Viral Video: Women Leader Close To Imran Khan’s Slaps Pakistani MP During TV Show - Sakshi
Sakshi News home page

లైవ్‌లోనే ఎంపీ చెంప పగులగొట్టింది.. వీడియో వైరల్‌

Published Thu, Jun 10 2021 12:08 PM | Last Updated on Thu, Jun 10 2021 1:58 PM

Pakistani Women Leader Slaps PPP MP Qadir Mandokhel During TV Show - Sakshi

ఇస్లామాబాద్: ఈ రోజుల్లో టీవీలో రాజకీయ చర్చల సందర్భంగా గొడవలు జరగడం సాధారణమైపోయింది. అయితే ఆ గొడవలు ఒక్కోసారి శృతిమించి కొట్టుకునే స్థాయికి వెళ్తున్నాయి. తాజాగా పాక్‌ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ సన్నిహితురాలు, పంజాబ్‌ సీఎం ఉస్మాన్‌ బుజ్దార్‌కు స్పెషల్‌ అసిస్టెంట్‌గా వ్యవహరిస్తున్న డాక్టర్ ఫిర్దౌస్ ఆశిక్ అవన్ లైవ్‌టీవీలో చర్చ సందర్భంగా ప్రతిపక్ష పీపీపీ(పాకిస్తాన్‌ పీపుల్స్‌ పార్టీ) ఎంపీ ఖాదీర్‌ మండోఖేల్‌ చెంపను పగులగొట్టారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

విషయంలోకి వెళితే ఫిర్దౌస్‌ ఆశిక్‌, ఖాదీర్‌ మండోఖేల్‌లు పాకిస్తాన్‌లో జరుగుతున్న అవినీతిపై వాదోపవాదాలు చేసుకున్నారు. ''దమ్ముంటే మేం చేసిన అవినీతిని రుజువు చేయాలని'' ఫిర్దౌస్‌ ఖాదీర్‌కు సవాల్‌ విసిరారు. అయితే ఆమె మాటలు పట్టించుకోని ఖాదీర్‌ ఇది అవినీతి ప్రభుత్వమని పదేపదే ఆరోపణలు చేశారు. దీంతో ఒక్కసారిగా ఆగ్రహానికి గురైన ఫిర్దౌస్‌ కుర్చీలో నుంచి లేచి గట్టిగా అరుస్తూ ఖాదీర్‌ చొక్కా పట్టుకొని మేం ఏం తప్పుచేయలేదంటూ అతని చెంప పగులగొట్టారు. ఈ సన్నివేశం అక్కడి కెమెరాల్లో రికార్డవడంతో లైవ్‌ ప్రోగ్రాంను నిలిపివేశారు. అయితే విరామ సమయంలో ఫిర్దౌస్‌పై ఖాదీర్‌ అనుచిత వ్యాఖ్యలు చేశారని.. ఆమె తండ్రి గురించి తప్పుగా మాట్లాడారని అక్కడ ఉన్న వాళ్లలో కొంతమంది పేర్కొన్నారు. అయితే ఈ ఘటనపై ఫిర్దౌస్‌ ఇంతవరకు స్పందించలేదు.
చదవండి: 28 మంది భార్యల ముందు 37వ సారి పెళ్లి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement