ఇమ్రాన్.. రాజకీయాలంటే ఆటలు కావు! | 'Imran Khan should learn politics from Bhuttos' | Sakshi
Sakshi News home page

ఇమ్రాన్.. రాజకీయాలంటే ఆటలు కావు!

Published Mon, Oct 6 2014 3:27 PM | Last Updated on Sat, Mar 23 2019 8:32 PM

ఇమ్రాన్.. రాజకీయాలంటే ఆటలు కావు! - Sakshi

ఇమ్రాన్.. రాజకీయాలంటే ఆటలు కావు!

ఇస్లామాబాద్: భుట్టో కుటుంబం నుంచి రాజకీయాలు నేర్చుకోవాలని పాకిస్థాన్ తెహరీక్ ఇన్పాఫ్ (పీటీఐ) పార్టీ అధినేత ఇమ్రాన్ ఖాన్ కు  పాకిస్థాన్ పీపుల్స్ పారటీ చైర్మన్ బిలావల్ భుట్టో జర్ధారీ హితవు పలికారు. 'రాజకీయాలంటే ఆటలు కావు' అని ఇమ్రాన్ తెలుసుకోవాలని బిలావల్ వ్యాఖ్యలు చేశారు. 
 
భుట్టో కుటుంబానికి చెందిన వ్యక్తే పాకిస్థాన్ కు తదుపరి ప్రధాని అవుతాడని బిలావల్ జోస్యం చెప్పారు. తన తల్లి బెనజీర్ భుట్టో ఇంకా ప్రజల హృదయాల్లో గూడు కట్టుకుని ఉన్నారని ఆయన అన్నారు. 
 
పాక్ రాజకీయాల్లోకి తాను రావడం కొంతమందికి రుచించడం లేదని ఆయన తన రాజకీయ ఎంట్రీపై అడిగిన ప్రశ్నకు జవాబిచ్చారు.  బిలావల్ భుట్టో రాజకీయాల్లో ఎంట్రీకి అక్టోబర్ 18 తేదిని ఆపార్టీ ముహూర్తాన్ని నిర్ణయించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement