ డిస్కషన్స్ చాలా ముఖ్యం. ఈ తరహా చర్చల వల్ల లోతైన పరిజ్ఞానం అలవడే వీలుంది. నెల రోజులు సీరియస్‌గా చదివితే కోచింగ్ సెంటర్‌కు వెళ్లకుండానే గ్రూప్స్ కొలువు కొట్టొచ్చు. అలాగే, ఇంగ్లిష్ భాషపై పట్టు సాధించే ప్రయత్నం చేయాలి. మానసిక ఒత్తిడిని జయించాలి. సమయపాలన చాలా ముఖ్యం. దీనిపై ప్రిపరేషన్ నుంచే దృష్టి పెట్టాలి. -
లక్షలు కాదు.. లైఫ్ ఉండాలె
సాక్షి, హైదరాబాద్: ఐఐటీయన్లు సరికొత్త పంథాను ఎంచుకుంటున్నారు. దేశంలోని పేరొందిన సాంకేతిక విద్యాసంస్థల నుంచి ఉన్నత చదువులు చదివిన ఎంతో మంది ఇప్పుడు సాఫ్ట్వేర్ సంస్థల్లో, బహుళ జాతి కంపెనీల్లో ఆఫర్లను వదులుకొని అధ్యాపక వృత్తిని ఎంపిక చేసుకుంటున్నారు. ప్రత్యేకంగా కోచింగ్ సెంటర్లను ఏర్పాటు చేస్తున్నారు. ఐఐటీలో చదువుకున్న వారికి క్యాంపస్‌లోనే అద్భుత ప్యాకేజీలతో దేశ విదేశాల ఆఫర్లు వస్తాయి. అయితే ఈ ప్యాకేజీలు, ఆఫర్లు వారికి సంతృప్తినివ్వడం లేదు. రూ.లక్షల్లో జీతం వస్తున్నా తమ అభిరుచికి అనుగుణంగా టీచింగ్ ప్రొఫెషన్లోకి ప్రవేశిస్తున్నారు. హైదరాబాద్‌లో ఆర్టీసీ క్రాస్‌రోడ్స్ ఇప్పుడు ఐఐటీ కోచింగ్ సెంటర్లకు హబ్‌గా మారింది. అశోక్‌నగర్, ఇందిరాపార్కు సివిల్స్ కోచింగ్ అడ్డా కాగా.. విద్యానగర్, నల్లకుంట ప్రాంతాలు ఐఐటీ కోచింగ్‌కు కేంద్రంగా మారాయి. ఐఐటీ కోచింగ్‌లో రాజస్థాన్‌లోని కోట తరువాత హైదరాబాద్ దేశంలోనే రెండో స్థానంలో నిలిచింది. ఐఐటీ ఇప్పుడు అన్ని వర్గాల్లో ఒక క్రేజ్‌గా మారింది. పది, ఇంటర్ నుంచే ఐఐటీ కోసం శిక్షణ ఇప్పిస్తున్నారు. ఆడుతూ, పాడుతూ ఐఐటీ శిక్షణ పొందాలనే లక్ష్యంతో శిక్షణనిస్తున్నారు కొందరు ఐఐటీయన్లు. అధ్యాపకుల్లా కాకుండా స్నేహితుల్లా పాఠాలు బోధిస్తున్నారు. 24 గంటల పాటు చదువే కాదు.. సినిమాలు, షికార్లు, సరదా కబుర్లు కూడా జీవితంలో భాగం కావాలని వీరు చెబుతున్నారు. దీనికి అనుగుణంగా శిక్షణలో వైవిధ్యం, వినూత్నం కనబరుస్తూ బోధన చేస్తున్నారు. నగరానికి చెందిన భరత్ ఖరగ్‌పూర్ ఐఐటీలో 2010లో ఎంటెక్ పూర్తి చేశారు. క్యాంపస్ ప్లేస్మెంట్స్ను వదులుకొని టీచింగ్ ప్రొఫెషన్‌ను ఎంపిక చేసుకున్నారు. బహుళ జాతి సాఫ్ట్వేర్ సంస్థల్లో పని చేస్తే బోలెడంత జీతం ఇస్తారు. కానీ ఎలాంటి సంతృప్తి ఉండదు. జీవితం చాలా యాంత్రికంగా గడిచిపోతుంది. అలా రొటీన్‌గా గడపడం నాకు ఇష్టం లేదు. మనకు తెలిసిన జ్ఞానాన్ని, కొత్త విషయాలను బోధించడం వల్ల ఇప్పుడు టీచర్‌గా ఎంతో సంతోషంగా ఉన్నా. ఒక సాఫ్ట్వేర్ నిపుణుడితో పోల్చుకుంటే నా జీతం చాలా తక్కువే. కానీ ఈ జాబ్ చాలా క్రియేటివ్‌గా ఉంది. – భరత్ జస్వంత్ది వైజాగ్. ఖరగ్‌పూర్ ఐఐటీలో ఎంటెక్ పూర్తి చేశారు. నగరంలోని ఒక కోచింగ్ సెంటర్లో ఫిజిక్స్ బోధిస్తున్నారు. ఒక టీచర్‌గా పాఠం చెప్పి వెళ్లడం ఏ మాత్రం సరైన పద్ధతి కాదు. వాళ్లలో ఒక స్టూడెంట్‌గా కలిసిపోయి చర్చించడం వల్ల బోధన సృజనాత్మకంగా ఉండటమే కాకుండా ఆ చర్చలో ప్రతి స్టూడెంట్ భాగస్వామి అవుతాడు. లక్ష్యాన్ని నిర్దేశించుకుంటాడు. క్యాంపస్ ప్లేస్మెంట్ కాదనుకొని ఈ వృత్తికి వచ్చా. ఇది నాకు ఎంతో సంతృప్తినిస్తోంది. – జస్వంత్ విక్రమ్ దాచేపల్లిది సూర్యాపేట జిల్లాలోని లింగాల గ్రామం. వెల్లూరు వీఐటీలో చేరి 2010లో బీటెక్ పూర్తి చేశారు. ఆ మరుసటి సంవత్సరమే ఒక బహుళ జాతి సంస్థలో ఉద్యోగం లభించింది. నెలకు రూ.1.5 లక్షల జీతం. అయితే విక్రమ్‌కు ఆ ఉద్యోగం సంతృప్తినివ్వలేదు. ఒక సాఫ్ట్వేర్ సంస్థలో నాలుగు గోడల మధ్య పని చేయడం నచ్చలేదు, నాకు మొదటి నుంచి టీచింగ్ అంటే ఎంతో ఇష్టం. పైగా ఐఐటీ కోచింగ్‌లో తీవ్రమైన ఒత్తిడికి భిన్నంగా సృజనాత్మకమైన పద్ధతిలో శిక్షణనిస్తే మంచి ఫలితాలు సాధించవచ్చు అని అనిపించింది. అందుకే 2012లో ఐఐటీ అకాడమీని ఏర్పాటు చేశాం. – విక్రమ్ -
గేట్ వే ఆఫ్ అమెరికా.. అమీర్‌పేట
గత పదేళ్లతో పోలిస్తే ఇంజినీరింగ్ విద్య పూర్తి చేసి బయటకు వస్తున్న వారి సంఖ్య 10 రెట్లు పెరిగింది. క్యాంపస్ స్థాయిలోనే ప్లేస్మెంట్ దక్కితే సరి.. లేదంటే అమీర్‌పేటను నమ్ముకోవాల్సిందే. ఇంజినీరింగ్ చదివి బయటకు వచ్చే ఏ ఫ్రెషర్ అయినా అమీర్‌పేటలో కాలుమోపిన తర్వాతే మరెక్కడికైనా వెళ్తారంటే అతిశయోక్తి కాదు. ఎందుకంటే సాఫ్ట్వేర్ రంగంలో మారుతున్న మార్పులకు అనుగుణంగా ఇక్కడ శిక్షణ సంస్థలు అందించే కోర్సుల్లో కాసింత జ్ఞానం సంపాదించుకుంటే ఉద్యోగంలో రాణించవచ్చని, ఉపాధి పొందవచ్చనే భరోసాను కల్పించడమే కారణం. అందుకేనేమో అమీర్‌పేటకు గేట్ వే ఆఫ్ అమెరికా అనే పేరు చిరస్థాయిగా నిలిచిపోయింది. దేశంలో ఎక్కడా దొరకని టెక్నాలజీ కోర్సులు ఇక్కడ లభించడం విశేషం. ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకుంటూ... ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ కోర్సులైన జావా, ఫైతాన్, లిస్ప్, ప్రోలాగ్, సీ++ తదితర ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్, ఒరాకిల్, డాట్నెట్, జావా వంటి పరిమిత బేసిక్ కోర్సులే ఒకప్పుడు ఎక్కువగా వినిపించేవి. ఆ తర్వాత ఆయా టెక్నాలజీలో వచ్చిన అధునాతన మార్పులను అందిపుచ్చుకుంటూనే ప్రస్తుతం రాజ్యమేలుతున్న క్లౌడ్ ఆధారిత టెక్నాలజీ కోర్సుల వరకు ఎప్పటికప్పుడు శిక్షణ కేంద్రాలు పదునుపెట్టుకుంటూనే ఉన్నాయి. ఇప్పుడు ప్రపంచమంతా క్లౌడ్ సర్వీసుల చుట్టూ ప్రదక్షిణ చేస్తున్న క్రమంలో అమీర్‌పేటలో ఆయా టెక్నాలజీ కోర్సులకు ఎక్కడా లేని ప్రాధాన్యం సంతరించుకుంది. పరోక్షంగా వేలాదిమందికి ఉపాధి.. కోర్సుల ద్వారా నైపుణ్యాన్ని పెంచుకుని లక్షల ప్యాకేజీలకు ‘సాఫ్ట్’గా విద్యార్థులు ఎగిరిపోవడమే కాదు.. ఇక్కడ శిక్షణ కేంద్రాల ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా వేలాది మంది ఉపాధి అవకాశాలు పొందుతున్నారు. శిక్షణ కేంద్రాల్లో పనిచేసే బోధన, బోధనేతర సిబ్బంది మాట అలా ఉంచితే.. వీటిని నమ్ముకుని టీ స్టాళ్లు, చాట్‌భండార్, టిఫిన్ సెంటర్లు, ఫాస్ట్‌ఫుడ్ సెంటర్లు, హాస్టళ్లు, సాఫ్ట్వేర్ కోర్సుల మెటీరియల్ విక్రయ కేంద్రాలు, ట్రావెల్ ఏజెన్సీలు తదితర సంస్థల నిర్వాహకులు వ్యాపారాలను కొనసాగిస్తున్నారు. తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలోని వివిధ ప్రాంతాలకు ఇక్కడి నుంచి బస్సులు అందుబాటులో ఉన్నాయి. 500 పైచిలుకు శిక్షణ సంస్థలు.. రెండు దశాబ్దాల క్రితం వేళ్ల మీద లెక్కించేంత సాఫ్ట్వేర్ శిక్షణ కేంద్రాలకు మాత్రమే అమీర్‌పేట పరిమితంగా ఉండేది. మొదట అమీర్‌పేటలోనే సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్స్ ఆఫ్ ఇండియా (ఎస్టీపీఐ) కార్యాలయం ఉండేది. కాలక్రమంలో సాఫ్ట్వేర్ కంపెనీలు హైటెక్ సిటీకి వెళ్లిపోగా ఇక్కడ కోచింగ్ సెంటర్ల హవా మొదలైంది. అమీర్‌పేట మైత్రీవనం, ఆదిత్య ట్రేడ్ సెంటర్, సత్యం టాకీస్ రోడ్డు, గురుద్వారా రోడ్డు చుట్టుపక్కల ప్రాంతాల్లో దాదాపు 500 వరకు శిక్షణ సంస్థలు ఆయా కోర్సుల్లో శిక్షణనిస్తున్నాయి. కొన్ని సంస్థలు ఆన్లైన్ కోర్సులను కూడా అందిస్తున్నాయి. ఖర్చు తక్కువ.. బెంగళూరు, చెన్నైలతో పాటు ఇతర మెట్రో నగరాలతో పోలిస్తే ‘సాఫ్ట్’ కోర్సుల్లో శిక్షణకయ్యే ఖర్చు ఇక్కడ చాలా తక్కువ. దీంతో ఏపీ, తెలంగాణకు చెందిన ఇంజినీరింగ్ విద్యార్థులే కాకుండా ఢిల్లీ, ముంబై, బెంగళూరు, కోల్‌కతా వంటి వివిధ రాష్ట్రాలకు చెందిన విద్యార్థులతో పాటు దక్షిణాఫ్రికా, దుబాయ్, అబుదాబి తదితర దేశాలకు చెందిన విద్యార్థులు సైతం అమీర్‌పేట శిక్షణ కేంద్రాల్లో శిక్షణ తీసుకుంటుంటారు. గడిచిన రెండు దశాబ్దాల్లో అమీర్‌పేటలో కాలుపెట్టి అమెరికా వెళ్లినవారు అందుకే గేట్ వే ఆఫ్ అమెరికా.. అమీర్‌పేట అన్న పేరును సార్థకం చేసుకుంది. ఎప్పటికప్పుడు అప్డేట్.. మార్కెట్లోకి వచ్చే ఏ కొత్త టెక్నాలజీకి సంబంధించిన కోర్సయినా మొదట అమీర్‌పేట శిక్షణ కేంద్రాల్లో ఉండాల్సిందే. ముఖ్యంగా అమెరికా వెళ్లాలనే ఆశలను నెరవేర్చేందుకు ఇక్కడ శిక్షణ సంస్థలు టెక్నాలజీ కోర్సులను అప్డేట్ చేసుకుంటూనే ఉంటాయి. – ఎన్.కోటి,ఆపరేషన్స్ హెడ్, పీర్స్ టెక్నాలజీస్ భవితకు భరోసా ప్రస్తుతం మార్కెట్లో ఏడబ్ల్యూఎస్‌కు మంచి డిమాండ్ ఉంది. నేను ఈ కోర్సులో శిక్షణ పొందాను. ఫీజు కూడా ఎంతో రీజనబుల్‌గా ఉన్నాయి. అనుకున్న సమయంలో కోర్సులు పూర్తి చేసుకోవడం ఇక్కడ ప్రత్యేకత. – గోపీకృష్ణ, ఇంజినీరింగ్ విద్యార్ధి -
‘కోటా కోచింగ్’లో ఉరికొయ్యలు
రాజస్తాన్‌లోని కోటా పట్టణం చీరలకే కాదు, కోచింగ్ సెంటర్లకీ ప్రతీతి. కోరుకున్న చోట సీటు రావాలని తల్లిదండ్రులు తమ పిల్లలను కోటాలో చేర్పిస్తారు. ప్రతిష్టాత్మక ఆల్ఇండియా మెడికల్ సైన్సెస్, ఐఐటీ ప్రవేశ పరీక్షల కోసం వివిధ కోచింగ్ సెంటర్లలో శిక్షణ విద్యార్థులు ఇక్కడ శిక్షణ తీసుకుంటారు. అయితే, ఈ కోచింగ్ సెంటర్లలో కేవలం 5 రోజుల వ్యవధిలో ముగ్గురు విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడటంతో మరోమారు కోటా వార్తల్లోకెక్కింది. కోటాలోని ఓ కోచింగ్ సెంటర్లో ఐఐటీ శిక్షణ తీసుకుంటున్న 17 ఏళ్ల విద్యార్థి మంగళవారం తన హాస్టల్ గదిలో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గత ఐదు రోజుల్లో అక్కడ ఇది మూడో ఆత్మహత్య. డిసెంబర్ 24న మెడికల్ ఎంట్రన్స్ కోసం శిక్షణ తీసుకొంటోన్న ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఓ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. డిసెంబర్ 22న రాజస్తాన్‌కి చెందిన 16 ఏళ్ల బూండీ తన గదిలోనే బలవన్మరణానికి పాల్పడ్డాడు. కోచింగ్ సెంటర్లలో విద్యార్థులపై మానసిక ఒత్తిడిని ఈ వరుస ఆత్మహత్యలు మరోసారి తెరపైకి తెచ్చాయి. జైపూర్‌కి 250 కి.మీ. దూరంలో ఉన్న కోటాలో 150 కోచింగ్ సెంటర్లలో దాదాపు 1.5 లక్షల మంది విద్యార్థులు శిక్షణ పొందుతున్నారు. పదో తరగతి తర్వాత ఇంటర్లో చేరిన ఈ విద్యార్థులకు ఐఐటీ, వైద్య విద్యల ప్రవేశ పరీక్షల కోసం ప్రత్యేక శిక్షణనిస్తారు. వివిధ కారణాలతో 2011 నుంచి ఇప్పటి వరకు 60 మందికి పైగా విద్యార్థులు కోటా లో ఆత్మహత్యలకు పాల్పడ్డారు. మరోవైపు గత ఆరు నెలల్లో ఇక్కడి కోచింగ్ సెంటర్లలో 24 మంది ఆత్మహత్యలకు పాల్పడ్డారు. ఎంతోమంది ప్రముఖులు తల్లిదండ్రులకు బహిరంగ లేఖలు రాసినా.. వ్యక్తిగతంగా అవి ఎవరినీ కదిలించట్లేద నేది నిజం. దీంతో ఆత్మహత్యల పరంపర కొనసాగుతూనే ఉంది. ఆత్మహత్యలకు కారణాలు.. ఆల్ఇండియా మెడికల్ సైన్సెస్, లేదా ఐఐటీలో సీటు సంపాదించడమొక్కటే మార్గమని, అదే తమ భవిష్యత్తుని నిర్ణయిస్తుందన్న తప్పుడు భావన ఇటు విద్యార్థుల్లోనూ, అటు తల్లిదండ్రు ల్లోనూ ఉంది. నిజానికి వారి బంగారు భవిష్యత్తుకి బాటలు వేసే వేనవేల వేరే మార్గాలున్నాయన్న విషయం వారికి అర్థం కాకపోవడం వల్ల ఈ దారుణాలు జరుగుతున్నాయి. విద్యార్థుల విభజన.. ఫిల్టర్ చేసి మార్కులను బట్టి విద్యార్థులకు ప్రత్యేక అవకాశాలు ఏర్పర్చడం. ఎక్కువ మార్కులొచ్చే విద్యార్థుల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించడం, వారిని ప్రత్యేకంగా చూడటం. స్పెషల్ క్లాసెస్, అన్ని సదుపాయాలున్న గదులు కేటాయించడం, వ్యక్తిగత ఆసక్తి ప్రదర్శించడం, వారికి మాత్రమే 24 గంటలూ లెక్చరర్లు అందుబాటులో ఉంచడం లాంటివి విద్యార్థుల్లో చీలిక తెచ్చి, వారిని తీవ్రమైన ఒత్తిడికి గురిచేస్తున్నాయి. కోచింగ్ సెంటర్ల మధ్య పోటీ ... ఐఐటీ, లేదా ఎయిమ్స్‌కి వెళ్లే సామ ర్థ్యాలు ఆ విద్యార్థికి ఉన్నాయా లేదా అన్న విషయాన్ని అంచనావేసే టెస్ట్ లేవీ లేకుండానే ఎంతమంది వస్తే, అంతమందిని కాలేజీల్లో చేర్చుకుంటున్నారు. ఇన్స్టిట్యూట్ల మధ్య పోటీతత్వం గొర్రెల మందలా కోచింగ్ సెంటర్లలో విద్యార్థులను నింపుతోంది. కోచింగ్ సెంటర్ల జిమ్మిక్కులు... కోచింగ్ సెంటర్లు ప్రతిభ గల విద్యార్థులను వేరే ఇన్స్టిట్యూట్ల నుంచి కొనుక్కొని తమ సెంటర్లలో చేర్చుకోవడంతో ఆయా సంస్థలకు తప్పనిసరిగా కొన్ని ఐఐటీ, ఎయిమ్స్ సీట్లొస్తాయి. ఆ ఇన్స్టిట్యూట్లోనే చదివినట్లు వారిపై ప్రకటనలిచ్చుకుని తల్లిదండ్రులను ఆకర్షించి ఎక్కువ మందిని చేర్చుకునే జిమ్మిక్కులు చేస్తున్నారు. ఇందుకు స్మృతి ప్రత్యక్ష ఉదాహరణ. ఈఎన్టీ స్పెషలిస్ట్ కూతురు స్మృతిని అధికమొత్తంలో కొనేందుకు ప్రయత్నించారు. -
మహిళల బాత్రూమ్ల్లో సీసీ కెమెరాలు..
సాక్షి, అనంతపురం : కోచింగ్ సెంటర్ల ఆగడాలు రోజు రోజుకు తీవ్రమౌతున్నాయి. వేలాది రూపాయల కొద్ది దండుకునే కోచింగ్ సెంటర్లు మరింత రెచ్చిపోయి భద్రత పేరుతో అకృత్యాలు చేస్తున్నాయి. మహిళల బాత్రూమ్లో రహస్య కెమారాలు పెట్టి దారుణాలకు పాల్పడుతున్నారు. వివరాల్లోకి వెళ్తే.. అనంతపురంలోని లోటస్ కోచింగ్ సెంటర్ చేస్తున్న నిర్వాకం బయటపడింది. కోచింగ్ సెంటర్లోని మహిళల బాత్రూమ్ల్లో రహస్య కెమరాలు పెట్టి వీడియోలు రికార్డు చేస్తున్నారు. అయితే విషయం తెసుకున్న మహిళలు విద్యార్థులు ఈ దారుణం గురించి కుటుంబ సభ్యులకు తెలియచేశారు. దీంతో ఆగ్రహించిన తల్లిదండ్రలు కోచింగ్ సెంటర్‌పై దాడలకు దిగారు. చదువు చెప్పాల్సింది పోయి.. ఇలాంటి పనులు చేయడం ఏంటని నిలదీశారు. కోచింగ్ సెంటర్ నిర్వాహకుడు సంజీవరాయుడుకు దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. -
రండిబాబూ.. రండి..!
తెలంగాణ ప్రభుత్వం ఇటీవలే టీచర్ నియామకాలకు ఉత్తర్వులు జారీ చేసింది. దరఖాస్తులు కూడా పూర్తయ్యాయి. సంబంధిత పరీక్షలో విజయం సాధించేందుకు ఉమ్మడి జిల్లా అభ్యర్థులు కోచింగ్ సెంటర్ల వైపు పరుగులు తీస్తున్నారు. ఎలాగైనా కొలువు కొట్టాలని ఆసక్తితో ఉన్నారు. అయితే సదరు కోచింగ్ సెంటర్ల నిర్వాహకులు ‘రండిబాబూ.. రండి’ అంటూ అభ్యర్థులను నిలువునా ముంచుతున్నారు. అర్హతలేని టీచర్లతో బోధిస్తూ.. అధిక ఫీజులు వసూలు చేస్తున్నారు. గోదావరిఖని టౌన్ : టీఆర్టీకి కేవలం కొద్ది నెలల గడువు మాత్రమే ఉందని భావించిన నిరుద్యోగులు కోచింగ్ సెంటర్ల వైపు పరుగు తీస్తున్నారు. టీచర్ రిక్రూట్మెంట్ టెస్ట్ కోసం కోచింగ్ తీసుకునే అభ్యర్థులు తస్మాత్జాగ్రత్తగా ఉండాలని పలువురు విద్యావేత్తలు సూచిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం టీఆర్టీని ప్రకటించిన వెంటనే కొన్ని బూటకపు కోచింగ్ సెంటర్లు పుట్టుకచ్చి, అభ్యర్థుల నుంచి వేలల్లో డబ్బు గుంజడానికి అసత్యపు ప్రచారాలతో ముందుకు వస్తున్నారని తెలుస్తోంది. ఉమ్మడి జిల్లాలో 40 వేల మంది ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 35 నుంచి 40వేల వరకు టీఆర్టీ కోసం కోర్సులు పూర్తి చేసిన నిరుద్యోగులు ఉన్నారు. గతంలో వరంగల్, హైదరాబాద్, కరీంనగర్ ప్రాంతాలలో మాత్రమే గుర్తింపు ఉన్న కోచింగ్ సెంటర్లు ఉండేవి. ప్రస్తుతం గుర్తింపు లేకున్నా ప్రతీ ప్రాంతంలో కోచింగ్ సెంటర్లు వెలుస్తున్నాయి. అధికారుల నిర్లక్ష్యం సంబంధిత అధికారులు కోచింగ్ సెంటర్లపై దృష్టి సారించడం లేదు. కోచింగ్ సెంటర్లకు కావాల్సిన అర్హత ఏమిటి, వాటిని ఎలా సమసన్వయ పరుచాలనే బాధ్యతలను నిర్వహించకపోవడంతో నిరుద్యోగులు తీవ్రంగా నష్ట పోతున్నారు. వేలల్లో ఫీజులు గోదావరిఖని, మంథని, కరీంనగర్, జగిత్యాల ప్రాంతాలలో ఉన్న పలు సెంటర్లు మూడు నెలలకు రూ. 40 నుంచి 60 వేల వరకు ఫీజులు వసూలు చేస్తున్నారని అభ్యర్థులు అంటున్నారు. ప్రభుత్వం జోక్యం చేసుకుని ఫీజులను నియంత్రించడమే కాకుండా, సరైన కోచింగ్‌ను ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. సరైన సెంటర్‌ను ఎంచుకోవాలి కోచింగ్ సెంటర్లలలో బోధించే అధ్యాపకులకు అర్హత ఉందా, లేదా? అని చూసి అభ్యర్థులు కోచింగ్ సెంటర్లలో చేరాలి. అధిక డబ్బులు చెల్లించి సరైన కోచింగ్ సెంటర్‌ను ఉంచుకోవడం వలన నిరుద్యోగులు తీవ్రంగా నష్టపోయే అవకాశాలు ఉన్నాయి. – దాదాసలాం, ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ ప్రచారాలు నమ్మొద్దు ప్రభుత్వం టీచర్ రిక్రూట్మెంట్ ప్రకటించిన వెంటనే చాలా కోచింగ్ సెంటర్లు సెల్ ద్వారా, ఇతర ప్రచారా సాధనాల ద్వార ప్రచారాలు నిర్వహిస్తున్నారు. వాటిలో ఏది మెరుగైంది. గతంలో వాటి చరిత్ర ఏంటి ఇలా చాలా రకాలుగా సెంటర్‌పై విషయాన్ని తెలుసుకోవాలి. లేకుంటే నష్టపోయే అవకాశాలు ఉన్నాయి. – ఎల్ సుహాసిని, ఆర్జేడీ ప్రభుత్వం చొరవ తీసుకోవాలి కోచింగ్ సెంటర్ల విషయంలో ప్రభుత్వం చొరవ తీసుకోవాలి. గుర్తింపు లేని సెంటర్లను మూసి వేయాలి. అర్హత లేని భోధకులను తొలగించాలి. అప్పుడే నిరుద్యోగులకు న్యాయం జరుగుతుంది. లేకుంటే డబ్బుతో పాటు సమయాన్ని, భవిష్యత్‌ను, అవకాశాన్ని చేజార్చుకుంటాం. – సుచరిత, హెచ్‌పీటీ అభ్యర్థి -
కోచింగ్ సెంటర్లపై గోపాలకృష్ణ మండిపాటు
హైదరాబాద్: కోచింగ్ సెంటర్ల వ్యవహారశైలిపై సివిల్స్ ఆలిండియా మూడో ర్యాంకర్ రోణంకి గోపాలకృష్ణ మండిపడ్డారు. కోచింగ్ సెంటర్లు చెప్పే మాటలు నమ్మి మోసపోవద్దంటూ నిరుద్యోగులను సలహా ఇచ్చారు. గురువారం హైదరాబాద్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. ‘నేను ఎక్కడా కోచింగ్ తీసుకోలేదు. కానీ కొన్ని కోచింగ్ సెంటర్లు కావాలనే నా పేరును వాడుకుంటున్నాయి. ఇది దారుణం. మరోసారి స్పష్టం చేస్తున్నా.. నేను సొంతగానే సివిల్స్‌కు ప్రిపేర్ అయ్యా. తెలుగు సాహిత్యం సొంతగా చదివా, జనరల్ స్టడీస్ మాత్రం బాలలతగారి దగ్గర శిక్షణపొందా. సిటీలోని పలు కోచింగ్ సెంటర్లు నా పేరును, ర్యాంకుతో ప్రకటనలు ఇస్తున్నాయి. అవి తప్పుడు ప్రకటనలు’ అని గోపాలకృష్ణ చెప్పారు. సివిల్స్ పరీక్షలు రాయగోరే అభ్యర్థులు సొంత ప్రిపరేషన్‌కే తొలి ప్రాధాన్యం ఇస్తే మంచిదని గోపాలకృష్ణ అభిప్రాయపడ్డారు. అలా కుదరని పక్షంలో నచ్చిన కోచింగ్ సెంటర్‌కు వెళ్లాలని సూచించారు. అయితే కోచింగ్ సెంటర్లు చెప్పే మాటలు నమ్మి మోసపోవద్దని హితవుపలికారు. -
కోచింగ్ సెంటర్లు, బ్రోకర్లపై నిఘా
* 11న ఎంసెట్-3కి ఏర్పాట్లు పూర్తి * పోలీస్ ఉన్నతాధికారులతో ఎంసెట్ కమిటీ భేటీ * బయోమెట్రిక్ పరికరాలను పెంచాలని నిర్ణయం * నేడూ హాల్‌టికెట్ల డౌన్‌లోడ్‌కు అవకాశం సాక్షి, హైదరాబాద్: ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఈ నెల 11న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు నిర్వహించనున్న ఎంసెట్-3 పరీక్షకు ఎంసెట్ కమిటీ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఎంసెట్-2 లీకేజీ నేపథ్యంలో తెలంగాణతోపాటు పక్క రాష్ట్రాల్లోనూ కార్పొరేట్ విద్యా సంస్థలు, కోచింగ్ కేంద్రాలు, బ్రోకర్లపై ఇంటెలిజెన్స్, సీఐడీ నేతృత్వంలో పోలీసుశాఖ నిఘా పెట్టింది. ముఖ్యంగా వచ్చే మూడు రోజులు బ్రోకర్ల కదలికలను పరిశీలించాలని, నిర్ణయించింది. ఏపీలో ఏర్పాటు చేసే 25 పరీక్ష కేంద్రాలపైనా పకడ్బందీ నిఘాకు చర్యలు చేపడుతోంది. ప్రశ్నపత్రాల విషయంలో ఇప్పటికే అడుగడుగునా నిఘా ఏర్పాటు చేసింది. గురువారం ఇక్కడి ఉన్నత విద్యా మండలి కార్యాలయంలో పోలీసు ఉన్నతాధికారులతో ఎంసెట్ కమిటీ సమావేశమై నిఘా, పరీక్ష ఏర్పాట్లపై సమీక్షించింది. మండలి చైర్మన్ ప్రొఫెసర్ తుమ్మల పాపిరెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఎంసెట్-3 చైర్మన్, జేఎన్టీయూహెచ్ వీసీ ప్రొఫెసర్ వేణుగోపాల్‌రెడ్డి, ఎంసెట్-3 కన్వీనర్ ప్రొఫెసర్ యాదయ్య, ఇంటెలిజెన్స్ డీఐజీ ప్రభాకర్‌రావు, హైదరాబాద్ లా అండ్ ఆర్డర్ జాయింట్ సీపీ వీవీ శ్రీనివాసరావు, సైబరాబాద్ జాయింట్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర, లా అండ్ ఆర్డర్ డీఐజీ కల్పనా నాయక్ తదితరులు సమావేశమయ్యారు. ఈసారి పరీక్షకు బయోమెట్రిక్ పరికరాలను పెంచాలని నిర్ణయించారు. గతంలో ప్రతి 250 మందికి ఒక బయోమెట్రిక్ పరికరం ఏర్పాటు చేయగా, ఈసారి ప్రతి 200 మంది విద్యార్థులకు ఒక పరికరం ఏర్పాటు చేయనున్నారు. విద్యార్థులను తనిఖీ చేసే ప్రదేశాల్లో బాంబు డిస్పోజల్ స్క్వాడ్లను ఏర్పాటు చేయనున్నారు. పరీక్ష కేంద్రాల వద్ద మహిళా కానిస్టేబుళ్లను మోహరించడంతోపాటు ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోనున్నారు. మరోవైపు హాల్‌టికెట్ నంబర్లలో మార్పులు చేశారు. వాటిని ఏడు అంకెల నుంచి ఎనిమిది అంకెలకు పెంచారు. పరీక్ష కేంద్రాలను కూడా జంబ్లింగ్ చేశారు. పాత పరీక్ష కేంద్రాల్లో ఏ విద్యార్థీ పరీక్ష రాసే అవకాశం లేకుండా కొత్త కేంద్రాల్లోనే పరీక్ష రాసేలా ఏర్పాట్లు చేశారు. పరీక్ష రాసిన విద్యార్థులకు కార్బన్‌లెస్ జవాబుల కాపీలను అందించనున్నారు. నిమిషం ఆలస్యమైనా అనుమతించం: ప్రొఫెసర్ పాపిరెడ్డి ఎంసెట్-3 పరీక్షకు నిమిషం ఆలస్యమైనా విద్యార్థులను అనుమతించబోమని ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ తుమ్మల పాపిరెడ్డి స్పష్టం చేశారు. అందుకే విద్యార్థులు పరీక్ష కేంద్రానికి ముందుగానే చేరుకోవాలన్నారు. బయోమెట్రిక్ డేటా సేకరించాల్సి ఉన్నందువల్ల విద్యార్థులు 9 గంటలకే పరీక్షా కేంద్రాలకు చేరుకోవడం మంచిదన్నారు, ఉదయం 9 గంటల నుంచే వారిని పరీక్ష హాల్లోకి అనుమతిస్తామన్నారు. 96 పరీక్ష కేంద్రాల్లో జరిగే ఈ పరీక్షలకు 56,153 మంది విద్యార్థులకు హాల్‌టికెట్లు సిద్ధం చేశామన్నారు. గురువారం సాయంత్రం వరకు 33,169 మంది హాల్‌టికెట్లను డౌన్లోడ్ చేసుకున్నారని, మిగతా విద్యార్థులు శుక్రవారం కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చని తెలిపారు. విద్యార్థులు ఎలక్ట్రానిక్ పరికరాలు తీసుకురాకూడదని పాపిరెడ్డి స్పష్టం చేశారు. -
‘కోచింగ్’పై కొరడా
ప్రతి శిక్షణ కేంద్రానికి రిజిస్ట్రేషన్ తప్పనిసరి ఈ వారంలోనేప్రారంభం.. ఆ తరువాత ప్రత్యేక వెబ్సైట్ విద్యా చట్టం, జీవో 200 అమలుకు ప్రభుత్వం చర్యలు నిబంధనలు పాటించాల్సిందే టీచర్లు, అధ్యాపకులు ఈ శిక్షణ కేంద్రాల్లో పనిచేయడానికి వీల్లేదు హైదరాబాద్: గ్రూప్-1, గ్రూప్-2, డీఎస్సీ, ఎంసెట్, ఐసెట్, క్యాట్, గేట్... ఇలా ఏ ఉద్యోగ, ప్రవేశపరీక్షలకైనా శిక్షణ ఇస్తామంటూ పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చిన కోచింగ్ కేంద్రాలు, ట్యుటోరియల్స్ల లెక్క తేల్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. అంతేకాదు ప్రతి కోచింగ్ కేంద్రం కూడా విద్యాశాఖ వద్ద రిజిస్ట్రేషన్ చేయించుకునేలా ఏర్పాట్లు చేస్తోంది. తద్వారా రాష్ట్రంలోని అన్నిరకాల కోచింగ్ కేంద్రాల నియంత్రణకు రంగం సిద్ధం చేస్తోంది. ఇన్నాళ్లుగా అధికారులెవరూ పట్టించుకోని ఆంధ్రప్రదేశ్ విద్యాచట్టం-1982ను అమలు చేయాలని నిర్ణయించింది. ఈ చట్టాన్ని తెలంగాణ రాష్ట్రానికి అన్వయించుకునేందుకు సర్కారు సిద్ధమైంది. దీంతోపాటు ఆ చట్టంలోని నిబంధనలకు లోబడి 1997 ఆగస్టు 6న అప్పటి ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులు (జీవో) 200లోని (ఆంధ్రప్రదేశ్ ట్యుటోరియల్ ఇనిస్టిట్యూషన్స్ రిజిస్ట్రేషన్స్ అండ్ రెగ్యులేషన్స్) నిబంధనల అమలుకు ఏర్పాటు చేసింది. ప్రతి కోచింగ్ కేంద్రం మీసేవ కేంద్రాల్లో నిర్ణీత ఫీజు చెల్లించి రిజిస్ట్రేషన్ చేయించుకునేలా చర్యలు చేపట్టింది. ఈ వారంలోనే ఈ రిజిస్ట్రేషన్‌ను ప్రారంభించనుంది. ఈమేరకు అన్ని ఏర్పాట్లను విద్యాశాఖ పూర్తి చేసింది. ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి నుంచి అనుమతి రాగానే ఈ ప్రక్రియను ప్రారంభించనుంది. త్వరలో ప్రత్యేక వెబ్సైట్ కోచింగ్ కేంద్రాల రిజిస్ట్రేషన్ ప్రక్రియను మొదట మీ సేవ కేంద్రాల్లో ప్రారంభించనున్నారు. ప్రస్తుతం వీటిలోనే రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. తరువాత ప్రత్యేక వెబ్‌సైట్‌ను అందుబాటులోకి తెచ్చి.. రిజిస్ట్రేషన్ ప్రక్రియను నిరంతరం కొనసాగించాలని సర్కారు భావిస్తోంది. అందులో కొత్తగా వస్తున్న ప్రతి కోచింగ్ కేంద్రం కూడా రిజిస్ట్రేషన్ చేయించుకోవచ్చు. ప్రతి శిక్షణ సంస్థ రూ. 1,000 చెల్లించి రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. రూ.10 వేలు డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. తేలనున్న లెక్క రిజిస్ట్రేషన్ ద్వారా కోచింగ్ కేంద్రాల సంఖ్యతోపాటు ఎన్ని రకాల కోచింగ్ కేంద్రాలు ఉన్నాయన్న వివరాలు అందుబాటులోకి రానున్నాయి. రిజిస్ట్రేషన్ తరువాత వాటిలో సదుపాయాలు, అమలు చేయాల్సిన నిబంధనలపై దృష్టి పెట్టనుంది. మరోవైపు రిజిస్ట్రేషన్ చేయించుకోని శిక్షణాసంస్థల నిర్వాహకులపై చట్టంలోని సెక్షన్ 32 ప్రకారం.. కేసులు నమోదు చేసి, కోర్టు ద్వారా ఆరు నెలల నుంచి ఏడాది వరకు జైలుశిక్ష, జరిమానా విధించే అవకాశం ఉంది. ఈ నిబంధన అమలుకు చర్యలు చేపట్టాలని సర్కారు నిర్ణయించింది. అన్ని అంశాల తనిఖీ.. విద్యాచట్టం-1982, జీవో 200లోని నిబంధనల ప్రకారం పాఠశాల విద్య, కళాశాల విద్య మినహా ఇతరత్రా శిక్షణ ఇచ్చే ప్రతి కోచింగ్ కేంద్రం, స్కూల్, కాలేజీలు ట్యుటోరియల్ కిందకే వస్తాయి. నిబంధనల ప్రకారం ఉపాధ్యాయులు, అధ్యాపకులు ఎవరూ అలాంటి శిక్షణలు ఇవ్వడానికి వీల్లేదు. స్కూళ్లు, కాలేజీల్లోనే పనిచేయాలి. ఆ నిబంధనను పక్కాగా అమలుచేసేందుకు విద్యాశాఖ కసరత్తు చేస్తోంది. రిజిస్ట్రేషన్ సమయంలో తాము శిక్షణ ఇవ్వనున్న, ఇచ్చే కోర్సుల వివరాలు, కల్పించే మౌలిక సదుపాయాలు, శానిటరీ సదుపాయాల (జిల్లా ఆరోగ్య అధికారి ఇచ్చిన సర్టిఫికెట్ తదితరాల) వివరాలన్నీ తెలియజేయాలి. వీటిపై డీఈవో ఆధీనంలోని మరో అధికారి స్వయంగా తనిఖీ చేసి నివేదిక సమర్పించాకే.. ఆ శిక్షణా సంస్థను రిజిస్టర్డ్ సంస్థగా గుర్తించాలా? లేదా? అన్నది నిర్ధారిస్తారు. తనిఖీ సందర్భంగా సదుపాయాలతో కూడిన భవనాలు ఉన్నాయా, ప్రతి తరగతికి గది ఉందా, ఫీజుల విధానం ఏమిటి, ఆర్థిక అవకతవకలు ఉన్నాయా? అన్న కోణంలో పరిశీలన జరుపుతారు. -
కోచింగ్ సెంటర్లపై పీడీఎస్‌యూ కార్యకర్తల దాడి
హైదరాబాద్ : కోచింగ్ సెంటర్లలో వసతులు మెరుగుపరచాలని, ఫీజులు నియంత్రించాలని డిమాండ్ చేస్తూ పీడీఎస్‌యూ ఆధ్వర్యంలో శుక్రవారం బంద్‌కు పిలుపునిచ్చారు. అయితే, ప్రొఫెసర్ జయశంకర్, ఆర్సీ రెడ్డి కోచింగ్ సెంటర్లలో క్లాసులు కొనసాగుతుండగా పీడీఎస్‌యూ కార్యకర్తలు దాడికి దిగారు. దీంతో పోలీసులు సుమారు 50 మంది కార్యకర్తలను అదుపులోకి తీసుకుని, స్టేషన్‌కు తరలించారు. (ముషీరాబాద్) -
‘ఢీ’ఎస్సీ
* ‘టెర్ట్’కు సిద్ధమవుతున్న ఉపాధ్యాయ ఉద్యోగార్థులు * ప్రణాళికాబద్ధమైన సాధనతో విజయుం సాధ్యవుంటున్న నిపుణులు * కోచింగ్ సెంటర్లకు క్యూ కడుతున్న అభ్యర్థులు చిత్తూరు(ఎడ్యుకేషన్): రాష్ట్ర ప్రభుత్వం డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయడంతో జిల్లాలోని వేలాదివుంది బీఈడీ, డీఈడీ పూర్తిచేసిన అభ్యర్థులు తమ కల నెరవేర్చుకునేందుకు తుదిపోరుకు సన్నద్ధవువుతున్నారు. ఈసారి టెట్, డీఎస్సీ రెండు పరీక్షలను కలిపి టెర్ట్(టీచర్ ఎలిజిబిలిటీ కమ్ రిక్రూట్మెంట్ టెస్ట్) పేరిట సిలబస్‌ను సైతం సమ్మిళితం చేసి ఒకే పరీక్షను నిర్వహించేందుకు రాష్ట్ర విద్యాశాఖ నిర్ణయించింది. 2012 డీఎస్సీ సిల బస్నే ఇవ్వడంతో హైస్కూల్స్థారుు వరకు పాత పాఠ్యపుస్తకాల కోసం అభ్యర్థులు శోధిస్తున్నారు. జిల్లాలో స్కూల్ అసిస్టెంట్ పోస్టులు 221 ఉండగా, సెకండరీ గ్రేడ్ టీచర్లు 1,194 పోస్టులున్నారుు. లాంగ్వేజ్ పండిట్లు 182 ఉండగా, తొమ్మిది పీఈటీ పోస్టులు ఉన్నారుు. ఎస్జీటీ పోస్టులకు కేవలం డీఎడ్ అభ్యర్థులు వూత్రమే అర్హులుగా ప్రకటించడంతో బీఈడీ అభ్యర్థులు కేవలం స్కూల్ అసిస్టెంట్ పోస్టులకే కుస్తీ పడుతున్నారు. టెట్ రద్దు చేయుడంతో బీఈడీ, డీఈడీ పూర్తిచేసిన ప్రతి అభ్యర్థీ డీఎస్సీ (టెర్ట్) రాసే అవకాశం ఉంది. ఈసారి దరఖాస్తులు రికార్డుస్థాయిలో వచ్చే అవకాశం కనిపిస్తోంది. జిల్లాలో అధిక సంఖ్యలో ఉపాధ్యాయు పోస్టులు ఉండడంతో ఇతర జిల్లాల అభ్యర్థులు సైతం నాన్‌లోకల్ కేటగిరీ కింద ఇక్కడ దరఖాస్తు చేసే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. ఓపెన్ కేటగిరీలో 20 శాతం నాన్‌లోకల్ అభ్యర్థులు పోటీపడే వెసులుబాటు ఉండడంతో ముఖ్యంగా పోస్టులు తక్కువగా ఉన్న వైఎస్సార్, విజయునగరం, కృష్ణా, విజయునగరం, శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు తదితర జిల్లాలకు చెందిన అభ్యర్థులు వున జిల్లావారితో పోటీ పడనున్నారు. తెలుగు అభ్యర్థులకు అన్యాయుం తెలుగు బోధనలో ఏవూత్రం ఉపయోగంలేని సబ్జెక్టులకు అధిక వూర్కులు కేటారుుంచి తెలుగు సబ్జెక్టుకు తక్కువ వూర్కులు కేటారుుం చడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నా. స్కూల్ అసిస్టెంట్లకు ఈసారి సిలబస్ కొద్దిగా క్లిష్టతరంగా ఇచ్చారు. పాఠ్యపుస్తకాల్లోని కవి కాలాదులతోపాటు విషయు అవగాహనకు ప్రాధాన్యం ఇవ్వాలి. తెలుగుభాష సాహిత్యచరిత్ర (వెలవుల తివ్మున్న) తెలుగుభాష సాహిత్య సమీక్ష (ద్వానాశాస్త్రి, నాగయ్యు), ప్రశ్నోత్తర కైముది(తెలుగు అకాడమీ) పుస్తకాలు అధికవూర్కులు సాధించేందుకు తోడ్పడతాయి. -యువశ్రీ మురళి,తెలుగు భాషా పండితులు, గోవర్థనపురం, వరదయ్యుపాళెం భూగోళం, చరిత్రపై శ్రద్ధ చూపాలి సోషల్ స్కూల్ అసిస్టెంట్ అభ్యర్థులు భూగోళ శాస్త్రం, చరి త్ర అంశాలపై ప్రధానంగా ప్రత్యేక శ్రద్ధ వహించాలి. భూగోళ శాస్త్రంలో వ్యూప్కు అనుసంధానంగా ప్రిపేర్ కావాలి. చరిత్ర విషయూనికొస్తే కాలానుగుణంగా రాజవంశాలపై అవగాహన ఏర్పరుచుకోవాలి. ప్రతి ప్రశ్నకూ తార్కిక పద్ధతిలో ఆలోచించి సవూధానాలు గుర్తించాలి. - సురేష్‌బాబు,సాంఘికశాస్త్ర ఉపాధ్యాయుడు, శ్రీకాళహస్తి ప్రతి మార్కూ కీలకం ఉపాధ్యాయు ఉద్యోగానికి పోటీ తీవ్రతరమైం ది. పరీక్షలో ప్రతి వూర్కూ కీలకం కానుంది. దీంతో మిగిలి ఉన్న కాలాన్ని విభజించుకుని అవగాహనతో కూడిన ప్రిపరేషన్‌తో సత్ఫలితాలు సాధించవ చ్చు. అకాడమీ పుస్తకాలను చదవడం ద్వారా అధిక ప్రయోజనం చేకూరే అవకాశం ఉంది. - నల్లందుల గుణశేఖర్రెడ్డి, యూటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి ప్రాక్టీస్ పేపర్లు సాధన చేయూలి ఉపాధ్యాయు పరీక్ష డీఎస్సీకి పోటీ తీవ్రంగా ఉంటుంది. సివిల్స్ స్థారుులో ప్రిపేర్ కావాలి. తక్కువ కాల వ్యవధిలో అధిక ప్రశ్నలకు సవూధానాలు రాయూలి. వీలైనన్ని ఎక్కువ పేపర్లను సాధన చేయూలి. విషయూంశాలపై జ్ఞానంతోపాటు అవగాహన పెంపొందించుకోవాలి. గతంలో అడిగిన ప్రశ్నల సరళిని పరిశీలించాలి. ఇతర వ్యాపకాలను తగ్గించి ఏకాగ్రతతో సాధన చేస్తే విజేతలుగా నిలవచ్చు. - కె.సుధాకర్‌రెడ్డి, సైకాలజిస్టు పోటీ చూసి ఆందోళన వద్దు డీఎస్సీకి పోటీ తీవ్రంగా ఉంటుంది. పోస్టును సాధించడం అనే లక్ష్యం తప్ప వునస్సులో వేరే ఆలోచనవద్దు. నాలుగు నెలల కాలవ్యవధి పరీక్షకు ఉండడంతో సవుయూన్ని ఏవూత్రం వృథా చేయుకుండా ప్రిపరేషన్‌ను కొనసాగించాలి. డీఎస్సీ నిర్వహణలో పారదర్శకతను పాటిస్తాం. అనవసర విషయూలను వదిలిపెట్టి సిలబస్ ను అనుసరించి ప్రిపరేషన్ సాగాలి. - శామూయల్, ఇన్చార్జి డీఈవో, చిత్తూరు -
బ్యాంకింగ్ ఉద్యోగమే లక్ష్యం
బ్యాంకింగ్ రంగంలో కొలువు కోసం శిక్షణ డిగ్రీ అర్హతతో చైర్మన్ స్థాయికి ఎదిగే అవకాశం ఏటా ఎంతో మంది విద్యార్థులు డిగ్రీ పట్టాలు చేతపట్టుకుని ఉద్యోగాల కోసం కళాశాలల నుంచి పోటీ ప్రపంచంలోకి అడుగుపెడుతున్నారు. ఏ ప్రభుత్వ శాఖలో చూసినా ఉద్యోగాల సంఖ్య ఆశించిన స్థాయిలో ఉండటం లేదు. అయితే ఒక్క బ్యాంకింగ్ రంగంలో మాత్రమే పరిస్థితులు ఆశాజనకంగా ఉన్నాయి. పలు బ్యాంకులు తమ శాఖలను విస్తరించడంతో ఖాళీల సంఖ్య పెరుగుతోంది. దీంతో యువత ఆ ఉద్యోగాల సాధన కోసం శిక్షణ పొందుతోంది. గ్రంథాలయాలు, కోచింగ్ సెంటర్లల్లో నిరంతర సాధన చేస్తూ ప్రణాళికా బద్ధంగా ముందుకు సాగుతోంది. మచిలీపట్నం (ఈడేపల్లి) : బ్యాంకు ఉద్యోగాలంటే గతంలో నిరుద్యోగులు అంతగా ఆసక్తి చూపేవారు కాదు. కారణం ఉద్యోగాలపై అవగాహన లేమి, ఇతర ప్రభుత్వ శాఖలతో పోలిస్తే బ్యాంకింగ్ రంగంలో ఖాళీలు తక్కువ ఉండడమే. ఇటీవల కాలంలో బ్యాం కుల సంఖ్య పెరిగింది. అందుకు తగ్గట్టు సిబ్బంది, నిపుణులైన యువత కావాలి. ఖాళీలు, వేతనాలు ఎక్కువగా ఉండడంతో నిరుద్యోగులతో పాటు చిరుద్యోగులు కూడా ఈ కొలువులకు సై అంటున్నారు. బ్యాంకింగ్ రంగ దిగ్గజం స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) సహా ఇతర అన్ని ప్రభుత్వరంగ సంస్థల బ్యాంకులు ఉద్యోగాల భర్తీకోసం అధిక సంఖ్యలో ప్రకటనలు వెలువరిస్తున్నాయి. నవంబర్ నెలాఖరు వరకు ప్రొబేషనరీ ఆఫీసర్స్(పీవో) పరీక్షలు ఉన్నాయి. డిసెంబర్ నుంచి జనవరి వరకు జరిగే పరీక్షల్లో వేల సంఖ్యలో క్లర్క్ ఉద్యోగాలు భర్తీ కానున్నాయి. బ్యాంకు ఉద్యోగాలకు డిగ్రీలో 60శాతం మార్కుల వచ్చిన వారే అర్హులు. ప్రస్తుతం భారతీయ స్టేట్ బ్యాంకు, అనుబంధ సంస్థలు ఒకే విధమైన పరీక్షలు నిర్వహిస్తే, మరో 19 రకాల బ్యాం కులకు అవసరమయ్యేలా ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్స్(ఐబీపీఎస్) బ్యాంకు పరీక్షలు నిర్వహిస్తున్నాయి. ప్రశ్న పత్రాలు ఇలా... ఎస్బీఐ పరీక్షలో వివిధ విభాగాలుగా 200 మార్కులకు ప్రశ్నలు ఉంటాయి. ఏ విభాగంలో తక్కువ మార్కులు వచ్చినా పరీక్షలో ఉత్తీర్ణులు కానట్టే. జనరల్ నాలెడ్జ్‌లో సమకాలీన అంశాలతో పాటు అన్నిరంగాల్లో పట్టు సాధించాలి. జనరల్ ఇంగ్లిషులో గ్రామర్‌పై అవగాహన ఉండాలి. కంప్యూటర్ స్కిల్స్‌లో బేసిక్స్, ఎంఎస్ ఆఫీస్, డేటా ఎడిటింగ్, విండోస్, లాంగ్వేజెస్ తెలిసి ఉంటే చాలు. బిజినెస్ పత్రికలు, బిజినెస్ చానళ్లు వీక్షించి అవసరమైన సమాచారాన్ని నమోదు చేసుకుంటే షేర్ మార్కెట్లపై పట్టు వస్తుంది. ప్రణాళిక ప్రకారం చదివితే పరీక్ష ఎంత కఠినంగా ఉన్నా విజయం సాధించడం తేలికేనని ఇటీవల యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ప్రొబేషనరీ ఆఫీసర్(పీవో)గా నియమితులైన సమీర్ పేర్కొన్నారు. నిరంతర సాధనే విజయానికి సోపానం నిరంతర సాధనతో బ్యాంకింగ్ పరీక్షల్లో విజయం సాధించడం సులువేనని మచిలీపట్నానికి చెందిన కోచింగ్‌సెంటర్ నిర్వాహకుడు ఎం.ఎస్.నాయుడు పేర్కొన్నారు. ఆయన ఇచ్చిన సూచనలు ఇవీ.. ప్రశ్నలకు జాగ్రత్తగా, నేర్పుతో, సమయం వృథా చేయకుండా ఆలోచించి సమాధానం ఇవ్వాలి. తెలియని వాటిని వదిలేయడం మేలు. రీజ నింగ్‌లో 30 మార్కుల వరకు డెషిషన్ మేకింగ్‌పై ప్రశ్నలు వస్తాయి. ఐబీపీఎస్ పరీక్షల్లో ఎక్కువగా బ్యాంకింగ్ రంగానికి చెందిన ప్రశ్నలు అడుగుతుంటారు.నమూనా ఆన్లైన్ ఎగ్జామ్స్‌కు సిద్ధమవ్వాలి. ఆన్లైన్ పరీక్షలు ప్రాక్టీసు చేయాలి. పట్టుదలతో చదివితే గెలుపు సాధ్యం. ప్రతి బిట్టూ ఉద్యోగ సాధనలో కీలకం అనే విషయం మర్చిపోకూడదు. రీజనింగ్‌పై ఎక్కువ పట్టు సాధించాలి. ఉజ్జ్వల భవిష్యత్తుకు మార్గం బ్యాంకింగ్ ఉద్యోగాల్లో ఎటువంటి అవకతవకలు ఉండవు. ఇవి పూర్తిగా అభ్యర్థి సామర్థ్యాలపైనే ఆధారపడి ఉంటాయి. క్లర్క్ ఉద్యోగంతో బ్యాంకింగ్ రంగంలోకి అడుగుపెట్టిన వారు కూడా చైర్మన్ స్థాయికి ఎదిగే అవకాశం ఉంది. ఉజ్జ్వల భవిష్యత్తుకు బ్యాంకు ఉద్యోగాలు మంచి మార్గం. పోటీ ఎక్కువగా ఉన్నప్పటికీ యువత సానుకూల దృక్పథంతో ముందుకు సాగితే విజయం తప్పకుండా పొందుతారు. -పి.వి.శేఖర్, స్టేట్‌బ్యాంకు ఆఫ్ ఇండియా ఏజీఎం పోస్టల్ ఉద్యోగిగా పనిచేస్తూనే పోస్టల్ శాఖలో ఉద్యోగిగా పనిచేస్తున్నా. డిగ్రీతో బ్యాంకింగ్ రంగంలో ఉన్నత ఉద్యోగాలు పొందే అవకాశం ఉందని తెలుసుకున్నా. దీంతో రెండేళ్లుగా ఉద్యోగాల కోసం సాధన చేస్తున్నా. పోస్టాఫీస్ నుంచి ఇంటికి రాగానే రోజూ నాలుగు గంటలకు తగ్గకుండా ప్రణాళికా బద్ధంగా సిలబస్‌ను అధ్యయనం చేస్తున్నా. ఇప్పటి వరకు పదికి పైగా బ్యాంకింగ్ పరీక్షలు రాశా. ఇంటర్వ్యూలో మిస్ అవుతూ వచ్చాను. ఈ సారి తప్పక విజయం సాధిస్తాననే నమ్మకం ఉంది. - కె.వెంకటే శ్వరరావు, పిట్టల్లంక(కోడూరు) బ్యాంకింగ్‌లో ఎన్నో అవ కాశాలు బీటెక్ పూర్తిచేశా. సాఫ్ట్వేర్ రంగం కంటే బ్యాంకింగ్‌లోనే యువతకు ఎన్నో అవకాశాలు ఉన్నాయని గ్రహించా. ఆరు నెలల నుంచి కోచింగ్ సెంటర్లో సాధన చేస్తున్నా. రోజూ కోచింగ్‌లో నేర్చుకున్న అంశాలను రెండు గంటల పాటు పునఃశ్చరణ చేస్తూ వస్తున్నా. ప్రణాళికతో అధ్యయనం చేస్తే ఉద్యోగం పొందండం అంత కష్టమేమీ కాదు. సిలబస్‌ను పూర్తిగా అధ్యయనం చేయడం ముఖ్యం. - ఎస్.దివ్య, బీటెక్ -
‘కోచింగ్’ దందా
నిజామాబాద్ అర్బన్, న్యూస్‌లైన్ : నిరుద్యోగులలో ఆశలు రేకెత్తిస్తూ ఇటీవల ప్రభుత్వం పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు జారీ చేసింది. అరకొరగానే ఉద్యోగాలను భర్తీ చేస్తున్నా.. ఆశావహులు ఆయా ఉద్యోగాల కు భారీ స్థాయిలోనే దరఖాస్తు చేసుకుంటున్నారు. కొందరు స్టడీ మెటీరియల్ కొనుగోలు చేసి ఇంట్లోనే సన్నద్ధం అవుతుండగా.. మరికొందరు కోచింగ్ సెంటర్ల బా ట పడుతున్నారు. దీనిని కోచింగ్ సెంటర్లు సొమ్ము చేసుకుంటున్నాయి. ఫీజులు, మెటీరియల్ పేరుతో వేలల్లో డబ్బులు గుంజుతున్నాయి. అరకొరగానే పోటీ పరీక్షలకు సంబంధించి నిజామాబాద్ నగరం లో సుమారు 25 కోచింగ్ సెంటర్లున్నాయి. బస్టాండ్ సమీపంలో, సుభాష్‌నగర్, ఖలీల్‌వాడి, హమాల్వా డీ, గో ల్హన్మాన్ తదితర ప్రాంతాలలో ఈ కేంద్రాలున్నాయి. ఒక్కోదానిలో 200 నుంచి 400 వరకు అభ్యర్థులు వివిధ సబ్జెక్టులపై శిక్షణ తీసుకుంటున్నా రు. అన్ని కోచింగ్ సెంటర్లలో కలిపి సుమారు ఆరు వేల వరకు అభ్యర్థులున్నారు. నిర్వాహకులు నాలుగు గదులను అద్దెకు తీసుకొని, మూడు నాలుగు వందల మంది అభ్యర్థులను చేర్చుకొని నిరుద్యోగుల జీవితాలతో ఆడుకుంటున్నారు. ఏ కేంద్రంలోనూ సరైన వసతులు లేవు. చాలా చోట్ల ఇరుకు గదులలోనే తరగతులు నిర్వహిస్తున్నారు. రేకుల షెడ్డులో నడుస్తున్న కోచింగ్ సెంటరూ ఉంది. కొన్ని సెంటర్లలో తాగునీటి వసతి సైతం కల్పించడం లేదు. చాలా చోట్ల అనుభ వం ఉన్న శిక్షకులు లేరు. డిగ్రీ పూర్తి చేసినవారితోనే త తంగం నడిపిస్తున్నారు. ప్రకటనల్లో మాత్రం అనుభవజ్ఞులైన శిక్షకులతో ప్రత్యేక కోచింగ్ ఇప్పిస్తామని పేర్కొంటూ బురిడీ కొట్టిస్తున్నారు. ఉద్యోగం కోసం నిరుద్యోగు లు ఈ బాధలను భరిస్తున్నారు. వేలల్లో ఫీజులు ప్రస్తుతం వీఆర్ఓ, వీఆర్ఏ, పంచాయతీ కార్యదర్శి, ఐబీపీఎస్ తదితర పోటీ పరీక్షలకు జిల్లాలో కోచింగ్ ఇస్తున్నారు. ఆయా కోర్సులకు రూ. 3,500 నుంచి రూ. 5 వేల వరకు ఫీజు తీసుకుంటున్నారు. కోర్సులో చేరినప్పుడే పూర్తి ఫీజు వసూలు చేస్తున్నారు. స్టడీ మెటీరియల్ పేరుతో అభ్యర్థులనుంచి అదనపు మొత్తాన్ని గుంజుతున్నారు. హైదరాబాద్ నుంచి ప్రత్యేక శిక్షకులను రప్పిస్తున్నామంటూ ఫీజులు వసూ లు చేస్తున్నారు. అయితే నిర్దేశిత సిలబస్ ప్రకారం ఎక్కడా స్టడీ మెటీరియల్ అందించడం లేదని అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమకు తోచినట్లు గా మెటీరియల్ తయారు చేయించి విక్రయిస్తున్నారని పేర్కొంటున్నారు. కోచింగ్ సెంటర్లపై పర్యవేక్ష ణ లేకపోవడంతో ఆయా సెంటర్ల నిర్వాహకులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. ఉన్నతాధికారులు కోచింగ్ సెంటర్లపై దృష్టి సారించాలని విద్యార్థి సంఘాల నాయకులు కోరుతున్నారు. పర్యవేక్షణ లేకపోవడంతోనే అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో కోచింగ్ సెంటర్లు ఆడింది ఆట, పాడింది పాటగా నడుస్తోంది. అభ్యర్థులనుంచి అధిక మొత్తంలో ఫీజులు వసూలు చేస్తున్నారు. న్యాయబద్ధం గా ఫీజులు వసూలు చేయకపోతే ఆందోళన చేస్తాం. -శ్రీనివాస్‌గౌడ్, విద్యార్థి జేఏసీ జిల్లా చైర్మన్ అభ్యర్థులకు న్యాయం చేయాలి చాలా చోట్ల సరైన శిక్షకులు లేకున్నా కోచింగ్ సెంటర్లను నడిపిస్తూ నిరుద్యోగుల జీవితాలతో ఆడుకుంటున్నారు. ఇది మంచిది కాదు. నిపుణులతో కోచింగ్ ఇప్పించి అభ్యర్థులకు న్యాయం చేయాలి. కోచింగ్ సెంటర్లలో వసతులు కూడా కల్పించాలి. - ఎ.ప్రగతి కుమర్, ఎస్సీ, ఎస్టీ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు -
ఇక డీఎస్సీ !
=ఎన్నికల ముందు నోటిఫికేషన్? టెట్ సన్నాహాలతో కదలిక =జిల్లాలో 1370 పోస్టుల భర్తీ =స్కూల్ అసిస్టెంట్లు - 233, ఎస్జీటీలు - 1086 సాక్షి, విశాఖపట్నం : ఉపాధ్యాయ నియామకాలకు సన్నాహాలతో బీఎడ్, డీఎడ్ అభ్యర్థుల్లో ఉరుకులు పరుగులు ప్రారంభమయ్యాయి. కోచింగ్ సెంటర్లలో రద్దీ పెరిగింది. జిల్లాలో ప్రస్తుతమున్న క్లియర్ వేకెన్సీలు, బ్యాక్లాగ్ ఖాళీలతోపాటు ఈ ఏడాది ఫిబ్రవరిలో జీవో 43 ప్రకారం జిల్లాకు కేటాయించిన పోస్టుల్ని కూడా రానున్న డీఎస్సీలో భర్తీ చేయనున్నారు. ఈ మేరకు జిల్లాలో 1370 పోస్టుల భర్తీకి నోటిఫై చేస్తూ పాఠశాల విద్యాశాఖ డెరైక్టరేట్‌కు జిల్లా విద్యాశాఖ గతంలోనే నివేదిక పంపింది. ఇందులో స్కూల్ అసిస్టెంట్ పోస్టులు 233, పండితులు 36, పీఈటీలు 15, ఎస్జీటీలు 1086 ఉన్నాయి. చిత్తూరు తర్వాత అత్యధిక పోస్టులు విశాఖలోనే ఉండటం గమనార్హం. కొత్త కేటాయింపులే ఎక్కువ వివిధ కేటగిరీల్లో అన్ని సబ్జెక్టులు కలిపి జిల్లాలో ఉన్న ఖాళీలు కేవలం 443 మాత్రమే. ఇందులో 239 పోస్టులు గత డీఎస్సీల్లో ఆయా రోస్టర్‌లో అర్హులైన అభ్యర్థుల్లేక మిగిలిపోయాయి. వీటిలో 193 ఎస్జీటీలే. ఈ ఏడాది ఫిబ్రవరిలో జారీ చేసిన జీవో నంబరు.43 ప్రకారం జిల్లాకు 820 ఎస్జీటీ పోస్టులు, 183 గణితం, 184 సోషల్ స్కూల్ అసిస్టెంట్ పోస్టుల్ని మంజూరు చేశారు. నిబంధనల మేరకు వీటిలో 70 శాతం పదోన్నతిపై భర్తీ చేయాల్సి ఉంది. మిగిలిన వాటిని డీఎస్సీకి నోటిఫై చేశారు. దీంతో ఇప్పటికే ఉన్న ఖాళీలతోపాటు, కొత్త పోస్టులు 820 ఎస్జీటీ, గణితం(55), సోషల్(55) స్కూల్ అసిస్టెంట్ ఖాళీలు కలిపి మొత్తం 1370 పోస్టులు డీఎస్సీలో అభ్యర్థులకు అందుబాటులో ఉన్నాయి. ఇవన్నీ నాలుగుమాసాల కిందటి మాట. ఈ మధ్య కాలంలో మరి కొన్ని పోస్టులు పదవీ విరమణ, మరణం తదితర కారణాలతో ఖాళీ అయ్యాయి. కొత్తగా మరోసారి నోటిఫై చేస్తే వివిధ కేటగిరీలో మరో 50 వరకు పోస్టులు పెరిగే అవకాశాలున్నట్టు అధికారుల అంచనా. టెట్‌కు 22,464 మంది రాష్ట్ర విభజన వివాదంతో ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్) వాయిదాపడుతూ వస్తోంది. దీన్ని త్వరితగతిన నిర్వహించేందుకు పాఠశాల విద్యాశాఖ ఏర్పాట్లు చేస్తోంది. జిల్లా నుంచి టెట్ పేపర్-1కు 2,109మంది,పేపర్-2కు 19,787 మంది, రెండింటికీ కలిపి 568 మంది కలిపి మొత్తం 22,464 మంది దరఖాస్తు చేసుకున్నారు. వీరితోపాటు ఇప్పటికే టెట్‌లో అర్హత పొందినవారు కూడా వేల సంఖ్యలో ఉన్నారు. వారిలో కొందరు మార్కులు పెంచుకునేందుకు మళ్లీ టెట్‌కు దరఖాస్తు చేసుకున్నారు. తాజా డీఎస్సీలో స్కూల్ అసిస్టెంట్ పోస్టులు గణితం, సోషల్ మినహా మిగిలిన సబ్జెక్టుల్లో పెద్దగా లేవు. ఉన్నవాటిలో కూడా బ్యాక్లాగ్ ఖాళీలే ఎక్కువ. దీంతో గత డీఎస్సీ మాదిరి ఈ సారి కూడా డీఎడ్ అభ్యర్థులకే ఎక్కువగా కలిసిరానుంది.