పసికందును కనుగొన్న శ్రీరంగాపురం రవి, హైవే పోలీసులు సాయి కిరణ్, రామయ్య
అమ్మా..నేనేమి నేరం చేశాను. వెచ్చని నీ పొత్తిళ్లలో హాయిగా నిద్రపోదామంటే విసిరిపారేశావేం?. నన్ను లోకానికి చూపించడానికి భయపడ్డావా? పోషించడం భారమనుకున్నావా? ఎందుకిలా చేశావమ్మా.. అయినా నేను ఏమైపోయానోనని బాధ పడుతున్నావా? ఆ దేవుడి దయవల్ల క్షేమంగా ఉన్నా. కాకాపోతే నీ చనుబాలు తీపి రుచి చూడాలని ఉంది. వెల్దుర్తి మండల పరిధిలోని రైల్వే స్టేషన్ ఎదురుగా ముళ్ల పొదల్లో దొరికిన ఓ చిన్నారి ఏడుపు చూస్తే ఇలాగే ప్రశ్నించినట్లుంది.
కర్నూలు, వెల్దుర్తి: రైల్వేస్టేషన్ ఎదురుగా ముళ్లపొదల్లో రోజులు నిండని ఓ పసికందు లభ్యమయ్యాడు. శ్రీరంగాపురం గ్రామానికి చెందిన ఎర్రమల అనే వ్యక్తి అటుగా వెళ్తూ కాలకృత్యాల నిమిత్తం బైక్‌ను ఆపగా ఏడుపులు వినిపించడంతో బాబును గమనించి విలేకరులకు సమాచారం అందించాడు. విలేకరులతో పాటు అదే సమయంలో అటుగా వెళ్తున్న హైవే పోలీసులకు చిన్నారిని అప్పగించాడు. వారు స్థానిక ప్రభుత్వ వైద్యశాలకు తరలించి చికిత్స చేయించారు. బరువు తక్కువగా ఉండడంతో డోన్ ఆసుపత్రికి రెఫర్ చేశారు. అక్కడి వైద్యుల సూచనల మేరకు 108లో కర్నూలు ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment