birth child
-
పుట్టిన బిడ్డకు ఆటోమేటిక్‌గా ‘టెంపరరీ’ ఆధార్!
సాక్షి, న్యూఢిల్లీ: భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (యూఐడీఏఐ).. ఇక నుంచి జననం నుంచి మరణం దాకా మొత్తం జీవిత చక్ర సమాచారాన్ని ‘ఆధార్’తో నిక్షిప్తం చేయనుంది. ఇందులో భాగంగా.. రాబోయే రోజుల్లో బిడ్డ పుట్టిన వెంటనే వాళ్ల పేరిట ఆటోమేటిక్‌గా టెంపరరీ ఆధార్ జారీ చేయనున్నట్లు సమాచారం. పుట్టిన వెంటనే ఆధార్ నెంబర్ పొందే చిన్నారులు.. మేజర్లు అయిన తర్వాత వేలిముద్రలతో ఆ ఆధార్‌ను అప్ డేట్ చేసుకోవాలి. ప్రభుత్వం నుంచి విడుదలయ్యే నిధులు దుర్వినియోగం కాకుండా ఉండేందుకు.. త్వరలోనే రెండు పైలట్ కార్యక్రమాలను మొదలుపెట్టనుంది కేంద్రం. ఇందులో భాగంగానే.. యూఐడీఏఐ తరపున తాజాగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. 2010లో ఆధార్ మొదలైనప్పటి నుంచి దేశవ్యాప్తంగా పెద్దలు అందరికీ ఆధార్ జారీ అయింది. ఇక మీదట జన్మించిన దగ్గర్నుంచి, మరణించే వరకు వ్యక్తులకు సంబంధించి అన్ని ముఖ్యమైన వాటికి ఆధార్ ను తప్పనిసరి చేసే యోచనతో యూఐడీఏఐ ఉంది. కారణం? మరణ రికార్డులతోనూ ఆధార్ డేటాను అనుసంధానించడం వల్ల ప్రభుత్వ ప్రయోజనాలు పొందే విషయంలో దుర్వినియోగాన్ని అరికట్టాలన్నది ఉద్దేశ్యం. ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులను సంప్రదించి.. మరణించిన వారి వివరాలు వెంటనే ఆధార్ డేటా బేస్ లోకి చేరేలా యూఐడీఏఐ చర్యలు తీసుకోనుంది. ‘‘ఇటీవల మరణించిన వారి ఆధార్ యాక్టివ్ గా ఉండడంతో వారి పేరిట పెన్షన్.. ఇంకా ఆటోమేటిక్‌గా జమ అవుతోంది’’ అని సదరు అధికారి తెలిపారు. అలాగే, ఒకే వ్యక్తికి ఒక ఆధార్ మాత్రమే ఉండేలా యూఐడీఏఐ చర్యలు తీసుకుంటోంది. -
జనవరిలో పెళ్లి ప్రకటన, తాజాగా మగబిడ్డకు జన్మనిచ్చిన హీరోయిన్
సౌత్ కొరియాకు చెందిన స్టార్ హీరోయిన్ పార్క్ షిన్ హై తల్లయింది. పండంటి మగ బిడ్డకు ఆమె జన్మనిచ్చినట్లు కొరియన్ మీడియా వెల్లడించింది. సియోల్‌లోని ఓ ప్రైవేటు ఆసుప్రతిలో పార్క్ షీన్ మగబిడ్డకు జన్మనిచ్చినట్లు సాల్ట్ ఎంటర్టైన్మెంట్ ఎజెన్సీ ప్రకటించింది. ప్రియుడు, సహా నటుడు చోయి టే జూన్‌ను ఆమె పెళ్లి చేసుకున్న ఈ ఏడాది జనవరి అధికారికంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. పెళ్లిని, ప్రెగ్నెన్సీని ఒకేసారి ఈ జంట ప్రకటించింది. చదవండి: సింగర్ సిద్ధూ హత్య.. సల్మాన్‌కు లారెన్స్ వార్నింగ్.. అప్రమత్తమైన పోలీసులు తాజాగా ఈ జంటకు బిడ్డ పుట్టడంతో ఈ కొత్త దంపతులకు సౌత్ కొరియాకు చెందిన నటీనటుల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తున్నాయి. కాగా 2017 నుంచి పార్క్ షిన్ హై, చోయి టే జూన్‌లు డేటింగ్లో ఉన్నారు. ఈ క్రమంలో 2022 జనవరిలో వీరిద్దరు పెళ్లి బంధంతో ఒక్కటయ్యామని, ప్రస్తుతం షీన్ ప్రెగ్నెంట్ అని సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. కాగా షిన్ హై ‘‘స్టేర్వే టూ హేవెన్, మిరాకిల్ ఇన్ సెల్ నెం.7, యూ ఆర్ బ్యూటీఫుల్, ది హెయిర్స్’’ వంటి సిరీస్‌తో గుర్తింపు పొందింది. చదవండి: OTT: అమెజాన్‌లో కేజీయఫ్ 2 స్ట్రీమింగ్, ఇకపై ఉచితం View this post on Instagram A post shared by 박신혜/Shin Hye Park (@ssinz7) -
కొడుకుతో పెళ్లి.. బిడ్డకు జన్మనిచ్చిన సెలబ్రిటీ
మాస్కో: రష్యాకు చెందిన ఓ మహిళ భర్తకు విడాకులు ఇచ్చిన అనతరం మళ్లీ అతడి కొడుకునే పెళ్లి చేసుకున్న సంఘటన గతేడాది వెలుగు చూసిన సంగతి తెలిసిందే. ఇన్‌స్ట్రాగ్రామ్‌లో 4 లక్షల మంది ఫాలోవర్స్‌తో సోషల్ మీడియా సెలబ్రెటీగా మారిన మెరీనా బల్మషేవ(35) గతేడాది జులైలో తన సవతి కొడుకు వ్లాదిమిర్ వోయా (21)ను పెళ్లి చేసుకోవడంతో వార్తల్లో నిలిచారు. ఈ క్రమంలో ఇటీవల గర్భవతి అయిన మెరీనా సోమవారం పండంటి బిడ్డకు జన్మినిచ్చినట్లు సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. దీంతో ఆమె మరోసారి వార్తల్లో నిలిచింది. (చదవండి: కొడుకును పెళ్లాడిన సోషల్ మీడియా స్టార్) "Marina Balmasheva, 35, from Russia, lived with her [now] ex-husband Alexey, 45, for over 10 years before the relationship ended in divorce." "Now the new man in her life is her ex-husband’s 20-year-old son Vladimir."https://t.co/aq5JOOWHFZ — Ross Bowler (@BowlerBarrister) May 11, 2020 కాగా మెరీనా ప్రస్తుత భర్త వ్లాదిమిర్ వోయా తండ్రి అలెక్స్ అరేను పెళ్లి చేసుకుని అతనితో పదేళ్లు కలిసి ఉంది. అంతేగాక వీరు ఐదుగురు పిల్లలను కూడా దత్తత తీసుకుని పెంచుకున్నారు. ఈ క్రమంలో వారి మధ్య మనస్పర్థలు తలెత్తడంతో విడాకులు తీసుకున్నారు. ఇక వారు విడిపోయాక అయిదుగురి దత్తత పిల్లల బాధ్యతను తండ్రైన అలెక్స్కే కోర్టు అప్పగించింది. అనంతరం మెరీనా అలెక్స్ 21 ఏళ్ల కొడుకు వ్లాదిమిర్ వోయాతో ప్రేమలో పడింది. ఇక వ్లాదిమియా కూడా తన సవతి తల్లిపై మనసు పారేసుకోవడంతో వీరిద్దరూ గతేడాది జూలైలో పెళ్లి చేసుకున్నారు. అప్పట్లో ఈ సంఘటన సోషల్ మీడియాలో సంచలనం సృష్టిచింది. View this post on Instagram A post shared by Марина Балмашева (@marina_balmasheva) -
జిల్లాలో విచ్చలవిడిగా లింగ నిర్ధారణ
జిల్లాలో భ్రూణహత్యలు కొనసాగుతున్నాయి. 20 వారాలు దాటిన తర్వాత గర్భస్రావం చేయకూడదని నిబంధనలు ఉన్నా పలు ప్రైవేటు ఆసుపత్రులు పట్టించుకోవడం లేదు. ఈ విషయం అధికారుల దృష్టికి వెళ్లినా పెద్దగా çస్పందించడం లేదు. కర్నూలులోని కొత్త బస్టాండ్, ఎన్ఆర్ పేట, ప్రభుత్వ ఆసుపత్రి ఎదురుగా ఉండే పలు ఆసుపత్రులలో యథేచ్ఛగా భ్రూణహత్యలు జరుగుతున్నాయి. ఈ ప్రాంతంలో ప్రతి నెలా 60కి పైగానే చేస్తున్నారు. ఆదోని, ఎమ్మిగనూరు, కోడుమూరు, గూడూరు, డోన్, నంద్యాల, నందికొట్కూరు ప్రాంతాల్లోనూ ఇదే పరిస్థితి. కర్నూలు(హాస్పిటల్):జిల్లాలో 260కి పైగా స్కానింగ్ కేంద్రాలకు అనుమతులు ఉన్నాయి. అయితే అనధికారికంగా మరో 400కు పైగానే నిర్వహిస్తున్నారు. పీసీపీఎన్డీటీ యాక్ట్ ప్రకారం లింగనిర్ధారణ నేరం. దీనికి భారీ జరిమానాతో పాటు జైలు శిక్ష కూడా ఉంటుంది. కర్నూలుతో పాటు కోడుమూరు, గూడూరు, ఎమ్మిగనూరు, ఆదోని, డోన్, నందికొట్కూరు, ఆత్మకూరు వంటి ప్రాంతాల్లోని స్కానింగ్ కేంద్రాల్లో పలువురు వైద్యులు యథేచ్ఛగా లింగనిర్ధారణ చేస్తున్నారు. గర్భంలో ఉన్నది ఆడపిల్ల అని తేలితే చాలు అధిక శాతం అబార్షన్‌కు సిద్ధమవుతున్నారు. ఇరువర్గాల సమ్మతి మేరకు జరుగుతున్న ఈ తంతులో అటు గర్భిణి కుటుంబసభ్యులు, ఇటు వైద్యవర్గాలు విషయం బయటకు రాకుండా జాగ్రత్త పడుతున్నాయి. లింగనిర్ధారణ, భ్రూణహత్యలో ఇద్దరికీ శిక్ష పడుతుందని భావించి గుట్టుగా ఉంచుతున్నారు. 930కి తగ్గిన బాలికల సంఖ్య జిల్లాలో స్త్రీ, పురుషుల మధ్య వ్యత్యాసం రోజురోజుకూ పెరుగుతోంది. 2011 లెక్కల ప్రకారం ప్రతి వెయ్యి మంది పురుషులకు గాను జిల్లాలో సగటున 930 మందిమాత్రమే మహిళలు ఉన్నారు. డోన్‌లో 889, ప్యాపిలి 894, గడివేముల 899, శ్రీశైలం 892, ఆదోని డివిజన్లో 900 మాత్రమే స్త్రీలు ఉన్నట్లు అధికారులు లెక్కలు తేల్చారు. ప్రస్తుతం ఈ సంఖ్య మరింత తగ్గినట్లు తెలుస్తోంది. 920లోపు స్త్రీలు ఉన్నట్లు సమాచారం. ఈ విషయాన్ని కేంద్ర ఆరోగ్యశాఖ సైతం సీరియస్‌గా పరిగణించినట్లు సమాచారం. జిల్లాలో బాలికల సంఖ్య ఎందుకు తగ్గుతుందో తెలుసుకునేందుకు త్వరలో ఓ బృందం జిల్లాకు రానున్నట్లు తెలిసింది. అధికారులంటే భయం లేదు లింగనిర్ధారణ, భ్రూణహత్యలను నివారించేందుకు ఉద్దేశించిన పీసీ పీఎన్డీటీ చట్టం అభాసుపాలవుతోంది. ఈ చట్టం ఉన్నట్లు ఆయా స్కానింగ్ కేంద్రాల్లో పోస్టర్లు అతికించి, లోపల మాత్రం యథేచ్ఛగా లింగనిర్ధారణ పరీక్షలు చేస్తున్నా పట్టించుకోవడం లేదు. ఈ చట్టాన్ని ఉల్లంఘిస్తే భారీ జరిమానాతో పాటు జైలుశిక్ష కూడా ఉంటుంది. కానీ జిల్లాలో ఏ ఒక్కరికీ ఇప్పటి వరకు ఈ శిక్షలు అమలు కాలేదు. స్కానింగ్ కేంద్రాలను తనిఖీ చేస్తున్నాం జిల్లాలోని స్కానింగ్ కేంద్రాలను అధికారులు తరచూ తనిఖీ చేస్తున్నారు. పీసీపీఎన్డీటీ యాక్ట్ ప్రకారం స్కానింగ్ కేంద్రాలు నిర్వహిస్తున్నారా, లేదా అని పరిశీలిస్తున్నాం. నిబంధనల మేరకు లేని కేంద్రాలకు నోటీసులు ఇస్తున్నాం. –డాక్టర్ కె.వెంకటరమణ, ఇన్చార్జ్ డీఎంహెచ్‌వో -
పాపం..పసి పాప
బంజారాహిల్స్: బంజారాహిల్స్‌లో దారుణం చోటు చేసుకుంది. వారం రోజులు నిండని ఒక మగ శిశువును కుక్కలు పీక్కు తింటుండగా స్థానికులు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని ఉస్మానియా మార్చురీకి తరలించారు. ఎస్ఐ బచ్చు శ్రీనివాస్ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. అలీ అస్గర్ అనే వ్యక్తి ఆదివారం తెల్లవారుజమున బంజారాహిల్స్ రోడ్ నెం. 13లోని హిందూ శ్మశాన వాటిక ముందు నుంచి ఇంటికి వెళ్తున్నాడు. అదే సమయంలో కొన్ని కుక్కలు అరుస్తుడటంతో వాటిని తరిమేయగా ఓ శిశువు కాళ్ళు, చేతులు రోడ్డుపై చెల్లా చెదురుగా పడి ఉండగా మెడంతా కోసుకుపోయింది. కుక్కలు శిశువును పీక్కు తింటున్నట్లుగా గుర్తించిన అతను బంజారాహిల్స్ పోలీసులకు సమాచారం ఇచ్చాడు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని శిశువు శరీర భాగాలను ఒక్క చోటకు చేర్చి ఉస్మానియా మార్చురీకి తరలించారు. శిశువు వారం రోజుల క్రితం జన్మించి ఉండవచ్చునని శ్మశాన వాటిక పక్కన పడేసి వెళ్ళి ఉంటారని భావిస్తున్నారు. సీసీ పుటేజీలను పరిశీలించి ఈ దారుణానికి ఒడిగట్టినవారిని గుర్తిస్తామన్నారు. -
పసికందును వదిలేశారు
గుడిపాల: ఓ తల్లి మగశిశువుకు జన్మనిచ్చి బాత్రూమ్లో వదిలేసి వెళ్లిపోయింది. ఆ శిశువు ఏడుపు విని స్థాని కులు ఆస్పత్రికి తరలించారు. గుడిపాల మండలానికి చెందిన ఆర్ఎంపీ డాక్టర్ సుబ్రమణ్యం వద్దకు ఓ మహిళ మంగళవారం ఉదయం వచ్చింది. అధికంగా బ్లీడింగ్ పోతుందని తెలియజేసింది. డాక్టర్ ఇంజక్షన్ వేశాడు. అప్పటికే రోగులు అధికంగా ఉండడంతో ఆ మహిళ గురించి ఎవ్వరూ పట్టించుకోలేదు. కొంతసేపటికే ఆస్పత్రి పక్కనే ఉన్న బాత్రూంలో శిశువు ఏడుపు వినిపించింది. గమనించగా మగశిశువు కనిపిం చింది. ఇంతలో ఆ మహిళ కనిపించకుండా వెళ్లిపోయింది. వెంటనే గుడిపాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి శిశువును తీసుకువెళ్లారు. ఐసీడీఎస్ అధికారులకు తెలియజేశారు. -
శిశువులను విక్రయించిన మాట నిజమే
సేలం: శిశువులను అక్రమంగా విక్రయించిన వ్యవహారానికి సంబంధించి మాజీ నర్సుతో పాటు ముగ్గురిని పోలీసులు శుక్రవారం అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు. నామక్కల్ జిల్లా రాశిపురం సమీపంలోని కాట్టుకొట్టాయ్ ప్రాంతానికి చెందిన దంపతులు రవిచంద్రన్, అముదవల్లి. రవిచంద్రన్ రాశిపురంలో ఉన్న కోఆపరేటివ్ బ్యాంకులో ఆఫీస్ అసిస్టెంట్‌గా పని చేస్తున్నాడు. అముదవల్లి ప్రభుత్వ ఆస్పత్రిలో అసిస్టెంట్ నర్సుగా ఉద్యోగం చేసి గత 2012లో వీఆర్ఎస్ తీసుకుని ఇంటిలో ఉంటోంది. ఈ స్థితిలో శిశువులను అముదవల్లి అక్రమంగా విక్రయిస్తున్నట్టు వీడియో బుధవారం రాత్రి వైరల్ అయ్యింది. ఈ వీడియో ఆధారంగా నామక్కల్ జిల్లా ఆరోగ్య శాఖ జాయింట్ డైరెక్టర్ రమేష్ కుమార్ గురువారం అముదవల్లిపై రాశిపురం పోలీసు స్టేషన్లో ఒక ఫిర్యాదు చేశారు. నాలుగు బృందాలుగా పోలీసులు.. దీనిపై స్పందించిన పోలీసులు నాలుగు బృందాలుగా ఏర్పడి విచారణ చేపట్టారు. అప్పుడు అముదవల్లి, రవిచంద్రన్‌లను అదుపులోకి తీసుకుని విచారించగా శిశువులను విక్రయించిన మాట నిజమే అని అంగీకరించారు. అయితే, ముగ్గురు పిల్లలను మాత్రమే తాము కొనుగోలు చేసి విక్రయించినట్లు తెలిపారు. వారిలో ఒక బిడ్డను సేలం అన్నదానపట్టిలో కొనుగోలు చేసి, ఓమలూరు మున్సిపాలిటీలో బర్త్ సర్టిఫికేట్ పొంది, మేట్టూరుకు చెందిన రవి అనే వ్యక్తికి, మరో ఇద్దరు పిల్లల్లో కొల్లిమలైలోని ప్రభుత్వ ఆస్పత్రి అంబులెన్స్ డ్రైవర్ మురుగేశన్ ద్వారా ఈ రోడ్‌కు చెందిన పర్వీన్ అనే మహిళకు విక్రయించినట్టు తెలిపారు. ఈ క్రమంలో పోలీసులు పర్వీన్‌ను విచారించగా తాను నలుగురు పిల్లలను విక్రయించినట్టు చెప్పింది. దీంతో పోలీసులు శుక్రవారం అముదవల్లి, రవిచంద్రన్, మురుగేశన్‌లను అరెస్టు చేసి, రాశిపురం నేరవిభాగ కోర్టులో న్యాయమూర్తి మాలతి ముందు హాజరుపరిచారు. -
టీకాణా లేదా..!
పశ్చిమగోదావరి, ఏలూరు టౌన్: ముక్కుపచ్చలారని శిశువులకు ప్రాణాంతక వ్యాధుల నుంచి రక్షణ కరువైంది. వ్యాక్సిన్ల కొరత నవజాత శిశువుల పాలిట శాపంలా మారుతోంది. చిన్నారుల బంగారు భవిష్యత్తుకు బాటలు వేయాల్సిన రాష్ట్ర సర్కారు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. ప్రభుత్వ నిర్లిప్తత చిన్నారులను వ్యాధుల బారిన పడేసేలా ఉంది. ఇక పేద, మధ్యతరగతి వర్గాల తల్లిదండ్రులకు ఆర్థిక భారంగా పరిణమిస్తోంది. సర్కారు దవాఖానాల్లో వ్యాక్సిన్లు అందుబాటులో లేకపోవటంతో ప్రైవేటు ఆస్పత్రులు, లేదా మెడికల్‌షాపుల్లో అధిక ధరలకు వ్యాక్సిన్లు కొని బిడ్డలకు వేయించుకోవాల్సిన దుస్థితి నెలకొంది. పుట్టిన 24గంటల్లోనే శిశువులకు అత్యంత ప్రమాదకరమైన హెపటైటిస్–బీ వ్యాక్సిన్ వేయించాల్సి ఉండగా.. ఈ వ్యాక్సిన్ ఆస్పత్రుల్లో లభించడం లేదు. మిగతా వ్యాక్సిన్ల కొరత కూడా తీవ్రంగా ఉంది. ఎప్పుడు అడిగినా వ్యాక్సిన్లు లేవనే సమాధానమే వస్తోంది. దీంతో ప్రభుత్వ వైఫల్యంపై సర్వత్రా నిరసన వ్యక్తమవుతోంది. ప్రభుత్వాస్పత్రుల్లోనే 9 వేల ప్రసవాలు జిల్లా ఆస్పత్రి, ప్రాంతీయ ఆస్పత్రి, సామాజిక ఆరోగ్యకేంద్రాల్లోనే అధికంగా ప్రసవాలు జరుగుతాయి. జిల్లావ్యాప్తంగా ప్రతి నెలా సుమారు 15వేల మంది పిల్లలు జన్మిస్తుంటే, ఒక్క ప్రభుత్వాస్పత్రుల్లోనే 9 వేల ప్రసవాలు జరుగుతున్నట్లు వైద్య శాఖ అధికారుల అంచనా. ఏలూరు ప్రభుత్వాస్పత్రిలోనే నెలలో సుమారు 2 వేల ప్రసవాలుజరుగుతున్నాయి. ఒక వేళ ప్రైవేటు అసుపత్రుల్లో ఆపరేషన్లు, ప్రసవాలు చేయించుకున్నా తమ బిడ్డలకు మాత్రం వ్యాక్సిన్లను ప్రభుత్వాస్పత్రుల్లోనే తల్లిదండ్రులు వేయిస్తారు. ప్రైవేటు ఆస్పత్రుల్లో వేయించాలంటే భారీ ఖర్చుతో కూడుకున్న పని. అందుకే చాలామంది వ్యాక్సిన్లకు ప్రభుత్వాస్పత్రులనే ఆశ్రయిస్తారు. సుమారు 75 శాతానికి పైగా తల్లులు తమ బిడ్డలకు ప్రభుత్వాస్పత్రుల్లోనే వ్యాక్సిన్లు వేయిస్తారు. ప్రభుత్వాస్పత్రుల్లో ఉచితంగా వ్యాక్సిన్లు వేస్తుండడమే దీనికి కారణం. బయట వ్యాక్సిన్లు కొనాలంటే రూ.150 నుంచి రూ.350 వరకూ, ఇక డిమాండ్‌ను బట్టి రూ.500 వరకూ వెచ్చించాల్సిన పరిస్థితి. వ్యాక్సిన్లు చంటిబిడ్డలకు శ్రీరామరక్ష భయంకరమైన ప్రాణాంతక వ్యాధుల నుంచి చంటి బిడ్డలను కాపాడుకునేందుకు వ్యాక్సిన్లు వేయించాల్సి ఉంటుంది. ఒకరకంగా చెప్పాలంటే శిశువులకు సకాలంలో వ్యాక్సిన్లు వేయించటం శ్రీరామరక్ష వంటిదనే చెప్పాల్సి ఉంటుంది. వ్యాక్సిన్లు వేయించటం ఎంత ముఖ్యమో సకాలంలో వ్యాక్సిన్ ఇవ్వటం అత్యంత ప్రాధాన్యమైంది. సకాలంలో బిడ్డలకు వ్యాక్సిన్ వేయించకుంటే నిమోనియా, ధనుర్వాతం, కోరింతదగ్గు, హెపటైటిస్–బీ (కాలేయ జబ్బులు) వస్తాయి. ఈ జబ్బులు రాకుండానే నివారించేందుకు ప్రయత్నించాలి తప్ప సోకిన అనంతరం చికిత్స చాలా కష్టమైన అంశం. క్రమం తప్పకుండా నిర్దేశించిన సమయానికి ఏ వ్యాక్సిన్ వేయించాలో ఆ టీకా తప్పకుండా వేయించటం చిన్నారుల భవిష్యత్తుకు భరోసానే. 24 గంటల్లోనే వ్యాక్సిన్ వేయాలి పుట్టిన బిడ్డకు 24గంటల్లోనే కామెర్ల వ్యాధి రాకుండా హెపటైటిస్–బీ వ్యాక్సిన్ ఇవ్వాల్సి ఉంటంది. కానీ ఈ వ్యాక్సిన్ ప్రస్తుతం ప్రధాన ఆస్పత్రుల్లోనూ అందుబాటులో లేదు. ప్రైవేటు అస్పత్రులకు వెళితే భారీగా సొమ్ములు గుంజేస్తున్నారు. సామాన్య, మధ్యతరగతి వర్గాల ప్రజలకు ఇలా ప్రైవేటు ఆస్పత్రుల్లో వ్యాక్సిన్లు తమ పిల్లలకు వేయించటం తలకుమించిన భారంలా పరిణమి స్తోంది. భావితరాల ఆరోగ్యానికి ప్రభుత్వం ఏ మేరకు శ్రద్ధ చూపిస్తోందో వ్యాక్సిన్ల కొరతను చూస్తే అర్థమవుతోంది. ఇక మీజిల్స్ రూబెల్లా (తట్టు రాకుండా) వ్యాక్సిన్ సైతం అందుబాటులో లేదు. ఇనాక్టివ్ పోలియో వ్యాక్సిన్ ప్రభుత్వాస్పత్రిలో దొరకనే దొరకదు. కోరింత దగ్గుకు ఇచ్చే డీపీటీ వ్యాక్సిన్‌కు తీవ్ర కొరత ఏర్పడింది. పైనుంచే సరఫరా లేదని సమాచారం. ముందుగానే వ్యాక్సిన్లు తెప్పించుకోవాల్సి ఉన్నా ప్రభుత్వం నిర్లక్ష్యం ప్రదర్శిస్తోంది. ప్రభుత్వాస్పత్రిలో వ్యాక్సిన్లు లేవట నా భార్య విజయలక్ష్మి బాబుకు జన్మనిచ్చింది. వైద్యులు వెంటనే హెపటైటిస్–బీ వ్యాక్సిన్ వేయించాలని చెప్పారు. ప్రభుత్వాస్పత్రిలో వ్యాక్సిన్ అందుబాటులో లేదన్నారు. బయట మందుల షాపులో తీసుకుని వేయించాల్సి వచ్చింది. పిల్లలకు సకాలంలో వ్యాక్సిన్ వేయకపోతే మీ బిడ్డకే ప్రమాదమని వైద్యులు చెబితే చాలా కంగారు పడ్డాను. ప్రభుత్వాస్పత్రుల్లో ఉచితంగా వేయాల్సిన వ్యాక్సిన్ దొరకకపోతే ఎలా. – వెంకటేశ్వరరావు, ఏలూరు -
అమ్మా.. బరువయ్యానా?
అమ్మా.. తొమ్మిది నెలలు నన్ను మోశావు.. నీ కడుపులో చిన్న దెబ్బ తగులకుండా కాపాడావు.. అటూ ఇటూ తిరుగుతుంటే.. నా కాళ్లతో తన్నుతూ ఉంటే భరించావు.. చివరకి నిన్ను చూడాలని ఎంతో సంతోషంగా నేను బయటకు వస్తే నన్ను ఇలా చెత్తకుప్పలో పడేశామేమిటమ్మా.. నీ కడుపులో నుంచి బయటకు రావడమే నేను చేసిన తప్పా.. ఇన్నాళ్లూ బరువుగా లేని నేను ఇప్పుడు బరువయ్యానా.. రా అమ్మా.. చీమలు కుడుతున్నా యి.. కుక్కలు, పందులు వాసన చూస్తున్నాయి.. భయమేస్తోం దమ్మా.. నీ పొత్తిళ్లలో పెట్టుకుని ధైర్యమివ్వమ్మా! ఇదీ నూజివీడులోని ఢంఢం గార్డెన్ ప్రాంతంలో చెత్తాచెదారం మధ్య దొరికిన శిశువు ఆక్రందనకు అక్షరరాగం. కృష్ణాజిల్లా, నూజివీడు: ఎవరో తెలియనివారి పిల్లలకు.. మన కళ్ల ముందు కాస్త దెబ్బ తగిలితేనే అయ్యో అంటూ జాలి చూపుతాం.. ఇక్కడ నవ మాసాలూ మోసి, పేగు తెంచుకు పుట్టిన బిడ్డను ఓ కర్కశ తల్లి చెత్తకుప్పల పాలు చేసింది. పట్టణంలోని ఢంఢం గార్డెన్‌లోని చెత్తాచెదారం మధ్యలో పడేసిన మగ శిశువును గుర్తు తెలియని వ్యక్తులు వదిలివెళ్లిన సంఘటన మంగళవారం వెలుగు చూసింది. ఉదయం 7.30 గంటల సమయంలో ఢంఢం గార్డెన్‌కు చెందిన రేచల్ సుమేధ అనే మహిళ శిశును గమనించి వెంటనే స్థానిక ఏరియా ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఆస్పత్రి సూపరింటెండెంట్ శిశువును బరువు తూచగా 1.8 కేజీలు బరువు ఉందని.. ఆరోగ్య పరిస్థితి అంతా బాగానే ఉన్నప్పటికీ చీమలు కుట్టడం వల్ల శరీరం అక్కడక్కడ ఎర్రగా కంది ఉందని తెలిపారు. మెరుగైనా చికిత్స నిమిత్తం విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రికి రిఫర్ చేశారు. ఈ విషయం తెలుసుకున్న ఐసీడీఎస్ సీడీపీవో జి. మంగమ్మ, సూపర్వైజర్ కాగిత కుమారిలు హుటాహుటిన ఆస్పత్రికి చేరుకుని శిశువును విజయవాడ ఆస్పత్రికి తరలించారు. పట్టణ పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేశారు. -
నారపల్లి పీహెచ్సీలో శిశువు అపహరణ
బోడుప్పల్: నారపల్లి ప్రాధమిక ఆరోగ్య కేంద్రంలో అప్పుడే పుట్టిన మగ శిశువు అపహరణకు గురైన సంఘటన మంగళవారం మేడిపల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఫిర్యాదు అందిన మూడున్నర గంటల్లో శిశువును పోలీసులు గుర్తించి తల్లిదండ్రులకు అప్పగించారు. అపహరణకు పాల్పడిన వారిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఇన్స్పెక్టర్ అంజిరెడ్డి, శిశువు తల్లిదండ్రులు తెలిపిన వివరాల ప్రకారం.. మేడిపల్లి మండలం చెంగిచర్ల గ్రామంలో నివసించే బంగారు నరేష్, అరుణ భార్యాభర్తలు. వీరికి ఇప్పటికే ముగ్గురు మగ పిల్లలున్నారు. నరేష్ మెకానిక్‌గా, అరుణ లేబర్‌గా పనిచేస్తున్నారు. నిండు గర్భిణి అయిన అరుణ వారం రోజుల క్రితం ఉప్పల్ ప్రాధమిక ఆరోగ్య కేంద్రంలో చేరింది. డెలివరీ సమయం దగ్గర పడుతుండడంతో మెరుగైన వైద్యం కోసం ఘట్కేసర్ మండలం నారపల్లిలోని ప్రాధమిక ఆరోగ్య కేంద్రంలో సోమవారం చేర్పించగా అదేరోజు అర్ధరాత్రి మగబిడ్డకు జన్మనిచ్చింది. వెంటనే కేసీఆర్ కిట్స్ కూడా తీసుకున్నారు. అనంతరం అరుణ నిద్రలోకి జారుకోగా తెల్లవారుజాము 4 గంటల ప్రాంతంలో శిశువు కనిపించకుండా పోయింది. దీంతో కంగారు పడ్డ శిశువు తల్లిదండ్రులు మేడిపల్లి పోలీస్ స్టేషన్లో మంగళవారం మధ్యాహ్నం ఫిర్యాదు చేశారు. రంగ ప్రవేశం చేసిన పోలీసులు మగశిశువు అపహరణకు గురైందన్న ఫిర్యాదు మేరకు పోలీసులు గాలింపు చర్యలు ప్రారంభించారు. మేడిపల్లిలోని భగత్‌సింగ్ కాలనీలో ఓ ఇంట్లో ఉందని తెలుసుకుని అక్కడకు వెళ్లారు. అక్కడ ఓ మహిళ వద్ద ఓ మగ శిశువు ఉండడంతో వారి తల్లిదండ్రులను పిలిపించారు. వారు తమ బిడ్డేనని చెప్పడంతో వారికి అప్పగించారు. అనుమానితుల విచారణ శిశువు అపహరణకు కారకులు నరేష్ పక్కంటి వారని తెలుసుకున్న పోలీసులు ఆ కుటుంబానికి చెందిన ముగ్గురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అలాగే నారాపల్లి ప్రాధమిక ఆరోగ్య కేంద్రంలో పనిచేసే ఓ నర్సు ప్రమేయం ఉందని ప్రాధమిక విచారణలో తేలడంతో ఆమెనూ అదుపులోకి తీసుకున్నారు. అయితే, పోలీసులు అధికారికంగా ధ్రువీకరించడం లేదు. అర్ధరాత్రి డిశార్చి అయినట్లురికార్డుల్లో నమోదు ఆస్పత్రిలో అరుణ రాత్రి 12 గంటలకు ప్రసవం కాగా, మగ శిశువు అపహరణకు గురి కావడంతో వెంటనే హాస్పిటల్లో పనిచేసే సిబ్బంది శిశువు తల్లిదండ్రులకు కేసీఆర్ కిట్స్ ఇచ్చినట్లు ఫొటోలు తీసుకున్నారు. అనంతరం హాస్పిటల్ నుంచి డిశ్చార్జి అయినట్లు వారితో సంతకాలు తీసుకున్నట్లు తెలిసింది. కిడ్నాప్ వ్యవహారం బయట పడడంతో ఆస్పత్రి సిబ్బంది ఇలా చేసినట్లు తెలుస్తోంది. కేసు నమోదు చేసుకున్న మేడిపల్లి పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు ప్రారంభించారు. -
ఊరవతల వదిలేసి వదిలించుకుంది..
సాక్షి ప్రతినిధి, చెన్నై: ‘చెట్టుకు కాయ భారమా..కని పెంచే తల్లికి బిడ్డ భారమా’ పాత తెలుగు చిత్రంలోని ఈ పాటలోని అర్థానికి విరుద్ధంగా వ్యవహరించింది ఓ తల్లి. అంతగా మతిస్థిమితం లేని 38 ఏళ్ల కుమార్తె ఆమెకు భారమైంది. దీంతో వేరే ఊరిలో వదిలిపెట్టి వదిలించుకుంది. వివరాలు..తూత్తుకూడి జిల్లా పుదుకోట్టై సమీపం పొట్టలూరని విలక్కల్ గ్రామం లో ఓ మహిళ తీవ్రగాయాలతో స్పృహతప్పి పడి ఉండగా ఈనెల 17న పోలీసులు కనుగొని ఆస్పత్రిలో చేర్పించారు. నాలుగురోజుల చికిత్స అనంతరం ఆమెకు స్పృహరాగా తిరునెల్వేలి జిల్లా తెన్‌కాశీ కుత్తుకల్‌వలసైకి చెందిన ఇందిర (38) అని తెలిసింది. దీంతో పోలీసులు కుత్తుకల్‌వలసైకి వెళ్లి విచారించగా ఆశ్చర్యకరమైన నిజాలు వెలుగుచూశాయి. బాధితురాలు ఇందిరకు ఆమె మేనమామతో 12 ఏళ్ల క్రితం వివాహమైంది. ఎంతకూ సంతానం కలగకపోవడంతో ఇందిర మానసిక రోగిగా మారింది. ఈ కారణంగా దంపతుల మధ్య మనస్పర్థలు నెలకొనగా భర్త వదిలేసి వెళ్లడంతో ఆమె పుట్టింటికి చేరి తల్లి లీలతో ఉండేది. కుమార్తెను ఎందరో వైద్యుల వద్దకు తీసుకెళ్లినా ఆమె మానసిక స్థితి కుదుటపడలేదు. పైగా రోజురోజుకూ ఇందిర పరిస్థితి ఇబ్బందికరంగా మారడంతో మరో ప్రయత్నంగా తెన్కాశిలోని ప్రభు త్వ ఆస్పత్రిలో చేర్పించింది. ఆస్పత్రి పక్కపై నుంచి కిందపడడంతో గాయాలయ్యాయి. ఆస్పత్రిలో ఇక వైద్యం చేయించలేని స్థితిలో కుమార్తె ఇందిరను తల్లి లీల మరలా తన ఇంటికి తీసుకెళ్లింది. శాశ్వతంగా వదిలించుకోవాలని నిశ్చయించుకుని స్పృహలోలేని స్థితిలో ఉన్న ఇందిరను ఈనెల 18న అద్దెకారులో ఎక్కించుకుని తూత్తుకూడి సమీపంలోని పొట్టలూరని విలక్కల్‌లో విడిచిపెట్టింది. ఈనెల 23న స్పృహరాగా తల్లే తనని విడిచిపెట్టి వెళ్లిన విషయాన్ని బాధితురాలు పోలీసులకు వివరించింది. -
శిశు సంక్షేమ శాఖ అధికారులకు పసికందు అప్పగింత
తూర్పుగోదావరి, తాడితోట(రాజమహేంద్రవరం): మూడు రోజుల పసికందును శిశు సంక్షేమ శాఖ అధికారులకు అప్పగించిన సంఘటన ఇది. కూనవరం మండలం, కూటూరు పంచాయతీ పరిధిలోని పులుసుమామిడిగొంది గ్రామానికి చెందిన 20 ఏళ్ల కొండ్ల లక్ష్మిని ఒక వ్యక్తి పెళ్లి చేసుకుంటానని చెప్పి గర్భవతిని చేశాడు. ఈనెల 17న కూనవరం పొలాల్లో ఉన్న పాకలో గర్భిణిగా ఉన్న లక్ష్మి తనకు తానుగా పురుడు పోసుకొని బిడ్డను పాకలో వదిలి వెళ్లిపోయింది. సమీపంలో పొలంలో పనులు చేసుకుంటున్న కూలీలు గుర్తించి ఆ శిశువును కూటూరు ఆసుపత్రికి తరలించి వైద్యులకు అప్పగించారు. వైద్యులు ఆ పాపకు చికిత్స అందించారు. స్థానికులు పూరిపాక సమీపంలో మరో పాకలో శిశువుకు జన్మనిచ్చిన తల్లి లక్ష్మిని గుర్తించారు. తల్లి బిడ్డలను ఇప్పటి వరకూ అంగన్ వాడీ సంరక్షణలో ఉంచారు. తల్లి బిడ్డను పోషించుకునే స్థితిలో లేకపోవడంతో గురువారం బాలల సంక్షేమ సమితి, జిల్లా చైల్డ్ లైన్ 1098 ఆధ్వర్యంలో స్త్రీ , శిశు సంక్షేమ శాఖకు అప్పగించారు. తల్లి లక్ష్మిని రాజమహేంద్రవరం రూరల్, బొమ్మూరు లో ఉన్న స్వధార హోమ్‌లో చేర్చారు. కార్యక్రమంలో సీడబ్ల్యూఎస్సీ చైర్పర్సన్ బి. పద్మావతి, కె.ఎల్.తాయారు, టి.పద్మజ, టి.ఆదిలక్ష్మి, చైల్డ్ లైన్ జిల్లా కోఆర్డినేటర్ బి. శ్రీనివాసరావు, డీసీపీయూ కె.శ్రీనివాస్, ఐసీడీఎస్ సూపర్వైజర్ పద్మశ్రీ, పోలీస్ కానిస్టేబుల్ సుష్మలత, ఏఎన్ఎం పి.లలిత పాల్గొన్నారు. -
పుట్టుకలోనే రికార్డు
సాక్షి ప్రతినిధి, చెన్నై: పుత్రోదయం ఏ దంపతులకైనా ఆనందమే. అదే బిడ్డ పుట్టుకతోనే రికార్డు సృష్టిస్తే ఇంకేముంది అమితానందం. చెన్నైలోని ఓ దంపతుల విషయంలో అదే జరిగింది. తమ కుమారుడు తమిళనాడుకే రికార్డని చెప్పుకుని మురిసిపోతున్నారు. ఇంతకూ అసలు విషయం ఏమిటంటే.ఇటీవల తమిళనాడులోని అనేకశాతం గర్భిణులు సంప్రదాయ ఆహారానికి గుడ్‌బై చెప్పడంతో కాన్పు సమయంలో సిజేరియన్ శస్త్రచికిత్స తప్పనిసరిగా మారిపోయింది. అయితే పూర్వీకుల కాలం నుంచి వస్తున్న సంప్రదాయ ఆహారాన్ని గర్భిణులు భుజిస్తే పండంటి బిడ్డను సాధారణ కాన్పు ద్వారానే పొందవచ్చని ఇటీవల నిరూపితమైంది. చెన్నై సైదాపేటకు చెందిన ఇందిరోస్ కుమార్ గుప్త (35), జయశ్రీ (35) దంపతులకు ఇప్పటికే పదేళ్లబాబు ఉన్నాడు. కాగా రెండోసారి గర్భవతైన జయశ్రీ ప్రసవం కోసం చెన్నై ట్రిప్లికేన్‌లోని కస్తూరిభా గాంధీ ప్రభుత్వ ఆస్పత్రిలో చేరింది. వారం రోజుల క్రితం ఆమెకు సాధారణ కాన్పు జరగ్గా 5.2 కిలోల బరువున్న మగబిడ్డ పుట్టాడు. ఈ సందర్భంగా ఆసుపత్రి డైరక్టరర్ డాక్టర్ విజయ గురువారం మీడియాతో మాట్లాడుతూ, జయశ్రీకి తొలి కాన్పుగా పదేళ్ల క్రితం సాధారణ కాన్పుద్వారా 3.9 కిలోల బరువుతో మగబిడ్డ పుట్టాడు. రెండో కాన్పులో 4.5 కిలోల బరువున్న బిడ్డ పుడతాడని అంచనావేయగా 5.2 కిలోల బరువున్న ఆరోగ్యకరమైన బిడ్డ జన్మించాడు. పైగా రెండోది కూడా సాధారణ కాన్పు. ప్రసవ సమయంలో తల్లి సహకరించడంతో కాన్పు చేయడం సులువైంది. రెండేళ్ల కిత్రం ఇదేఆస్పత్రిలో 4.8 కిలోల బరువున్న బిడ్డ పుట్టింది. సహజంగా గర్భం దాల్చిన సమయంలో చక్కెరవ్యాధి సోకితే బరువైన బిడ్డ పుట్టే అవకాశం ఉంది. అయితే జయశ్రీకి అలాంటి ఆరోగ్య సమస్యలేవీ లేకుండానే పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. బిడ్డ అధిక బరువుతో ఉన్నందున తల్లిపాలను ఎక్కువగా తాగుతుంది. అయినా ఇబ్బందేమీ లేదు, మావద్ద తల్లిపాల బ్యాంకు ఉంది. తమిళనాడులో వైద్య ఆరోగ్యశాఖాధికారి ఒకరు మాట్లాడుతూ, చెన్నై వేలాచ్చేరికి చెందిన ఒక వివాహితకు తమిళనాడు చరిత్రలోనే తొలిసారిగా 2014లో 5.2 బరువుగల మగబిడ్డ పుట్టాడు. అయితే అది సిజేరియన్ శస్త్రచికిత్స ద్వారా ప్రసవం జరిగింది. అయితే తాజా కేసులో సాధారణ కాన్పులో 5.2 కిలోల బరువైన బిడ్డ పుట్టడం రాష్ట్రంలో ఒక రికార్డు. సహజంగా బిడ్డ 4 కిలోలకు పైగా బరువుంటే తప్పనిసరిగా సిజేరియన్ చేయాల్సి ఉంటుంది. అయితే 5.2 కిలోల బరువున్న బిడ్డను కలిగి ఉన్న జయశ్రీకి సాధారణ ప్రసవం చేసిన వైద్య బృందం అభినందనీయమని అన్నారు. -
అమ్మా.. నేను క్షేమం!
అమ్మా..నేనేమి నేరం చేశాను. వెచ్చని నీ పొత్తిళ్లలో హాయిగా నిద్రపోదామంటే విసిరిపారేశావేం?. నన్ను లోకానికి చూపించడానికి భయపడ్డావా? పోషించడం భారమనుకున్నావా? ఎందుకిలా చేశావమ్మా.. అయినా నేను ఏమైపోయానోనని బాధ పడుతున్నావా? ఆ దేవుడి దయవల్ల క్షేమంగా ఉన్నా. కాకాపోతే నీ చనుబాలు తీపి రుచి చూడాలని ఉంది. వెల్దుర్తి మండల పరిధిలోని రైల్వే స్టేషన్ ఎదురుగా ముళ్ల పొదల్లో దొరికిన ఓ చిన్నారి ఏడుపు చూస్తే ఇలాగే ప్రశ్నించినట్లుంది. కర్నూలు, వెల్దుర్తి: రైల్వేస్టేషన్ ఎదురుగా ముళ్లపొదల్లో రోజులు నిండని ఓ పసికందు లభ్యమయ్యాడు. శ్రీరంగాపురం గ్రామానికి చెందిన ఎర్రమల అనే వ్యక్తి అటుగా వెళ్తూ కాలకృత్యాల నిమిత్తం బైక్‌ను ఆపగా ఏడుపులు వినిపించడంతో బాబును గమనించి విలేకరులకు సమాచారం అందించాడు. విలేకరులతో పాటు అదే సమయంలో అటుగా వెళ్తున్న హైవే పోలీసులకు చిన్నారిని అప్పగించాడు. వారు స్థానిక ప్రభుత్వ వైద్యశాలకు తరలించి చికిత్స చేయించారు. బరువు తక్కువగా ఉండడంతో డోన్ ఆసుపత్రికి రెఫర్ చేశారు. అక్కడి వైద్యుల సూచనల మేరకు 108లో కర్నూలు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. -
పేగు బంధంపై ఎందుకంత పగ
అగనంపూడి(గాజువాక): అమ్మతనం కోసం ఆరాట పడేవాళ్లు ఎందరో... అమ్మా అని ముద్దు ముద్దుగా మురిపెంగా పిలిపించుకోవాలని ఆశ పడే అమ్మలు ఉంటారు. అలాంటి అమ్మతనాన్ని కాలదన్ని కన్నపేగు బంధాన్ని వదిలించుకోడానికి ఓ తల్లి చేసిన పయత్నం బెడిసికొట్టిన సంఘటన దువ్వాడ పోలీస్టేషన్ పరిధిలో చేటుచేసుకుంంది. బుచ్చయ్యపేట మండలానికి చెందిన అప్పలకొండ భర్త రాజీవ్‌నగర్‌లోని ఒక అపార్టుమెంట్లో వాచ్‌మెన్‌గా పనిచేస్తున్నారు. అప్పలకొండ కుమార్తె కె.మణి తన భర్తకు దూరంగా తల్లిదండ్రుల వద్దే ఉంటుంది. ఆమె గర్భిణి కావడంతో చికిత్స కోసం కేజీహెచ్‌కు వెళ్లేందుకు సోమవారం ఉదయం కూర్మన్నపాలెం బస్టాప్ వద్ద వేచి ఉంది. ఆ సమయంలో బస్టాప్ వద్దే పురుటి నొప్పులతో బాధపడుతూ మణి ఓ మగ బిడ్డను ప్రసవించింది. అయితే ఆ శిశువును హత్తుకోవాల్సిన మణి బిడ్డను వదిలించుకోవడానికి ప్రయత్నించడంతో అక్కడే ఉన్న జీవీఎంసీ పారిశుధ్య సిబ్బంది ఆమె ను వారించి బిడ్డను ఆమె కు అప్పగించి, స్థానికుల సహకారంతో 108 అంబులెన్స్‌లో కేజీహెచ్‌కు తరలించారు. అయితే భర్తకు దూరంగా ఉంటూ గర్భం దాల్చడం వల్లే ఆమె పేగు బంధాన్ని కా దని పరారయ్యేందుకు యత్నించిందని స్థానికులు చెబుతున్నారు. ఇప్పటికే మణికి జాన్ అనే ఐదేళ్ల కుమారుడు ఉన్నాడు. ఈ సంఘటనపై సమాచారం లేదని పోలీసులు చెబుతున్నారు. శిశువు పరిస్థితి ఆందోళనకరం పాతపోస్టాఫీసు(విశాఖ దక్షిణ): కూర్మన్మపాలెం బస్టాప్ వద్ద రోడ్డు మీద ప్రసవించిన కె.మణి (25) ఆరోగ్య పరిస్థితి బాగుందని కేజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ జి.అర్జున తెలిపారు. పరామర్శించిన తర్వాత ఆయన మాట్లాడుతూ మణి ఆరోగ్యం నిలకడగా ఉందని, బిడ్డ పరిస్థితి ఆందోళనకరంగా ఉండడం వల్ల నవజాత శిశువుల విభాగంలో వెంటిలేటర్‌పై ఉంచామని తెలిపారు. ఆమెను సీఎస్‌ఆర్‌ఎంవో కె.ఎస్.ఎల్.జి.శాస్త్రి, ఆర్ఎంవో డాక్టర్ సిహెచ్.సాధన, సిబ్బంది పరిశీలించారు. -
మానవతా మరణం
అనంతపురం కల్చరల్: పురిటి బిడ్డను కాలవ పాలు చేసిన ఘటన మరువక ముందే అనంతలోని వేర్వేరు ప్రాంతాల్లో ఇద్దరు నవజాత శిశువులు కుక్కలకు ఆహారంగా మారారు. వివరాల్లోకి వెళితే.. అనంతపురంలోని విద్యుత్ నగర్ నుంచి శారదానగర్‌ను కలుపుతూ కొత్తగా నిర్మిస్తున్న 80 అడుగుల రోడ్డు పక్కనే సోమవారం మధ్యాహ్నం ముళ్ల కంపల్లో ఓ నవజాత శిశువును అట్టపెట్టిలో పెట్టి పారిపోయారు. ఎవరూ గమనించకపోవడంతో వీధి కుక్కలు ఆ శిశువు శరీరంలోని చాలా భాగాలను తినేశాయి. కాగా, అట్టపెట్టెలో శిశువును పడేసి వెళుతున్న ఇద్దరిని స్థానికులు గుర్తించి ఒకటో పట్టణ పోలీసులకు అప్పగించారు. వీరిలో ఒకరు సర్వజనాస్పత్రిలో పనిచేస్తున్న శివ, మరొకరు కరిముల్లా అని తేలింది. విచారణలో తమకు సెక్యూరిటీ ఆఫీసర్ జోషి రూ. 500 ఇచ్చి నవజాత శిశువును ఖననం చేయాలని సూచించినట్లు నిందితులు తెలిపారు. మరో ఘటనలో జేఎన్టీయూ సమీపంలో ఓ పసికందును పడేసి వెళ్లారు. సోమవారం ఉదయమే రెండు ఆటోల్లో వచ్చిన అమ్మాయిలు ఇందుకు పాల్పడి ఉంటారని స్థానికులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. స్థానికులు, అధికారుల సూచన మేరకు మృతశిశువుల మృతదేహాలను సాయి సంస్థ అధ్యక్షుడు విజయసాయికుమార్ ఖననం చేశారు. -
పెద్దాస్పత్రిలో బిడ్డ మాయం
ఆడపిల్ల పుడితే మహాలక్ష్మి నడిచివచ్చిందని అందరూ సంతోషించారు. కానీ ఆనందం కొన్ని గంటల్లో మాయమైంది. తల్లీబిడ్డ గాఢనిద్రలో ఉండగా పాప అదృశ్యమైంది. ఈ హఠాత్పరిణామంతో తల్లి కన్నీటి పర్యంతమైంది. బిడ్డ కోసం తల్లి మనసు తపిస్తోంది. కోలారు: కోలారు నగరంలోని ఎస్ఎన్ఆర్ జిల్లా ప్రభుత్వ ఆస్పత్రి నుంచి నవజాత శిశువు కిడ్నాప్‌కు గురైంది. ముళబాగిలు తాలూకా వమ్మసంద్ర గ్రామానికి చెందిన వేణుకుమారి అనే కూలీ మహిళ రెండవ కాన్పుకోసం కోలారు ఎస్ఎన్ ఆస్పత్రిలో చేరింది. మంగళవారం ఆడ శిశువుకు జన్మనిచ్చింది. బుధవారం రాత్రి బిడ్డతో కలిసి నిద్రించింది, గురువారం తెల్లవారుజామున మెలకువ వచ్చాక చూస్తే బిడ్డ కనిపించలేదు. దీంతో తల్లి గట్టిగా రోదించడంతో సిబ్బంది వచ్చి శిశువు అదృశ్యమైన విషయాన్ని గుర్తించారు. శిశువు తండ్రి తండ్రి, బంధువులు వెతికినా ఫలితం లేక పోలీసులుకు ఫిర్యాదు చేశారు. ఆస్పత్రిలో సిసి కెమెరాలు ఉన్నప్పటికీ శిశువు అదృశ్యమైన దృశ్యం వాటిలో కనిపించలేదు. ఆస్పత్రి సిబ్బంది నిర్లక్ష్యమే బిడ్డ మిస్సింగ్‌కు కారణమని కుటుంబీకులు పోలీసుల ముందు ఆరోపించారు. ఎస్పీ పరిశీలన గురువారం ఉదయం జిల్లా ఎస్పీ రోహిణి కటౌచ్ ఆస్పత్రికి వచ్చి బాలింతతో పాటు కుటుంబ సభ్యులతో మాట్లాడారు. సిబ్బందితోనూ వివరాలు సేకరించారు. ఆస్పత్రిలో తగిన భద్రత ఉన్నా శిశువు కిడ్నాప్ కావడం పలు అనుమానాలకు తావిస్తోందని ఎస్పీ తెలిపారు. శిశువు గాలింపునకు ప్రత్యేక బృందాన్ని ఏర్పరుస్తామని చెప్పారు. సంఘటనకు ముందు ఇద్దరు పురుషులు అనుమానాస్పదంగా ప్రసూతి వార్డు వద్ద తిరుగుతున్న విషయాన్ని పలువురు పోలీసుల దృష్టికి తీసుకువచ్చారు. వారిని గుర్తిస్తే శిశువు ఆచూకి సులువుగా లభిస్తుందని పోలీసులు అంటున్నారు. తల్లి రోదన శిశువు తల్లి వేణుకుమారి తనకు బిడ్డను అందించాలని కన్నీరుమున్నీరుగా రోదించింది. బాలింత అత్త మునియమ్మ మాట్లాడుతూ ధర్మాసుపత్రిలో ధర్మం ఎక్కడుందని, శిశువును కోల్పోయిన తాము పుట్టెడు దుఃఖంలో ఉంటే తమ పైనే నిందలు వేస్తున్నారని ఆస్పత్రి సిబ్బందిని దుయ్యబట్టింది. నాలుగు నెలల్లో రెండో మిస్సింగ్ గత నాలుగు నెలల్లో రెండోసారి నవజాత శిశువు అపహరణ చోటు చేసుకుంది. గత నాలుగు నెలల క్రితం కేజీఎఫ్ ప్రభుత్వ ఆస్పత్రిలో నవజాత శిశువు కిడ్నాప్‌కు గురైంది. ఇప్పటికీ ఆచూకీ తెలియరాలేదు. ఇంతలోనే ఏకంగా జిల్లా ఆస్పత్రిలో మరో సంఘటన జరగడంతో తల్లిదండ్రులు భయాందోళనకు గురవుతున్నారు. ఆస్పత్రి ముందు ధర్నా జిల్లా ఆస్పత్రి ముందు కిడ్నాప్‌కు గురైన శిశువు తల్లితో పాటు మానవ హక్కుల జాగృతి సమితి కార్యకర్తలు నిరసన నిర్వహించారు. కారకులను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. జిల్లాలో పదేపదే శిశువు కిడ్నాప్‌లకు గురౌతుండి వీటిని అరికట్టడంలో జిల్లా యంత్రాంగం, పోలీసులు పూర్తిగా విఫలమయ్యారని ఆరోపించారు. శిశువు తల్లికి న్యాయం జరిగే వరకు ఆందోళణ విరమించేది లేదని పట్టుబట్టారు. -
ఆ తల్లికి ఏ కష్టమొచ్చిందో..!
గుంటూరు ఈస్ట్: ఆ తల్లికి ఏ కష్టం వచ్చిందో కన్న తల్లి మమకారాన్ని చంపుకొని పురిటిలోని బిడ్డను అనాథగా వదిలేసి వెళ్లింది. జీజీహెచ్ అత్యవసర విభాగం సెల్లార్లో ఐదు రోజుల పసిగుడ్డు ఏడవడం విని సమీపంలోని సెక్యూరిటీ సిబ్బంది వెళ్లి చూశారు. అక్కడ బిడ్డ పరిస్థితికి చలించిపోయారు. చుట్టుపక్కల బిడ్డకు సంబంధించిన వారు ఎవరూ లేకపోవడంతో జీజీహెచ్ ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చారు. వారి ఆదేశాల మేరకు ఐదు రోజుల మగ శిశువును 108 పిల్లల వార్డుకు తరలించారు. వార్డులోని ఎన్ఐసీ విభాగంలో పసికందును ఉంచి వైద్యులు చికిత్స అందిస్తున్నారు. పసికందు ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. పసికందు చేతి మణికట్టు, కాలుకు తెల్ల ప్లాస్టర్లు చుట్టి ఉన్నాయి. సమాచారం తెలుసుకున్న కొత్తపేట పోలీసులు దీనిపై విచారణ చేస్తున్నారు. -
చంటి బిడ్డలకు ‘ఆర్ఎఫ్ఐడీ’ రక్ష
తెనాలిఅర్బన్: ఆస్పత్రుల్లో చంటిబిడ్డల అపహరణలకు చెక్ పెట్టేందుకు తెనాలి జిల్లా వైద్యశాల సిద్ధమవుతోంది. అందుకు అవసరమైన ఆర్ఎఫ్ఐడీ విధానాన్ని వైద్యశాలలో ప్రవేశపెట్టనున్నారు. ఈ క్రమంలో తల్లి–బిడ్డకు ట్యాగ్‌లను వేయనున్నారు. అలాగే ప్రసూతి విభాగంలో సిస్టమ్స్‌కు సంబంధించి సెన్సార్‌ను కూడా ఏర్పాటు చేశారు. పెరిగిన రద్దీ.. తెనాలి జిల్లా వైద్యశాలలో 150 పడకల తల్లి–పిల్లల వైద్యశాలో నెలకు సుమారు 300 ప్రసవాలు జరుగుతున్నాయి. దీనివల్ల జిల్లా వైద్యశాల ఆవరణ నిత్యం రద్దీగా ఉంటుంది. గతంలో గుంటూరు ప్రభుత్వ వైద్యశాలలో పసిబిడ్డల అపహరణలు జరగటం.. తెనాలి జిల్లా వైద్యశాలలో అప్పుడే పుట్టిన చిన్నారులను వదిలి వెళ్లటం వంటి ఘటనలు జరిగాయి. వీటిని దృష్టిలో ఉంచుకుని చిన్నారుల అపహరణలు జరగకుండా ఉండాలనే ఉద్దేశంతో జిల్లా వైద్యశాల ఒక అడుగు ముందుకు వేసింది. ఇందులో భాగంగా రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ డివైజ్(ఆర్ఎఫ్ఐడీ) విధానాన్ని ప్రవేశపెట్టేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. వార్డుల్లో ఇప్పటికే సెన్సార్లను ఏర్పాటు చేశారు. అలాగే సిస్టం అమలుకు అవసరమైన గదిని కూడా కేటాయించారు. రెండు రోజుల్లో దీనిని అధికారికంగా జిల్లా వైద్యశాలలో ప్రవేశపెట్టనున్నారు. ఆర్ఎఫ్ఐడీ పనిచేసే విధానం.. జిల్లా వైద్యశాలలో కాన్పు జరిగిన వెంటనే తల్లి–పుట్టిన చంటి బిడ్డకు ఒకే నంబర్ కలిగిన ట్యాగ్‌లను చేతులకు వేస్తారు. ట్యాగ్లు వేసిన వారిని బయటకు తీసుకెళ్లేందుకు అనుమతించరు. ఎవరైన చంటి బిడ్డను అపహరించాలని చూసి బయటకు తీసుకువెళ్లితే వార్డులో ఏర్పాటు చేసిన అలారాలు మోగుతాయి. అంతే కాకుండా చంటిబిడ్డ ఫొటో, వివరాలను ఆర్ఎఫ్ఐడీ మానిటర్స్ డిస్ప్లే చేస్తాయి. వాటిని నిత్యం పర్యవేక్షించే సిబ్బంది సెక్యూరిటీని అప్రమత్తం చేసి, దొంగను పట్టుకునే విధంగా చూస్తారు. మొత్తం మీద గుంటూరులో మినహా జిల్లాలో ఇలాంటి ఆర్ఎఫ్ఐడీ విధానాన్ని అమలు చేస్తున్న ఆస్పత్రిగా జిల్లా వైద్యశాల నిలవనుంది. ఇది విజయవంతం అయితే పిల్లల దొంగతనాలకు చెక్‌పెట్టినట్లే. చిన్నారుల అపహరణకు చెక్.. ఆర్ఎఫ్ఐడీ విధానాన్ని జిల్లా వైద్యశాలలోని తల్లి–పిల్లల వైద్యశాలలో ప్రవేశపెట్టేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. తల్లి–బిడ్డలకు ఒకే నంబర్ ట్యాగ్లు వేస్తాం. వాటికి ఉన్న రేడియో ఫ్రీక్వెన్సీ సెన్సార్‌కు సంకేతాలు పంపి సిబ్బందిని అలర్ట్ చేస్తుంది. అలాగే ట్యాగ్‌లను పాడుచేసేందుకు అవకాశం ఉండదు. దీని వల్ల చంటిబిడ్డల దొంగతనాలను నియంత్రించవచ్చు. –డాక్టర్ ఎం సనత్‌కుమారి,సూపరింటెండెంట్, జిల్లా వైద్యశాల, తెనాలి -
పండంటి బిడ్డకు జన్మనిచ్చిన దేశాధినేత
ఆక్లాండ్: న్యూజిలాండ్ ప్రధాని జెసిండా ఆర్డర్న్ పండంటి ఆడబిడ్డకు బుధవారం ఆక్లాండ్‌లోని ఆస్పత్రిలో జన్మనిచ్చారు. దేశాధినేత హోదాలో ఉండి బిడ్డకు జన్మనిచ్చిన రెండో మహిళగా ఆర్డర్న్ రికార్డుకెక్కారు. 37 ఏళ్ల జెసిండా, 40 ఏళ్ల క్లార్క్ గెఫోర్డ్ దంపతులకు ఈ పాప మొదటి సంతానం. 3.3 కిలోగ్రాముల బరువుతో బిడ్డ ఆరోగ్యంగా ఉందని ఆర్డర్న్ ఇన్‌స్టాగ్రామ్‌లో వెల్లడించారు. ‘కొత్తగా తల్లిదండ్రులైన వారికున్న భావోద్వేగాలే మాకూ ఉన్నాయి. శుభాకాంక్షలు అందజేస్తున్న ప్రజలకు ధన్యవాదాలు’అని పేర్కొన్నారు. పాకిస్తాన్ ప్రధాని బెనజీర్ భుట్టో 1990లో అధికారంలో ఉండగా బిడ్డకు జన్మనిచ్చిన తొలి మహిళగా చరిత్రకెక్కారు. కాగా, లేబర్‌పార్టీ అధ్యక్ష బాధ్య తలు చేపట్టిన మూడు నెలలకు అంటే గతేడాది అక్టోబర్‌లో ఆర్డర్న్ ప్రధాని అయ్యారు. -
అయ్యో..పాపం!
చీరాల రూరల్: చీరాల ఏరియా ఆస్పత్రిలో డాక్టర్లు చేసే పనిని నర్సులు చేస్తుండడంతో పుట్టిన పండంటి బిడ్డలు పిట్టల్లా రాలిపోతున్నారు. ప్రసవం కోసం వచ్చిన నిండు గర్భిణికి నర్సులు వైద్యం చేయడంతో పరిస్థితి విషమించి పండంటి మగబిడ్డ మృతి చెందిన సంఘటన సోమవారం స్థానిక ఏరియా వైద్యశాలలో జరిగింది. న్యాయం చేయాలంటూ ఆస్పత్రి ప్రాంగణంలో బాధితులు ఆందోళనకు దిగారు. ఇదీ..జరిగింది స్థానిక జాన్‌పేటకు చెందిన జొన్నలగడ్డ స్పందన, అశోక్‌కుమార్ దంపతులు. స్పందన నిండు గర్భిణి. మూడో కాన్పు కోసం ఆమె భర్త, బంధువులు సోమవారం ఉదయం 6:30 గంటలకు ఆమెను ఆస్పత్రిలో చేర్చారు. గతంలో ఆమె మొదటి కాన్పు కూడా ఇదే ఆస్పత్రిలో చేశారు. అప్పుడు వైద్యులు ఆమెకు ఆపరేషన్ చేసి బిడ్డను తీశారు. రెండో కాన్పు కూడా గతంలో ఇదే ఆస్పత్రిలో జరిగింది. పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెప్పడంతో ఆమెను గుంటూరు తరలించారు. అక్కడే ఆమె పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. అంతవరకూ ఓకే.. మూడో కాన్పు కోసం ఆమెను భర్త, బంధువులు కలిసి ఆస్పత్రిలో చేర్చారు. వైద్యులు అందుబాటులో లేకపోవడంతో విధుల్లో ఉన్న నర్సులు కాన్పు చేసేందుకు ప్రయత్నించారు. 10 గంటల సమయంలో డ్యూటీకి వచ్చిన వైద్యులు ఆమెను గమనించి పరిస్థితి విషమంగా ఉందని, మిమ్మల్ని ఎవరు వైద్యం చేయమన్నారని సిబ్బందిని మందలించారు. వైద్యులు వైద్యం చేసేందుకు ప్రయత్నించిన కొద్ది సేపటికే మగబిడ్డ చనిపోయింది. బయటకు వెళ్లాలని ఆదేశం బిడ్డ చనిపోయిందని వైద్యులు చెప్పడంతో బంధువులు విషాదంలో మునిగిపోయారు. ఆస్పత్రి సిబ్బంది ఇక్కడ ఎందుకు ఏడుస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. బిడ్డను తీసుకుని త్వరగా బయటకు వెళ్లాలని కేకలేశారు. తన కుమారుడు ఎందుకు చనిపోయాడంటూ తండ్రి అశోక్‌కుమార్‌తో పాటు అతని బంధువులు ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ తిరుపాలు వద్ద వాపోయారు. ఉదయం 6:30 గంటలకు ఆస్పత్రికి వస్తే వైద్యులు రాలేదని, నర్సులు వైద్యం చేసేందుకు ప్రయత్నించారని, దాని కారణంగానే తమ కుమారుడు మృతి చెందాడని ఆరోపించారు. రెండో కాన్పు కోసం తన భార్యకు గుంటూరు ప్రభుత్వాస్పత్రిలో ఆపరేషన్ చేసి బిడ్డను తీశారని, ఇదే విషయాన్ని నర్సులకు కూడా చెప్పామని, వారు సాధారణ కాన్పు చేసి బిడ్డను తీస్తామని చెప్పి అన్యాయంగా చంపేశారని కన్నీటిపర్యంతమయ్యాడు. బాధితులు తహసీల్దార్ వెంకటేశ్వరరావుకు ఫిర్యాదు చేశారు. స్పందించిన తహసీల్దార్ ఆస్పత్రికి చేరుకుని బాధితులను విచారించారు. సంఘటన జరిగిన సమయంలో తాను లేనని, విచారించి తగు చర్యలు తీసుకుంటానని ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ తిరుపాలు తెలిపారు. -
పుట్టిన అరగంటకే వదిలి వెళ్లిన తల్లి
ఆ తల్లికి ఏం కష్టమొచ్చిందో తెలియదు. రక్తం పంచుకుని, పేగు తెంచుకుని పుట్టిన బిడ్డపై మమకారం చంపుకుంది. పుట్టిన అరగంటకే ఆస్పత్రిలోనే వదిలేసి వెళ్లిపోయింది. ఆ పసికందు కళ్లు తెరిచేలోపే అనాథగా మారింది. ఆకలితో ఏడుస్తూ బిక్కచూపులు చూస్తున్న నవజాత శిశువు ఆలనాపాలనా చూసేదెవరో ఆ దేవుడికే ఎరుక. రొంపిచెర్ల: ఒక మహిళ రక్తం పంచి కన్న బిడ్డను అరగంటలోనే వదిలి వెళ్లింది. ఈ ఘటన ఆదివారం రొంపిచెర్ల మండలంలో చోటుచేసుకుంది. సంత బజారువీధికి చెందిన ఆర్ఎంపీ షీబా దగ్గరకు ఆదివారం ఉదయం ఒక గర్భిణి వచ్చింది. 30 నిమిషాలకే పురిటి నొప్పులు రావడంతో బిడ్డకు జన్మనిచ్చింది. అనంతరం ఆమె బిడ్డను అక్కడే వదిలిపెట్టి గుట్టు చప్పుడు కాకుండా వెళ్లిపోయింది. ఆర్ఎంపీ షీబా సాయంత్రం వరకు వేచి చూసినా తల్లి కాని, ఆమె తరఫు వారు కానీ రాలేదు. ఆదివారం రాత్రి రొంపిచెర్ల పోలీసులకు సమాచారం అందించారు. చిన్నగొట్టిగల్లు సీడీపీఓ ప్రదీపకు ఫోన్లో సమాచారం ఇవ్వడంతో ఆమె వచ్చి ఆ బిడ్డను తీసుకుని తిరుపతికి తరలించారు. బిడ్డను వదిలివెళ్లిన యువతి రాజస్థాన్‌కు చెందినట్టు ఆర్ఎంపీ అనుమానం వ్యక్తం చేశారు. ఆమెకు(19) ఏళ్లు ఉంటాయని, ప్రేమికుడి చేతిలో మోసపోయి గర్భం దాల్చినట్టు పేర్కొన్నారు. -
నవజాత శిశువుకు గుండె ఆపరేషన్
లబ్బీపేట(విజయవాడతూర్పు): టోటల్ ఎనామీలస్ పల్మనరీ వీనస్ రిటర్న్ అనే అత్యంత క్లిష్టమైన గుండె సమస్యతో జన్మించిన శిశువుకు ఆంధ్రా హాస్పటల్ వైద్యులు ఆయుష్షు పోశారు. 18 రోజుల వయస్సులోనే క్లిష్టతరమైన ఆపరేషన్‌ను విజయవంతంగా నిర్వహించడంతో ప్రస్తుతం ఆ శిశువు కోలుకుని ఆరోగ్యంగా ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయింది. ఈ సందర్బంగా బుధవారం ఆంధ్రా హార్ట్ అండ్ బ్రెయిన్ ఇనిస్టిట్యూట్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో పిడియాట్రిక్ చీఫ్ డాక్టర్ పీవీ రామారావు వివరాలు వెల్లడించారు. గుంటూరు జిల్లా తాడేపల్లికి చెందిన సుమతిరాణి, సురేష్‌బాబులకు ఏప్రిల్ 20న శిశువు జన్మించగా, చికిత్స నిమిత్తం ఆంధ్రా ఆస్పత్రికి తీసుకువచ్చారు. ఇక్కడి వైద్యులు శిశువును పరీక్షించి గుండెలోపలికి మంచి రక్తాన్ని తీసుకువెళ్లే రక్తనాళాలు ఎడమచేతి పక్కన కాకుండా, గుండెలోపల కరోనరీ సైనస్ అనే చోట చేరడం వల్ల రక్తంలో ఆక్సిజన్ శాతం తక్కువగా ఉన్నట్లు గుర్తించారు. దీంతో ఆ శిశువుకు ఈ నెల 3న విజయవంతంగా శస్త్ర చికిత్స నిర్వహించామని తెలిపారు. శస్త్ర చికిత్స చేసిన డాక్టర్ దిలీప్ మాట్లాడుతూ ఈ శిశువుకు క్లిష్టతరమైన సమస్య కావడంతో ఛాలెంజ్‌గా తీసుకుని చేశామన్నారు. పిడియాట్రిక్ కార్డియాలజిస్ట్ డాక్టర్ కుడుముల విక్రమ్, కార్డియాలజిస్ట్ డాక్టర్ జె.శ్రీమన్నారాయణ, కార్డియాక్ అనస్థీషియా డాక్టర్ రమేష్ పాల్గొన్నారు. -
సీఎం సారూ... ప్రాణాలు పోతున్నాయ్..!
అమ్మ ఒడిలోకి రాకుండానే మృత్యు ఒడిలోకి వెళ్లిపోతున్నారు. పేగు తెంచుకోగానే తనువు చాలిస్తున్నారు. బయట ప్రపంచం చూడకుండానే కన్ను మూస్తున్నారు. గర్భ శోకానికి ప్రభుత్వాసుపత్రులు వేదికగా మారిపోయాయి.కాకినాడ జీజీహెచ్‌లోనైతే శిశు మరణ ఘోష నిత్యం వినిపిస్తూనే ఉంది.శిశు మరణాలు ఏటా పెరిగిపోతున్న తీరుపై ‘సాక్షి’ వరుస కథనాలు ఇచ్చినాసంబంధితాధికారుల్లో కనీస స్పందన కరువవుతోంది. జిల్లా పర్యటనలసందర్భంగా స్వయంగా సీఎం ఇచ్చిన హామీలూ ఆచరణకు నోచుకోవడం లేదు. సాక్షి ప్రతినిధి, కాకినాడ: చిన్నారుల్లో తలెత్తే లోపాలను సత్వరమే గుర్తించి, తగు చికిత్సలు అందించేందుకు ‘చిన్నారుల పలకరింపు’ కార్యక్రమాన్ని ఈ నెల 5వ తేదీ నుంచి అట్టహాసంగా ప్రభుత్వం ప్రారంభిస్తోంది. ఐదేళ్లలోపు పిల్లల్లో సంభవిస్తున్న మరణాలకుకారణమైన రోగాలను గుర్తించి, తగు మందులు వాడేలా ప్రోత్సహించేందుకు ఈ కార్యక్రమాన్ని తలపెట్టామని చెబుతున్నారు. చిత్తశుద్ధితో అమలు చేస్తే మంచిదే కానీ మాటల్లో ఉన్న చిత్తశుద్ధి ఆచరణల్లో కనిపించడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. గుర్తించిన రోగానికి వైద్యం అందించే వైద్యులు, సిబ్బంది కొరత పట్టిపీడిస్తోంది. ఈ నేపథ్యంలో గుర్తించిన రోగాలకు వైద్యమెలా అందిస్తారో ప్రశ్నార్థకంగా మారింది. ఎంతసేపూ ఆశా వర్కర్లు, అంగన్వాడీలు, మెప్మా కార్యకర్తలపై ఆధారపడితే సరిపోదని, వారితో ‘చిన్నారుల పలకరింపు’ కార్యక్రమంలో ఆరోగ్య పరిస్థితులను గుర్తించినంత మాత్రాన ప్రయోజనమేమిటని పలువురు ప్రశ్నిస్తున్నారు. గురువారం జిల్లాకు సీఎం చంద్రబాబు వస్తున్న సందర్భంగా ‘సీఎం సారూ... ఓ సారి ఇటు చూడండ’ంటూ జిల్లాలో మాతా, శిశు మరణాల దయనీయ దుస్థితులపై ‘సాక్షి’ అందిస్తున్న ప్రత్యేక కథనం. పురిటినొప్పులు వస్తే భయమే... పురిటినొప్పులు వస్తే చాలు గర్బిణీలు, వారి కుటుం బీకులు భయాందోళనకు గురవుతున్నారు. కడుపులో ఉన్న బిడ్డ క్షేమంగా వస్తారా లేరా అని భయపడుతున్నారు. సుఖ ప్రసవం సాగేవరకు, ఆరోగ్యవంతమైన బిడ్డ పుట్టేవరకు ఆందోళన వీడటం లేదు. గిరిజనం, మైదానం అనే తేడా లేకుండా కలవరపడుతున్నారు. గత నాలుగేళ్లలో శిశు మరణాలు ఎక్కువగా సంభవించడమే దీనికి కారణం. శాస్త్ర సాంకేతికత విశ్వం అంచులకు చేరిన కాలంలోనూ...వైద్య రంగంలో విప్లవాత్మక మార్పులొచ్చాక శిశు మరణాల సంఖ్య పెరగడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. విచిత్రమేమిటంటే టీడీపీ అధికారంలోకి వచ్చాక శిశు మరణాలతోపాటు మాతృ మరణాలు కూడా పెరుగుతూ వస్తున్నాయి. పైన పేర్కొన్న పట్టికలో 2014–15 నుంచి అంకెలు చూస్తే పరిస్థితేంటో స్పష్టమవుతోంది. గత నాలుగేళ్ల కాలంలో ఏడాదిలోపు శిశువులు 2,922 మంది చనిపోగా, ఐదేళ్లలోపు చిన్నారులు 261 మంది మరణించారు. ఇక తల్లుల మరణాలైతే ఈ నాలుగేళ్ల కాలంలో 220 వరకూ ఉన్నాయి. మనకే ఎందుకీ పరిస్థితి... సహస్రాబ్ది లక్ష్యాల్లో ఒకటిగా ఐక్య రాజ్యసమితి నిర్ణయించిన శిశు మరణాల నియంత్రణ విషయంలో మన దేశం చెప్పుకోదగ్గ విజయం సాధించిందని అంతర్జాతీయ జర్నల్ లాన్సెట్ వెల్లడించిన గణాంకాలు ఊరటనిచ్చాయి. ప్రభుత్వాలు తీసుకున్న వివిధ చర్యల కారణంగా 2000–15 మ«ధ్య పది లక్షల మంది మృత్యుపాశం నుంచి తప్పించుకోగలిగారని ఆ నివేదికలో పేర్కొంది. భారత రిజిస్ట్రార్ జనరల్ నిరుడు విడుదల చేసిన నివేదిక కూడా శిశు మరణాల రేటు తగ్గిందని వివరించింది. కానీ ఈ జిల్లాలో నాలుగేళ్లుగా శిశు మరణాలు పెరుగుతూనే ఉన్నాయి. లోపమెక్కడ... సాధారణంగా గర్భం దాల్చిన వెంటనే ఆమె పేరు, ఆధార్, రేషన్ నెంబర్, చిరునామాలాంటి వివరాల్ని స్థానిక వైద్యాధికారులు నమోదు చేయాలి. గర్భిణీకి హెచ్‌బీ, బీపీ, సుగర్, హెచ్‌బీఎస్‌ఎజీ, హెచ్ఐవీ వంటి పరీక్షలు నిర్వహించాలి. వాటిలో ఏ ఒక్క వ్యాధి ఉన్నా వారిని హైరిస్క్ గర్భిణిగా గుర్తించి ప్రసవమయ్యే వరకూ నిరంతరం ఏఎన్ఎం, వైద్యులు పర్యవేక్షించాలి. గుర్తించిన హైరిస్క్ మదర్స్‌ను 9వ నెల వచ్చేలోపు నాలుగుసార్లు పరిశీలించాల్సి ఉంది. ఏ ఆసుపత్రిలో ప్రసవం చేయించుకోవాలో చెప్పేందుకు బర్త్ ప్లానింగ్ వేయాలి. జిల్లాలో ఇదేమీ సరిగా జరగగడం లేదు. ప్రసవానికి ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కలిగించడం, రక్తహీనత తదితర సమస్యలను గుర్తించి సలహాలివ్వడం, అవసరమైన మందులు సమకూర్చడం వంటివి చేస్తేనే నెలలు నిండని, బలహీన శిశు మరణాలు తగ్గడం సాధ్యమవుతుంది. కానీ జిల్లాలో ఆ పరిస్థితి కనిపించడం లేదు. జిల్లా కేంద్రంలో ఉండే కాకినాడ సర్వ జన ప్రభుత్వాసుపత్రికి ప్రసవానికి వచ్చిన తల్లుల్లో మెజార్టీ కేసుల్లో పిల్లలు దక్కని దుస్థితి నెలకొంది. గిరిజనులకైతే నరకమే... గిరిజన మహిళలు గర్భం దాలిస్తే చాలు నరకం చూస్తున్నారు. రహదారి సౌకర్యమే లేదంటే మిగతా సౌకర్యాలు ఎలా ఉంటాయో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. గిరిజనులను ప్రధానంగా రక్తహీనత పట్టిపీడిస్తోంది. పోషకాహారం అందిస్తేనే రక్త హీనతను నియంత్రించగలం. కానీ, ప్రభుత్వం ఆ దిశగా చర్యలు తీసుకోవడం లేదు. గిరిజన గ్రామాల ప్రజలకు పౌష్టికాహారం అందించాల్సిన అంగన్వాడీ కేంద్రాలు సరిగా పనిచేయడం లేదన్న విమర్శలున్నాయి. పౌష్టికాహారం కోసం కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తున్నట్టు రికార్డుల్లో కనిపించడమే తప్ప గిరిజనులకు మాత్రం అందడం లేదు. వైద్యుల కొరత... ఏజెన్సీలో వైద్యసేవలందించడంలో ప్రధాన భూమిక వహిస్తున్న రంపచోడవరం, చింతూరు ఏరియా ఆసుపత్రుల్లోనే అసౌకర్యాలు వెంటాడుతున్నాయి. చింతూరు ఏరియా ఆసుపత్రికి 31 పోస్టులు మంజూరు చేస్తూ సెప్టెంబర్ 9న రాష్ట్ర మంత్రి వర్గం నిర్ణయం తీసుకుంది. ఏజెన్సీలో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలన్నీ 24 గంటలూ పని చేయించాలని కేబినెట్ నిర్ణయించినా ఆచరణకు నోచుకోవడం లేదు. ఏడాదిన్నర క్రితం అప్‌గ్రేడైన చింతూరు ఆసుపత్రికి వైద్యులు, సిబ్బంది లేకపోవడంతో వైద్య సేవలకు ప్రతిబంధకంగా మారింది. కాకినాడ జిల్లా ఆసుపత్రిలోనూ అవస్థలే... కాకినాడ ప్రభుత్వ బోధనాసుపత్రిలో పెరుగుతున్న ఓపీకి అనుగుణంగా వైద్యుల భర్తీ చేయలేదు. ముఖ్యంగా గైనిక్ వార్డులో పూర్తిస్థాయిలో గైనిక్ వైద్యులు లేకపోవడంతో ఉన్న వారిపై తీవ్ర పనిభారం పడుతోంది. ఫలితంగా ప్రాణాంతక సమయంలో సరైన వైద్య చికిత్సలందక ప్రాణాలు కోల్పోయే పరిస్థితులు నెలకొన్నాయి. కాకినాడ ప్రభుత్వ సామాన్య ఆస్పత్రి, మాతా, శిశు ప్రసూతి విభాగంలో సుమారు 300 పడకలు ఉన్నాయి. నిత్యం ఇక్కడ చికిత్స పొందేందుకు గర్భిణులు 500 నుంచి 550 వరకు వస్తుంటారు. రోజుకి 50 వరకు ప్రసవాలు జరుగుతుండగా, 20–25 వరకు సీజేరియన్ ప్రసవాలు జరుగుతున్నాయి. తగిన స్థాయిలో సిబ్బంది లేకపోవడంతో ప్రస్తుతం ఉన్న వైద్యులు, సిబ్బందిపై తీవ్ర పనిభారం పడుతోంది. ఎంసీఐ మార్గదర్శకాల ప్రకారం ఒక్కో గైనిక్ విభాగంలో ఒక ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, ఇద్దరు అసిస్టెంట్ ప్రొఫెసర్లతో 24 మంది వైద్యులు పనిచేయాల్సి ఉంది. ఇక్కడ ఆ స్థాయిలో వైద్యుల్లేరు. చిన్నారుల మరణాలునియంత్రించేందుకే... ఐదేళ్లలోపు సంభవిస్తున్న మరణాలు నియంత్రించేందుకు ‘చిన్నారుల పలకరింపు’ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నారు. అంగన్వాడీ కార్యకర్తలు, ఆశా కార్యకర్తలు, మెప్మా కార్యకర్తలు ఇంటింటికీ వెళ్లి చిన్నారుల ఆరోగ్య పరిస్థితులను తెలుసుకుంటారు. వారిచ్చే నివేదిక ఆధారంగా సదరు చిన్నారులకు వైద్యులు సేవలందిస్తారు. మందులు ఎలా వాడాలో తల్లులకు తెలియజేస్తారు. ఈ నెల 5వ తేదీ నుంచి జిల్లాలో ‘చిన్నారుల పలకరింపు’ కార్యక్రమం ప్రారంభం కానుంది. – చెంచయ్య, జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి, కాకినాడ -
చిమ్మచీకటిలో పసిబిడ్డ
కావలిరూరల్: కావలి ప్రభుత్వ ఏరియా వైద్యశాల సిబ్బంది నిర్వాకంతో అప్పుడే పుట్టిన పసిబిడ్డ మూడు గంటల పాటు చిమ్మచీకటిలో ఆర్తనాదాలు చేస్తూ ఉండాల్సి వచ్చింది. బోగోలు మండలం బిట్రగుంటకు చెందిన యు.అంజలి పురుడు కోసం గురువారం కావలి ప్రభుత్వ ఏరియా వైద్యశాలకు వచ్చింది. మధ్యాహ్నం 2.50 గంటలకు డాక్టర్లు ఆమెకు ఆపరేషన్ చేసి మగబిడ్డను కాన్పు చేశారు. అనంతరం 3.20 గంటలకు ఆమెను అప్పుడే పుట్టిన బిడ్డతో సహా పే వార్డులోని రూం నంబరు 2లోకి మార్చారు. అయితే రూంలో లైటు పని చేయలేదు. ఈ విషయం గమనించిన డ్యూటీ సిస్టర్ వెంటనే ఎలక్ట్రీషియన్‌కు సమాచారమందించారు. అయితే ఎలక్రీషియన్ 6.25 గంటలకు వచ్చి లైట్‌ను సరిచేసి వెళ్లాడు. అయితే మూడు గంటల పాటు ఆ చిన్నారి ఏడుస్తూనే ఉంది. ఆపరేషన్ చేయించుకున్న పేషెంట్ పొత్తిళ్లలో బిడ్డతో సహా అలాగే ఉండిపోవాల్సి వచ్చింది. వీరి బాధ చూడలేక అక్కడ విధులలో ఉన్న సిబ్బంది పదే పదే ఫోన్లు చేయడంతో ఎలక్ట్రీషియన్ తీరుబడిగా 3గంటల తర్వాత వచ్చి లైటు సరిచేయడంతో వారు ఊపిరి పీల్చుకున్నారు. ప్రభుత్వ ఆస్పత్రిలో కాన్పులు బాగా చేస్తున్నారని వస్తే సిబ్బంది ఇంత నిర్లక్ష్యంగా ఉన్నారేంటని అంజలి కుటుంబ సభ్యులు వాపోయారు.