చండీగఢ్/అమృత్‌సర్: విచారణ ఖైదీగా అస్సాం జైలులో గడుపుతున్న ఖలిస్తానీ ప్రచారకుడు, సిక్కు వేర్పాటువాది అమృత్‌పాల్ సింగ్ జూలై ఐదో తేదీన పార్లమెంట్ సభ్యునిగా ప్రమాణంచేయనున్నారు. ‘వారిస్ పంజాబ్ దే’ అధినేత అయిన అమృత్‌పాల్ ఇటీవల సార్వత్రిక ఎన్నికల్లో పంజాబ్ నుంచి గెలిచారు. ఖదూర్ సాహిబ్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దిగి దాదాపు 2లక్షల భారీ మెజారిటీతో గెల్చిన విషయం తెల్సిందే.
జాతీయ భద్రతా చట్టం కింద అరెస్టయి అస్సాంలోని దిబ్రూగఢ్ జైలులో అమృత్‌పాల్ విచారణ ఖైదీగా ఉన్నారు. కొత్తగా ఎన్నికైన ఎంపీలంతా ప్రమాణంచేసేనాటికి ఈయనకు పెరోల్ లభించలేదు. తాజాగా జూలై 5వ తేదీ నుంచి నాలుగురోజులపాటు పెరోల్ దొరికింది. దీంతో లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా ప్రైవేట్ ఛాంబర్‌లో ఈయనతో ఎంపీగా ప్రమాణంచేయిస్తారని ఫరీద్‌కోట్ స్వతంత్ర ఎంపీ సరబ్‌జీత్ సింగ్ ఖల్సా బుధవారం వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment