న్యూఢిల్లీ: ప్రస్తుతం భారత్‌లో ఉన్న పాకిస్థాన్ విదేశాంగ మంత్రి బిలావల్ భుట్టో జర్దారీ ఇరు దేశాల సంబంధాలపై బింకాలకు పోయారు. ఆర్టికల్ 370 రద్దును సమీక్షిస్తేనే భారత్‌తో సంబంధాలు, చర్చల విషయంపై ఆలోచిస్తామని అన్నారు. అప్పటివరకు భారత్‌తో ఎలాంటి సంప్రదింపులు ఉండవన్నారు. ఓ జాతీయ వార్త సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ వ్యా ఖ్యలు చేశారు.
గోవాలో మే 4,5 తేదీల్లో రెండు రోజుల పాటు జరిగిన షాంగై కోఆపరేషన్ ఆర్గనైజేషన్(ఎస్‌సీఓ) సదస్సుకు భుట్టో హాజరయ్యారు. అయితే భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్‌తో ఎలాంటి మాటామంతీలో పాల్గొనలేదు. దీంతో భారత్‌తో ఎప్పుడు సమావేశంలో పాల్గొంటారని ప్రశ్నించగా.. ఆర్టికల్ 370 రద్దును సమీక్షించినప్పుడే అని బదులిచ్చారు.
కాగా.. 2011 తర్వాత పాకిస్థాన్ విదేశాంగ మంత్రి భారత్‌కు రావడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. అప్పుడు పాక్ విదేశాంగ మంత్రిగా ఉన్న హీనా రబ్బానీ ఖార్ అప్పటి భారత విదేశాంగమంత్రితో సమావేశమయ్యారు. అప్పటి నుంచి ఇప్పటివరకు ఇరుదేశాల విదేశాంగ మంత్రులు ఏ సమావేశంలోనూ పాల్గొనలేదు.
జమ్ముకశ్మీర్‌కు స్వయంప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370ని 2019 ఆగస్టు 5న కేంద్రం రద్దు చేసిన విషయం తెలిసిందే. ఈ నిర్ణయాన్ని పాకిస్థాన్ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. పలు అంతర్జాతీయ వేదికలపైనా భారత అంతర్గత విషయమైన కశ్మీర్ అంశాన్ని లేవనెత్తి అబాసుపాలైంది.
చదవండి: వీడియో: రష్యా ప్రతినిధి కవ్వింపు.. ఉక్రెయిన్ ఎంపీ పంచ్‌ల వర్షం
Comments
Please login to add a commentAdd a comment