Pakistan Peoples Party
-
పాకిస్తాన్ అధ్యక్షుడిగా జర్దారీ ప్రమాణం
ఇస్లామాబాద్: పాకిస్తాన్ 14వ అధ్యక్షుడిగా పాకిస్తాన్ పీపుల్స్ పారీ్ట(పీపీపీ) నేత అసిఫ్ అలీ జర్దారీ ఆదివారం ప్రమాణ స్వీకారం చేశారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఖాజీ ఫయీజ్ ఈసా ఆయనతో ప్రమాణం చేయించారు. జర్దారీ పాక్ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టడం ఇది రెండోసారి. ప్రమాణ స్వీకారోత్సవానికి పాకిస్తాన్ ప్రధానమంత్రి షహబాజ్ షరీఫ్, మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్, చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ జనరల్ అíసీమ్ మునీర్, జర్దారీ కుటుంబ సభ్యులు హాజరయ్యారు. జర్దారీ 2008 నుంచి 2013 వరకు అధ్యక్షుడిగా పనిచేశారు. అధికార కూటమి ఉమ్మడి అభ్యరి్థగా ఆయన శనివారం అధ్యక్షుడిగా ఎన్నికైన సంగతి తెలిసిందే. -
పాక్ అధ్యక్షుడిగా జర్దారీ
ఇస్లామాబాద్: పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ (పీపీపీ) చైర్పర్సన్ ఆసిఫ్ అలీ జర్దారీ(68) పాక్ అధ్యక్షుడిగా మరోమారు ఎన్నికయ్యా రు. శనివారం జరిగిన ఓటింగ్‌లో పీపీపీ, పాకిస్తాన్ ముస్లిం లీగ్–నవాజ్(పీఎంఎల్–ఎన్) ఉమ్మడి అభ్యర్థి జర్దారీకి 255 ఓట్లు, ఎస్ఐసీ బలపరిచిన మహ్మూద్ ఖాన్‌కు 119 ఓట్లు పోలయ్యాయి. -
పాక్ నేషనల్ అసెంబ్లీ స్పీకర్‌గా సాదిక్
ఇస్లామాబాద్: పాకిస్తాన్ ముస్లిం లీగ్(నవాజ్)(పీఎంఎల్–ఎన్), పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ(పీపీపీ)మరికొన్ని పారీ్టలతో ఏర్పడిన సంకీర్ణ కూటమిలో పదవుల పంపిణీ కొలిక్కి వస్తోంది. నేషనల్ అసెంబ్లీ స్పీకర్ పదవికి శుక్రవారం జరిగిన ఓటింగ్‌లో పీఎంఎల్–ఎన్ సీనియర్ నేత సర్దార్ అయాజ్ సాదిక్, డిప్యూటీ స్పీకర్‌గా పీపీపీ నేత గులాం ముస్తాఫాషా ఎన్నికయ్యారు. అయాజ్ సాదిక్‌కు 291 ఓట్లకు గాను 199 ఓట్లు రాగా, తెహ్రీక్–ఇ–ఇన్సాఫ్ బలపరిచిన అమిర్ డోగార్‌కు 91ఓట్లు దక్కాయి. మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పారీ్టకి చెందిన ప్రజాప్రతినిధులు సున్నీ ఇత్తెహాద్ కౌన్సిల్లో చేరిన విషయం తెలిసిందే. తాజా పరిణామంతో మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ సారథ్యంలోని పీఎంఎల్–ఎన్ బలపరిచిన అభ్యర్థి ప్రధాని పదవిని చేపట్టేందుకు మార్గం సుగమమైంది. -
సైన్యం పడగ నీడన... పాక్‌లో ఎన్నికలకు వేళాయె
అది 2018. పాకిస్తాన్లో సాధారణ ఎన్నికల సమయం. సైన్యం ఆగ్రహానికి గురై అవినీతి కేసుల్లో దోషిగా తేలడంతో నవాజ్ షరీఫ్ అప్పటికి ఏడాది క్రితమే ప్రధాని పదవి పోగొట్టుకున్నారు. జైల్లో మగ్గుతున్నందున ఎన్నికల్లో పోటీకీ దూరమయ్యారు. క్రికెట్ దిగ్గజం ఇమ్రాన్‌ఖాన్ సైన్యం ఆశీస్సులతో ఎన్నికల్లో నెగ్గి ఏకంగా ప్రధాని పీఠమెక్కారు. ఆరేళ్లు గడిచి పాక్ మళ్లీ సాధారణ ఎన్నికల ముంగిట నిలిచేనాటికి ఈ ఇద్దరు మాజీ ప్రధానుల విషయంలో ఓడలు బళ్లు, బళ్లు ఓడలూ అయ్యాయి. సైన్యం కన్నెర్రతో ఇమ్రాన్ పదవి పోగొట్టుకోవడమే గాక అవినీతి కేసుల్లో జైలుపాలయ్యారు. శిక్షల మీద శిక్షలు అనుభవిస్తూ ఎన్నికలకు దూరమయ్యారు. పార్టీకి కనీసం ఎన్నికల గుర్తు కూడా దక్కని దుస్థితి నెలకొంది! చికిత్స పేరుతో ఆరేళ్ల కింద లండన్ చేరి బతుకు జీవుడా అంటూ ప్రవాసంలో కాలం వెళ్లదీసిన నవాజ్ మళ్లీ సైన్యం దన్నుతో దర్జాగా స్వదేశాగమనం చేశారు. సైన్యం స్క్రిప్టులో భాగంగా అవినీతి కేసులన్నీ కొట్టుకుపోయి నాలుగోసారి ప్రధాని అయ్యేందుకు ఉత్సాహంతో ఉరకలు వేస్తున్నారు. ఇలా దశాబ్దాలుగా పాక్‌లో నేతల భాగ్యరేఖలను ఇష్టానికి నిర్దేశిస్తూ వస్తున్న సైన్యం కనుసన్నల్లో ఎప్పట్లాగే మరో ఎన్నికల తంతుకు సర్వం సిద్ధమవుతోంది... ఏ పౌర ప్రభుత్వమూ పూర్తి పదవీకాలం మనుగడ సాగించని చరిత్ర పాక్ సొంతం. చాలాకాలం పాటు ప్రత్యక్షంగా, మిగతా సమయంలో పరోక్షంగా సైనిక నియంతృత్వపు పడగ నీడలోనే ఆ దేశంలో పాలన సాగుతూ వస్తోంది. అలాంటి దేశంలో సైనిక పాలన ఊసు లేకుండా వరుసగా మూడోసారి సాధారణ ఎన్నికలు జరగబోతుండటం విశేషం! ఇలా జరగడం ఆ దేశ చరిత్రలో ఇదే తొలిసారి. 342 మంది సభ్యుల జాతీయ అసెంబ్లీకి ఫిబ్రవరి 8న పోలింగ్‌కు సర్వం సిద్ధమవుతోంది. ఎప్పటి మాదిరే ఈసారి కూడా ఏయే పార్టీలు పోటీ చేయాలో, వాటి తరఫున ఎక్కణ్నుంచి ఎవరు బరిలో ఉండాలో కూడా సైన్యమే నిర్దేశిస్తూ వస్తోంది. దేశ ఆర్థికంగా వ్యవస్థ పూర్తిగా కుప్పకూలి, నిత్యావసరాలతో పాటు అన్ని ధరలూ ఆకాశాన్నంటుతూ ప్రజల బతుకే దుర్భరంగా మారిన వేళ జరుగుతున్న ఎన్నికలివి. అక్కడ ఏ ఎన్నికలూ వివాదరహితంగా జరగలేదు. కానీ ఈసారి మాత్రం అవి పరాకాష్టకు చేరాయి. నిజానికి గత నవంబర్‌లోపే ఎన్నికల ప్రక్రియ పూర్తి కావాల్సింది. జనగణనను కారణంగా చూపి ఫిబ్రవరి దాకా వాయిదా వేశారు. నవాజ్ స్వీయ ప్రవాసం నుంచి తిరిగొచ్చి కాలూచేయీ కూడదీసుకుని బరిలో దిగేందుకు వీలుగానే ఇలా చేశారన్న ఆరోపణలున్నాయి. ఏదెలా ఉన్నా కనీసం ఈసారన్న కాస్త సుస్థిర ప్రభుత్వం ఏర్పాటు కావాలన్నది సగటు పాక్ పౌరుల ఆశ. అమెరికాతో పాటు అంతర్జాతీయ సంస్థల నుంచి అవసరమైన ఆర్థిక సాయం రాబట్టి అవ్యవస్థను చక్కదిద్దడంతో పాటు అన్ని రంగాల్లోనూ దూసుకుపోతున్న భారత్‌తో సంబంధాలను మెరుగు పరుచుకోవాలన్నది వారి ఆకాంక్ష. కానీ సర్వం సైన్యం కనుసన్నల్లో సాగుతున్న తీరును బట్టి చూస్తే ఈసారీ అది అత్యాశే అయ్యేలా కనిపిస్తోంది. నవాజ్ షరీఫ్ పాక్ చరిత్రలో అత్యధిక కాలం ప్రధానిగా పని చేసిన రికార్డు 74 ఏళ్ల నవాజ్ సొంతం. భారత్‌తో సత్సంబంధాలకు ప్రాధాన్యమిచ్చే నేతగానూ పేరుంది. దేశంలోకెల్లా అత్యంత ధనవంతుడని కూడా చెబుతారు. పాకిస్తాన్ ముస్లిం లీగ్ (ఎన్) సారథిగా మూడోసారి ప్రధానిగా ఉండగా 2017లో పనామా పేపర్స్, లండన్ అపార్ట్మెంట్స్ వంటి నానారకాల కేసుల్లో ఇరుక్కున్నారు. పదవి పోగొట్టుకుని జైలుపాలై ప్రాణ భయంతో లండన్ పారిపోయారు. అనంతరం పగ్గాలు చేపట్టిన ఇమ్రాన్‌కూ నాలుగేళ్లలోపే అదే గతి పట్టింది. 2022లో నవాజ్ సోదరుడు షహబాజ్ షరీఫ్ సారథ్యంలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటవడంతో నవాజ్‌కు మంచి రోజులు తిరిగొచ్చాయి. గత అక్టోబర్‌లో ఆయన తిరిగొచ్చి పీఎంఎల్ (ఎన్) పగ్గాలు చేపట్టడం, సైన్యంతో పాటు న్యాయ వ్యవస్థ దన్నూ తోడై ఆయనపై అవినీతి కేసులు, శిక్షలూ ఒక్కొక్కటిగా రద్దవడం చకచకా జరిగిపోయాయి. అడ్డంకులన్నీ తొలిగి ఎన్నికల బరిలో నిలిచిన నవాజ్ నాలుగోసారి ప్రధాని కావడం ఖాయమేనంటున్నారు. ఇమ్రాన్‌ఖాన్ అనితరసాధ్యమైన క్రికెట్ నైపుణ్యంతో పాక్ ప్రజలను ఉర్రూతలూగించి నేషనల్ హీరోగా వెలుగు వెలిగిన 71 ఇమ్రాన్ రాజకీయ పిచ్‌పై మాత్రం నిలదొక్కుకోలేక చతికిలపడ్డారు. అవినీతిని రూపుమాపి, కుటుంబ రాజకీయాలకు చెక్ పెట్టి సర్వం చక్కదిద్దుతానంటూ మార్పు నినాదంతో 2018లో ప్రధాని అయ్యారాయన. కానీ ఇమ్రాన్ హయాంలో ఆర్థికంగానే గాక అన్ని రంగాల్లోనూ దేశం కుప్పకూలింది. హింసతో, అశాంతితో పాక్ అట్టుడికిపోయింది. ఆయనకు ఆదరణా అడుగంటింది. నిజానికి సైన్యం చేతిలో పావుగానే ఇమ్రాన్ రాజకీయ ప్రవేశం జరిగిందంటారు. అలాంటి సైన్యానికే ఎదురు తిరగడంతో ఇమ్రాన్ పరిస్థితి పెనం నుంచి పొయ్యిలో పడింది. ఎంత ప్రయతి్నంచినా పదవిని కాపాడుకోలేకపోయారు. పైగా జైలు శిక్ష వల్ల తాను పోటీ చేసే అవకాశం లేదు. ఆయన పార్టీ తరఫున కొందరు ధైర్యం చేసి ఇండిపెండెంట్లుగా బరిలో దిగుతున్నా చాలామంది జైలుపాలయ్యారు. పలువురు ఫిరాయించగా మిగిలిన వారు అజ్ఞతంలోకి వెళ్లిపోయారు. ఈ సమస్యలు చాలవన్నట్టు పీటీఐ ఎన్నికల గుర్తు బ్యాట్‌పైనా ఎన్నికల సంఘం వేటు వేసింది. దాంతో లక్షలాది మంది నిరక్షరాస్య ఓటర్లు బ్యాలెట్ పత్రాలపై ఇమ్రాన్ పార్టీని గుర్తించను కూడా లేరంటున్నారు. బిలావల్ భుట్టో 35 ఏళ్ల బిలావల్ భుట్టో జర్దారీ పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ చైర్మన్. దారుణ హత్యకు గురైన మాజీ ప్రధాని బేనజీర్ భుట్టో, పాక్ మాజీ అధ్యక్షుడు ఆసిఫ్ అలీ జర్దారీ కుమారుడు. షహబాజ్ షరీఫ్ సర్కారులో విదేశాంగ మంత్రిగా తన పనితీరుతో స్వదేశంలో విమర్శలపాలు, భారత్‌లో నవ్వులపాలయ్యారు. గత ఎన్నికల్లో పీపీపీ మూడో స్థానంలో నిలిచింది. ఈసారి అన్నీ కలిసొస్తే బహుశా కింగ్‌మేకర్ అవ్వొచ్చంటున్నారు. పాక్ జాతీయ అసెంబ్లీలో 342 మంది సభ్యులుంటారు. 266 మందిని నేరుగా ఉన్నుకుంటారు. 70 సీట్లను మహిళలు, మతపరమైన మైనారిటీలకు; ఆరింటిని గిరిజన ప్రాంతాల వారికి రిజర్వు చేశారు. ఈ స్థానాలను పార్టీలకు గెలుచుకున్న స్థానాలను బట్టి నైష్పత్తిక ప్రాతిపదికన కేటాయిస్తారు. సాక్షి, నేషనల్ డెస్క్ -
లైవ్‌లోనే ఎంపీ చెంప పగులగొట్టింది.. వీడియో వైరల్
ఇస్లామాబాద్: ఈ రోజుల్లో టీవీలో రాజకీయ చర్చల సందర్భంగా గొడవలు జరగడం సాధారణమైపోయింది. అయితే ఆ గొడవలు ఒక్కోసారి శృతిమించి కొట్టుకునే స్థాయికి వెళ్తున్నాయి. తాజాగా పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ సన్నిహితురాలు, పంజాబ్ సీఎం ఉస్మాన్ బుజ్దార్‌కు స్పెషల్ అసిస్టెంట్‌గా వ్యవహరిస్తున్న డాక్టర్ ఫిర్దౌస్ ఆశిక్ అవన్ లైవ్‌టీవీలో చర్చ సందర్భంగా ప్రతిపక్ష పీపీపీ(పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ) ఎంపీ ఖాదీర్ మండోఖేల్ చెంపను పగులగొట్టారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. విషయంలోకి వెళితే ఫిర్దౌస్ ఆశిక్, ఖాదీర్ మండోఖేల్లు పాకిస్తాన్లో జరుగుతున్న అవినీతిపై వాదోపవాదాలు చేసుకున్నారు. ''దమ్ముంటే మేం చేసిన అవినీతిని రుజువు చేయాలని'' ఫిర్దౌస్ ఖాదీర్‌కు సవాల్ విసిరారు. అయితే ఆమె మాటలు పట్టించుకోని ఖాదీర్ ఇది అవినీతి ప్రభుత్వమని పదేపదే ఆరోపణలు చేశారు. దీంతో ఒక్కసారిగా ఆగ్రహానికి గురైన ఫిర్దౌస్ కుర్చీలో నుంచి లేచి గట్టిగా అరుస్తూ ఖాదీర్ చొక్కా పట్టుకొని మేం ఏం తప్పుచేయలేదంటూ అతని చెంప పగులగొట్టారు. ఈ సన్నివేశం అక్కడి కెమెరాల్లో రికార్డవడంతో లైవ్ ప్రోగ్రాంను నిలిపివేశారు. అయితే విరామ సమయంలో ఫిర్దౌస్పై ఖాదీర్ అనుచిత వ్యాఖ్యలు చేశారని.. ఆమె తండ్రి గురించి తప్పుగా మాట్లాడారని అక్కడ ఉన్న వాళ్లలో కొంతమంది పేర్కొన్నారు. అయితే ఈ ఘటనపై ఫిర్దౌస్ ఇంతవరకు స్పందించలేదు. చదవండి: 28 మంది భార్యల ముందు 37వ సారి పెళ్లి In which special assistant to CM Punjab Firdous Ashiq Awan slaps member national assembly Qadir Mandokhel. Behind the scenes of news talkshow. pic.twitter.com/qqzURJAdlm — Naila Inayat (@nailainayat) June 9, 2021 -
రెహ్మాన్ మాలిక్ నాపై అత్యాచారం చేశారు..
-
'రెహ్మాన్ మాలిక్ నాపై అత్యాచారం చేశారు'
ఇస్లామాబాద్: అమెరికా బ్లాగర్ సింథియా డి రిచీ పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ (పీపీపీ) సీనియర్ లీడర్, మాజీ విదేశాంగ మంత్రి రెహ్మాన్ మాలిక్‌పై సంచలన ఆరోపణలు చేశారు. 2011లో ఆయన పాకిస్తాన్ విదేశాంగ మంత్రిగా ఉండగా తనకు మత్తుమందు ఇచ్చి అత్యాచారం చేశారని సింథియా పేర్కొన్నారు. ఇస్లామాబాద్‌లోని అధ్యక్ష భవనంలో మాజీ ప్రధాని యూసఫ్ రజా గిలానీ, మాజీ ఆరోగ్య మంత్రి మఖ్దూమ్ షాహబుద్దీన్ కూడా తనను శారీరకంగా వేధించారని ఆమె ఆరోపించారు. కాగా ఈ ఘటన సమయంలో అసిఫ్ అలీ జర్దారీ పాకిస్తాన్ అధ్యక్షుడిగా ఉన్నట్లు సింథియా పేర్కొన్నారు. ఈ మేరకు శుక్రవారం రోజున ఆమె తన ఫేస్బుక్ పేజీ లైవ్ ద్వారా మాట్లాడుతూ.. ఈ ముగ్గురి వ్యవహారాలకు సంబంధించి తన వద్ద అన్ని ఆధారాలు ఉన్నాయని వచ్చే వారంలో వాటన్నింటినీ విడుదల చేస్తానని హామీ ఇచ్చారు. కాగా.. మాజీ ప్రధాని బెనజీర్ భుట్టో, మాజీ అధ్యక్షుడు అసిఫ్ అలీ జర్దారీతో వైవాహిక జీవితంపై సింథియా డి రిచీ అవమానకర వ్యాఖ్యలు చేశారంటూ సింథియాపై గత వారం ఫెడరల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎఫ్ఐఏ) సైబర్ క్రైమ్ విభాగానికి పీపీపీ షెషావర్ జిల్లా అధ్యక్షుడు జుల్ఫికర్ ఆప్ఘానీ ఫిర్యాదు చేశారు. సింథియా గత వారం బెనజీర్ భుట్టో గురించి 'ఇన్‌డీసెంట్ కరస్పాండెంట్ సీక్రెట్ సెక్స్ లైఫ్ ఆప్ బెనజీర్ భుట్టో’ పుస్తకంలోని కొన్ని భాగాలను ట్విటర్లో పోస్ట్ చేశారు. పుస్తకంలో బెనజీర్ భుట్టో, ఆమె కుమారుడు బిలావల్ భుట్టో, పార్టీ సీనియర్ నేత షెర్రీ రెహమాన్ గురించి వివరంగా రాశారు. చదవండి: డీ గ్యాంగ్ బాస్‌కు కరోనా? పీపీపీ నేతలు మద్యం తాగుతూ, మహిళలతో డ్యాన్స్ వేస్తూ.. మోసం చేస్తారని సింథియా పునరుద్ఘాటించారు. సింథియా ఆరోపణల ప్రకారం.. బెనజీర్ భుట్టో మహిళలపై అత్యాచారాలు చేసేవారు అంటూ దివంగత రాజకీయ నాయకుల లైంగిక జీవితం గురించి ఆమె కొన్ని అభ్యంతకర వ్యాఖ్యలు చేశారు. ఒక బొమ్మల దుకాణం యొక్క రశీదును కూడా పోస్ట్ చేస్తూ సెక్స్ బొమ్మల వ్యాపారానికి సహాయం చేయడానికి తన రాజకీయ ప్రభావాన్ని ఉపయోగించారనే ఆరోపణలను ఖండించమని పీపీపీ సీనియర్ నాయకుడు షెర్రీ రెహ్మాన్‌కు సవాల్ చేయడం గమనార్హం. చదవండి: జార్జియాలో కూలిన విమానం; ఐదుగురు మృతి ఎవరీ సింథియా డి. రిచీ..? సింథియా నేపథ్యంపై పూర్తిగా ఆధారాలు లేవు. అయితే ఆమె 2009లో మొదటిసారిగా పాకిస్తాన్‌కు పర్యాటకురాలిగా వచ్చారు. తర్వాతి కాలంలో పాకిస్తాన్ ప్రధాని యూసఫ్ రజా గిలానీ, విదేశాంగ మంత్రి రెహ్మాన్ మాలిక్‌లతో సన్నిహిత సంబంధాలను కొనసాగించారు. పీపీపీ కమ్యూనికేషన్ కన్సల్టెంట్‌గా పనిచేశారు. ఈమె ఉర్దూ, పంజాబీ భాషలు మాట్లాడతారు. ప్రస్తుతం ఇస్లామాబాద్‌లో నివసిస్తూ.. ఫ్రీలాన్స్ ఫిల్మ్ మేకర్, రచయిత, కాలమిస్ట్‌గా పనిచేస్తున్నారు. ఈ మధ్య పీపీపీ అధికారానికి దూరం కావడంతో ఇమ్రాన్ ఖాన్ శిబిరంలోకి వెళ్లిన సింథియా పీపీపీ నాయకులపై తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. -
పాక్ అధ్యక్ష ఎన్నిక రసవత్తరం!
ఇస్లామాబాద్: పాకిస్తాన్ అధ్యక్షుడి ఎన్నికలో ఇమ్రాన్ ఖాన్ పార్టీ పాకిస్తాన్ తెహ్రీక్ ఇ ఇన్సాఫ్ (పీటీఐ)తో ఉమ్మడిగా తలపడాలని పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ (పీపీపీ), పాకిస్తాన్ ముస్లిం లీగ్–నవాజ్ (పీఎంఎల్–ఎన్) నిర్ణయించాయి. సెప్టెంబర్ 4న జరిగే ఈ ఎన్నికలో ఉమ్మడి అభ్యర్థిని బరిలో దింపాలని రెండు పార్టీలు నిర్ణయం తీసుకున్నట్లు పాక్ మీడియా వెల్లడి ంచింది. ముర్రేలో ఆగస్టు 25న జరిగే ప్రతిపక్ష పార్టీల సమావేశంలో అభ్యర్థిని ప్రకటి ంచనున్నట్లు తెలిసింది. ఆ సమావేశానికి పీఎం ఎల్–ఎన్ చీఫ్ షాబాజ్ షరీఫ్ అధ్యక్షత వహిం చనున్నారు. తొలుత ఇత్‌జాజ్ అహసన్‌ను పీపీపీ అభ్యర్థిగా నిర్ణయించగా.. ప్రతిపక్షాలను సంప్రదించకుండా ప్రకటించారంటూ పీఎం ఎల్–ఎన్ తిరస్కరించింది. ప్రస్తుతం జైల్లో ఉన్న మాజీ ప్రధాని, పీఎంఎల్–ఎన్ నేత నవాజ్ షరీఫ్, ఆయన భార్య కుల్సుమ్కు వ్యతిరేకంగా అహసన్ వ్యాఖ్యలు చేశారంటూ అభ్యంతరం వ్యక్తం చేసింది. కాగా, ప్రతిపక్ష పార్టీలు ఉమ్మడి అభ్యర్థిని బరిలో దింపితే ఎన్నిక రసవత్తరంగా మారుతుందని.. పీటీఐ, ప్రతిపక్షాల మధ్య 8–10 ఓట్ల తేడానే ఉంటుందని సీనియర్ పీఎంఎల్–ఎన్ నేత అన్నారు. పీటీఐ ఇప్పటికే ప్రముఖ డెంటిస్ట్ అరీఫ్ అల్వీ (69)ని తమ అభ్యర్థిగా ప్రకటించింది. ప్రస్తుత అధ్యక్షుడు మమ్మూన్ హుస్సేన్ పదవీకాలం సెప్టెంబర్ 9న ముగియనుంది. పరోక్ష పద్ధతిలో జరిగే పాక్ అధ్యక్షుడి ఎన్నికలో పార్లమెంటు, నాలుగు రాష్ట్రాల అసెంబ్లీల సభ్యులు పాల్గొంటారు. -
లాడెన్ డబ్బుతో ఎన్నికల బరిలో షరీఫ్!
ఇస్లామాబాద్: దివంగత పాక్ మాజీ ప్రధాని బెనజీర్ భుట్టో నేతృత్వంలోని పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ(పీపీపీ)ని ఎదుర్కొనేందుకు 1990 ఎన్నికల్లో నిలబడేందుకు కావాల్సిన భారీ మొత్తాలను ప్రస్తుత ప్రధాని నవాజ్ షరీఫ్ అల్ కాయిదా అధినేత లాడెన్ నుంచి పొందారని ఓ పుస్తకంలో వెల్లడైంది. పాక్ నిఘా సంస్థ ఐఎస్ఐ మాజీ ఉన్నతాధికారి ఖలీద్ ఖవాజా భార్య షమామా ఖలీద్ వెలువరించిన ‘ ఖలీద్ ఖవాజా: షాహీదీ అమాన్’ పుస్తకంలో ఈ విషయాలు వెలుగుచూశాయి. పాక్‌లో ఇస్లామిక్ రాజ్యస్థాపనకు షరీఫ్ ప్రతినబూనడంతో ఆయనవైపు లాడెన్, ఖలీద్‌లు ఆకర్షితులయ్యారని పేర్కొన్నారు. జియాల తుది దశలో 1990లో పీపీపీని ఎన్నికల్లో ఎదుర్కొనేందుకు కావాల్సిన భారీ నగదు మొత్తాలను లాడెన్ నుంచి తీసుకున్నాడని, అధికారంలోకి వచ్చాక షరీఫ్ తన వాగ్దానాలను పక్కనబెట్టాడని ‘డాన్’ వార్తాసంస్థ సోమవారం ఓ కథనం ప్రచురించింది. -
ఇమ్రాన్.. రాజకీయాలంటే ఆటలు కావు!
ఇస్లామాబాద్: భుట్టో కుటుంబం నుంచి రాజకీయాలు నేర్చుకోవాలని పాకిస్థాన్ తెహరీక్ ఇన్పాఫ్ (పీటీఐ) పార్టీ అధినేత ఇమ్రాన్ ఖాన్ కు పాకిస్థాన్ పీపుల్స్ పారటీ చైర్మన్ బిలావల్ భుట్టో జర్ధారీ హితవు పలికారు. 'రాజకీయాలంటే ఆటలు కావు' అని ఇమ్రాన్ తెలుసుకోవాలని బిలావల్ వ్యాఖ్యలు చేశారు. భుట్టో కుటుంబానికి చెందిన వ్యక్తే పాకిస్థాన్ కు తదుపరి ప్రధాని అవుతాడని బిలావల్ జోస్యం చెప్పారు. తన తల్లి బెనజీర్ భుట్టో ఇంకా ప్రజల హృదయాల్లో గూడు కట్టుకుని ఉన్నారని ఆయన అన్నారు. పాక్ రాజకీయాల్లోకి తాను రావడం కొంతమందికి రుచించడం లేదని ఆయన తన రాజకీయ ఎంట్రీపై అడిగిన ప్రశ్నకు జవాబిచ్చారు. బిలావల్ భుట్టో రాజకీయాల్లో ఎంట్రీకి అక్టోబర్ 18 తేదిని ఆపార్టీ ముహూర్తాన్ని నిర్ణయించారు. -
కాశ్మీర్ మొత్తాన్నీ లాక్కుంటాం
పాక్ నేత బిలావల్ భుట్టో రెచ్చగొట్టే వ్యాఖ్యలు తీవ్రంగా ఖండించిన భారత ప్రభుత్వం కాశ్మీర్ ఎప్పటికీ భారత అంతర్భాగమేనన్న బీజేపీ ఇస్లామాబాద్: పాకిస్థాన్ మాజీ ప్రధాని బేనజీర్ భుట్టో కుమారుడు, పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ (పీపీపీ) చైర్మన్ బిలావల్ భుట్టో జర్దారీ (25) కాశ్మీర్ అంశాన్ని రాజకీయ లబ్ధికి ఉపయోగించుకునేలా కవ్వింపు చర్యలకు దిగారు. పాక్ భావి నేతగా కితాబులందుకుంటున్న ఆయన భారత్ నుంచి కాశ్మీర్ మొత్తాన్నీ తమ పార్టీ స్వాధీనం చేసుకుంటుందంటూ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం ముల్తాన్‌లో పార్టీ కార్యకర్తల సమావేశంలో బిలావల్ మాట్లాడుతూ ‘‘కాశ్మీర్ మొత్తాన్నీ నేను వెనక్కు తీసుకుంటా. ఒక్క అంగుళాన్ని కూడా వదిలిపెట్టను. ఎందుకంటే...ఇతర రాష్ట్రాల్లాగానే కాశ్మీర్ కూడా పాకిస్థాన్‌దే’’ అని వ్యాఖ్యానించారు. ఆ సమయంలో దేశ మాజీ ప్రధానులు గిలానీ, అష్రాఫ్‌లు బిలావల్ పక్కనే ఉన్నారు. 2018 ఎన్నికల్లో పోటీ చేస్తానని ఆయన ప్రకటించారు. బిలావల్ తల్లి బేనజీర్ రెండుసార్లు పాక్ ప్రధానిగా పనిచేయగా, ఆయన తాత జుల్ఫీకర్ సైతం 1970లలో ప్రధానిగా పనిచేశారు. సరిహద్దులపై రాజీపడం: భారత్ న్యూఢిల్లీ: బిలావల్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన భారత్...సరిహద్దుల విషయంలో పాక్‌తో రాజీపడే ప్రసక్తే లేదని తేల్చి చెప్పింది. పొరుగుదేశంతో సత్సంబంధాలు కోరుకుంటున్నామంటే దాని అర్థం సరిహద్దులపై రాజీపడటం కాదని విదేశాంగ ప్రతినిధి సయ్యద్ అక్బరుద్దీన్ అన్నారు. భారతసరిహద్దులను మార్చేది లేదన్నారు. పాక్‌తో స్నేహం కోసం దేశసార్వభౌమత్వాన్ని, సమగ్రతను పణంగా పెట్టేదిలేదన్నారు. బిలాల్ వ్యాఖ్యలను సత్యదూరమైనవిగా అభివర్ణించారు. మరోవైపు బిలావల్ వ్యాఖ్యలను అపరిపక్వమైనవిగా, చిన్నపిల్లాడి మాటలుగా బీజేపీ అభివర్ణించింది. కాశ్మీర్ ఎప్పటికీ భారత అంతర్భాగంగానే కొనసాగుతుందని పేర్కొది. కాగా, బిలావల్ వ్యాఖ్యలను ఎద్దేవా చేస్తూ భారత నెటిజన్లు ట్విట్టర్లో జోకులు పేల్చారు. యావత్ కాశ్మీర్‌ను బిలావల్ తీసుకున్నా అందులోనూ తండ్రికి 10 శాతం వాటా ఇవ్వాలని ఒకరు చురకలంటించారు. -
'ఇమ్రాన్ ఖాన్ ఓ పిరికిపంద'
క్రికెటర్, రాజకీయ వేత్త ఇమ్రాన్ ఖాన్ పై పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ (పీపీపీ) నేత బిలావల్ భుట్టో జర్ధారీ మండిపడ్డారు. ఇమ్రాన్ ఓ పిరికివాడు అని బిలావల్ ఆరోపించారు. ఉగ్రవాదులకు ఇమ్రాన్ అండగా నిలువడంపై ఆయన తప్పు పట్టారు. ఇమ్రాన్ నేతృత్వంలోని తెహ్రీక్ ఏ ఇన్సాఫ్ లా తమ పార్టీ పిరికి పార్టీ కాదని ఆయన నిప్పులు చెరిగారు. సెప్టెంబర్ 21న పెషావర్ లో 80 మరణానికి కారణమైన ఉగ్రవాదులను ఓ చర్చి ముందు నిలుచుని వారికి అనుకూలంగా మాట్లాడటాన్ని బిలావల్ ఖండించారు. తాలిబాన్ చెందిన ఉగ్రవాదుల పేషావర్ లోని ఆల్ సెయింట్ లక్ష్యంగా చేసుకుని సుసైడ్ బాంబులతో దాడి చేసిన సంగతి తెలిసిందే. ఉగ్రవాదులకు పీపీపీ భయపడదని... వారికి ఎదురొడ్డి పోరాడుతుందని ఆయన అన్నారు. 2007లో ఉగ్రవాదులు జరిపిన దాడిలో తన తల్లి బెనజీర్ భుట్టో తోపాటు మరో 140 మంది మృతి చెందిన సంగతి తెలిసిందే. బేనజీర్ భుట్టో వర్ధంతి సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మాట్లాడుతూ ఇమ్రాన్ ఖాన్ పై మాటల తూటాలను పేల్చారు.