తాలిబాన్ పై సైనిక చర్యకు బిలావల్ విజ్క్షప్తి!
తాలిబాన్ పై సైనిక చర్య చేపట్టాలని పాకిస్థాన్ సైన్యానికి మాజీ ప్రధాని బెనజీర్ భుట్టో కుమారుడు, బిలావల్ భుట్టో జర్ధారీ విజ్క్షప్తి చేశారు. బీబీసీ కిచ్చిన ఇంటర్వ్యూలో బిలావల్ భుట్టో మాట్లాడుతూ.. మిలిటెంట్లతో చర్చల వల్ల లాభం లేదని.. సైనిక చర్య జరపడమే పాకిస్థాన్ ముందున్న ఏకైక మార్గం అని అన్నారు. సమస్యల పరిష్కారానికి చర్చలే కీలకం, అయితే వారు మాపై యుద్ధం చేస్తున్నారని.. వారితో చర్చలు జరపడానికి శక్తి సామర్ధ్యాలు అవసరం అని బిలావల్ తెలిపారు.
కేవలం నార్త్ వజిరిస్థాన్ పరిమితం కాలేదు. కరాచీలోనూ మాపై దాడులకు పాల్పడుతున్నారు. పాకిస్థాన్ లో తాలిబాన్ ను ఏరిపారేయాల్సిందే అని అన్నారు. రాజకీయాల్లోకి వస్తానని ఎప్పుడు అనుకోలేదని.. మరింత బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన సమయం ఆసన్నమైందని ఓ ప్రశ్నకు బిలావల్ సమాధానమిచ్చారు.