మహిళల బాత్రూమ్‌ల్లో సీసీ కెమెరాలు.. | CCTV Cameras Found In Women's Bathrooms At Anantapur Coaching Centers | Sakshi
Sakshi News home page

Published Fri, Apr 13 2018 3:13 PM | Last Updated on Fri, Jun 1 2018 8:45 PM

CCTV Cameras Found In Women's Bathrooms At Anantapur Coaching Centers - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, అనంతపురం : కోచింగ్‌ సెంటర్ల ఆగడాలు రోజు రోజుకు తీవ్రమౌతున్నాయి. వేలాది రూపాయల కొద్ది దండుకునే కోచింగ్‌ సెంటర్లు మరింత రెచ్చిపోయి భద్రత పేరుతో అకృత్యాలు చేస్తున్నాయి. మహిళల బాత్రూమ్‌లో రహస్య కెమారాలు పెట్టి దారుణాలకు పాల్పడుతున్నారు. వివరాల్లోకి వెళ్తే.. అనంతపురంలోని లోటస్‌ కోచింగ్‌ సెంటర్‌ చేస్తున్న నిర్వాకం బయటపడింది. కోచింగ్‌ సెంటర్‌లోని మహిళల బాత్రూమ్‌ల్లో రహస్య కెమరాలు పెట్టి వీడియోలు రికార్డు చేస్తున్నారు. అయితే విషయం తెసుకున్న మహిళలు విద్యార్థులు ఈ దారుణం గురించి కుటుంబ సభ్యులకు తెలియచేశారు. దీంతో ఆగ్రహించిన తల్లిదండ్రలు కోచింగ్‌ సెంటర్‌పై దాడలకు దిగారు. చదువు చెప్పాల్సింది పోయి.. ఇలాంటి పనులు చేయడం ఏంటని నిలదీశారు. కోచింగ్ సెంటర్‌ నిర్వాహకుడు సంజీవరాయుడుకు దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement