తమ బిడ్డతో జెసిండా అర్డర్న్ దంపతులు
ఆక్లాండ్: న్యూజిలాండ్ ప్రధాని జెసిండా ఆర్డర్న్ పండంటి ఆడబిడ్డకు బుధవారం ఆక్లాండ్‌లోని ఆస్పత్రిలో జన్మనిచ్చారు. దేశాధినేత హోదాలో ఉండి బిడ్డకు జన్మనిచ్చిన రెండో మహిళగా ఆర్డర్న్ రికార్డుకెక్కారు. 37 ఏళ్ల జెసిండా, 40 ఏళ్ల క్లార్క్ గెఫోర్డ్ దంపతులకు ఈ పాప మొదటి సంతానం. 3.3 కిలోగ్రాముల బరువుతో బిడ్డ ఆరోగ్యంగా ఉందని ఆర్డర్న్ ఇన్‌స్టాగ్రామ్‌లో వెల్లడించారు. ‘కొత్తగా తల్లిదండ్రులైన వారికున్న భావోద్వేగాలే మాకూ ఉన్నాయి. శుభాకాంక్షలు అందజేస్తున్న ప్రజలకు ధన్యవాదాలు’అని పేర్కొన్నారు. పాకిస్తాన్ ప్రధాని బెనజీర్ భుట్టో 1990లో అధికారంలో ఉండగా బిడ్డకు జన్మనిచ్చిన తొలి మహిళగా చరిత్రకెక్కారు. కాగా, లేబర్‌పార్టీ అధ్యక్ష బాధ్య తలు చేపట్టిన మూడు నెలలకు అంటే గతేడాది అక్టోబర్‌లో ఆర్డర్న్ ప్రధాని అయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment