'ఇమ్రాన్ ఖాన్ ఓ పిరికిపంద' | Imran Khan making excuses for terrorists: Bilawal Bhutto Zardari | Sakshi
Sakshi News home page

'ఇమ్రాన్ ఖాన్ ఓ పిరికిపంద'

Published Fri, Oct 18 2013 5:03 PM | Last Updated on Fri, Sep 1 2017 11:45 PM

'ఇమ్రాన్ ఖాన్ ఓ పిరికిపంద'

'ఇమ్రాన్ ఖాన్ ఓ పిరికిపంద'

క్రికెటర్, రాజకీయ వేత్త ఇమ్రాన్ ఖాన్ పై పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ (పీపీపీ) నేత బిలావల్ భుట్టో జర్ధారీ మండిపడ్డారు. ఇమ్రాన్ ఓ పిరికివాడు అని బిలావల్ ఆరోపించారు.  ఉగ్రవాదులకు ఇమ్రాన్ అండగా నిలువడంపై ఆయన తప్పు పట్టారు. ఇమ్రాన్ నేతృత్వంలోని తెహ్రీక్ ఏ ఇన్సాఫ్ లా తమ పార్టీ పిరికి పార్టీ కాదని ఆయన నిప్పులు చెరిగారు. సెప్టెంబర్ 21న పెషావర్ లో 80 మరణానికి కారణమైన ఉగ్రవాదులను ఓ చర్చి ముందు నిలుచుని వారికి అనుకూలంగా మాట్లాడటాన్ని బిలావల్ ఖండించారు. 
 
తాలిబాన్ చెందిన ఉగ్రవాదుల పేషావర్ లోని ఆల్ సెయింట్ లక్ష్యంగా చేసుకుని సుసైడ్ బాంబులతో దాడి చేసిన సంగతి తెలిసిందే. ఉగ్రవాదులకు పీపీపీ భయపడదని... వారికి ఎదురొడ్డి పోరాడుతుందని ఆయన అన్నారు. 2007లో ఉగ్రవాదులు జరిపిన దాడిలో తన తల్లి బెనజీర్ భుట్టో తోపాటు మరో 140 మంది మృతి చెందిన సంగతి తెలిసిందే. బేనజీర్ భుట్టో వర్ధంతి సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మాట్లాడుతూ ఇమ్రాన్ ఖాన్ పై మాటల తూటాలను పేల్చారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement