పసికందును వదిలేశారు | Women Leave Birth Child in Bathroom Chittoor | Sakshi
Sakshi News home page

పసికందును వదిలేశారు

Published Wed, Jun 5 2019 11:53 AM | Last Updated on Wed, Jun 5 2019 11:53 AM

Women Leave Birth Child in Bathroom Chittoor - Sakshi

బాత్‌రూంలో పడి ఉన్న మగశిశువు

గుడిపాల: ఓ తల్లి మగశిశువుకు జన్మనిచ్చి బాత్‌రూమ్‌లో వదిలేసి వెళ్లిపోయింది. ఆ శిశువు ఏడుపు విని స్థాని కులు ఆస్పత్రికి తరలించారు. గుడిపాల మండలానికి చెందిన ఆర్‌ఎంపీ డాక్టర్‌ సుబ్రమణ్యం వద్దకు ఓ మహిళ మంగళవారం ఉదయం వచ్చింది. అధికంగా బ్లీడింగ్‌ పోతుందని తెలియజేసింది. డాక్టర్‌ ఇంజక్షన్‌ వేశాడు. అప్పటికే రోగులు అధికంగా ఉండడంతో ఆ మహిళ గురించి ఎవ్వరూ పట్టించుకోలేదు. కొంతసేపటికే ఆస్పత్రి పక్కనే ఉన్న బాత్‌రూంలో శిశువు ఏడుపు వినిపించింది. గమనించగా మగశిశువు కనిపిం చింది. ఇంతలో ఆ మహిళ కనిపించకుండా వెళ్లిపోయింది. వెంటనే గుడిపాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి శిశువును తీసుకువెళ్లారు. ఐసీడీఎస్‌ అధికారులకు తెలియజేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement