Benazir Bhutto
-
తల్లి బాటలో తనయ.. పాక్ రాజకీయాల్లో ఆమె ఒక సంచలనం
ఏ దేశంలో అయినా ప్రథమ పౌరురాలు అంటే.. ఆ దేశ అధ్యక్షుడో/సుప్రీమో/రాజుగారి భార్యకో ఆ హోదా కల్పిస్తారు. కానీ, బహుశా ప్రపంచంలోనే తొలిసారిగా ప్రథమ పౌరుడి కూతురికి ఆ స్థానం దక్కబోతోంది!. పాకిస్థాన్ ఈ తరహా నిర్ణయానికి వేదిక కానుంది. ఈ క్రమంలోనే అసీఫా భుట్టో పేరు ట్రెండింగ్‌లోకి వచ్చేసింది. పాకిస్థాన్ అధ్యక్షుడు అసిఫ్ అలీ జర్దారీ తన కూతురు అసీఫా భుట్టో జర్దారీ(31)ని ఆ దేశ ప్రథమ పౌరురాలిగా ప్రకటించబోతున్నారు. నేడో రేపో అధికారిక ప్రకటన వెలువడనుందని.. ఆ వెంటనే ప్రొటోకాల్ సహా ప్రథమ పౌరురాలికి దక్కే సముచితమైన అధికారాలు అసీఫాకు దక్కనున్నట్లు స్థానిక మీడియా ఛానెల్స్ కథనాలు వెలువరిస్తున్నాయి. ►అసీఫా భుట్టో జర్దారీ.. అసిఫ్ అలీ జర్దారీ-బెనజీర్ భుట్టోల చిన్నకూతురు. 1993లో జన్మించారామె. జర్దారీ-బెనజీర్‌ల మిగతా ఇద్దరు పిల్లలు బిలావల్ , బక్తావర్లు రాజకీయాల్లోనే ఉన్న సంగతి తెలిసిందే ►పాక్ తొలి మహిళా ప్రధాని బెనజీర్ భుట్టో తనయగా పాక్ ప్రజల్లో అసీఫాపై సానుభూతి ఉంది. బెనజీర్ భుట్టో 2007లో హత్యకు గురైన సంగతి తెలిసిందే. ►అసీఫా విద్యాభ్యాసం అంతా విదేశాల్లోనే సాగింది. ఆక్స్ఫర్డ్ బ్రూక్స్ యూనివర్సిటీ, యూనివర్సిటీ కాలేజీ లండన్, యూనివర్సిటీ ఆఫ్ ఎడిన్బర్గ్లో విద్యాభ్యాసం పూర్తి చేశారామె. ►2020లో పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ(PPP) తరఫున ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగుపెట్టారామె ►పాక్ పవర్ఫుల్ లేడీగా పేరున్న బెనజీర్ తనయగా.. పీపీపీలో అంచెలంచెలుగా ఎదిగి తనకంటూ ఒక స్థానాన్ని సంపాదించుకున్నారు అసీఫా. ►బిలావల్ గతంలో విదేశాంగ మంత్రిగా పని చేసినా.. అసీఫానే తన తండ్రితో ఎక్కువగా కనపడతారు. ►తండ్రి అసిఫ్ జర్దారీకి ఆమె తొలి నుంచి వెన్నంటే నిల్చుంది. పలు కేసుల్లో జర్దారీ ఆభియోగాలు ఎదుర్కొన్నప్పుడు.. ఆయన తరఫున న్యాయపోరాటంలో పాల్గొంది అసీఫానే ►రాజకీయ ప్రసంగాలు, ర్యాలీలలో చురుకుగా పాల్గొనే అసీఫాను.. జూనియర్ బెనజీర్ భుట్టోగా అభివర్ణిస్తుంటుంది అక్కడి మీడియా ►2022లో ఖనేవాల్‌లో పీపీపీ ఊరేగింపు సందర్భంగా ఆసిఫా తన సోదరుడు బిలావల్‌తో కలిసి వెళుతుండగా మీడియా డ్రోన్ ఢీకొట్టింది. ఆమెకు స్వల్ప గాయాలయ్యాయి. ►పాక్ ఎన్నికల్లో పీపీపీ తరఫున ప్రధాని అభ్యర్థిగా బిలావర్ భుట్టోను ప్రకటించింది. అసీఫా మాత్రం ఎన్నికల్లో పోటీ చేయలేదు. ఇక పీఎల్‌ఎం-ఎన్తో కలిసి కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసే క్రమంలో పీపీపీ పలు షరతులు విధించినట్లు తెలుస్తోంది ►ఇందులో భాగంగానే అసిఫ్ అలీ జర్దారీ కుటుంబానికి కీలక పదవులు, బాధ్యతలు దక్కనున్నట్లు స్పష్టమవుతోంది ►పోలియో నిర్మూలన కార్యక్రమానికి పాక్ అంబాసిడర్‌గా అసీఫా భుట్టో ఉన్నారు ►అసీఫా తండ్రి, పీపీపీ సహా వ్యవస్థాపకుడు అసిఫ్ అలీ జర్దారీ మార్చి 10వ తేదీన పాక్ అధ్యక్షుడిగా ప్రమాణం చేశారు. పాక్ చరిత్రలో రెండోసారి అధ్యక్ష పదవి చేపట్టిన వ్యక్తిగా(మిలిటరీ అధిపతుల్ని మినహాయించి) అసిఫ్ చరిత్ర సృష్టించారు. గతంలో 2008-13 మధ్య ఆయన పాక్ అధ్యక్ష బాధ్యతలు చేపట్టారు -
నాటకీయత లేని యాక్షన్ సినిమా
ఒక దౌత్యవేత్త జీవితంలోని ఘటనలు పూర్తిస్థాయి యాక్షన్ సినిమాకేమీ తీసిపోవు. ముఖ్యంగా ఆయన లెబనాన్ అంతర్యుద్ధ కాలంలో చురుగ్గా ఉన్నవాడూ; మాజీ ప్రధానులు బేనజీర్ భుట్టో, రాజీవ్ గాంధీ మధ్య రహస్య సందేశాల వినిమయానికి తోడ్పడ్డవాడూ అయినప్పుడు! అందుకే ‘ఎ డిప్లొమాట్స్ గార్డెన్’ పుస్తకం ఉర్రూతలూగిస్తుందనుకుంటాం. కానీ విషయ తీవ్రత ఎలాంటిదైనా, చలిమంట కాచుకుంటూ, నింపాదిగా మాట్లాడే శైలి ఆఫ్తాబ్ సేఠ్ది. ఢిల్లీలోని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖకు దశాబ్దాల పాటు నివేదికలను డిక్టేటు చేసిన ప్రభావం ఆయన శైలిలో స్పష్టంగా కనబడుతుంది. దౌత్యవేత్తగా ఆయన మనసు ఎప్పుడూ నాటకీయతను శూన్యం చేయడంపైనే ఉంటుందని ఈ పుస్తకం చెబుతుంది. ఒక భారతీయ దౌత్యవేత్త జీవితం ఎలా ఉంటుందోనని మీకు ఎప్పుడైనా అనిపించి ఉంటే, ఒక్కసారి ఆఫ్తాబ్ సేఠ్ జ్ఞాపకాల్లోకి తొంగిచూడండి. లెబనాన్ అంతర్యుద్ధ కాలంలో ఆయన చురుగ్గా ఉన్నారు, పాకిస్తాన్ మాజీ ప్రధాని బేనజీర్ భుట్టో, భారత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ మధ్య రహస్య సందేశాల వినిమయానికి తోడ్పడ్డారు. అంతేనా? జపాన్ రాజ కుటుంబంతో విందులారగించడం మొదలుకొని, మంచానపడ్డ గ్రీకు ప్రధాన మంత్రులను ఆసుపత్రుల్లో పలకరించడం, మయన్మార్ విప్లవ నేత ఆంగ్‌సాన్ సూకీ దివంగత భర్త మైకేల్ ఆరిస్‌తో కలిసి కుట్రలు పన్నడం వరకూ దౌత్యవేత్తగా ఆఫ్తాబ్ చేసిన పనులు ఎన్నో! ఈ ఘటనలన్నీ పూర్తిస్థాయి యాక్షన్ సినిమాకేమీ తీసిపోవు. బహుశా ఇవి ఆయన ‘అడ్రినలిన్’ను ఎప్పుడూ పైపైకి ఎగబాకించి ఉంటాయి కూడా. కానీ సుశిక్షితుడైన దౌత్యవేత్తగా ఆఫ్తాబ్ రాసిన ‘ఎ డిప్లొమాట్స్ గార్డెన్ ’ పుస్తకం ఇలాంటి గాథలను పల్లెసీమల రోడ్ల మీద తిరిగే కారు వేగంలా నెమ్మదిగా వివరిస్తుంది. విషయం చాలా గొప్పది కావచ్చు కానీ చెప్పే శైలి మాత్రం ఆచితూచి, ప్రశాంతంగా ఉంటుంది. విషయ తీవ్రత ఎంత ఉన్నా, చలిమంట కాచుకుంటూ, నింపాదిగా నోట్లోని చుట్టతో పొగలు ఊదుకుంటూ, దేనికీ చలించని వ్యక్తిగా ఆఫ్తాబ్ను మనం ఊహించుకోవచ్చు. పుస్తకంలోని చాలా వాక్యాలు ‘ఒకసారి గుర్తు చేసుకుంటే’, ‘గుర్తుంచుకోవాల్సిన అంశం’, ‘ఇంతకుముందే చెప్పినట్లు’, ‘దీని గురించి క్లుప్తంగా చెప్పుకుని’ వంటి పదబంధాలతో మొదలవుతాయి. ‘దీని వివరాలు మనల్ని నిలిపి ఉంచకూడదు’ అన్నదీ తరచుగా కని పిస్తుంది. కొన్నిసార్లు అధ్యాయాల మధ్యలో ‘ఇప్పుడు మనం అసలు కథలోకి వెళితే’ అని ఉంటుంది. దశాబ్దాలపాటు ఢిల్లీలోని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖకు నివేదికలను డిక్టేటు చేసిన ప్రభావం స్పష్టంగా కనబడుతుంది. కానీ తలుచుకుంటే ఆఫ్తాబ్ సేఠ్ భాష గాల్లోకి లేస్తుంది, ఆయన విశేషణాలు ఆకాశాన్ని అంటుతాయి. ‘‘భయంకరమైన తరచుదనంతో కాండ్రించి ఉమ్మడం ఆయనకున్న ఒకానొక ఇబ్బందికరమైన అల వాటు. అదృష్టం ఏమిటంటే, ఆ ఉమ్మడమేదో తన కుర్చీ దగ్గరగానే పెట్టుకున్న ఉమ్మితొట్టెలోకి పడేలా చాకచక్యంగా ఊసేవాడు.’’ సేఠ్ భాషకు మచ్చుకు ఒక ఉదాహరణ ఇది. జాగ్రత్తగా తూచినట్టుండే ఆయన శైలి అప్పటికి ఆదరణీయం కాకపోయినా, ఆయన చేసిన పనులు, కలిసిన మనుషుల గురించి తెలిస్తే మాత్రం సంబరపడేన్ని కథలు ఉన్నాయనిపిస్తుంది. చిన్న ఉదాహరణ చూద్దాం. లెబనాన్ అంతర్యుద్ధం తీవ్రంగా జరుగుతున్న కాలంలో ఆఫ్తాబ్ బీరూట్‌లో ఉన్నారు. ఒక పక్క బాంబుల వర్షం, ఇంకోపక్క కుప్ప కూలుతున్న భవనాలు... వీటన్నింటి మధ్యలో సేఠ్ తన ఫ్లాట్ ముంగిట్లో నిద్ర పోయారట. పడే బాంబు ఏదో నేరుగా భవనం మీద పడవచ్చునన్న అంచనాతో! వాళ్ల డ్రైవర్ అలీ ‘‘కదులు తున్న దేనిమీదికైనా విచ్చలవిడిగా దూసుకొస్తున్న తుపాకీ గుళ్ల నుంచి తప్పించేందుకు కారును వాయువేగంతో ముందుకు ఉరికించాడు.’’ ఆఫ్తాబ్ భార్య పోలా అప్పుడు రెండోసారి గర్భవతిగా ఉన్నారు. పురిటినొప్పులు తెల్లవారుఝామున మూడు గంటల సమయంలో మొదలయ్యాయి. ఆ సమయంలో ఆంబులెన్ ్స కూడా అందుబాటులో లేదు. తానే సొంతంగా కాన్పు చేసేందుకు కూడా సేఠ్ సిద్ధమయ్యారు. అయితే, అదృష్టవశాత్తూ ఆ అవసరం రాలేదు. ఈ పుస్తకం మొత్తం ఉత్కంఠభరితంగా ఉంటుంది కానీ ఈ విషయాలన్నీ చెప్పే విషయంలో ఆఫ్తాబ్ చాలా డిప్లొమాటిక్‌గా వ్యవహరించారని చెప్పాలి. బేనజీర్ భుట్టో విషయాలు చెప్పేటప్పుడు ఆయనెంత జాగ్రత్తగా వ్యవహరించారన్నది స్పష్టంగా తెలుస్తుంది. బేనజీర్ ఓ అద్భుతమైన వ్యక్తి. ఆమె గురించి ఆఫ్తాబ్కూ బాగా తెలుసు. కరాచీ, లార్కానాల్లోని భుట్టో ఇళ్లకు ఆయన వెళ్లేవారు. అలాగే మలేసియా, న్యూఢిల్లీల్లోని హోటళ్లలోనూ సమావేశాలు, చర్చలు నడిచేవి. రాజీవ్ గాంధీ నుంచి వచ్చే రహస్య సందేశాలు ఇలాంటి సమావేశాల్లోనే చేతులు మారేవి. కానీ ఈ సందేశాల గురించి ఆయన మనోహరమైన మౌనం పాటిస్తారు. ఈ అధ్యాయం ఎంత అద్భుతంగా మారి ఉండేది! కానీ ఏం చేస్తాం? తన వజ్రాలను సానపెట్టడం కాకుండా, వాటిని ఇలాంటి వాక్యాలతో రాళ్లలా మార్చేశారు. ‘‘మాజీ ప్రధాని వ్యక్తిత్వం గురించి తమకు తెలిసిన అరుదైన విషయాలను రోషన్(ఆఫ్తాబ్ సోదరుడు)తో భుట్టోలు పంచుకున్నారు’’ అని రాస్తారు. కానీ ఆ విషయాలు ఏమిటో వెల్లడించరు. బేనజీర్తో జరిగిన ఒక సమావేశం గురించి ఆయన రాశారు. ఇందులో బేనజీర్ మిలిటరీ కార్యదర్శి ఆ సమావేశాన్ని అడ్డుకునేందుకు ‘‘తప్పుడు ఆఫ్తాబ్’’ గురించి చెబుతారు. ప్రతిగా బేనజీర్ ‘‘రహస్యంగా వినే మైక్రోఫోన్లను గందరగోళ పరిచేందుకు రేడియో సౌండ్ పెంచారు’’ అని రాశారు. దౌత్యవేత్తగా ఆయన మనసు నాటకీయతను సున్నా చేయడంపైనే ఉంటుంది. ‘‘నింపాదిగా భోంచేస్తూ పాకిస్తాన్ స్థానిక రాజకీయ పరిస్థితిపై కూడా చర్చించాము’’ అని రాయడం ఇలాంటిదే. అదృష్టం ఏమిటంటే, కొన్ని సందర్భాల్లో ఆఫ్తాబ్ విచక్షణకు కాకుండా, ధైర్యానికి ప్రాధాన్యం ఇవ్వడం. ఇలాంటి సందర్భాల్లోనే నియంత్రణలో నడిపే ఆయన వాక్యాలు సంకెళ్ల నుంచి తప్పించుకుంటాయి. కౌలాలంపూర్‌లోని ఓ రెస్టారెంట్లో బేనజీర్తో ఇద్దరిద్దరుగా భోంచేసిన కథ ఈ కోవకు చెందుతుంది. వారిద్దరూ ఒక టేబుల్ మీద ఉండగా, వారి సంభాషణను చెవులు రిక్కించినా వినలేనంతగా పదిహేను అడుగుల దూరంలో ఉన్న పాకిస్తాన్ విదేశాంగ మంత్రి గుడ్లగూబలా చూస్తూ ఉండటం! ప్రధానిగా పాక్ అధ్యక్షుడితో తాను ఎదుర్కొంటున్న సమస్య లేమిటో ఆమె వివరంగా ఆఫ్తాబ్కు తెలిపిన సందర్భమిది. దాంతో పాటే ‘‘ఆయన రహస్య కార్యకలాపాల జాబితా’’ గురించి కూడా చర్చకు రావడం ఇక్కడ చెప్పుకోవాల్సిన అంశం. ఆ క్షణంలోనే విదేశాంగ మంత్రి యాకూబ్ ఖాన్‌ను విస్మరించి చాలా సమయమైందని బేనజీర్ అనుకున్నారో ఏమో, తమతో కలవమన్నట్టుగా ఆయన వైపు చూస్తూ సంజ్ఞ చేశారనీ, అలాగే మాట్లాడుతున్న అంశాన్ని కూడా ‘‘ఏదేదో ఊహించుకునే యాకూబ్ మనసుకు సాంత్వన ఇచ్చేలా’’ పాకిస్తాన్లో ఎవరికైనా చిర్రెత్తించే ‘జిన్నా హౌస్’ వైపు మళ్లించారనీ ఆఫ్తాబ్ రాశారు. ఇలాంటి పూవులే ఆఫ్తాబ్ సేఠ్ ఉద్యానవనంలో మనల్ని ఉల్లాసపరుస్తాయి. కరణ్ థాపర్ వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్ -
నిశ్చితార్థం జరిగింది: బఖ్తావర్ భావోద్వేగం!
ఇస్లామాబాద్: పాకిస్తాన్ మాజీ అధ్యక్షుడు అసిఫ్ అలీ జర్దారీ- దివంగత ప్రధాని బేనజీర్ భుట్టోల కుమార్తె బఖ్తావర్ భుట్టో జర్దారీ త్వరలోనే వివాహ బంధంలో బంధంలో అడుగుపెట్టనున్నారు. అమెరికాకు చెందిన వ్యాపారవేత్త కుమారుడు మహ్మద్ చౌదరిని ఆమె పెళ్లి చేసుకోనున్నారు. కరాచిలోని బిలావల్ హౌజ్‌లో వీరిద్దరి నిశ్చితార్థం శుక్రవారం అంగరంగ వైభవంగా జరిగింది. సుమారు 100- 150 మంది అతిథులు ఈ శుభకార్యంలో పాల్గొని కాబోయే వధూవరులకు ఆశీస్సులు అందజేశారు. అందరికీ ధన్యవాదాలు: బఖ్తావర్ భుట్టో- జర్దారీ కుటుంబ సన్నిహితులతో పాటు పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ(పీపీపీ) నేతలు, ఇతర రాజకీయ నాయకులు, బిజినెస్ టైకూన్లు, న్యాయవాదులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను బఖ్తావర్ తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేశారు. ‘‘ఇది సెంటిమెంటల్, ఎమోషనల్ డే. మాపై ప్రేమను కురిపిస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ముఖ్యంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్న పీపీపీ కుటుంబానికి థాంక్స్. ఇది ఆరంభం మాత్రమే. ఆ దేవుడి దయతో భవిష్యత్ వేడుకలు ఘనంగా చేసుకుందాం’’ అంటూ ఉద్వేగానికి లోనయ్యారు. (చదవండి: త్వరలోనే పెళ్లి చేసుకోనున్న ప్రధాని!) వీడియోకాల్‌లో విష్ చేసిన బిలావల్ బఖ్తావర్ సోదరుడు, రాజకీయ నాయకుడు బిలావల్ భుట్టోకు గతవారం కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయిన సంగతి తెలిసిందే. దీంతో ప్రస్తుతం అతడు ఐసోలేషన్‌లో ఉన్నాడు. ఈ క్రమంలో వీడియో కాల్లో సోదరిని విష్ చేయగా.. అనారోగ్య కారణాలతో గత నెలలో ఆస్పత్రిపాలైన అసిఫ్ అలీ జర్దారీ ఆరోగ్యం కాస్త కుదుటపడటంతో బిలావల్ హౌజ్‌కు చేరుకున్న ఆయన కూతురి నిశ్చితార్థ తంతును దగ్గరుండి జరిపించారు. Very sentimental & emotional day. So grateful for everyone’s love & prayers. Especially our PPP family whom I know are eager to participate. InshAllah this is only the beginning - will be able to celebrate in a post Covid world. Please keep SMBB and our family in your prayers💗🤗 — Bakhtawar B-Zardari (@BakhtawarBZ) November 27, 2020 -
అభినందన్‌ను విడిచిపెట్టండి: ఫాతిమా భుట్టో
ఇస్లామాబాద్ : పాకిస్తాన్ ఆర్మీకి చిక్కిన భారత పైలట్‌ను విడుదల చేయాలని పాక్ మాజీ ప్రధాని జుల్ఫికర్ అలీ భుట్టో మనుమరాలు, పాకిస్తానీ రచయిత్రి ఫాతిమా భుట్టో ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వాన్ని కోరారు. పాకిస్తాన్ దాడులను తిప్పి కొట్టే క్రమంలో విక్రమ్ అభినందన్ అనే భారత పైలట్ ఆ దేశ సైన్యానికి పట్టుబడ్డ సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆయనను హింసించినట్లుగా ఉన్న వీడియోలు బహిర్గతం కావడంతో యావత్ భారతావని ఆందోళనలో మునిగిపోయింది. దీంతో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తత తారస్థాయికి చేరింది. ఈ నేపథ్యంలో తనతో పాటు పాకిస్తానీ యువత మొత్తం అభినందన్‌ను క్షేమంగా భారత్ పంపించాలని కోరుకుంటున్నారంటూ ఫాతిమా కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు న్యూయార్క్ టైమ్స్‌లో ఆమె కథనం రాసుకొచ్చారు.(ఎవరీ విక్రమ్ అభినందన్?) అనాథలుగా మారాలనుకోవడం లేదు... ‘శాంతి, మానవత్వం, నిబంధనల పట్ల నిబద్ధత కనబరిచి భారత పైలట్‌ను విడుదల చేయండి. మా జీవితంలో గరిష్ట కాలమంతా యుద్ధ వాతావరణంలోనే గడిపాము. పాకిస్తాన్ సైనికులు గానీ భారత సైన్యం గానీ చనిపోవాలని నేను కోరుకోవడం లేదు. ఉపఖండం అనాథలుగా మిగిలిపోవాలని అనుకోవడం లేదు కూడా. మా తరం పాకీస్తానీలు మాట్లాడే హక్కు కోసం నిర్భయంగా పోరాడారు. అందరినీ క్షేమంగా ఉంచే శాంతి కోసం మా గళం వినిపించడానికి మేము ఎల్లప్పుడూ సిద్ధమే. కానీ సైనిక పాలన, ఉగ్రవాదం, ఇతర సంక్షోభ పరిస్థితులు ఎదుర్కొన్న కారణంగా మతదురభిమానానికి, యుద్ధానికి మేము వ్యతిరేకం. శాంతిని దూరం చేసే ఈ అంశాలను మేము అస్సలు సహించలేం’ అని పాక్ మాజీ ప్రధాని బేనజీర్ భుట్టో మేనకోడలు ఫాతిమా పేర్కొన్నారు. ఇక ప్రపంచ వ్యాప్తంగా బుధవారం మధ్యాహ్నం నుంచి #saynotowar అనే హ్యాష్ ట్యాగ్.. మొదట పాకిస్తాన్లో ట్రెండ్ అయిన విషయాన్ని ప్రస్తావించిన ఫాతిమా... ‘ పొరుగదేశంతో మా దేశం శాంతియుతంగా ఉన్న సందర్భాన్ని నేనెప్పుడూ చూడలేదు. కానీ ప్రస్తుతం నాలాగే చాలా మంది భారత్- పాక్‌ల మధ్య ఉన్న ఉద్రిక్తత తొలగిపోవాలని ఆశిస్తున్నారు’ అని వ్యాఖ్యానించారు. కాగా పుల్వామా ఉగ్రదాడి, సర్జికల్ స్ట్రైక్స్ నేపథ్యంలో గత కొన్ని రోజులుగా భారత్- పాకిస్తాన్ల మధ్య యుద్ధ వాతావరణం నెలకొన్న సంగతి తెలిసిందే. -
పండంటి బిడ్డకు జన్మనిచ్చిన దేశాధినేత
ఆక్లాండ్: న్యూజిలాండ్ ప్రధాని జెసిండా ఆర్డర్న్ పండంటి ఆడబిడ్డకు బుధవారం ఆక్లాండ్‌లోని ఆస్పత్రిలో జన్మనిచ్చారు. దేశాధినేత హోదాలో ఉండి బిడ్డకు జన్మనిచ్చిన రెండో మహిళగా ఆర్డర్న్ రికార్డుకెక్కారు. 37 ఏళ్ల జెసిండా, 40 ఏళ్ల క్లార్క్ గెఫోర్డ్ దంపతులకు ఈ పాప మొదటి సంతానం. 3.3 కిలోగ్రాముల బరువుతో బిడ్డ ఆరోగ్యంగా ఉందని ఆర్డర్న్ ఇన్‌స్టాగ్రామ్‌లో వెల్లడించారు. ‘కొత్తగా తల్లిదండ్రులైన వారికున్న భావోద్వేగాలే మాకూ ఉన్నాయి. శుభాకాంక్షలు అందజేస్తున్న ప్రజలకు ధన్యవాదాలు’అని పేర్కొన్నారు. పాకిస్తాన్ ప్రధాని బెనజీర్ భుట్టో 1990లో అధికారంలో ఉండగా బిడ్డకు జన్మనిచ్చిన తొలి మహిళగా చరిత్రకెక్కారు. కాగా, లేబర్‌పార్టీ అధ్యక్ష బాధ్య తలు చేపట్టిన మూడు నెలలకు అంటే గతేడాది అక్టోబర్‌లో ఆర్డర్న్ ప్రధాని అయ్యారు. -
బెనజీర్ హత్య.. విస్మయపరిచే వాస్తవం!
కరాచి : పాకిస్థాన్ మాజీ ప్రధాని బెనజీర్ భుట్టో హత్య కేసులో సంచలన విషయాన్ని పాక్ వెల్లడించింది. ఆమె హత్య కుట్ర వెనక ఉంది ఆల్‌ఖైదా మాజీ చీఫ్ ఒసామా బిన్‌లాడెన్ అని పేర్కొంది. ఆమె మరణించి పదేళ్లు పూర్తి కావస్తున్నందున(డిసెంబర్ 27, 2017) పాక్ గూఢాచారి సంస్థ ఐఎస్ఐ రూపొందించిన ఓ నివేదికను ప్రభుత్వం బయటపెట్టింది. అల్ ఖైదా, బిన్ లాడెన్ ఆధ్వర్యంలోనే ఆమె హత్యకు ప్రణాళిక రచించారు. అంతేకాదు ఆ సమయంలో బెనజీర్తోపాటు ముషార్రఫ్, జమైత్ ఉలేమా ఈ ఇస్లాం ఫజల్ చీఫ్ ఫజ్లుర్ రెహమాన్‌ను కూడా లేపేయాలని లాడెన్ నిర్ణయించుకున్నాడు. ఇందుకు సంబంధించి అప్రమత్తంగా ఉండాలని సిబ్బందికి ఆర్మీ అధికారులు హెచ్చరికలను జారీ చేశారు. ‘లాడెన్ తన కొరియర్ ముసా తరీఖ్ను ముల్తాన్‌కు పంపించాడు. వజిరిస్థాన్ నుంచి పెద్ద ఎత్తున్న పేలుడు పదార్థాలను ముసా తీసుకెళ్లాడు. వచ్చే ఆదివారం (డిసెంబర్ 22న) భారీ నర మేధానికి అల్‌ఖైదా శ్రీకారం చుట్టింది’ అంటూ ఓ లేఖ ఆర్మీకి అందింది. మరుసటి రోజు అంటే సరిగ్గా ఆమె హత్యకు ఆరు రోజుల ముందు మరో హెచ్చరిక కూడా జారీ అయ్యింది. కానీ, ఆమె మాత్రం వాటిని పెడచెవిన పెట్టారు. ఇక ఆ ఫ్లాన్ మొత్తం అఫ్ఘనిస్థాన్ నుంచి లాడెన్ స్వయంగా పర్యవేక్షించాడంట. ఈమేరకు డిసెంబర్ 27, 2007న రావల్పిండి వద్ద ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆమెను బాంబు దాడిలో హత్య చేశారు. ఆమె హత్యానంతరం తమ ఫ్లాన్ సక్సెస్ అయినట్లు ఓ లేఖ కూడా లాడెన్‌కు అందినట్లు ఐఎస్ఐ పేర్కొంది. పరిస్థితులు చల్లబడ్డాకే లాడెన్ తిరిగి పాక్‌కి తిరిగి వెళ్లినట్లు తెలుస్తోంది. పర్యవేక్షణ చేసింది లాడెనే అయినా ఆమె మరణం ద్వారా ఎక్కువ లబ్ధి(రాజకీయ) పొందాలనుకున్న వారే ఈ కుట్ర వెనుక ఉన్నారన్నది ఆమె అనుచరుల వాదన. అయితే అది ఎవరన్న ప్రశ్న పదేళ్ల తర్వాత కూడా ఇప్పటికీ మిస్టరీగానే మిగిలిపోయింది. కాగా, తమ భూభాగంలో లాడెన్ తలదాచుకోలేదని పాక్ వాదించినప్పటికీ.. అమెరికా భద్రతా దళాలు మాత్రం అబ్బోట్టాబాద్లో లాడెన్ ను(2011 మే నెలలో) మట్టుపెట్టిన విషయం తెలిసిందే. -
భుట్టో హత్యలో జర్దారీ ప్రమేయం
ఇస్లామాబాద్ : పాకిస్తాన్ మాజీ ప్రధానమంత్రి బేనజీర్ భుట్టోను హత్య చేయడంలో ఆమె భర్త ఆసిఫ్ ఆలీ జర్దారీ ప్రమేయం ఉందని మాజీ సైనిక నియంత పర్వేజ్ ముషారఫ్ స్పష్టం చేశారు. భుట్టో హత్య, అప్పటి పరిస్థితులు, జర్దారీ పాత్రను వివరిస్తూ.. ముషారఫ్ ఒక వీడియోను తన ఫేస్బుక్లో పోస్ట్ చేశారు. బేనజీర్, ముర్తాజా భుట్టోల హత్యలో ఆసిఫ్ ఆలీ జర్దారీ పాత్ర ఉందని ముషారఫ్ అందులో స్పష్టం చేశారు. జర్దారీతో భుట్టో తనయులు.. సింధ్ ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. బేనజీర్ హత్యతో వాస్తవంగా ఎవరు లాభం పొందారు? ఆ హత్య తరువాత నేను అన్నీ కోల్పోయాను.. పదవి, అధికారం సహా.. చిట్ట చివరకు దేశాంతరం వెళ్లాల్సివచ్చింది. కానీ.. ఆ హత్యతోనే జర్దారీ దేశాధ్యక్షుడు అయ్యారు. సహజంగానే లాభం పొందిన వాళ్లు.. ఆ హత్యను నాపై రుద్దారు.. అని ముషారఫ్ పేర్కొన్నారు. -
బేనజీర్ హత్య కేసులో ఇద్దరికి శిక్ష
♦ ముషారఫ్ పరారీలో ఉన్నారన్న కోర్టు ♦ ఈ కేసు నుంచి ఐదుగురికి విముక్తి రావల్పిండి: పాకిస్తాన్ మాజీ ప్రధాని బేనజీర్ భుట్టో హత్య కేసులో ఇద్దరికి 17 ఏళ్ల జైలు శిక్షను విధిస్తూ ఆ దేశ యాంటి టెర్రరిస్ట్ కోర్టు గురువారం తీర్పు వెలువరించింది. ఈ కేసులో నిందితుడిగా ఉన్న పాక్ మాజీ అధ్యక్షుడు జనరల్ పర్వేజ్ ముషారఫ్‌ను పరారీలో ఉన్నట్లు కోర్టు పేర్కొంది. బేనజీర్ హత్య జరిగిన పదేళ్ల తరువాత కోర్టు తీర్పును ప్రకటించింది. ఈ ఘటన సమయంలో రావల్పిండి పోలీస్‌కమిషనర్‌గా ఉన్న సౌద్ అజీజ్‌తోపాటు రావల్పిండి పట్టణ ఎస్పీ ఖుర్రం షహ్‌జాద్‌కు చెరో 17 ఏళ్ల జైలు శిక్షతోపాటు రూ.5 లక్షల జరిమానా విధించింది. ఈ హత్య కేసులో అనుమానితులుగా ఉన్న రఫీక్ హుస్సేన్, హుస్సన్ గుల్, షేర్ జమాన్, ఇంతియాజ్ షా, అబ్దుల్ రషీద్‌లకు కోర్టు విముక్తి ప్రసాదించింది.పాక్ మాజీ ప్రధాని, పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ అధినేత్రి అయిన బేనజీర్ భుట్టో 2007 డిసెంబర్ 27న రావల్పిండిలో జరిగిన ఒక పబ్లిక్ మీటింగ్‌లో పాల్గొన్నారు. అదే సమయంలో ఆమెను లక్ష్యంగా చేసుకుని ముష్కరులు బాంబు పేల్చడంతో బేనజీర్ మృతిచెందారు. -
బెనజీర్ను చంపిందెవరు..?
‘‘నేను పాక్‌కు వెళ్లాలనుకుంటున్నా..’’ అంటూ మనసులో మాట బయటపెట్టింది భుట్టో. ఆమె సన్నిహితులు ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు. ‘మీకు ఏమైనా పిచ్చి పట్టిందా..? ఈ పరిస్థితుల్లో పాక్‌కు వెళ్లడం అవసరమా..’ కొందరు ధైర్యం చేసి గొంతు సవరించారు. ఇంకొందరైతే ఓ అడుగు ముందుకేసి, ‘మీరు వెళ్లకూడదంతే..’ అంటూ అడ్డుతగిలారు. కానీ, బెనజీర్ భుట్టో మొండిఘటం. ఎవరి మాటా వినలేదు. చివరకు నిఘా వర్గాల మాట కూడా..! 2007 అక్టోబర్ 18.. బెనజీర్ భుట్టో పాక్‌కు వెళ్లేందుకు సిద్ధంగా ఉంది. ఎవరెన్ని చెప్పినా ఆమె వినిపించుకునే స్థితిలో లేదు. ఒకటా రెండా.. ఎనిమిదేళ్లు! దేశానికి దూరంగా.. ఎవరో విసిరేస్తే ఎగిరిపడినట్టు, విదేశాల్లో పడింది. దుబాయ్, బ్రిటన్లలో భారంగా కాలం వెళ్లదీసింది. స్వదేశాన్ని చూడాలని, పాక్ ప్రజల జేజేలు అందుకోవాలనీ ఆమెకూ ఆత్రంగానే ఉండేది. కానీ, ఏమీ చేయలేని నిస్సహాయ స్థితి. పాక్‌ను ముషారఫ్ ఏలుతున్నాడు. అసలే సైనికాధ్యక్షుడు, ఆపై నియంత.. తలచుకుంటే ఏదైనా చేయగలడు. అందుకే అన్ని రోజులూ అజ్ఞాతంలో గడిపింది. ఇక, ఉపేక్షించి లాభం లేదు. పాక్‌కు ఎలాగైనా వెళ్లాల్సిందే. నాలుగు నెలల్లో జరగబోయే ఎన్నికల్లో గెలిచి అధికారం చేపట్టాల్సిందే. భయపడితే కుదరదు. అయినా, రెండు సార్లు దేశానికి ప్రధానిగా పనిచేసిన తాను భయపడటమా..? నెవర్! కొన్ని గంటల వ్యవధిలోనే భుట్టో విమానం కరాచీలోని జిన్నా అంతర్జాతీయ విమానాశ్రయంలో ల్యాండ్ అయింది. బయట వేల సంఖ్యలో మద్దతుదారులు. పాకిస్థాన్ పీపుల్స్ పార్టీకి చెందిన కార్యకర్తలు ఓ మానవ హారంలా ఏర్పడ్డారు. వారి మధ్యలోంచి బెనజీర్ భుట్టో ర్యాలీ. ఎనిమిదేళ్ల తర్వాత స్వదేశానికి చేరుకున్న ఆమె ముక్కు పుటాలకు కమ్మని మట్టివాసన తాకిందో లేదో గానీ, క్షణాల వ్యవధిలోనే బాంబుల వాసన చుట్టేసింది. ర్యాలీలో రెండు బాంబులు పేలి భారీ విధ్వంసం జరిగింది. భుట్టో ఎలాగో ప్రాణాలతో బయటపడింది. కానీ, 139 మంది మరణించారు. 450 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. ఈ స్థాయి ఘన స్వాగతాన్ని భుట్టో ఊహించలేదు. అప్పుడు గుర్తొచ్చాయి అమెకు సహచరుల హెచ్చరికలు! వెంటనే దేశాధ్యక్షుడు ముషారఫ్‌కు లేఖ రాసింది. తనకు, తన భర్త అసిఫ్ అలీ జర్దారీకి భద్రత పెంచమంది. బుల్లెట్ ప్రూఫ్ అద్దాలు, బాంబులను నియంత్రించే జామర్లు, ప్రైవేటు గార్డులు, నాలుగు పోలీసు వాహనాలు.. ఇలా ఏవేవో కోరింది. ముగ్గురు అమెరికన్ సెనేటర్లు కూడా ఇదే విషయమై ముషారఫ్‌కు లేఖలు రాశారు. అయితే, అవన్నీ బుట్టదాఖలే అయ్యాయి. భుట్టోకు మెల్లమెల్లగా పరిస్థితి అర్థమైంది. ‘ఇలాగే అయితే కష్టం.. తన ప్రాణాలు ఎన్నో రోజులు నిలవవు..’ అనుకుంది. అమెరికా గూఢచారి సంస్థ సీఐఏకు, బ్రిటన్ ప్రభుత్వానికి చెందిన స్కాట్లాండ్ యార్డ్‌కు, ఇజ్రాయెల్‌లోని మొసాద్లకు లేఖలు రాసింది. తన భద్రత కోసం అభ్యర్థించింది. అయితే, పాక్‌తో దౌత్య సంబంధాల దృష్ట్యా ఈ దేశాల నుంచీ ఆమెకు స్పందన కరవైంది. చిట్టచివరగా అమెరికా, బ్రిటన్‌లలోని అత్యుత్తమ ప్రైవేట్ ఏజెన్సీలైన ‘బ్లాక్‌వాటర్’, ‘ఆర్మర్ గ్రూప్’లను తనకు రక్షణ కల్పించాల్సిందిగా కోరింది. ఈ రెండు ఏజెన్సీలు ముందుకొచ్చాయి. కానీ, పాక్ ప్రభుత్వం ఈ సంస్థలకు వీసా నిరాకరించింది. విదేశీ శక్తులను దేశంలోకి అనుమతించబోమని తేల్చి చెప్పింది. దీంతో ఏం చేయాలో పాలుపోని స్థితిలోనే జనవరిలో జరగబోయే ఎన్నికల కోసం కసరత్తులు మొదలుపెట్టింది భుట్టో. పార్టీ మేనిఫెస్టో రూపొందించి, జనాల్లోకి దూసుకెళ్లింది. ప్రజలు ఆమెకు బ్రహ్మరథం పట్టారు. ఎక్కడికి వెళ్లినా జనమే జనం! దీనికితోడు అమెరికా గూఢచారి సంస్థ సీఐఏ ఆమెకు నిఘా విషయంలో రహస్యంగా సహాయం చేస్తానని మాటిచ్చింది. ఈ ఉత్సాహంతో మరింత దూకుడు పెంచింది భుట్టో. 2007, డిసెంబర్ 27న రావల్పిండిలో ఓ ర్యాలీ ఏర్పాటు చేసింది. ర్యాలీ విజయవంతంగా ముగిశాక, తన టయోటా ల్యాండ్ క్రూజర్ వాహనంలోకి చేరుకుంది. అయినా, చుట్టూ జనమే! ఈలోగా కారు లోపలి వ్యక్తులు కొందరు.. సన్ రూఫ్‌ను తెరచి అభిమానులకు మరోసారి అభివాదం చేయాలంటూ సలహాలిచ్చారు. భుట్టో కూడా అదే చేసింది. సన్ రూఫ్ నుంచి బయటకు తల పెట్టి, ప్రజలకు అభివాదాలు చేసింది. అంతే.. కొద్ది సెకన్ల వ్యవధిలోనే ఘోరం జరిగిపోయింది. ఎవరు కాల్చారో.. ఏ వైపు నుంచి కాల్చారో కానీ.. భుట్టో తలలోకి రెండు బుల్లెట్లు దూసుకుపోయాయి. ఒక్కసారిగా కారులోకి కూలబడిపోయింది భుట్టో. ఇది జరిగిన మరుక్షణమే శక్తిమంతమైన బాంబు ఒకటి పేలింది. అంతే.. ఆ దెబ్బకు పరిసరాలన్నీ అదిరిపోయాయి. అభిమానులు రక్తపు ముద్దలయ్యారు. కాసేపటికి తేరుకున్న కొందరు భుట్టోను ఆసుపత్రికి తరలించారు. సాయంత్రం 6.16 నిమిషాలకు భుట్టో మరణవార్తను ప్రపంచం వినాల్సివచ్చింది. ముషారఫ్ ప్రభుత్వ నిరంకుశ, నిర్లక్ష్య ధోరణి వల్లే భుట్టో మరణించిందని కొందరన్నారు. ముషారఫ్ ఈ హత్య చేయించాడన్నారు. మరి కొందరేమో.. ఆమె భర్త జర్దారీని సైతం అనుమానించారు. ఇంకొందరు అల్ ఖైదా పనేనన్నారు. ఇలా ఎవరికి వారు ఏదేదో చెప్పుకొచ్చారు. చివరకు నిజాన్ని మాత్రం సమాధి చేశారు. భుట్టోను చంపిందెవరో ఆ ‘అల్లా’కే తెలియాలి! -
ఇది.. మహిళా రాజకీయ 'రక్త'చరిత్ర
వాళ్లు హత్యకు గురైన అన్ని సందర్భాల్లోనూ ఆయా జాతులు తీవ్ర ఉద్వేగానికి గురయ్యాయి. దేశాలు దిక్కులేని స్థితిలోకి వెళ్లిపోయాయి. గంటలు, రోజుల వ్యవధిలోనే పరిస్థితులు మళ్లీ సాధారణస్థాయికి చేరుకున్నాయి. అంతలోనే ఇంకో హత్యోదంతం. వాళ్లిప్పుడు లేరు. కాలంలో కలిసిపోయారు. రాజకీయాల్లో మహిళల ప్రయాణం.. నల్లేరుపై కాదు, రక్తపుటేరులపై సాగుతున్నదని వాళ్లు చెప్పారు. అందుకు సాక్ష్యంగా మరణ సందేశాలు వినిపిస్తున్నారు. ఇది ప్రపంచ మహిళా రాజకీయ నేతల 'రక్త'చరిత్ర.. బ్రిటన్ లోని బిర్స్టల్ లో గతవారం మహిళా ఎంపీ జో కాక్స్ ను బహిరంగంగా కాల్చిచంపిన సంఘటన ఆ దేశంలో మహిళా రాజకీయ నేతల భద్రతలో లోపాలను ఎత్తిచూపింది. ఇప్పుడు బ్రిటన్ ఎంపీ కాక్సే కాదు గతంలో భారత మాజీ ప్రధాని, పాకిస్థాన్, రువాండా, స్పెయిన్, మెక్సికో లాంటి పలు దేశాల్లో మహిళలు ప్రభుత్వ పరంగానో, పార్టీ పరంగానో అత్యున్నత పదవిలో ఉండగానే దారుణ హత్యలకు గురయ్యారు. జో కాక్స్ - బ్రిటన్ ఎంపీ(ప్రతిపక్ష లేబర్ పార్టీ) బ్రిటన్.. యురోపియన్ యూనియన్ (ఈయూ) లో కలిసే ఉండాలా? ఈయూ నుంచి విడిపోవాలా? అనే అంశంపై గురువారం(జూన్ 23న) ఆ దేశంలో రెఫరెండం జరగనుంది. ప్రతిపక్ష లేబర్ పార్టీ.. బ్రిటన్ ఈయూలోనే కొనసాగాలనే వాదనకు మద్దతు పలుకుతోంది. బాధ్యత గల ఎంపీగా పార్టీ నిర్ణయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్దామనుకున్న ఆమె.. తన నియోజకవర్గం బిర్ స్టల్ పర్యటనకు వెళ్లారు. అక్కడ ఆమెను ఓ దుండగుడు తుపాకితో కాల్చి చంపాడు. బ్రిటన్ ఈయూలో కలిసి ఉండటం ఇష్టంలేకే ఎంపీని హత్యచేశానని పోలీసు దర్యాప్తులో చెప్పాడు. ఆనా లిండ్- స్విడన్ విదేశాంగ మంత్రి (సోషల్ డెమోక్రటిక్ లీగ్) స్విడన్ విదేశాంగ శాఖ మంత్రిగా అద్భుతమైన పనితీరుతో మెప్పించిన ఆనా లిండ్.. తర్వాతి ఎన్నికల్లో ప్రధానమంత్రి అభ్యర్థినిగా దాదాపు ఖరారైపోయారు. అయితే 2003లో స్టాక్ హోమ్ లోని ఓ డిపార్ట్ మెంటల్ స్టోర్ లో ఆనా దారుణహత్యకు గురయ్యారు. రాజకీయ నాయకులన్నా, నాయకురాళ్లన్నా తనకు ఇష్టం ఉండదని, ఆ పగతోనే ఆమెను చంపానని ఆనా హంతకుడు ప్రకటించుకున్నాడు. బెనజీర్ భుట్టో- పాకిస్థాన్ మాజీ ప్రధానమంత్రి (పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ) అధికారిక ఇస్లామిక్ దేశమైన పాకిస్థాన్ లో వారసత్వరాజకీయాల ద్వారా తెరపైకి వచ్చి, తర్వాత తనదైన ముద్రతో పరిపాలన సాగించిన బెనజీర్ భుట్టో రెండు పర్యాయాలు ప్రధానమంత్రి పదవి చేపట్టారు. ఎన్నికల్లో ఓటమితో 1998లో తనకుతానుగా ప్రవాసంలోకి వెళ్లిపోయిన బెనజీర్.. 2007లో తిరిగి పాకిస్థాన్ గడ్డపై అడుగుపెట్టారు. పాకిస్థాన్ పీపుల్స్ పార్టీని మళ్లీ అధికారంలోకి తెచ్చేందుకు కాలికి బలపం కట్టుకుని తిరిగారు. అలా రావల్సిండిలోని ఓ ఎన్నికల సభలో పాల్గొన్న ఆమె.. ఉగ్రవాదులు ఆత్మాహుతి దాడిలో చనిపోయారు. ఇందిరా గాంధీ- భారత మాజీ ప్రధానమంత్రి(ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ) భారత దేశపు మొట్టమొదటి ప్రధాని కూతురిగా, మొదటి మహిళా ప్రధానిగా ఇందిరా గాంధీ రాజకీయ ప్రస్థానం ఆద్యంతం చారిత్రక ఘట్టంలా సాగింది. ఖలిస్థాన్ ఉద్యమాన్ని అణిచివేసే క్రమంలో ఆమె ప్రభుత్వం చేపట్టిన 'ఆపరేషన్ బ్లూ స్టార్' చివరికి ఆమె ప్రాణాలనే తీసుకుంది. 1984లో బాడీగార్డ్ గా విధులు నిర్వహిస్తున్న సిక్కు వ్యక్తి ప్రధాని ఇందిరాగాధీని కాల్చిచంపాడు. అగాథే ఉవిలింగ్జిమనా అలియాస్ మేడం అగాథే- రువాండా మాజీ ప్రధానమంత్రి మేడం అగాథేగా ప్రపంచ ఖ్యాతి పొందిన అగాథే ఉవిలింగ్జిమనా జీవితం ఆఫ్రికా రాజకీయ చరిత్రలోనే అరుదైన అధ్యాయం. అనిశ్చితికి మారుపేరైన రువాండాకు మొట్టమొదటి మహిళా ప్రధానమంత్రిగా ఆమె చేసిన సేవలు వెలకట్టలేనివి. 1994లో బెల్జియన్ స్పీకర్లతో కలిసి ఓ సమావేశంలో పాల్గొన్న ఆమెను దుండగులు కాల్చిచంపారు. ఆమె చనిపోయిన తర్వాతి రోజే నాటి రువాండా అధ్యక్షుడు కూడా హత్యకు గురయ్యాడు. అఖ్విలా అల్ హషీమి - ఇరాకీ రాజకీయవేత్త ఇరాక్ ను నియంతలా పాలించిన సద్దాం హుస్సేన్ తన ప్రభుత్వంలో ఒకేఒక మహిళకు ప్రాతినిథ్యం కల్పించారు. ఆమె అఖ్విలా అల్ హషీమీ. కీలకమైన గవర్నింగ్ కౌన్సిల్ లో సభ్యురాలు కాకముందు పలు ఉద్యమాలకు సారధ్యం వహించారామె. 2003లో బాగ్ధాద్ లోని ఇంట్లో ఆరుగురు సాయుధులు మాటువేసి ఆమెను చంపారు. సద్దాం హుస్సేనే ఆమెను చంపాడని కొందరు, లేదు అమెరికా దళాలే ఆమెను హతమార్చాయని మరికొందరు వాదిస్తారు. హనీఫా సాఫి- మహిళా సంక్షేమ శాఖ మాజీ మంత్రి (అఫ్ఘానిస్థాన్) కీచక రాజ్యానికి నకలుగా సాగిన తాలిబన్ల పాలనలో మహిళల హక్కులకోసం నినదించి, అనేక పోరాటాలుచేసింది హనీఫా సాఫి. అఫ్ఘానిస్థాన్ లో తాలిబన్ల ప్రాబల్యం ఉన్న కాబుల్ ప్రాంతంలో వారికి వ్యతిరేకంగా పలు ఉద్యమాలకు నేతృత్వం వహించింది. 2012లో ఓ వివాహానికి వెళ్లివస్తోండగా ఆమె ప్రయాణిస్తున్నకారును తాలిబన్లు పేల్చేశారు. ఇసబెల్ కురాస్కో- స్పెయిన్ మాజీ గవర్నర్ ఉత్తర స్పెయిన్ లోని లియోన్ ప్రావిన్స్ గవర్నర్ గా, పాపులర్ పార్టీ కీలక నేతగా భవిష్యత్ దేశాధినేతగా పేరుతెచ్చుకున్న ఇసబెల్ కురాస్కో 2014లో అనూహ్యరీతిలో హత్యకు గురయ్యారు. తన కూతురు ఉద్యోగం కోల్పోవడానికి గవర్నర్ ఇసబెలే కారణమని నమ్మిన ఓ వ్యక్తి.. కూతురు సహాయంతోనే ఇసబెల్ ను కాల్చిచంపాడు. సాదూ అలీ వర్సమే- ప్రముఖ సోమాలీ గాయని, (సోమాలియా మాజీ ఎంపీ) సాంప్రదాయ సోమాలీ గీతాలాపనలతో ప్రపంచ ఖ్యాతిగాంచిన గాయని సాదూ అలీ వర్సమే.. సోమాలియా రాజకీయాల్లోకి ప్రవేశించి ఎంపీగా ఎన్నికయ్యారు. సోమాలియాను ఆధునిక రాజ్యంగా మార్చాలన్న ఆమె కలలు కల్లలుగానే మిగిలిపోయాయి. 2014లో రాజధాని మొగదిషులో కారులో వెళుతున్న ఆమెపై అల్ షబాబ్ ఉగ్రవాదులు దాడిచేశారు. కారుతోసహా ఆమెనూ తూట్లుతూట్లుగా పేల్చేశారు. జారా షాహిద్ హుస్సేన్- పాక్ రాజకీయనాయకురాలు పాకిస్థాన్ మాజీ క్రికెటర్ ఇమ్రాన్ ఖాన్ స్థాపించిన తెహ్రీక్ ఏ నిన్సాఫ్ పార్టీలో కీలక నాయకురాలిగా ఎదిగిన జారా షాహిద్ హుస్సేన్ ను 2013లో ఉగ్రవాదులు కాల్చిచంపారు. కరాచీలోని తన ఇంటి పెరట్లో వాకింగ్ చేస్తున్న ఆమెను ఉగ్రవాదులు దారుణంగా చంపడం అప్పట్లో సంచలనం రేపింది. గిసెలా మోటా- మెక్సికో సిటీ మాజీ మేయర్ ప్రపంచ మాదకద్రవ్యాల అడ్డాగా పేరుపొందిన మెక్సికో సిటీకి మొట్టమొదటి మహిళా మేయర్ గా ఎన్నికైన గిసెలా మోటా ఇటీవలే హత్యకు గురయ్యారు. మాఫియాపై కఠిన వైఖరి అవలంభిస్తున్న కారణంగానే ఆమె హత్య జరిగినట్లు తెలుస్తోంది. -
లాడెన్ డబ్బుతో ఎన్నికల బరిలో షరీఫ్!
ఇస్లామాబాద్: దివంగత పాక్ మాజీ ప్రధాని బెనజీర్ భుట్టో నేతృత్వంలోని పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ(పీపీపీ)ని ఎదుర్కొనేందుకు 1990 ఎన్నికల్లో నిలబడేందుకు కావాల్సిన భారీ మొత్తాలను ప్రస్తుత ప్రధాని నవాజ్ షరీఫ్ అల్ కాయిదా అధినేత లాడెన్ నుంచి పొందారని ఓ పుస్తకంలో వెల్లడైంది. పాక్ నిఘా సంస్థ ఐఎస్ఐ మాజీ ఉన్నతాధికారి ఖలీద్ ఖవాజా భార్య షమామా ఖలీద్ వెలువరించిన ‘ ఖలీద్ ఖవాజా: షాహీదీ అమాన్’ పుస్తకంలో ఈ విషయాలు వెలుగుచూశాయి. పాక్‌లో ఇస్లామిక్ రాజ్యస్థాపనకు షరీఫ్ ప్రతినబూనడంతో ఆయనవైపు లాడెన్, ఖలీద్‌లు ఆకర్షితులయ్యారని పేర్కొన్నారు. జియాల తుది దశలో 1990లో పీపీపీని ఎన్నికల్లో ఎదుర్కొనేందుకు కావాల్సిన భారీ నగదు మొత్తాలను లాడెన్ నుంచి తీసుకున్నాడని, అధికారంలోకి వచ్చాక షరీఫ్ తన వాగ్దానాలను పక్కనబెట్టాడని ‘డాన్’ వార్తాసంస్థ సోమవారం ఓ కథనం ప్రచురించింది. -
కాశ్మీర్ మొత్తాన్నీ లాక్కుంటా
-
కాశ్మీర్ మొత్తాన్నీ లాక్కుంటాం
పాక్ నేత బిలావల్ భుట్టో రెచ్చగొట్టే వ్యాఖ్యలు తీవ్రంగా ఖండించిన భారత ప్రభుత్వం కాశ్మీర్ ఎప్పటికీ భారత అంతర్భాగమేనన్న బీజేపీ ఇస్లామాబాద్: పాకిస్థాన్ మాజీ ప్రధాని బేనజీర్ భుట్టో కుమారుడు, పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ (పీపీపీ) చైర్మన్ బిలావల్ భుట్టో జర్దారీ (25) కాశ్మీర్ అంశాన్ని రాజకీయ లబ్ధికి ఉపయోగించుకునేలా కవ్వింపు చర్యలకు దిగారు. పాక్ భావి నేతగా కితాబులందుకుంటున్న ఆయన భారత్ నుంచి కాశ్మీర్ మొత్తాన్నీ తమ పార్టీ స్వాధీనం చేసుకుంటుందంటూ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం ముల్తాన్‌లో పార్టీ కార్యకర్తల సమావేశంలో బిలావల్ మాట్లాడుతూ ‘‘కాశ్మీర్ మొత్తాన్నీ నేను వెనక్కు తీసుకుంటా. ఒక్క అంగుళాన్ని కూడా వదిలిపెట్టను. ఎందుకంటే...ఇతర రాష్ట్రాల్లాగానే కాశ్మీర్ కూడా పాకిస్థాన్‌దే’’ అని వ్యాఖ్యానించారు. ఆ సమయంలో దేశ మాజీ ప్రధానులు గిలానీ, అష్రాఫ్‌లు బిలావల్ పక్కనే ఉన్నారు. 2018 ఎన్నికల్లో పోటీ చేస్తానని ఆయన ప్రకటించారు. బిలావల్ తల్లి బేనజీర్ రెండుసార్లు పాక్ ప్రధానిగా పనిచేయగా, ఆయన తాత జుల్ఫీకర్ సైతం 1970లలో ప్రధానిగా పనిచేశారు. సరిహద్దులపై రాజీపడం: భారత్ న్యూఢిల్లీ: బిలావల్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన భారత్...సరిహద్దుల విషయంలో పాక్‌తో రాజీపడే ప్రసక్తే లేదని తేల్చి చెప్పింది. పొరుగుదేశంతో సత్సంబంధాలు కోరుకుంటున్నామంటే దాని అర్థం సరిహద్దులపై రాజీపడటం కాదని విదేశాంగ ప్రతినిధి సయ్యద్ అక్బరుద్దీన్ అన్నారు. భారతసరిహద్దులను మార్చేది లేదన్నారు. పాక్‌తో స్నేహం కోసం దేశసార్వభౌమత్వాన్ని, సమగ్రతను పణంగా పెట్టేదిలేదన్నారు. బిలాల్ వ్యాఖ్యలను సత్యదూరమైనవిగా అభివర్ణించారు. మరోవైపు బిలావల్ వ్యాఖ్యలను అపరిపక్వమైనవిగా, చిన్నపిల్లాడి మాటలుగా బీజేపీ అభివర్ణించింది. కాశ్మీర్ ఎప్పటికీ భారత అంతర్భాగంగానే కొనసాగుతుందని పేర్కొది. కాగా, బిలావల్ వ్యాఖ్యలను ఎద్దేవా చేస్తూ భారత నెటిజన్లు ట్విట్టర్లో జోకులు పేల్చారు. యావత్ కాశ్మీర్‌ను బిలావల్ తీసుకున్నా అందులోనూ తండ్రికి 10 శాతం వాటా ఇవ్వాలని ఒకరు చురకలంటించారు. -
తాలిబాన్ పై సైనిక చర్యకు బిలావల్ విజ్క్షప్తి!
తాలిబాన్ పై సైనిక చర్య చేపట్టాలని పాకిస్థాన్ సైన్యానికి మాజీ ప్రధాని బెనజీర్ భుట్టో కుమారుడు, బిలావల్ భుట్టో జర్ధారీ విజ్క్షప్తి చేశారు. బీబీసీ కిచ్చిన ఇంటర్వ్యూలో బిలావల్ భుట్టో మాట్లాడుతూ.. మిలిటెంట్లతో చర్చల వల్ల లాభం లేదని.. సైనిక చర్య జరపడమే పాకిస్థాన్ ముందున్న ఏకైక మార్గం అని అన్నారు. సమస్యల పరిష్కారానికి చర్చలే కీలకం, అయితే వారు మాపై యుద్ధం చేస్తున్నారని.. వారితో చర్చలు జరపడానికి శక్తి సామర్ధ్యాలు అవసరం అని బిలావల్ తెలిపారు. కేవలం నార్త్ వజిరిస్థాన్ పరిమితం కాలేదు. కరాచీలోనూ మాపై దాడులకు పాల్పడుతున్నారు. పాకిస్థాన్ లో తాలిబాన్ ను ఏరిపారేయాల్సిందే అని అన్నారు. రాజకీయాల్లోకి వస్తానని ఎప్పుడు అనుకోలేదని.. మరింత బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన సమయం ఆసన్నమైందని ఓ ప్రశ్నకు బిలావల్ సమాధానమిచ్చారు. -
మారుతున్న ‘శాంతి’ సమీకరణలు
మన దేశంలో పర్యటనకు ముందే కర్జాయ్ ‘తలరాత’ మారిపోయిన సంగతి మన విదేశాంగ శాఖకు పట్టలేదు. కాబట్టే కర్జాయ్ పర్యటనకు అనవసర ప్రాధాన్యం ఇచ్చి, ప్రధాని మన్మోహన్సింగ్ ఆయనతో రహస్య సమాలోచన సాగించారు. పాకిస్థాన్ ప్రధానిగా నవాజ్ షరీఫ్ విశ్లేషకులందరి అంచనాలను తలకిందులు చేశారు. 1999లో నవాజ్ ప్రభుత్వాన్ని కూలదోసిన మాజీ సైనిక పాలకుడు జనరల్ పర్వేజ్ ముషార్రఫ్‌పై ప్రతీకారాన్ని తీర్చుకోడానికి యత్నించకపోవచ్చని అంతా ఊహాగానాలు చేశారు. ముషార్రఫ్‌ను ఏదో ఒక విధంగా దేశం విడిచిపోయేలా చేయడమే నవాజ్‌కు, పాక్ ప్రజాస్వామ్యానికి శ్రేయస్కరమని సూచించారు. పాక్ చరిత్రలో మొదటిసారిగా ఒక మాజీ జనరల్‌పై పౌర ప్రభుత్వం క్రిమినల్ నేరారోపణలను చేయడం, విచారించడం సైనిక వ్యవస్థకు మింగుడు పడదని అంచనా వేశారు. ముషార్రఫ్‌ను అవమానించడానికి యత్నిస్తే సహించేదిలేదని ఆయన పాక్ గడ్డపై కాలుపెట్టినప్పుడే మాజీ ఆర్మీ చీఫ్‌లు ప్రకటించారు. అది నిజానికి ఆర్మీ చీఫ్ అష్ఫాక్ కయానీ హెచ్చరికేనని అందరికీ తెలిసిందే. అయినా నవాజ్ ముషార్రఫ్‌పై మరణశిక్ష విధించదగిన దేశద్రోహం వంటి తీవ్ర ఆరోపణలను ఒక్కటొక్కటిగా చేయిస్తూ వస్తున్నారు. తాజాగా ముషార్రఫ్‌పై మాజీ ప్రధాని బెనజీర్ భుట్టో హత్యానేరం ఆరోపణను మోపారు. కీలక రాజకీయ పాత్రధారిగా మారిన పాక్ న్యాయవ్యవస్థకు కూడా ముషార్రఫ్ అంటే కంటగింపే. కాబట్టి ముషార్రఫ్ తనకు తగినంత భద్రత కల్పించడం లేదని బెనజీర్ ఒక పాత్రికేయునికి రాసిన లేఖ ఒక్కదాని ఆధారంతోనే కోర్టు కేసు విచారణకు సిద్ధపడటంలో ఆశ్చర్యం లేదు. పైగా నవాజ్ భారత్‌తో సత్సంబంధాలను కోరుతున్నారు. 1999లో సరిగ్గా అందుకే ముషార్రఫ్ ఆయనపై ఆగ్రహించారు. కయానీకి ఈ పరిణామా లు మింగుడుపడతాయా? అందుకే పాక్ చరి త్రలో నాలుగో సైనిక తిరుగుబాటుకు తెరలేస్తున్నదేమోనని భయపడుతున్నారు. సరిహద్దుల్లోని ఇటీవలి ఘర్షణలు పాక్ సైన్యం ప్రేరేపిస్తున్నవేనని, నవాజ్ మాత్రం భారత్‌తో మైత్రికే ప్రాధాన్యం ఇస్తున్నారని తరచుగా వినవస్తోంది. అయితే మే నెలలో అఫ్ఘాన్ అధ్యక్షుడు మన దేశ పర్యటనకు రావడానికి ముందు నుంచి పాక్ సైన్యం ట్యాంకు లు, భారీ శతఘు్నలతో అఫ్ఘానిస్థాన్‌పై కాల్పు లు సాగిస్తోంది. అఫ్ఘాన్‌లోని హమీద్ కర్జాయ్ ప్రభుత్వంతో తప్ప అన్ని తాలిబన్, జిహాదీ గ్రూపులతోనూ పాక్ సైన్యానికి మంచి సంబంధాలున్నాయి. అందుకే పాక్ అఫ్ఘాన్‌లో కీలక పాత్రధారి. అమెరికా సైతం ఈ ఏడాది మొదటి నుంచి కర్జాయ్‌ను వదిలి, కయానీపై ఆధారపడుతోంది. కయానీ సహాయంతోనే రియాద్‌లో తాలిబన్లతో శాంతి చర్చలకు సన్నాహా లు చేస్తోంది. కాగా, రేపటి అఫ్ఘాన్‌లో భారత్ ప్రముఖ పాత్ర నిర్వహించనున్నదనే భ్రమలో మన దౌత్యనీతి బతుకుతోంది. అందుకే మన ప్రభుత్వం అఫ్ఘాన్‌లో రోడ్లు, ఆస్పత్రుల వంటి మౌలిక నిర్మాణాలపై 200 కోట్ల డాలర్లకుపైగా ఖర్చు చేసింది. అఫ్ఘాన్ పోలీసు బలగాలకు శిక్షణను ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నదని మీడియా కథనం. అయితే మన దేశంలో పర్యటనకు ముందే కర్జాయ్ ‘తలరాత’ మారిపోయిన సంగతి మన విదేశాంగ శాఖకు పట్టలేదు. కాబట్టే కర్జాయ్ పర్యటనకు అనవసర ప్రాధాన్యం ఇచ్చి, ప్రధాని మన్మోహన్సింగ్ ఆయనతో రహస్య సమాలోచనలను సైతం సాగిం చారు. కర్జాయ్ భారీ శతఘు్నలు, యుద్ధ విమానాలు తదితర ఆయుధ సామాగ్రిని కోరారు. అవి పాక్ సరిహద్దులలో మోహరించడానికేనన్నది స్పష్టమే. అయినా గుర్తించలేని గుడ్డితనం కయానీకి లేదు. అఫ్ఘాన్-భారత్ సైనిక బంధమంటే పాక్‌ను చుట్టుముట్టడమేనని పాక్ సైన్యం భావిస్తున్నది. మన సరి హద్దుల్లోని తుపాకుల మోతకు, అఫ్ఘాన్ సరి హద్దుల్లోని శతఘు్నల ఘోషకు కారణం ఒక్కటే. ‘ఉగ్రవాద వ్యతిరేక యుద్ధం’ కోసం అమెరికా పాక్‌కు అందిస్తున్న భారీ ఆయుధ, ఆర్థిక సహాయాన్ని సైన్యం దారిమళ్లించి భార త వ్యతిరేక జిహాదీ ముఠాలకు చేరవేస్తోందనేది 2010లో రచ్చకెక్కింది. ఆ తదుపరి అమెరికా పాక్‌కు అందించే సైనిక సహాయం దారి మళ్లకుండా ఆయుధాలు, నిధులు ఉగ్రవాద వ్యతిరేక యుద్ధానికి అవసరమైనవి మాత్రమేనని ధృవీకరించే పద్ధతిని అమల్లోకి తెచ్చింది. నామమాత్రమైన ఆ ధృవీకరణను సైతం అమెరికా ఫిబ్రవరిలో కయానీ కోరిక మేరకు గుట్టు చప్పుడు కాకుండా ఎత్తేసింది. అమెరికా, కయానీల మధ్య కుదిరిన సయోధ్యను గుర్తించకుండానే మన విదేశాంగశాఖ అఫ్ఘాన్, పాక్ విధానాలను రూపొందించుకుంటోంది. అఫ్ఘాన్ యుద్ధం ప్రారంభంలో ముషార్రప్ అమెరికాకు ఎంతటి కీలక మిత్రుడో నేడు కయానీకూడా అంతే కీలక మిత్రుడు. అప్ఘాన్ యుద్ధం ముగింపు దశలో సైన్యం నవాజ్ ‘ధిక్కారాన్ని’ సహించడమంటే వారి మధ్య ‘అంగీకారం’ కుదిరిందనే అర్థం కావాలి. ఆ ‘అంగీకారం’ ముషార్రఫ్‌ను ఉరికంబానికి ఎక్కించవచ్చేమోగానీ భారత్ పట్ల ‘మెతక’ వైఖరిని కనపబరచదనే అర్థం. అలాంటి ‘అంగీకారం’ ఏదీలేకుంటే మనం మరో సైనిక కుట్రను చూడాల్సిరావొచ్చు. - పిళ్లా వెంకటేశ్వరరావు -
ముషార్రఫ్‌పై హత్యాభియోగం
ఇస్లామాబాద్: పాకిస్థాన్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్‌పై మంగళవారమిక్కడి ఉగ్రవాద వ్యతిరేక కోర్టు ఒకటి హత్యా నేర అభియోగాలను నమోదు చేసింది. 2007లో జరిగిన మాజీ ప్రధాని బెనజీర్ భుట్టో హత్య కేసులో ఈ చర్య తీసుకుంది. 66 ఏళ్ల దేశ చరిత్రలో అత్యధిక కాలం సైన్యమే పాలించిన పాక్‌లో ఓ మాజీ సైనిక పాలకుడిపై అభియోగాలను నమోదు చేయడం ఇదే తొలిసారి. భుట్టో హత్యకు యత్నించడం, హత్యకు కుట్ర చేయడం, హత్యకు అవసరమైనవి సమకూర్చడం వంటి అభియోగాలు వీటిలో ఉన్నాయి. ఈ కేసులో ముషార్రఫ్‌తో పాటు ఏడుగురు నిందితులున్నారు. నేరం రుజువైతే ముషార్రఫ్‌కు మరణ శిక్ష లేదా యావజ్జీవ కారాగార శిక్ష పడుతుంది.