![Newlyweds Park Shin Hye and Choi Tae Joon Welcome Baby Boy - Sakshi](/styles/webp/s3/article_images/2022/05/31/park-shin-Hye.jpg.webp?itok=HsNuhSRf)
సౌత్ కొరియాకు చెందిన స్టార్ హీరోయిన్ పార్క్ షిన్ హై తల్లయింది. పండంటి మగ బిడ్డకు ఆమె జన్మనిచ్చినట్లు కొరియన్ మీడియా వెల్లడించింది. సియోల్‌లోని ఓ ప్రైవేటు ఆసుప్రతిలో పార్క్ షీన్ మగబిడ్డకు జన్మనిచ్చినట్లు సాల్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ ఎజెన్సీ ప్రకటించింది. ప్రియుడు, సహా నటుడు చోయి టే జూన్‌ను ఆమె పెళ్లి చేసుకున్న ఈ ఏడాది జనవరి అధికారికంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. పెళ్లిని, ప్రెగ్నెన్సీని ఒకేసారి ఈ జంట ప్రకటించింది.
చదవండి: సింగర్ సిద్ధూ హత్య.. సల్మాన్‌కు లారెన్స్ వార్నింగ్.. అప్రమత్తమైన పోలీసులు
తాజాగా ఈ జంటకు బిడ్డ పుట్టడంతో ఈ కొత్త దంపతులకు సౌత్ కొరియాకు చెందిన నటీనటుల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తున్నాయి. కాగా 2017 నుంచి పార్క్ షిన్ హై, చోయి టే జూన్‌లు డేటింగ్‌లో ఉన్నారు. ఈ క్రమంలో 2022 జనవరిలో వీరిద్దరు పెళ్లి బంధంతో ఒక్కటయ్యామని, ప్రస్తుతం షీన్ ప్రెగ్నెంట్ అని సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. కాగా షిన్ హై ‘‘స్టేర్‌వే టూ హేవెన్, మిరాకిల్ ఇన్ సెల్ నెం.7, యూ ఆర్ బ్యూటీఫుల్, ది హెయిర్స్’’ వంటి సిరీస్‌తో గుర్తింపు పొందింది.
చదవండి: OTT: అమెజాన్‌లో కేజీయఫ్ 2 స్ట్రీమింగ్, ఇకపై ఉచితం
Comments
Please login to add a commentAdd a comment