Bath rooms
-
పసికందును వదిలేశారు
గుడిపాల: ఓ తల్లి మగశిశువుకు జన్మనిచ్చి బాత్రూమ్లో వదిలేసి వెళ్లిపోయింది. ఆ శిశువు ఏడుపు విని స్థాని కులు ఆస్పత్రికి తరలించారు. గుడిపాల మండలానికి చెందిన ఆర్ఎంపీ డాక్టర్ సుబ్రమణ్యం వద్దకు ఓ మహిళ మంగళవారం ఉదయం వచ్చింది. అధికంగా బ్లీడింగ్ పోతుందని తెలియజేసింది. డాక్టర్ ఇంజక్షన్ వేశాడు. అప్పటికే రోగులు అధికంగా ఉండడంతో ఆ మహిళ గురించి ఎవ్వరూ పట్టించుకోలేదు. కొంతసేపటికే ఆస్పత్రి పక్కనే ఉన్న బాత్రూంలో శిశువు ఏడుపు వినిపించింది. గమనించగా మగశిశువు కనిపిం చింది. ఇంతలో ఆ మహిళ కనిపించకుండా వెళ్లిపోయింది. వెంటనే గుడిపాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి శిశువును తీసుకువెళ్లారు. ఐసీడీఎస్ అధికారులకు తెలియజేశారు. -
మహిళల బాత్రూమ్ల్లో సీసీ కెమెరాలు..
సాక్షి, అనంతపురం : కోచింగ్ సెంటర్ల ఆగడాలు రోజు రోజుకు తీవ్రమౌతున్నాయి. వేలాది రూపాయల కొద్ది దండుకునే కోచింగ్ సెంటర్లు మరింత రెచ్చిపోయి భద్రత పేరుతో అకృత్యాలు చేస్తున్నాయి. మహిళల బాత్రూమ్లో రహస్య కెమారాలు పెట్టి దారుణాలకు పాల్పడుతున్నారు. వివరాల్లోకి వెళ్తే.. అనంతపురంలోని లోటస్ కోచింగ్ సెంటర్ చేస్తున్న నిర్వాకం బయటపడింది. కోచింగ్ సెంటర్లోని మహిళల బాత్రూమ్ల్లో రహస్య కెమరాలు పెట్టి వీడియోలు రికార్డు చేస్తున్నారు. అయితే విషయం తెసుకున్న మహిళలు విద్యార్థులు ఈ దారుణం గురించి కుటుంబ సభ్యులకు తెలియచేశారు. దీంతో ఆగ్రహించిన తల్లిదండ్రలు కోచింగ్ సెంటర్‌పై దాడలకు దిగారు. చదువు చెప్పాల్సింది పోయి.. ఇలాంటి పనులు చేయడం ఏంటని నిలదీశారు. కోచింగ్ సెంటర్ నిర్వాహకుడు సంజీవరాయుడుకు దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. -
అవినీతి కంపు
* తూతూ మంత్రంగా మరుగుదొడ్ల నిర్మాణం * పాతవాటికి రంగులేసి నిధులు బొక్కేశారు.. * కమిషనర్ కన్నెర్ర... చర్యలకు రంగం సిద్ధం ? అవినీతికి కేరాఫ్ అడ్రస్‌గా కార్పొరేషన్ అధికారులు మారుతున్నారు... ప్రధానంగా అభివృద్ధి పనుల్లో వీరి అవినీతి తారస్థాయికి చేరింది. చివరికి మరుగుదొ డ్లు నిర్మాణంలో సైతం ఇంజనీరింగ్ అధికారుల అవినీతి పెచ్చుమీరింది. సాక్షి, గుంటూరు: స్వచ్ఛ గుంటూరులో భాగంగా అక్టోబర్ 2వ తేదీ నాటికి నగరాన్ని బహిరంగ మల, మూత్ర విసర్జన రహితంగా తీర్చిదిద్దాలని అధికారులు నిర్ణయించారు. ఇందులో భాగంగా ఉపాసెల్, ఇంజినీరింగ్ అధికారులకు లక్ష్యాలను నిర్దేశించారు. కార్పొరేషన్ పరిధిలోని గుంటూరు పశ్చిమ, గుంటూరు తూర్పు నియోజకవర్గాలతో పాటు ప్రత్తిపాడు నియోజకవర్గం పరిధిలోని పది విలీనగ్రామాల్లో మరుగుదొడ్లు నిర్మించాలని నిర్ణయించారు. దీంతో కార్పొరేషన్‌కు 7,160 మంది మరుగుదొడ్లు నిర్మించుకొనేందుకు దరఖాస్తు చేసుకున్నారు. సాంకేతిక కారణాలతో కొన్ని దరఖాస్తులను తిరస్కరించిన అధికారులు 6,886 మరుగుదొడ్ల నిర్మాణాలు చేపట్టారు. ఒక్కొక్క మరుగుదొడ్డి నిర్మాణానికి ప్రభుత్వం రూ.15 వేలు మంజూరు చేసింది. ఇంజినీరింగ్ అధికారులు ఒక్కొక్క మరుగుదొడ్డి నిర్మాణానికి అడ్వాన్సు రూపంలో ఏడు వేల నుంచి 10వేల రూపాలయల వరకు తీసుకున్నారు. ఇక్కడ వరకు బాగానే ఉన్నా కొన్ని ప్రాంతాల్లో తూతూ మంత్రంగా మరుగుదొడ్లు నిర్మించి వదిలేశారు. కొన్ని ప్రాంతాల్లో గుంతలు తవ్వి వదిలేయడం, మరికొన్ని ప్రాంతాల్లో సగం గోడలు నిర్మిం చి వదిలేయడం చేసి నిధులను మింగేశారు. గుంటూరు తూర్పు నియోజకవర్గం పరిధిలో చాలా ప్రాంతాల్లో పాత మరుగుదొడ్లకు రంగులు వేసి నిధులు బొక్కేశారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కాగా, మరుగొదొడ్ల నిర్మాణంలో అవినీతి జరిగిందన్నదానిపై కమిషనర్ నాగలక్ష్మి ఆగ్రహంగా ఉన్నారు. అక్రమార్కులపై కొరడా ఝుళిపించేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నట్లు సమాచారం. ఎలా సాధ్యం? స్వర్ణభారత్నగర్, చౌడవరం, పాతగుంటూరు, శివారుప్రాంతాల్లోని పేదలు ఆలస్యంగా దరఖాస్తు చేసుకున్నారు. తొలి, మలివిడతల్లో చేసుకున్న దరఖాస్తులను మాత్రమే స్వీకరించిన అధికారులు వీరి దరఖాస్తులను స్వీకరించలేదు. దీంతో సంపూర్ణ బహిరంగ మలవిసర్జన రహిత నగరంగా గుంటూరు ఎలా సాధ్యపడుతుందో అధికారులే చెప్పాలనే ప్రశ్నలు వస్తున్నాయి. -
రెండు రోజుల్లో పూర్తి చేయండి
మరుగు దొడ్లు నిర్మాణంపై నగర కమిషనర్ నాగలక్ష్మి ఆదేశాలు నెహ్రూనగర్: స్వచ్ఛ భారత్ కింద నగరంలో నిర్మిస్తున్న వ్యక్తిగత మరుగు దొడ్లను రెండు రోజుల్లో పూర్తి చేయాలని నగర కమిషనర్ ఎస్. నాగలక్ష్మి అన్నారు. వ్యక్తిగత మరుగుదొడ్లు విషయమై ఇంజనీరింగ్, ఉపాసెల్ అధికారులతో సోమవారం కౌన్సిల్ హాలులో ఆమె సమావేశమయ్యారు. ముందుగా ఏఈల వారీగా, వార్డుల వారీగా నిర్మాణంలో ఉన్న మరుగుదొడ్ల వివరాలను, నిర్మాణాలు పూర్తయిన వాటి వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మాట్లాడుతూ మరుగు దొడ్లు రెండు రోజుల్లో పూర్తి చేయాలన్నారు. నిర్మాణ సమయంలో వివిధ దశలలో ఆన్లైన్లో జియో ట్యాగింగ్ చేయాలని చెప్పారు. అక్టోబర్ 2 నాటికి నగరంలో మరుగుదొడ్లు నిర్మాణాలు పెండింగ్ లేకుండా పనులను పూర్తి చేయాలన్నారు. కాంట్రాక్టర్లతో అధికారుల కుమ్మక్కు.. స్వచ్ఛ గుంటూరు కార్యక్రమం కింద నగరంలో చేపట్టిన వ్యక్తిగత మరుగుదొడ్లు విషయంలో అవకతవకలు జరిగాయి. వచ్చిన దరఖాస్తులను ఉపాసెల్ అధికారులు, సిబ్బంది క్షేత్ర స్థాయిలో పరిశీలించి అర్హులను గుర్తిస్తారు. నగరంలో 7,299 మంది మరుగుదొడ్లు కోసం దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో 6,321 మందికి మరుగుదొడ్లు కట్టించారు. మరుగుదొడ్లు నిర్మాణానికి మూడు విడతల్లో రూ.15 వేలు చెల్లిస్తారు. కానీ కాంట్రాక్టర్లు, ఇంజనీరింగ్ అధికారులు కుమ్మకై కమీషన్ల కోసం కక్కుర్తి పడ్డారు. మరుగుదొడ్లు నిర్మాణానికి స్థలం గుర్తించి ముందుగా రూ.5 వేలు అడ్వాన్సుల కింద లబ్ధిదారులకు చెల్లించారు. కానీ నగరంలో కొన్ని చోట్ల అనుకూలమైన స్థలం లేకపోవడం, ఇతర కారణాలతో అధికారులు మరుగుదొడ్లు కట్టిం^è లేకపోయారు. ఇలా నగరంలో దాదాపు రూ.10 లక్షల సొమ్మును కాంట్రాక్టర్లు, ఇంజనీరింగ్ అధికారులు తిరిగి కార్పొరేషన్‌కు చెల్లించకుండా సొంతానికి వాడుకుంటున్నట్లు తెలుస్తోంది. జీతాల్లోంచి కట్.. నగర కమిషనర్ వ్యక్తిగత సెలవుపై ఈనెల 9 నుంచి 24వ తేదీ వరకు వెళ్ళడంతో పనులు మందకొడిగా సాగాయి. ఈనెల 25న విధుల్లో చేరిన కమిషనర్ సమావేశం ఏర్పాటు చేయడంతో అక్రమాలు జరిగినట్లు గుర్తించారు. కొన్ని మరుగుదొడ్లు ఇంకా పెండింగ్‌లో ఉండటం, జియో ట్యాగింగ్ చేయకుండా ఉండటాన్ని గమనించిన కమిషనర్ ఇంజనీరింగ్ అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నగరపాలక సంస్థకు చెల్లించాల్సిన సొమ్మును మంగళవారం సాయంత్రంకల్లా చెల్లించని పక్షంలో జీతాల్లోంచి కట్ చేసుకోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. -
ఆరుబయటే పని కానిచ్చేస్తున్నారు