![Asif Ali Zardari sworn in as Pakistan 14th President - Sakshi](/styles/webp/s3/article_images/2024/03/11/ali-jardhari.jpg.webp?itok=GfxJuj2z)
ఇస్లామాబాద్: పాకిస్తాన్ 14వ అధ్యక్షుడిగా పాకిస్తాన్ పీపుల్స్ పారీ్ట(పీపీపీ) నేత అసిఫ్ అలీ జర్దారీ ఆదివారం ప్రమాణ స్వీకారం చేశారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఖాజీ ఫయీజ్ ఈసా ఆయనతో ప్రమాణం చేయించారు. జర్దారీ పాక్ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టడం ఇది రెండోసారి.
ప్రమాణ స్వీకారోత్సవానికి పాకిస్తాన్ ప్రధానమంత్రి షహబాజ్ షరీఫ్, మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్, చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ జనరల్ అíసీమ్ మునీర్, జర్దారీ కుటుంబ సభ్యులు హాజరయ్యారు. జర్దారీ 2008 నుంచి 2013 వరకు అధ్యక్షుడిగా పనిచేశారు. అధికార కూటమి ఉమ్మడి అభ్యరి్థగా ఆయన శనివారం అధ్యక్షుడిగా ఎన్నికైన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment