Bilawal Bhutto Zardari
-
అప్పటివరకు భారత్‌తో మాటల్లేవ్.. పాక్ విదేశాంగ మంత్రి తలపొగరు..
న్యూఢిల్లీ: ప్రస్తుతం భారత్‌లో ఉన్న పాకిస్థాన్ విదేశాంగ మంత్రి బిలావల్ భుట్టో జర్దారీ ఇరు దేశాల సంబంధాలపై బింకాలకు పోయారు. ఆర్టికల్ 370 రద్దును సమీక్షిస్తేనే భారత్‌తో సంబంధాలు, చర్చల విషయంపై ఆలోచిస్తామని అన్నారు. అప్పటివరకు భారత్‌తో ఎలాంటి సంప్రదింపులు ఉండవన్నారు. ఓ జాతీయ వార్త సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ వ్యా ఖ్యలు చేశారు. గోవాలో మే 4,5 తేదీల్లో రెండు రోజుల పాటు జరిగిన షాంగై కోఆపరేషన్ ఆర్గనైజేషన్(ఎస్సీఓ) సదస్సుకు భుట్టో హాజరయ్యారు. అయితే భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్‌తో ఎలాంటి మాటామంతీలో పాల్గొనలేదు. దీంతో భారత్‌తో ఎప్పుడు సమావేశంలో పాల్గొంటారని ప్రశ్నించగా.. ఆర్టికల్ 370 రద్దును సమీక్షించినప్పుడే అని బదులిచ్చారు. కాగా.. 2011 తర్వాత పాకిస్థాన్ విదేశాంగ మంత్రి భారత్‌కు రావడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. అప్పుడు పాక్ విదేశాంగ మంత్రిగా ఉన్న హీనా రబ్బానీ ఖార్ అప్పటి భారత విదేశాంగమంత్రితో సమావేశమయ్యారు. అప్పటి నుంచి ఇప్పటివరకు ఇరుదేశాల విదేశాంగ మంత్రులు ఏ సమావేశంలోనూ పాల్గొనలేదు. జమ్ముకశ్మీర్‌కు స్వయంప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370ని 2019 ఆగస్టు 5న కేంద్రం రద్దు చేసిన విషయం తెలిసిందే. ఈ నిర్ణయాన్ని పాకిస్థాన్ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. పలు అంతర్జాతీయ వేదికలపైనా భారత అంతర్గత విషయమైన కశ్మీర్ అంశాన్ని లేవనెత్తి అబాసుపాలైంది. చదవండి: వీడియో: రష్యా ప్రతినిధి కవ్వింపు.. ఉక్రెయిన్ ఎంపీ పంచ్‌ల వర్షం -
Video: పాక్ మంత్రికి నమస్కారంతో స్వాగతం పలికిన జైశంకర్
పాకిస్థాన్ విదేశాంగ మంత్రి బిలావల్ భుట్టో గోవాలో వేదికగా జరుగుతున్న షాంఘై సహకార సంస్థ(ఎస్సీఓ) విదేశాంగ మంత్రుల మండలి సమావేశానికి హాజరయ్యారు. శుక్రవారం ఉదయం ప్రారంభమైన ఈ సదస్సుకు వచ్చిన పలు దేశాల మంత్రులను భారత విదేశాంగశాఖ మంత్రి జైశంకర్ మర్యాదపూరక్వంగా ఆహ్వానించారు. ఈ క్రమంలో దాయాది పాక్ మంత్రి భుట్టోను కూడా నమస్కారంతో స్వాగతం పలికారు. ఇద్దరు కలిసి ఫోటో కూడా దిగారు. ఆ తర్వాత వేదిక వద్దకు వెళ్లండంటూ భుట్టోను జైశంకర్ పంపతున్న దృశ్యాలు నెట్టింట్లో వైరల్‌గా మారింది. 🇷🇺 🇮🇳 WATCH: India's External Affairs Minister S. Jaishankar welcomes Russian Foreign Minister Sergey Lavrov to the #SCO2023 Council of Foreign Ministers' meeting in #Goa.#India #Russia pic.twitter.com/9Z7mw9bCu9 — Sputnik India (@Sputnik_India) May 5, 2023 అనంతరం షాంఘై సదస్సులో పాక్ మంత్రి సమక్షంలోనే విదేశాంగమంత్రి జై శంకర్ ఉగ్రవాద ముప్పు, సీమాంతర ఉగ్రవాదంపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఉగ్రవాద ముప్పు నిరాటంకంగా కొనసాగుతోందని దీనిని ఎట్టిపరిస్థితుల్లోనూ సమర్థించకూడదని అన్నారు. సరిహద్దు తీవ్రవాదంతో సహా దాని అన్ని రకాలైన ఉగ్రవాదాన్ని పాతరేయాలని పేర్కొన్నారు. తీవ్రవాదాన్ని ఎదుర్కోవడం ఎస్సీఓ ఆదేశాలలో ముఖ్యమైనదని, దీనిపై కలిసి కట్టుగా పోరాటం చేయాలని పిలుపునిచారు. చదవండి: ఘోర ప్రమాదం.. ఎమ్మెల్యే కారు ఢీకొని వ్యక్తి మృతి One of the best Foreign Ministers of India🇮🇳 Mr. S Jaishankar 🔥🔥 pic.twitter.com/HjdEe0nDfR — kanishka 🇮🇳 (@KanishkaDadhich) May 5, 2023 కాగా గత 12 ఏళ్లలో తర్వాత భారత్ గడ్డపై పాక్ మంత్రి అడుగుపెట్టిన వ్యక్తి బుట్టోనే కావడం విశేషం. షాంఘై రెండురోజుల పర్యటన నిమిత్తం పాక్ మంత్రి బుట్టో గురువారమే గోవా చేరుకున్నారు. ఎస్సీఓ సదస్సులో పాల్గొనేందుకు వచ్చిన అతిథులకు జైశంకర్ గురువారం రాత్రి ప్రత్యేక విందు ఇచ్చారు. .బెనాలిమ్‌లోని సముద్ర తీరంలో ఉన్న తాజ్ రిసార్ట్‌లో ఏర్పాటు చేసిన ఈ డిన్నర్‌కు వివిదే విదేశాంగ మంత్రులు హాజరయ్యారు. పాక్ మంత్రి బిలావల్ భుట్టోకూడా ఈ విందుకు వచ్చారు. Swag mera desi hai 🔥😎😉 (SCO Summit, Goa)#SJaishankar ji pic.twitter.com/MhL1vLdQxp — Stranger (@amarDgreat) May 5, 2023 అయితే, విందులో బిలావల్, జైశంకర్ మాట్లాడుకుంటారా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది. కానీ.. వీరిద్దరూ షేక్‌హ్యండ్ ఇచ్చుకొని పలకరించుకున్నారని విశ్వసనీయ వర్గాల త్వారా తెలిసినట్లు పలు మీడియా కథనాలు వెల్లడించాయి. అయితే భారత ప్రభుత్వం నుంచి దీనిపై ఎలాంటి ప్రకటనా రాలేదు. ఈ కార్యక్రమానికి మీడియాను అనుమతించలేదు. మరోవైపుతే భారత్- పాక్ విదేశాంగ మంత్రుల మధ్య ద్వైపాక్షిక చర్చ ఉంటుందా లేదా అనే దానిపై ఎలాంటి క్లారిటీ లేదు. చదవండి: మణిపూర్: బీజేపీ ఎమ్మెల్యేపై దాడి.. హెల్త్ కండిషన్ సీరియస్ -
'దీన్ని అలా చూడకూడదు..': భారత్ పర్యటనపై పాక్ మంత్రి వ్యాఖ్యలు
భారత్‌లోని గోవాలో వచ్చే నెల మే 4 నుంచి 5 వరకు షాంఘై కో ఆపరేషన్ ఆర్గనైజేషన్ కౌన్సిల్(ఎస్సీఓ) సమావేశం జరగనున్న సంగతి తెలిసిందే. ఆ సమావేశానికి బిలావల్ భుట్టో జర్దారీ పాక్ ప్రతినిధి బృందానికి నాయకత్వం వహిస్తారని పాక్ విదేశాంగ మంత్రిత్వ శాఖ గురువారం పేర్కొంది. ఈ మేరకు జర్దారీ పాక్ స్థానిక మీడియా సమావేశంలో మాట్లాడుతూ..వచ్చే నెలలో గోవాలో జరిగే విదేశాంగ మంత్రుల సమావేశంలో తాను పాకిస్తాన్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నట్లు తెలిపారు. తాము ఎస్సీఓ చార్టర్‌కు కట్టుబడి ఉన్నాం అని చెప్పారు. తాను ఈ సమావేశంలో పాలుపంచుకోవడం అనేది SCO చార్టర్ పట్ల పాక్‌కు ఉన్న నిరంతర నిబద్ధతను ప్రతిబింబిస్తోందన్నారు. ఈ పర్యటనను ద్వైపాక్షిక సంబంధాల కోణంలో చూడకూడదని జర్దారీ అన్నారు. కాగా, దాదాపు 12 ఏళ్ల విరామం తర్వాత భారత్‌లో పర్యటించనున్న తొలి విదేశాంగ మంత్రి బిలావల్ భుట్టో. చివరిసారిగా 2011లో అప్పటి పాక్ విదేశాంగ మంత్రి హీనా రబ్బానీ ఖర్ భారత్‌లో పర్యటించారు. భారత్‌లో జరగనున్న విదేశాంగ మత్రుల సమావేశానికి పాక్, చైనాతో సహా షాంఘై సహకార సంస్థ(ఎస్సీఓ) సభ్యులందరికీ భారత్ అధికారికంగా ఆహ్వానాలు పంపింది. ఈ సమావేశంలో చైనా విదేశాంగ మంత్రి క్విన్ గ్యాంగ్, రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ కూడా పాల్గొనే అవకాశం ఉంది. గతేడాది సెప్టంబర్లో తొమ్మిది మంది సభ్యులతో కూడిన మెగా గ్రూపింగ్‌కు భారతదేశం ఛైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించగా, ఈ ఏడాది కీలక మంత్రి వర్గ సమావేశాలు, శిఖరాగ్ర సమావేశాలు నిర్వహించనుంది. ఈ 20 ఏళ్ల షాంఘై సహకార సంస్థలో రష్యా, ఇండియా, చైనా, పాకిస్తాన్, కజకిస్తాన్, కిర్గిజిస్తాన్, తజికిస్తాన్, ఉజ్బెకిస్తాన్ తదితర దేశాలు సభ్యులుగా ఉన్నాయి. ఇందులో ఇరాన్ ఇటీవలే తాజగా సభ్యత్వం పొందిన దేశం. పైగా తొలిసారిగా ఇరాన్ బారత్ సారథ్యంలో పూర్తిస్థాయి సభ్యునిగా గ్రూపింగ్ సమావేశానికి హాజరవుతోంది. ఇక షాంఘై సహకార సంస్థ శిఖరాగ్ర సమావేశం సెప్టెంబర్ 2022లో ఉజ్బెకిస్తాన్‌లోని సమర్కండ్లో జరిగింది. దీనికి నరేంద్ర మోదీ హజరయ్యారు. అంతేగాదు జూన్ 2019 కిర్గిజిస్థాన్‌లో షాంఘై సదస్సు తదనంతరం జరిగి తొలి వ్యక్తిగత శిఖరాగ్ర సదస్సు కూడా ఇదే. (చదవండి: ఇద్దరి అధికారహం, అంతర్యుద్ధం.. సామాన్యుల ఆకలి కేకలు) -
9 ఏళ్ల తర్వాత భారత్‌లో పర్యటించనున్న పాక్ మంత్రి.. ఎందుకంటే!
న్యూఢిల్లీ: పాకిస్థాన్ విదేశీ వ్యవహారాలశాఖ మంత్రి బిలావల్ భుట్టో జర్దారీ భారత్ పర్యటనకు రానున్నారు. భారత్‌లో మే నెలలో జరగబోయే షాంఘై సహాకార సంస్థ సమావేశంలో ఆయన పాల్గొననున్నారు. కాగా చాలా ఏళ్ల తర్వాత పాకిస్థాన్‌లో కీలక పదవుల్లో ఉన్నవారు భారత్‌కు రావడం ఇదే తొలిసారి. చివరిసారి 2014లో అప్పటి ప్రధాని నవాజ్ షరీఫ్ పర్యటించగా.. ఈ తరువాత పాకిస్థాన్ నుంచి భారత్‌లో అడుగుపెట్టే మొదటి నేత బిలావల్ భుట్టోనే కానుండటం విశేషం భారత్ అధ్యక్షతన ఈ ఏడాది షాంఘై సహకార సంస్థ సమావేశాలు జరగనున్నాయి. ఇందులో భాగంగా విదేశీ వ్యవహరాల మంత్రుల సమావేశం మే 4,5 తేదీల్లో గోవాలో జరగనుంది. ఈ సమ్మిట్‌లో బిలావల్ భుట్టో పాల్గొననున్నారు. ఆయనతోపాటు గ్రూప్‌లోని వివిధ దేశాల విదేశాంగ మంత్రుల ప్రతినిధుల బృందం కూడా సమావేశానికి హాజరుకానుంది. కాగా షాంఘై సహకార సంస్థ 2001లో ప్రారంభమైంది. ఇందులో ఎనిమిది పూర్తిస్థాయి సభ్య దేశాలు(చైనా, రష్యా, భారత్, కజకిస్థాన్, కిర్గిజిస్థాన్, తజికిస్థాన్, ఉజ్బెకిస్థాన్, పాకిస్థాన్‌లు) ఉన్నాయి. 2017 జూన్9న శాశ్వత దేశంగా సభ్యత్వం పొందింది. సభ్య దేశాల మధ్య ఆర్థిక, రాజకీయ, సైనిక సహకారాన్ని ప్రోత్సహించే లక్ష్యంతో స్థాపించబడింది. ఇది ప్రపంచ మొత్తం జనాభాలో 42 శాతం, ప్రపంచ జీడీపీలోలో 25 శాతం ప్రాతినిధ్యం వహిస్తుంది. చదవండి: Mount Annapurna: అదృశ్యమైన భారతీయ పర్వతారోహకుడి ఆచూకీ లభ్యం -
మళ్లీ కశ్మీర్‌పై పాక్ ఏడుపు
ఐక్యరాజ్య సమితి: మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో జరిగిన ఒక చర్చాకార్యక్రమంలోనూ కశ్మీర్ అంశాన్ని లేవదీసి పాకిస్తాన్ భారత్‌పై తన అక్కసును మరోసారి వెళ్లబోసుకుంది. దీంతో భారత్ ఘాటుగా స్పందించింది. పాకిస్తాన్ చేసే ద్వేషపూరిత, తప్పుడు ప్రచారాలకు కనీసం స్పందించాల్సిన అవసరం తమకు లేదని భారత్ తేల్చిచెప్పింది. నెలపాటు మొజాంబిక్ దేశ అధ్యక్షతన ఐరాస భద్రతా మండలిలో సమావేశాలు జరుగుతున్నాయి. ఇందులోభాగంగానే ‘ మహిళలు, శాంతి, భద్రత’ అంశంపై చర్చలో పాకిస్తాన్ విదేశాంగ మంత్రి బిలావల్ భుట్టో జర్దారీ అసంబద్ధంగా జమ్మూకశ్మీర్ అంశాన్ని ప్రస్తావిస్తూ ప్రసంగించారు. ఆ తర్వాత ఐరాస భారత శాశ్వత ప్రతినిధి రుచిరా కాంభోజ్ మాట్లాడారు. ‘ బిలావల్ వ్యాఖ్యానాలు పూర్తిగా నిరాధారం. పూర్తిగా రాజకీయ దురుద్దేశంతో చేసిన ప్రసంగమిది. మహిళలకు భద్రతపై చర్చాకార్యక్రమాన్ని మేం గౌరవిస్తున్నాం. మహిళా దినోత్సవ కాల విలువకు గుర్తించాం. ఈ అంశంపైనే మనం దృష్టిసారిద్దాం. అసందర్భంగా పాక్ విదేశాంగ మంత్రి చేసిన వ్యాఖ్యలపై కనీసం స్పందించాల్సిన అగత్యం భారత్‌కు లేదు. గతంలో చెప్పాం. ఇప్పుడూ, ఇకమీదటా చెప్పేది ఒక్కటే. కేంద్రపాలిత ప్రాంతాలైన జమ్మూకశ్మీర్, లద్దాఖ్‌లు భారత్‌లో అంతర్భాగమే. దాయాదిదేశం పాక్‌తో పొరుగుదేశ సంబంధాలను సాధారణస్థాయిలో కొనసాగించాలని భారత్ మొదట్నుంచీ ఆశిస్తోంది. అలాంటి వాతావరణం నెలకొనేలా చూడాల్సిన బాధ్యత పాక్‌పై ఉంది. కానీ ఉగ్రవాదులకు స్వర్గధామంగా మారి శత్రుత్వాన్ని పెంచుకుంటోంది’ అని రుచిరా ఘాటుగా వ్యాఖ్యానించారు. పుల్వామాలో సీఆర్పీఎఫ్ బలగాలపై దారుణ ఉగ్రదాడికి ప్రతిస్పందనగా పాక్ ఆక్రమిత కశ్మీర్(పీఓకే)లోని బాలాకోట్‌లో కొనసాగుతున్న జైషే మొహమ్మద్ ఉగ్ర శిబిరంపై భారత వాయుసేన మెరుపుదాడి తర్వాత ఇరుదేశాల మధ్య సంబంధాలు మరింత క్షీణించాయి. జమ్మూకశ్మీర్‌ను కేంద్రపాలిత ప్రాంతాలుగా విడదీశాక భారత్‌పై పాక్ ఆక్రోశం మరింతగా ఎగసింది. -
పాక్ మంత్రి వ్యాఖ్యలపై కేసీఆర్ స్పందించాలి
గన్‌ఫౌండ్రి/కవాడిగూడ (హైదరాబాద్): దేశప్రధాని నరేంద్రమోదీపై పాకిస్తాన్ మంత్రి బిలావల్ భుట్టో చేసిన అనుచిత వాఖ్యలపై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు తక్షణమే స్పందించాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ డిమాండ్ చేశారు. దీనిపై కేసీఆర్ స్పందించకపోతే పాకిస్తాన్‌కు ఆయన సహకరిస్తున్నట్లే నని బండి ధ్వజమెత్తారు. ఎంఐఎంను ఇబ్బంది పెట్టడం ఇష్టంలేకనే పాకిస్తాన్ మంత్రి అనుచిత వ్యాఖ్యలు చేసినా కేసీఆర్ మౌనంగా ఉన్నారని ఆరో పించారు. ప్రధాని మోదీపై బిలావల్ భుట్టో అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా బీజేపీ ఆధ్వర్యంలో శనివారం బషీర్‌బాగ్‌లోని బాబూజగ్జీవన్‌రాం విగ్రహం నుంచి లోయర్‌ట్యాంక్‌బండ్‌లోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహం వరకు భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. తొలుత బాబుజగ్జీవన్‌రాం విగ్రహానికి నివాళులర్పించిన అనంతరం యువమోర్చా కార్యకర్తలు బిలావల్ భుట్టో దిష్టిబొమ్మను దహనం చేశారు. అనంతరం నిర్వహించిన ర్యాలీలో పాక్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ... ప్రధానిపై పాకిస్తాన్ విమర్శలు చేస్తే ప్రతిఒక్కరూ స్పందించాలని లేదంటే వారు దేశద్రోహులనేనని పేర్కొన్నారు. విశ్వ గురువుగా ఎదుగుతున్న భారతదేశాన్ని చూసి ఓర్వలేక పాకిస్తాన్ తన కుటిలబుద్ధిని బయటపెడుతోందన్నారు. భారత్ శాంతి సామరస్య దేశమని, పాకిస్తాన్ ఉగ్రవాద దేశమని ధ్వజమెత్తారు. బిలావల్ భుట్టో ప్రధాని మోదీకి బహిరంగ క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. -
విజయవాడలో బీజేపీ కార్యకర్తల ఆందోళనలు
-
నా పెళ్లి నా ఇష్టం.. మీకెందుకు అంత ఆత్రం: నటి
ఇస్లామాబాద్: పాక్ నటి మెహ్విష్ హయత్ పాక్ మాజీ ప్రధాని బెనజీర్ భుట్టో, మాజీ అధ్యక్షుడు ఆసీఫ్ అలీ జర్ధారీ కుమారుడు బిలావాల్ భుట్టో జర్ధారీతో వివాహం అంటూ వస్తున్న వార్తలను ఆమె ఖండించారు. సరైన సమాచారం లేకుండా ఇలాంటి తప్పుడు వార్త సృష్టించిన వారిపై ఆమె అసహనం వ్యక్తం చేశారు. తనకు సంబంధాలను కలిపే ప్రయత్నాలను ఆపి కాస్తా విశ్రాంతి తీసుకొండని నెటిజన్లకు ఆమె చురకలు అట్టించారు. అంతేగాక దీనిపై మంగళవారం ఆమె ట్వీట్ చేస్తూ.. ‘వివాహం అనేది వ్యక్తిగతం. నేను ఎవరిని చేసుకుంటాననేది నా సొంత నిర్ణయం. ఆ రోజు వచ్చినప్పుడు అతను ఎవరనేది మీకే తెలుస్తుంది. అప్పటీ వరకు ఇలాంటి తప్పుడు వార్తలను సృష్టించడం ఆపండి’ అంటూ మెహ్విష్ నెటిజన్లపై మండిపడ్డారు. అయితే మెహ్విష్ ఓ ఇంటర్వ్యూలో పర్ఫెక్ట్ బ్యాచిలర్ ఎవరని అడగ్గా ఆమె బిలావాల్ అని చెప్పారు. దీంతో ఈ వీడియో యూట్యూబ్‌లో వైరల్ అవ్వడంతో ఆమె, రాజకీయ నాయకుడు బిలావాల్లు త్వరలో పెళ్లి చేసుకోబుతున్నారంటూ నెట్టింటా వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. Who I choose to marry is my personal decision & ppl will know when it happens! Take a chill pill guys & stop matchmaking!✋🏻Let’s not take a throwaway line in a 2-year-old interview out of context & make unnecessarily juicy headlines. Aur b gham hain zamane mein Shadi k siwaa! LOL — Mehwish Hayat TI (@MehwishHayat) November 29, 2020 అయితే ఈ ఇంటర్వ్యూలో.. మెహ్విష్ను ఇంతకీ మీ జీవిత భాగస్వామిని కలుసుకున్నారా అని అడగ్గా... ‘లేదు ఇప్పటి వరకు అలాంటి వ్యక్తి తారసపడ లేదు. ఎందుకంటే చిన్న వయసులోనే నేను నటిగా నాకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నాను. అలాగే మెహ్విష్ హయత్‌గా నేను ఒకరి ప్రేమలో పడటం నాకు ఇష్టం లేదు. కానీ నేను ఓ మహిళనే కాబట్టి బహుశా నాకు నచ్చిన వ్యక్తి దొరికితే ప్రేమలో పడొచ్చు’ అని చెప్పుకొచ్చారు. అయితే భర్తగా ఎలాంటి లక్షణాలు ఉన్న వ్యక్తిని కోరుకుంటున్నారని అడిగిన ప్రశ్నకు.. మంచి ఎత్తు ఉండాలని, అదే విధంగా ఆకర్షనీయమైన రంగు ఉండాలని తన మనసులో మాటను చెప్పారు. అయితే ఇంటర్య్వూయర్ మీరు పర్ఫెక్ట్ బ్యాచిలర్ అని ఎవరిని అనుకుంటున్నారని అడగ్గా.. మెహ్విష్ ఆలోచించి కొన్ని క్షణాలకు బిలావాల్? అని చెప్పారు. -
యువ నేతతో దావుద్ ప్రేయసి వివాహం..!
ఇస్లామాబాద్: పాకిస్తాన్ నటి మోహ్విష్ హయత్ అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీంతో ప్రేమయాణం నడుపుతోందని పలు కథనాలు వచ్చిన విషయం తెలిసిందే. అయితే తాజాగా ఆమె పాకిస్తాన్‌కి చెందిన ఓ ప్రముఖ రాజకీయ నాయుకుడిని వివాహం చేసుకోబోతుందనే వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో పాక్‌కు చెందిన ఓ టీవీ ఛానల్ ఇటీవల నిర్వహించిన ఓ ఇంటర్వ్యూలో మోహ్విష్ పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. మీరు ఎటువంటి వ్యక్తిని భర్తగా పొందాలనుకుంటున్నారు? అని యాంకర్ ప్రశ్న అడగ్గా.. మంచి ఎత్తు ఉండాలని, అదే విధంగా ఆకర్షనీయమైన రంగు ఉండాలని తన మనసులో మాటను తెలిపారు. ఇటీవల పాకిస్తాన్ నేషనల్ అసెంబ్లీకి ఎన్నికైన బిలావల్ భుట్టో జర్దారీ దృష్టిలో పెట్టుకొని మాట్లాడున్నారా? మీరు ఆయనలా ఉండే వ్యక్తిని విహహం చేసుకుంటారా? అని హోస్ట్ ప్రశ్నించారు. చదవండి: అమెరికా కంటే అధ్వాన్నంగా: బిలావల్ భుట్టో దీనికి స్పందించిన మోహ్విష్.. మీరు బిలావల్ భుట్టో గురించి అడుతున్నారా? అని బదులిస్తూ.. అతడు చాలా అందంగా ఉంటాడని, యువ రాజకీయ నాయుకుడని ప్రశంసించారు. దీంతో మోహ్విష్.. బిలావల్ భుట్టో జర్దారీని వివాహం చేసుకోబోతున్నారని, ఇప్పటికే వారిద్దరూ ప్రేమలో ఉన్నారనే వార్తలు వస్తున్నాయి. అయితే దీనిపై ఆమె ఇప్పటి వరకు స్పందిచలేదు. కాగా, బిలావాల్ భుట్టో జర్దారీ.. మాజీ ప్రధాని బెనజీర్ భుట్టో, మాజీ అధ్యక్షుడు ఆసిఫ్ అలీ జర్దారీ కుమారుడు అన్న విషయం తెలిసిందే. ఇప్పటికే మోహ్విష్ దావుద్ ప్రేయసి అని ప్రచారంలో ఉంది. వీరు ఇద్దరూ ప్రేమలో ఉన్నట్లు 2019లో తెరపైకి వచ్చింది. దావుద్ ఆమెను ఓ ఐటెం సాంగ్‌లో చూసి మనసు పారేసుకున్నట్లు పాక్ మీడియా పలు కథనాల్లో వెల్లడించింది. ఆమెకు దావుద్ వల్లనే పలు సినిమా అవకాశాలు వస్తున్నాయని, అదే విధంగా పాకిస్తాన్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అందించే 'తమ్ గా ఏ ఇంతియాజ్' అవార్డు వెనక కూడా ఆయన హస్తం ఉన్నట్లు అప్పట్లో పెద్ద ఎత్తున వార్తలు హల్చల్ చేశాయి. దావుద్‌కి తనకు ప్రేమ ఉందని వస్తున్న వార్తలపై మోహ్విష్ ఇప్పటివరకు స్పందించకపోవడం గమనార్హం. -
కరోనా: అమెరికా కంటే అధ్వాన్నంగా..
ఇస్లామాబాద్: ‘‘అంతా బాగానే ఉంటుందని ఆశించడం మంచిదే. అయితే అదే సమయంలో విపత్కర పరిణామాలు ఎదుర్కొనేందుకు సిద్ధంగా లేనట్లయితే పాకిస్తాన్ నెమ్మదిగా విపత్తులోకి జారుకుంటుంది. రాబోయే పరిణామాలు తలచుకుంటే భయంగా ఉంది. ఆర్థిక వ్యవస్థను తిరిగి పుంజుకునేలా చేయవచ్చు. కానీ ప్రాణాలు పోతే మళ్లీ తీసుకురాలేం’’అని పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ(పీపీపీ) చైర్మన్, ప్రతిపక్ష నేత బిలావల్ భుట్టో జర్దారీ ఆందోళన వ్యక్తం చేశారు. మహమ్మారి కరోనా వైరస్(కోవిడ్-19)ను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు సరైన చర్యలు తీసుకోవడం లేదని ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ఉమ్మడిగా కరోనాపై పోరాడుదామని ముందుకు వచ్చినా సరిగా స్పందించడం లేదని ఆరోపించారు. ప్రపంచమంతా కరోనా కోరల్లో చిక్కుకుని విలవిల్లాడుతున్న వేళ వివిధ దేశాల్లో లాక్డౌన్ విధించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో దేశవ్యాప్తంగా లాక్డౌన్ విధిస్తే ఆర్థిక వ్యవస్థ పూర్తిగా దిగజారుతుందని పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ వ్యాఖ్యానించారు. దీంతో ఆయనపై తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో పీపీపీ అధికారంలో ఉన్న సింధ్ ప్రావిన్స్ సహా వైరస్ ప్రభావం తీవ్రంగా ఉన్న పలు రాష్ట్రాలు స్వచ్ఛంధంగా విద్యా సంస్థలు, కంపెనీలు మూసివేసి పాక్షిక లాక్డౌన్ విధించాయి. అయితే ఆర్థిక పరిస్థితి దృష్ట్యా ఈ నిబంధనలు సడలించాలంటూ అధికారులు ఒత్తిడి చేస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.(లాక్డౌన్: మృత్యువాత పడుతున్న మూగజీవాలు) ఈ నేపథ్యంలో కరాచీలోని తన కార్యాలయం నుంచి బిలావల్ భుట్టో వీడియో కాల్ ద్వారా మీడియాతో మాట్లాడారు. అంతర్జాతీయ సమాజాన్ని కరోనా బెంబేలెత్తిస్తోందని.. ఈ విషయాన్ని ప్రభుత్వానికి అర్థమయ్యేలా చెప్పాల్సిన బాధ్యత వైద్య నిపుణులదేనని పేర్కొన్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా పెను ప్రమాదం పొంచి ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. తక్షణమే చర్యలు తీసుకోకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని.. సరిగా స్పందించకపోతే పరిస్థితి అమెరికా, పశ్చిమ యూరప్ కంటే అధ్వాన్నంగా తయావుతుందని హెచ్చరించారు. వైద్య సిబ్బందికి సరిపడా రక్షణ పరికరాలు లేవని.. ఆస్పత్రుల్లో బెడ్లు కూడా అందుబాటులో లేవని తెలిపారు. కాగా పాకిస్తాన్లో ఇప్పటివరకు 5230 మంది కరోనా కేసులు నమోదు కాగా... 93 మంది మరణించారు.(మూర్ఖులుగా చరిత్రలో నిలిచిపోకండి: ఇమ్రాన్) -
ముమ్మాటికీ రిగ్గింగే..! పీఈసీపై సంచలన ఆరోపణలు
ఇస్లామాబాద్: తీవ్ర ఉద్రిక్తలు, ఘర్షణల మధ్య ముగిసిన పాకిస్తాన్ ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయోనని ఓవైపు పాకిస్తాన్‌తో సహా పొరుగుదేశం భారత్ ఆసక్తిగా ఎదురుచూస్తుండగా.. ఇమ్రాన్‌ఖాన్ ‘పాకిస్తాన్ తెహ్రీకే ఇన్సాఫ్’ (పీటీఐఈ) మినహా మిగతా పార్టీలన్నీ ఎన్నికల్లో భారీయెత్తున రిగ్గింగ్ జరిగిందని పాకిస్తాన్ ఎన్నికల కమిషన్‌పై ఆరోపణలు గుప్పిస్తున్నాయి. మరోవైపు ఓట్ల లెక్కింపు ప్రక్రియపై కూడా అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. ఎన్నికల ఫలితాలు ఒప్పుకోబోమని తేల్చి చెప్తున్నాయి. రిగ్గింగ్.. రిగ్గింగ్..!! నవాజ్ షరీఫ్ జైలుపాలు కావడంతో అతని తమ్ముడు షాబాజ్‌ఖాన్ ‘పాకిస్తాన్ ముస్లిం లీగ్’ (పీఎంఎల్-ఎన్) అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన సంగతి తెలిసిందే. ఎన్నికల్లో ఘన విజయం సాధించి పీఎంఎల్-ఎన్ను అధికారంలోకి తేవడమే కాకుండా జైలుపాలైన నవాజ్ షరీఫ్‌కు ఊరట కలిగిద్దామనుకున్న షాబాజ్ ఎన్నికల నిర్వహణ, ఓట్ల లెక్కింపుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆయన బుధవారం రాత్రి లాహోర్‌లో మీడియాతో మాట్లాడారు. ఎన్నికల్లో ఇమ్రాన్‌ఖాన్ పీటీఐ పార్టీ మెరుగైన స్థానంలో ఉండడానికి కారణం రిగ్గింగేనని చెప్తున్నారు. నిస్సిగ్గుగా ఎన్నికల్లో రిగ్గింగ్‌కు పాల్పడి అధికారంలోకి వచ్చే పీటీఐతో దేశం మరో ముప్పయ్యేళ్లు వెనక్కి పయనిస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఏజెంట్లు లేకుండా ఎలా..! పోలీంగ్ బూత్‌ల నుంచి తమ పార్టీ ఏజెంట్లు బలవంతంగా బయటకు గెంటేశారని పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ (పీపీపీ) మండిపడింది. ఓట్ల లెక్కింపులో సైతం అక్రమాలు చోటుచేసుకున్నాయని అనుమానాలు వ్యక్తం చేసింది. చిన్నాచితకా పార్టీలు కూడా ఎన్నికల ఫలితాలు నమ్మేట్టుగా లేవని అంటున్నాయి. అయితే, ఎన్నికల్లో రిగ్గింగ్ జరిగిందనే ఆరోపణలపై ఎలక్షన్ కమిషన్ స్పందించింది. ఎన్నికల్లో ఎలాంటి అక్రమాలు చోటుచేసుకోలేదని పేర్కొంది. మరోవైపు 111 పైగా స్థానాల్లో మంచి ఆధిక్యంలో నిలిచిన పీటీఐ అతిపెద్ద పార్టీగా అవతరించనుంది. పాక్ ప్రధానిగా ఇమ్రాన్‌ఖాన్ పగ్గాలు చేపట్టడం ఖాయమని ఇప్పటివరకు వెలువడిన ఎన్నికల ఫలితాలు స్పష్టం చేస్తున్నాయి. -
అమెరికాకు బిలావల్ వార్నింగ్
వాషింగ్టన్: ఏడు ముస్లిం దేశాల పౌరుల ప్రవేశంపై నిషేధం విధిస్తూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న నిర్ణయాన్ని పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ(పీపీపీ) చైర్మన్ బిలావల్ భుట్టో జర్దారీ తప్పుబట్టారు. ట్రంప్ తీసుకున్న నిర్ణయం దేశాల మధ్య చిచ్చు పెట్టి, యుద్ధాలకు కారణమయ్యేలా ఉందని మండిపడ్డారు. వాషింగ్టన్ పౌరులను ఉద్దేశించి సోమవారం ఆయన ప్రసంగించారు. ‘ముస్లిం పౌరులను తమ దేశంలోకి రాకుండా అమెరికా తీసుకున్న నిర్ణయంతో దేశాల మధ్య ఘర్షణలకు కారణమయ్యే అవకాశముంది. నిషేధిత జాబితాలో పాకిస్థాన్ ను కూడా చేర్చితే యుద్ధం వచ్చే రావొచ్చ’ని హెచ్చరించారు. ముస్లింలపై నిషేధం ట్రంప్ ప్రభుత్వం తీసుకున్న అత్యంత వివాదస్పద నిర్ణయమని ధ్వజమెత్తారు. పాకిస్థాన్ పౌరులపైనా నిషేధం విధిస్తే ఏం చేస్తారని ప్రశ్నించగా... అలా చేస్తే అమెరికాపై కచ్చితంగా ప్రతికూల ప్రభావం పడుతుందని సమాధానమిచ్చారు. కొంత మంది ఉగ్రవాదులు చేసిన చర్యలకు మొత్తం ముస్లింలపై నిషేధించడం సరికాదని అభిప్రాయపడ్డారు. ఉగ్రవాదంపై పోరాడుతున్న ముస్లిం ప్రపంచానికి ట్రంప్ నిర్ణయం నిరుత్సాహం కలిగించిందని పేర్కొన్నారు. ఇస్లామిక్ ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ముందుండి పోరాడుతున్న వారికి ప్రతికూల సంకేతాలు వెళ్లే అవకాశముందన్నారు. అమెరికా తన నిర్ణయాన్ని మార్చుకుంటుందన్న ఆశాభావాన్ని బిలావల్ వ్యక్తం చేశారు. -
ఇమ్రాన్.. రాజకీయాలంటే ఆటలు కావు!
ఇస్లామాబాద్: భుట్టో కుటుంబం నుంచి రాజకీయాలు నేర్చుకోవాలని పాకిస్థాన్ తెహరీక్ ఇన్పాఫ్ (పీటీఐ) పార్టీ అధినేత ఇమ్రాన్ ఖాన్ కు పాకిస్థాన్ పీపుల్స్ పారటీ చైర్మన్ బిలావల్ భుట్టో జర్ధారీ హితవు పలికారు. 'రాజకీయాలంటే ఆటలు కావు' అని ఇమ్రాన్ తెలుసుకోవాలని బిలావల్ వ్యాఖ్యలు చేశారు. భుట్టో కుటుంబానికి చెందిన వ్యక్తే పాకిస్థాన్ కు తదుపరి ప్రధాని అవుతాడని బిలావల్ జోస్యం చెప్పారు. తన తల్లి బెనజీర్ భుట్టో ఇంకా ప్రజల హృదయాల్లో గూడు కట్టుకుని ఉన్నారని ఆయన అన్నారు. పాక్ రాజకీయాల్లోకి తాను రావడం కొంతమందికి రుచించడం లేదని ఆయన తన రాజకీయ ఎంట్రీపై అడిగిన ప్రశ్నకు జవాబిచ్చారు. బిలావల్ భుట్టో రాజకీయాల్లో ఎంట్రీకి అక్టోబర్ 18 తేదిని ఆపార్టీ ముహూర్తాన్ని నిర్ణయించారు. -
'పగటి కలలు కంటున్న బిలావల్'
న్యూఢిల్లీ: కాశ్మీర్ పై పాకిస్థాన్ మాజీ ప్రధాని బేనజీర్ భుట్టో కుమారుడు, పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ (పీపీపీ) చైర్మన్ బిలావల్ భుట్టో జర్దారీ చేసిన వ్యాఖ్యలను ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్(ఐయూఎంఎల్) తప్పుబట్టింది. బిలావల్ పగటి కలలు కంటున్నారని పేర్కొంది. భారత భూభాగంలో ఇంచు కూడా వదులుకోబోమని స్పష్టం చేసింది. చివరివరకు భారత భూభాగాన్ని కాపాడుకుంటామని ప్రకటించింది. జమ్మూకాశ్మీర్- భారత్ అంతర్భాగమని ఐయూఎంఎల్ అధ్యక్షుడు ఇ అహ్మద్ అన్నారు. కాశ్మీర్ మొత్తాన్నీ లాక్కుంటామంటూ బిలావల్ భుట్టో జర్దారీ వివాదస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. -
బిలావల్.. భలే జోక్ పేల్చావోయ్!
పాకిస్థాన్ మాజీ ప్రధాని బేనజీర్ భుట్టో కుమారుడు, పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ (పీపీపీ) చైర్మన్ బిలావల్ భుట్టో జర్దారీ (25) కాశ్మీర్ పైచేసిన కవ్వింపు వ్యాఖ్యలపై సామాజిక మాధ్యమంలో నెటిజన్లు చురక అంటించారు. బిలావల్ కామెంట్లపై జోకులు పేల్చారు. వారు మనల్ని ఆయుధాలతో చంపకపోతే... కచ్చితంగా జోక్స్ తో చంపేస్తారంటూ ఓ నెటిజన్ హాస్యమాడారు. బాలీవుడ్ విలక్షణ నటుడు పరేష్ రావల్ కూడా ఒక జోక్ చెప్పారు. ఇదీ రావల్ చెప్పిన జోక్.. ప్రశ్న: చంద్రమామపై ఒక పాకిస్థానీ ఉంటే? జవాబు: సమస్య ప్రశ్న: చంద్రమామపై పది మంది పాకిస్థానీలు ఉంటే? జవాబు: సమస్య ప్రశ్న: చంద్రమామపై అందరూ పాకిస్థానీలు ఉంటే? జవాబు: సమస్య పరిష్కారం తాను ఇంతకుముందు విన్న జోకుల కంటే బిలావల్ చెప్పిన జోకే తనను ఎక్కువగా నవ్వించిందని జెమిన్ పంచాల్ అనే నెటిజన్ ట్వీట్ చేశారు. కాశ్మీర్ పై వ్యాఖ్యలతో బిలావల్... బిలో- ఆలో భుట్టో అయ్యారని మరో నెటిజన్ చురక అంటించారు. బిలావల్ ప్రకటనతో పీపీపీ- పాకిస్థాన్ పప్పు పార్టీగా నిర్థారణయిందని మరొకరు ట్వీట్ చేశారు. కాశ్మీర్ ను లాక్కునే సత్తా ఉంటే బిలావల్ ముందుగా తన మెదడుకు పదును పెట్టిలని మరో యూజర్ సలహాయిచ్చారు. యావత్ కాశ్మీర్‌ను బిలావల్ తీసుకున్నా అందులోనూ తండ్రికి 10 శాతం వాటా ఇవ్వాలని ఒకరు చురకలంటించారు. కాగా, బిలావల్ వ్యాఖ్యలను అపరిపక్వమైనవిగా, చిన్నపిల్లాడి మాటలుగా బీజేపీ అభివర్ణించింది. -
కాశ్మీర్ మొత్తాన్నీ లాక్కుంటా
-
కాశ్మీర్ మొత్తాన్నీ లాక్కుంటాం
పాక్ నేత బిలావల్ భుట్టో రెచ్చగొట్టే వ్యాఖ్యలు తీవ్రంగా ఖండించిన భారత ప్రభుత్వం కాశ్మీర్ ఎప్పటికీ భారత అంతర్భాగమేనన్న బీజేపీ ఇస్లామాబాద్: పాకిస్థాన్ మాజీ ప్రధాని బేనజీర్ భుట్టో కుమారుడు, పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ (పీపీపీ) చైర్మన్ బిలావల్ భుట్టో జర్దారీ (25) కాశ్మీర్ అంశాన్ని రాజకీయ లబ్ధికి ఉపయోగించుకునేలా కవ్వింపు చర్యలకు దిగారు. పాక్ భావి నేతగా కితాబులందుకుంటున్న ఆయన భారత్ నుంచి కాశ్మీర్ మొత్తాన్నీ తమ పార్టీ స్వాధీనం చేసుకుంటుందంటూ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం ముల్తాన్‌లో పార్టీ కార్యకర్తల సమావేశంలో బిలావల్ మాట్లాడుతూ ‘‘కాశ్మీర్ మొత్తాన్నీ నేను వెనక్కు తీసుకుంటా. ఒక్క అంగుళాన్ని కూడా వదిలిపెట్టను. ఎందుకంటే...ఇతర రాష్ట్రాల్లాగానే కాశ్మీర్ కూడా పాకిస్థాన్‌దే’’ అని వ్యాఖ్యానించారు. ఆ సమయంలో దేశ మాజీ ప్రధానులు గిలానీ, అష్రాఫ్‌లు బిలావల్ పక్కనే ఉన్నారు. 2018 ఎన్నికల్లో పోటీ చేస్తానని ఆయన ప్రకటించారు. బిలావల్ తల్లి బేనజీర్ రెండుసార్లు పాక్ ప్రధానిగా పనిచేయగా, ఆయన తాత జుల్ఫీకర్ సైతం 1970లలో ప్రధానిగా పనిచేశారు. సరిహద్దులపై రాజీపడం: భారత్ న్యూఢిల్లీ: బిలావల్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన భారత్...సరిహద్దుల విషయంలో పాక్‌తో రాజీపడే ప్రసక్తే లేదని తేల్చి చెప్పింది. పొరుగుదేశంతో సత్సంబంధాలు కోరుకుంటున్నామంటే దాని అర్థం సరిహద్దులపై రాజీపడటం కాదని విదేశాంగ ప్రతినిధి సయ్యద్ అక్బరుద్దీన్ అన్నారు. భారతసరిహద్దులను మార్చేది లేదన్నారు. పాక్‌తో స్నేహం కోసం దేశసార్వభౌమత్వాన్ని, సమగ్రతను పణంగా పెట్టేదిలేదన్నారు. బిలాల్ వ్యాఖ్యలను సత్యదూరమైనవిగా అభివర్ణించారు. మరోవైపు బిలావల్ వ్యాఖ్యలను అపరిపక్వమైనవిగా, చిన్నపిల్లాడి మాటలుగా బీజేపీ అభివర్ణించింది. కాశ్మీర్ ఎప్పటికీ భారత అంతర్భాగంగానే కొనసాగుతుందని పేర్కొది. కాగా, బిలావల్ వ్యాఖ్యలను ఎద్దేవా చేస్తూ భారత నెటిజన్లు ట్విట్టర్లో జోకులు పేల్చారు. యావత్ కాశ్మీర్‌ను బిలావల్ తీసుకున్నా అందులోనూ తండ్రికి 10 శాతం వాటా ఇవ్వాలని ఒకరు చురకలంటించారు. -
తాలిబాన్ పై సైనిక చర్యకు బిలావల్ విజ్క్షప్తి!
తాలిబాన్ పై సైనిక చర్య చేపట్టాలని పాకిస్థాన్ సైన్యానికి మాజీ ప్రధాని బెనజీర్ భుట్టో కుమారుడు, బిలావల్ భుట్టో జర్ధారీ విజ్క్షప్తి చేశారు. బీబీసీ కిచ్చిన ఇంటర్వ్యూలో బిలావల్ భుట్టో మాట్లాడుతూ.. మిలిటెంట్లతో చర్చల వల్ల లాభం లేదని.. సైనిక చర్య జరపడమే పాకిస్థాన్ ముందున్న ఏకైక మార్గం అని అన్నారు. సమస్యల పరిష్కారానికి చర్చలే కీలకం, అయితే వారు మాపై యుద్ధం చేస్తున్నారని.. వారితో చర్చలు జరపడానికి శక్తి సామర్ధ్యాలు అవసరం అని బిలావల్ తెలిపారు. కేవలం నార్త్ వజిరిస్థాన్ పరిమితం కాలేదు. కరాచీలోనూ మాపై దాడులకు పాల్పడుతున్నారు. పాకిస్థాన్ లో తాలిబాన్ ను ఏరిపారేయాల్సిందే అని అన్నారు. రాజకీయాల్లోకి వస్తానని ఎప్పుడు అనుకోలేదని.. మరింత బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన సమయం ఆసన్నమైందని ఓ ప్రశ్నకు బిలావల్ సమాధానమిచ్చారు. -
'ఇమ్రాన్ ఖాన్ ఓ పిరికిపంద'
క్రికెటర్, రాజకీయ వేత్త ఇమ్రాన్ ఖాన్ పై పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ (పీపీపీ) నేత బిలావల్ భుట్టో జర్ధారీ మండిపడ్డారు. ఇమ్రాన్ ఓ పిరికివాడు అని బిలావల్ ఆరోపించారు. ఉగ్రవాదులకు ఇమ్రాన్ అండగా నిలువడంపై ఆయన తప్పు పట్టారు. ఇమ్రాన్ నేతృత్వంలోని తెహ్రీక్ ఏ ఇన్సాఫ్ లా తమ పార్టీ పిరికి పార్టీ కాదని ఆయన నిప్పులు చెరిగారు. సెప్టెంబర్ 21న పెషావర్ లో 80 మరణానికి కారణమైన ఉగ్రవాదులను ఓ చర్చి ముందు నిలుచుని వారికి అనుకూలంగా మాట్లాడటాన్ని బిలావల్ ఖండించారు. తాలిబాన్ చెందిన ఉగ్రవాదుల పేషావర్ లోని ఆల్ సెయింట్ లక్ష్యంగా చేసుకుని సుసైడ్ బాంబులతో దాడి చేసిన సంగతి తెలిసిందే. ఉగ్రవాదులకు పీపీపీ భయపడదని... వారికి ఎదురొడ్డి పోరాడుతుందని ఆయన అన్నారు. 2007లో ఉగ్రవాదులు జరిపిన దాడిలో తన తల్లి బెనజీర్ భుట్టో తోపాటు మరో 140 మంది మృతి చెందిన సంగతి తెలిసిందే. బేనజీర్ భుట్టో వర్ధంతి సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మాట్లాడుతూ ఇమ్రాన్ ఖాన్ పై మాటల తూటాలను పేల్చారు.