Amritpal Singh
-
Amritpal Singh-Engineer Rashid: జైలు నుంచి గెలుపు.. ఎంపీలుగా ప్రమాణం
జైలు నుంచి ఇటీవల లోక్‌సభ ఎన్నికల్లో గెలుపొందిన ఇద్దరు ఎంపీలు శుక్రవారం పార్లమెంట్ సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేశారు. ఖలిస్థాన్ సానుభూతిపరుడు, వారిస్ పంజాబ్ దే నేత అమృత్‌పాల్ సింగ్ లోక్‌సభ సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేశారు.. తనతో పాటు జమ్ముకశ్మీర్ టెర్రర్ ఫండింగ్ కేసులో అరెస్టై ప్రస్తుతం జైల్లో ఉన్న ఇంజినీర్ రషీద్ కూడా ఇవాళ లోక్‌సభ ఎంపీగా ప్రమాణ స్వీకారం చేశారు.అమృత్‌పాల్ సింగ్ ఫిబ్రవరి 23న అరెస్టైన విషయం తెలిసిందే. లోక్‌సభ ఎన్నికల్లో పంజాబ్‌లోని ఖదూర్ సాహిబ్ నియోజకవర్గం నుంచి జైలు నుంచే పోటీ చేసి విజయం సాధించారు. ఈ నేపథ్యంలో అస్సాంలోని ధిబ్రూగఢ్ జైలు నుంచి పెరోల్‌పై నేరుగా ఢిల్లీకి వెళ్లిన ఆయన 18వ లోక్‌సభ సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేశారు.ఇక రషీద్ ఇటీవలే జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో జమ్మూ కశ్మీర్‌లోని బారాముల్లా నియోజకవర్గం నుంచి ఇండిపెండెంట్‌గా పోటీచేసి విజయం సాధించచారు. జమ్మూ కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి, నేషనల్ కాన్ఫరెన్స్ ఉపాధ్యక్షుడు ఒమర్ అబ్దుల్లాపై రెండు లక్షల ఓట్ల భారీ మెజారిటీతో గెలుపొందారు. -
రేపు ప్రమాణం చేయనున్న అమృత్‌పాల్
చండీగఢ్/అమృత్సర్: విచారణ ఖైదీగా అస్సాం జైలులో గడుపుతున్న ఖలిస్తానీ ప్రచారకుడు, సిక్కు వేర్పాటువాది అమృత్‌పాల్ సింగ్ జూలై ఐదో తేదీన పార్లమెంట్ సభ్యునిగా ప్రమాణంచేయనున్నారు. ‘వారిస్ పంజాబ్ దే’ అధినేత అయిన అమృత్‌పాల్ ఇటీవల సార్వత్రిక ఎన్నికల్లో పంజాబ్ నుంచి గెలిచారు. ఖదూర్ సాహిబ్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దిగి దాదాపు 2లక్షల భారీ మెజారిటీతో గెల్చిన విషయం తెల్సిందే. జాతీయ భద్రతా చట్టం కింద అరెస్టయి అస్సాంలోని దిబ్రూగఢ్ జైలులో అమృత్‌పాల్ విచారణ ఖైదీగా ఉన్నారు. కొత్తగా ఎన్నికైన ఎంపీలంతా ప్రమాణంచేసేనాటికి ఈయనకు పెరోల్ లభించలేదు. తాజాగా జూలై 5వ తేదీ నుంచి నాలుగురోజులపాటు పెరోల్ దొరికింది. దీంతో లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా ప్రైవేట్ ఛాంబర్లో ఈయనతో ఎంపీగా ప్రమాణంచేయిస్తారని ఫరీద్కోట్ స్వతంత్ర ఎంపీ సరబ్జీత్ సింగ్ ఖల్సా బుధవారం వెల్లడించారు. -
అమృత్‌పాల్ సింగ్‌కు పెరోల్.. జులై 5న ఎంపీగా ప్రమాణం
ఖలిస్థానీ ఉగ్రవాది, వారిస్ పంజాబ్ దే నాయకుడు అమృత్‌పాల్ సింగ్ లోక్‌సభ సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేసేందుకు రంగం సిద్ధమైంది. జాతీయ భద్రతా చట్టం కింద అరెస్టై అస్సాంలోని డిబ్రూగఢ్‌లో జైల్లో ఉన్న అమృత్‌పాల్ ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో పంజాబ్‌లోని ఖదూర్సా హిబ్ స్థానం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ఎంపీగా గెలుపొందారు.అమృత్‌పాల్ సింగ్ ఎంపీగా ప్రమాణ స్వీకారానికి బుధవారం స్పీకర్‌ను కలిసి అనుమతి కోరినట్లు ఫరీద్‌కోట ఎంపీ సరభ్‌జీత్ సింగ్ ఖల్సా వెల్లడించారు. లోక్‌సభలో కాకుండా.. స్పీకర్ ఛాంబర్లో జులై 5న ప్రమాణం చేసేందుకు ఓం బిర్లా అనుమతి ఇచ్చారని తెలిపారు. అతడికి ఐదవ తేదీ నుంచి నాలుగురోజులకు పేరోల్ లభించినట్లు చెప్పారు. ఇక అదే రోజు ఉగ్రవాదులకు నిధులు సమకూర్చిన కేసులో నిందితుడిగా ఉన్న బారాముల్లా ఎంపీ ఇంజినీర్ రషీద్ప్రమాణ స్వీకారం కూడా ఉండనుంది. -
అమృత్‌పాల్ నిర్భందం ఏడాది పొడగింపు
చండీగఢ్: సిక్కు తీవ్రవాద ప్రబోధకుడు అమృత్‌పాల్ సింగ్ నిర్భందాన్ని ఏడాది పాటు పొడగిస్తూ పంజాబ్ ప్రభుత్వం ఈనెల 3న ఉత్తర్వులు జారీచేసింది. అయితే బుధవారం వీటిని బహిరంగ పర్చారు. వారిస్ దే పంజాబ్ చీఫ్ అమృత్‌పాల్, అతని తొమ్మిది మంది అనుచరులు జాతీయ భద్రతా చట్టం కింద అరెస్టయ్యి ప్రస్తుతం అస్సాంలోని డిబ్రూగఢ్ జైలులో ఉన్నారు. జైలులో ఉంటూనే అమృత్‌పాల్ లోక్‌సభ ఎన్నికల్లో పంజాబ్‌లోని ఖదూర్ సాహిబ్ స్థానం నుంచి స్వతంత్ర అభ్యరి్థగా పోటీచేసి సమీప కాంగ్రెస్ ప్రత్యరి్థపై 1.97 లక్షల మెజారిటీతో ఎంపీగా విజయం సాధించాడు. ఫలితాలు ఈనెల 4న వెలువడగా.. 3వ తేదీనే అమృత్‌పాల్ నిర్భందాన్ని ఏడాదిపాటు పొడగిస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. -
ఆ నేత ఆలోచన 'వేరేలెవెల్'..గెలుపుని కూడా పర్యావరణ హితంగా..!
ఇటీవల లోక్‌సభ, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ ముగిసిన సంగతి తెలిసిందే. ఆ ఎన్నికల్లో గెలిచిన అభ్యర్థులు, పార్టీ కార్యకర్తలు బాణా సంచాలతో, మిఠాయిలతో ఆ విజయోత్సాహాన్ని ఆనందంగా జరుపుకుంటారు. ఎవ్వరైనా ఇలానే చేస్తారు. మరొకందరూ వారీ మతానుసారంగా పూజలు, మొక్కలు, చెల్లించుకోవడం చేస్తారు. మహా అయితే అన్నదానాలు చేస్తారు. కానీ ఈ ఎంపీలా ఇలా సెలబ్రేట్ చేసుకోవాలని ఎవ్వరూ ఆలోచించరేమో..!. అతడేమీ మిగతా అభ్యర్థుల్లా స్వేచ్ఛగా ప్రచార ర్యాలీతో ఎన్నికల బరిలోకి దిగిన వ్యక్తి కాదు. అయినప్పటికీ ఎన్నికల్లో విజయకేతనం ఎగరువేయడమే గాక ఆ సంతోషాన్ని ఇలా సెలబ్రేట్ చేయమని తన అభ్యర్థులను కోరి..అందర్నీ ఆశ్చర్యపరిచాడు. అతడి వినూత్న ఆలోచన చూసి..'వాటే ఎంపీ' అంటూ అంతా ప్రశంసిస్తున్నారు.అతడే అమృత్‌పాల్. 2024 లోక్‌సభ ఎన్నికల ఫలితాల్లో అత్యంత ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే..కొందరు అభ్యర్థులు జైల్లో ఉన్నప్పటికీ ఎంపీ ఎన్నికల్లో విజయం సాధించారు.వారిలో ఒక అభ్యర్థే ఈ అమృత్‌పాల్. స్వతంత్ర అభ్యర్థి అమృతపాల్ సింగ్ పంజాబ్‌లోని ఖదూర్ సాహిబ్ లోక్‌సభ స్థానం నుంచి గెలుపొందారు. ఇతడు రాడికల్ సిక్కు బోధకుడు, ఖలిస్థానీ అనుకూల గ్రూప్ ‘వారిస్ పంజాబ్ దే’ అధినేత. ఖదూర్ సాహిబ్ లోక్‌సభ స్థానం నుంచి అమృతపాల్ సింగ్ దాదాపు లక్షా 90 వేల ఓట్ల ఆధిక్యంతో గెలిచారు. ప్రస్తుతం అసోం జైలులో ఉన్నారు. జాతీయ భద్రతా చట్టం కింద అమృతపాల్‌ను అరెస్టు చేశారు. అమృతపాల్ సింగ్ జైలులో ఉండగానే పెద్ద విజయం సాధించారు. అయితే ఈ విజయాన్ని మిఠాయలతో సెలబ్రేట్ చెయ్యొద్దని అన్నారు. అందరికి ఉచితంగా మొక్కలను పంపిణీ చేసి వేడుక చేసుకోవాలని తన అభ్యర్థులకు సూచించారు. అంతేగాదు దాదాపు 5 లక్షల మొక్కలను పంపిణీ చేసేలా యత్నించమని అన్నారు. తాను వేడి, కాలుష్యం పట్ల ఆందోళన చెందుతున్నానని, అందువల్ల పర్వావరణ హితార్థం ఇలా మొక్కలు పంచండని అభ్యర్థులను కోరారు. వారు కూడా అతడు చెప్పినట్లు అతడి పేరుతో మొక్కలను డిస్ట్రూబ్యూట్ చేశారు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. దీన్ని చూసిన నెటిజన్లు పర్యావరణం పట్ల స్ప్రుహ కలిగిన గొప్ప నేత అంటూ ప్రశంసిస్తూ పోస్టులు పెట్టారు. Amritpal requested his supporters not to distribute sweets but plants after his victory. A target of distribution of 5 lakh plants has been set. Amritpal said he is worried about the rising heat and pollution. pic.twitter.com/3FwGEztaDP— Poor Vegitarian Majdoor 🤡(Modi ka Parivar) (@Nayak_Khalnyak) June 5, 2024 (చదవండి: ఆ చిన్న సిరామిక్ మేక బొమ్మ అన్ని లక్షలా..!) -
దూసుకెళ్తున్న స్వతంత్య్ర అభ్యర్థి 'అమృత్‌పాల్ సింగ్'
ఎలక్షన్ కౌటింగ్ జరుగుతూ ఉంది. జాతీయ పార్టీల నాయకులు మాత్రమే కాకుండా స్వతంత్య్ర అభ్యర్థులు కూడా తమదైన రీతిలో దూసుకెళ్తున్నారు. ఈ జాబితాలో ఖలిస్థానీ వేర్పాటువాది, వారిస్ పంజాబ్ డి చీఫ్ 'అమృత్‌పాల్ సింగ్' ఉన్నారు.పంజాబ్‌లోని ఖదూర్ సాహిబ్ స్థానం నుంచి పోటీ చేసిన 'అమృత్‌పాల్ సింగ్' 50,405 ఓట్ల ఆధిక్యంలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన కాంగ్రెస్ నేత కుల్బీర్ సింగ్ జిరా, ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థి కూడా వెనుకంజలో ఉన్నారు. 2019లో ఖాదూర్ సాహిబ్ స్థానాన్ని కాంగ్రెస్‌కు చెందిన జస్బీర్ సింగ్ గిల్ గెలుచుకున్నారు.Lok Sabha polls: Jailed pro-Khalistani separatist Amritpal Singh leads from Khadoor Sahib seat with over 50,000 votesRead @ANI Story | https://t.co/Ss7uSG3mZg#LokSabhaPolls #AmritpalSingh #Elections pic.twitter.com/rdUudrkviY— ANI Digital (@ani_digital) June 4, 2024 -
ఖలీస్థానీ వేర్పాటువాది అమృత్‌పాల్‌కి ‘మైక్’ గుర్తు కేటాయింపు
జైలులో ఉన్న ఖలీస్థానీ వేర్పాటువాది అమృత్‌పాల్ సింగ్ లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. పంజాబ్‌లోని ఖదూర్ సాహిబ్ పార్లమెంట్ స్థానం నుంచి అమృత్ పాల్ స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. కాగా, ఆయనకు కేంద్ర ఎన్నికల సంఘం పోలింగ్‌కు ‘మైక్’ గుర్తును కేటాయించింది. పోలింగ్ గుర్తులు కేటాయించిన మొత్తం 169 స్వతంత్ర అభ్యర్థుల్లో అమృత్ పాల్ సింగ్ ఒకరు. ‘వారిస్ పంజాబ్ దే’ సంస్థకు చీఫ్ అయిన అమృత్ పాల్.. జాతీయ భద్రతా చట్టం కింద అరెస్టై.. ప్రస్తుతం అసోంలోని దిబ్రూగఢ్ జైలులో ఉన్నారు. అదే విధంగా ఫరీద్కోట్( రిజర్వు) స్థానం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న సరబ్జిత్ సింగ్ ఖాస్లాకు ‘చెరుకు రైతు’ గుర్తును ఈసీ కేటాయించింది. మాజీ ప్రధాని ఇందిరా గాంధీని హత్య చేసిన నిందితుల్లో ఒకరైన బియాంత్ సింగ్ కుమారుడే సరబ్జిత్ సింగ్. ఇక.. పంజాబ్‌లోని 13 స్థానాలకు చివరి ఏడో విడతలో జూన్ 1న పోలింగ్ జరగనుంది. -
Lok Sabha Election 2024: లోక్‌సభ బరిలో ఖలిస్తాన్ మద్దతుదారులు
సాక్షి, న్యూఢిల్లీ: దేశానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న ఖలిస్తాన్ వేర్పాటువాదుల మద్దతుదారులు లోక్‌సభ ఎన్నికల్లో బరిలో దిగారు. పార్లమెంట్లో అడుగుపెట్టడంతో పాటు ఖలిస్తాన్ ఉద్యమానికి మద్దతు తెలిపే వారందరినీ ఏకం చేసేందుకు ఎన్నికలను ఉపయోగించుకోవాలని భావిస్తున్నారు. అకాలీదళ్‌కు చెందిన సిమ్రన్‌జీత్ సింగ్ మాన్, జైలులో ఉన్న ’వారిస్ పంజాబ్ దే’ చీఫ్ అమృత్‌పాల్ సింగ్‌తో సహా ఎనిమిది మంది వేర్పాటువాదులు పంజాబ్ బరిలో తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ సింగ్ మాన్ రాజీనామాతో 2022లో జరిగిన సంగ్రూర్ ఉప ఎన్నికలో సిమ్రన్‌జీత్ సింగ్ మాన్ విజయం సాధించారు. ఇది ఖలిస్తానీ మద్దతుదారులకు ప్రేరణగా మారింది. సిమ్రన్‌జీత్ ఈసారి కూడా సంగ్రూర్ నుంచే పోటీ చేస్తున్నారు. ఆనంద్‌పూర్ సాహిబ్ నుంచి కుశాల్‌పాల్ సింగ్ మాన్, ఫరీద్కోట్ నుంచి బల్దేవ్ సింగ్ గాగ్రా, లుధియానా నుంచి అమృత్‌పాల్ సింగ్ చంద్ర, పటియాలా నుంచి మోనీందర్పాల్ సింగ్ పోటీ చేస్తున్నారు. కర్నాల్ నుంచి హర్జీత్ సింగ్ విర్క్, కురుక్షేత్ర స్థానం నుంచి ఖాజన్ సింగ్ బరిలోకి దిగారు. దిబ్రూగఢ్ జైల్లో ఉన్న ఖలిస్థానీ వేర్పాటువాది అమృత్‌పాల్ సింగ్ ఖదూర్ సాహిబ్ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యరి్థగా పోటీ చేస్తున్నారు. -
లోక్‌సభ ఎన్నికల బరిలో ఖలిస్థానీ వేర్పాటువాది
ఖలిస్థానీ అనుకూల వేర్పాటువాది, వారిస్ పంజాబ్ డి చీఫ్ అమృత్‌పాల్ సింగ్ లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేస్తారని ఆయన తల్లి బల్విందర్ కౌర్ శనివారం తెలిపారు. పంజాబ్‌లోని ఖదూర్ సాహిబ్ లోక్‌సభ సెగ్మెంట్ నుంచి అమృత్‌పాల్ సింగ్ స్వాతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగనున్నారని చెప్పారు. ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలని తన కుమారుడు అమృత్‌పాల్ సింగ్‌పై ఒత్తిడి పెరుగుతోందని ఆమె తెలిపారు. లోక్‌సభ ఎన్నికల్లో ఖదూర్ సాహిబ్ సీట్లు పోటీ చేసి రాజకీయ ఇన్నింగ్స్ ప్రారంభిస్తారని పేర్కొన్నారామె. ఏ పార్టీ అభ్యర్థిగా పోటీ చేయటం లేదని.. స్వాతంత్రగా పోటీ చేస్తున్నారని ఆమె వివరించారు. పంజాబ్‌లోని పలు సమస్యలపై అమృత్ పాత్‌కు పూర్తి అవగాహన ఉందని, వాటిపై పోరాటం చేస్తారని తెలిపారు.ఒక రోజు క్రితం అమృత్‌పాల్ సింగ్ లోక్‌సభ ఎన్నికల్లో పోట చేసేది ధృవికరించలేమని ఆయన తండ్రి తార్సెమ్ సింగ్ చెప్పారు. అయితే ప్రజులు కోరుకుంటే ఎన్నికల బరిలోకి దిగుతారని అన్నారు. అంతకంటే ముందు అమృత్ పాల్ లోక్‌సభ ఎన్నికల పోటీపై ఆయన లీగల్ కౌన్సిల్ రాజ్దేవ్ సింగ్ ఖాల్సా కూడా స్పందించారు. అమృత్ పాల్.. పంజాబ్‌లోని ఖదూర్ సాహిబ్ లోక్‌సభ సెగ్మెంట్ పోటీ చేయనున్నారని తెలిపారు. ప్రస్తుతం అమృత్ పాల్ సింగ్ అసోంలోని డిబ్రూగఢ్ జైలులో ఉన్న విషయం తెలిసిందే. గత ఏడాది ఏప్రిల్‌లో ఆయనతో పాటు మరో తొమ్మిది మంది అనుచరులను జైలుకు తరలించారు. ఇక.. గతేడాది ఫిబ్రవరిలో అమృత్‌పాల్ సన్నిహితుడు లవ్‌ప్రీత్ సింగ్‌ను పోలీసులు అరెస్టు చేశారు. దీంతో అమృత్ పాల్ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయటంతో ఆయన మద్దతుదారులను పోలీస్ స్టేషన్‌పై దాడికి దిగెలా చేశాడు. వారంతా ఫిబ్రవరి 23న పోలీస్ స్టేషన్లోకి ప్రవేశించి విధ్వంసం సృష్టించారు.లవ్‌ప్రీత్ సింగ్‌ను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈనేపథ్యంలోనే విద్వేష ప్రసంగాలు చేసినందుకు అమృత్‌పాల్ సింగ్‌పై కేసు నమోదైంది. అనంతరం అతడు పరారీలో ఉన్నాడు. సుమారు 35 రోజుల పాటు వెతికి పట్టుకున్నారు పోలీసులు. అనంతరం పంజాబ్ పోలీసులు అమృత్ పాల్ సింగ్‌ను భద్రతా కారణాల దృష్ట్యా అసోంలోని డిబ్రూగఢ్ జైలుకు తరలించారు. -
విషప్రయోగంతోనే అవతార్ ఖాందా కన్నుమూత?
బ్రిటన్‌లో ఖలీస్తానీ లిబరేషన్ ఫోర్స్ చీఫ్ అవతార్ సింగ్ ఖాందా అనుమానాస్పదంగా మృతి చెందాడు. ఖలీస్తానీ వేర్పాటువాది అమృత్‌పాల్ సింగ్‌కి గురువుగా చెప్పుకునే అవతార్ సింగ్ క్యాన్సర్‌తో కన్నుమూశాడని ప్రకటించినప్పటికీ.. అతనిపై విష ప్రయోగం జరిగిందనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి ఇప్పుడు. ఈ క్రమంలో దర్యాప్తు కొనసాగుతోంది. అవతార్ సింగ్ ఖాందా.. కేఎల్ఎఫ్ చీఫ్ మాత్రమే కాదు, మార్చి 19వ తేదీన లండన్‌లోని భారత్ హైకమిషన్ ఎదుట భారతీయ జెండాను అవమానించేందుకు ఖలీస్తానీలు ప్రయత్నించిన కుట్రకు ప్రధాన సూత్రధారి కూడా. ఈ ఘటనకు సంబంధించి నేషనల్ ఇన్వెస్టిగేషన్ తన దర్యాప్తులో ఖాందానే ప్రధాన నిందితుడిగా పేర్కొంది కూడా. ఇక ప్రధానంగా చెప్పుకోవాల్సిన విషయం ఒకటి ఉండి. పోలీసులకు అమృత్‌పాల్ సింగ్ దొరకకుండా తిరిగిన రోజుల్లోనూ అవతార్ అతనికి సహకరించినట్లు తేలింది కూడా. అవతార్ ఖాందా బ్యాక్‌గ్రౌండ్‌ను పరిశీలిస్తే.. కేఎల్ఎఫ్ ఉగ్రవాది కుల్వంత్ సింగ్ తనయుడే ఈ అవతార్. బాంబ్ ఎక్స్పర్ట్ కూడా. 2007లో యూకేకి స్టడీ వీసా మీద వెళ్లి.. 2012లో అక్కడే ఆశ్రయం పొందాడు. 2020 జనవరిలో కేఎల్ఎఫ్ మాజీ చీఫ్ హర్మీత్ సింగ్ హత్యానంతరం.. కేఎల్‌ఎఫ్‌లో రాంజోధ్ సింగ్ కోడ్ నేమ్‌తో అవతార్ కొనసాగాడు. దీప్ సింగ్ మరణాంతరం వారిస్ పంజాబ్ దే చీఫ్‌గా అమృత్‌పాల్ సింగ్ నియామకంలోనూ అవతార్ సింగ్‌దే కీలక పాత్ర కూడా. మెంటార్ రోల్లో అమృత్‌పాల్ ప్రతీ వ్యవహారాన్ని అవతార్ చూసుకుంటూ వచ్చాడు కూడా. ఇక 37 రోజులపాటు అమృత్‌పాల్ సింగ్ పరారీలో ఉండగా.. ఆ సమయంలో యూకే నుంచి అవతార్ సహాయసహకారాలు అందించాడని దర్యాప్తు బృందాలు నిర్ధారించుకున్నాయి. బ్లడ్ క్యాన్సర్‌తో బాధపడుతున్న అవతార్ సింగ్ బర్మింగ్హమ్లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూసినట్లు మెడికల్ రిపోర్టులు చెబుతున్నా.. అతనిపై విష ప్రయోగం జరిగిందనే అనుమానాల నడుమ దర్యాప్తు కొనసాగుతోంది. ఇదిలా ఉంటే ఏప్రిల్ 23వ తేదీన పంజాబ్ మోగాలో అమృత్‌పాల్ సింగ్ పోలీసులకు లొంగిపోగా.. అసోం దిబ్రుఘడ్ జైలుకు అతన్ని తరలించారు. జాతీయ భద్రతా చట్టం కింద అమృత్‌పాల్, అతని ఎనిమిది మంది అనుచరులపైనా కేసులు నమోదు అయ్యాయి. సంబంధిత వార్త: వేట ముగిసింది.. అమృత్‌పాల్ అరెస్ట్ -
Amritpal Singh: భార్య అరెస్టు అవుతుందనే భయంతో లొంగిపోయాడా?
ఖలీస్తానీ వేర్పాటు వాది అమృత్‌పాల్ సింగ్ నెలరోజులుగా పరారీలో ఉండి ఈరోజు(ఆదివారం) అనుహ్యంగా అరెస్టవ్వడం పలు అనుమానాలను రేకెత్తించింది. అతను పంజాబ్ నుంచి నేపాల్ అక్కడి నుంచి వేరే దేశానికి వెళ్లిపోయి ఉండొచ్చని వార్తలు వస్తున్న వేళ..అనుహ్యంగా పంజాబ్‌లోని మోగా జిల్లాలో ప్రత్యక్షమవ్వడం అరెస్టు కావడం చర్చనీయాంశంగా మారింది. అదీకూడా అతడి భార్య కిరణదీప్ కౌర్ అతన్ని తరలించేందుకు చేసిన ప్రయత్నం విఫలమైన రెండు రోజుల్లోనే అమృత్‌పాల్ అరెస్టు కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. అతను మార్చి 18 నుంచి పరారీలో ఉన్నాడు. అప్పటి నుంచి అతనిపై అణిచివేత ప్రారంభమైంది. ఆ క్రమంలోనే అతడి భార్య కిరణ్‌దీప్ కౌర్‌పై పంజాబ్ పోలీసులు గట్టి నిఘా పెట్టారు. ప్రస్తుతం ఆమె భారతదేశంలో నివశిస్తున్నారు. అదీగాక ఆమె వీసా గడువు ఈ జూలైలో ముగుస్తోంది. సరిగ్గా ఆమె అమృత్‌పాల్ కోసం వేట కొనసాగిస్తున్న తరుణంలోనే లండన్ వెళ్లేందుకు యత్నించింది. ఐతే ఆమె విమానం ఎక్కి వెళ్లిపోతుందనంగా..చివరి నిమిషంలో ఇమిగ్రేషన్ అధికారులు అడ్డుకుని లుక్ఔట్ నోటీసులు జారీ చేసి ఆమెను దేశం విడిచి వెళ్లొద్దని చెప్పారు. దీంతో కిరణ్ కౌర్ అరెస్టు ఖాయమని వార్తలు ఊపందుకున్నాయి. నిజానికి ఆమెను దేశం నుంచి సురక్షితంగా దాటించేయాలనకున్నాడు. అది బెడిసికొంటింది. మరోవైపు తాను పారిపోయేందుకు సాయం చేసినందుకు గానూ తన భార్య అరెస్టు ఖాయమన్న భయం కూడా అమృత్‌పాల్‌ని వెంటాడింది. ఈ నేపథ్యంలోనే పోలీసుల ఎదుట లొంగిపోయి ఉండవచ్చనని అధికారులు అనుమానిస్తున్నారు. ఎందుకంటే బ్రిటన్ పౌరసత్వ కలిగి ఉన్న అతడి భార్య ద్వారా కిరణ్ దీప్ కౌర్ యూకేకి నిధులు మళ్లించినట్లు సమాచారం. దీంతో ఈ విషయం ఎక్కడ బయటపడుతుందన్న భయం కూడా అమృత్పాల్లో మొదలైంది. ఈ కారణాల రీత్యా అతను పంజాబ్‌లో తన సొంత మోగా జిల్లాలో ప్రత్యక్షమై లొంగిపోయి ఉండవచ్చన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. కాగా, కిరణ్‌దీప్ కౌర్ ఈ ఏడాది ఫిబ్రవరిలో తన పెళ్లి కోసం ఇండియాకు వచ్చింది.ఆమె పెళ్లి అమృత్‌పాల్ స్వస్థలమైన జల్లుపూర్ ఖేరా గ్రామంలో జరిగింది. పోలీసుల అతడి ఆచూకి కోసం సాగిస్తున్న వేటలో అమృత్‌పాల్ తల్లి తోపాటు ఆమెను కూడా విచారించారు. (చదవండి: గర్వంగా ఉంది! అమృతపాల్ తల్లిదండ్రుల స్పందన..) -
Amritpal Singh Arrest: గర్వంగా ఉంది! తల్లిదండ్రుల రియాక్షన్..
పోలీసులను ముప్పు తిప్పులు పెడుతున్న ఖలిస్థానీ సానుభూతిపరుడు, 'వారిస్ పంజాబ్ దే' చీఫ్ అమృత్ పాల్ సింగ్‌ను ఆదివారం అరెస్టు అయిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై అతడి తల్లి స్పందిస్తూ..తన కొడుకు ఓ యోధుడిలా లొంగిపోయినందుకు గర్వంగా ఉందన్నారు. అతని అరెస్టుకు వ్యతిరేకంగా న్యాయ పోరాటం చేస్తామని అతడి తల్లి బల్వీందర్ కౌర్ అన్నారు. అలాగే అతడి తండ్రి తార్సేమ్ సింగ్ ప్రజలు వేధింపులకు గురవుతున్నందున అమృత్‌పాల్‌ని లొంగిపోవాలిన తాను కోరినట్లు చెప్పారు. ఈ కేసుపై తాము పోరాడతామన్నారు. అంతేగాదు అతని గురించి మొత్తం సమాజం పోరాడాలన్నారు. అమృత్‌పాల్ డ్రగ్స్ ముప్పు నుంచి ప్రజలను రక్షించడానికి పనిచేస్తున్నాడని తాను కూడా అందు కోసమే కృషి చేస్తున్నాని చెప్పుకొచ్చారు తార్సేమ్. కాగా, వారిస్ పంజాబ్ దేపై పంజాబ్ పోలీసులు అణిచివేత ప్రారంభించిన తర్వాత నుంచి అమృతపాల్ పరారీలో ఉన్నాడు. అతని అనుచరులను ఒక్కొక్కరిగా అదుపులోకి తీసుకుంటూ..35 రోజుల వేట అనంతరం పక్కా సమాచారంతో మోగా జిల్లాలోని గురుద్వార్ వద్ద అమృత్‌పాల్‌ని అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు. అతనిపై కఠినమైన జాతీయ భద్రత చట్టం కింద కేసు నమోదు చేశారు పోలీసులు. ఈ మేరకు పోలీసులు అమృత్‌పాల్‌ని భద్రత దృష్ట్యా అసంలోని దిబ్రూఘర్ జైలుకి తరలించారు. (చదవండి: హెలికాప్టర్ వద్ద సెల్ఫీ తీసుకుంటుండంగా..అంతలోనే..) -
ఖలిస్థాన్ వేర్పాటువాది అమృత్ పాల్ అరెస్ట్
-
35 రోజులుగా వేట.. అమృత్‌పాల్ సింగ్‌ను అరెస్టు చేసిన పోలీసులు!
చండీగడ్: 35 రోజులుగా పోలీసులను ముప్పు తిప్పులు పెడుతున్న ఖలిస్థానీ సానుభూతిపరుడు, 'వారిస్ పంజాబ్ దే' చీఫ్ అమృత్ పాల్ సింగ్‌ను పోలీసులు అరెస్టు చేశారు. ఆదివారం ఉదయం మోగా జిల్లాలోని ఓ గురుద్వార్ అతడు ఉన్నట్లు పక్కా సమాచారం అందుకున్న పోలీసులు.. చాకచక్యంగా చుట్టుముట్టి అతడ్ని అదుపులోకి తీసుకున్నారు. ఎట్టకేలకు అతడు చిక్కడంతో ఊపిరిపీల్చుకున్నారు. అయితే అమృత్‌పాల్ సింగ్ తనంతట తానే పోలీసులకు లొంగిపోయినట్లు తెలుస్తోంది. పోలీసులపైకి ప్రతిఘటించే ప్రయత్నం కూడా చేయేలదని సన్నిహిత వర్గాలు తెలిపాయి. అతని లొంగిపోడవం తప్ప మరో ఆప్షన్ లేదని పోలీసు ఉన్నతాధికారి తెలిపారు. అతనిపై ఎన్ఎస్ఏ వారెంట్ జారీ అయినట్లు పేర్కొన్నారు. పంజాబ్ పోలీసులు అమృత్ పాల్ సింగ్‌ను భద్రతా కారణాల దృష్ట్యా అసోంలోని డిబ్రూగఢ్ జైలుకు తరలించినట్లు అధికారిక వర్గాలు తెలిపాయి. ఇప్పటికే అరెస్టైన అతని అనుచరులను కూడా పంజాబ్ నుంచి వేరే రాష్ట్రానికి తరలించినట్లు సమాచారం. అమృత్‌పాల్ అత్యంత సన్నిహితుడు పాపల్ ప్రీత్ సింగ్‌ను కూడా అసోం దిబ్రూగఢ్ సెంట్రల్ జైలులోనే ఉంచారు. అమృత్‌పాల్ సింగ్‌ను అత్వి త్వరలోనే అరెస్టు చేస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్‌షా శనివారమే వ్యాఖ్యానించడం గమనార్హం. గతంలో అతను స్వేచ్ఛగా తిరిగేవాడని, కానీ ఇప్పుడు అది సాధ్యం కాదని పేర్కొన్నారు. ఆ మరునాడే పోలీసులు అమృత్‌పాల్‌ను అరెస్టు చేశారు. విద్వేష ప్రసంగాలతో యువతను రెచ్చగొడుతున్న అమృత్‌పాల్ సింగ్ మార్చి 18 నుంచి పరారీలో ఉన్నాడు. అతడి కోసం వేల మంది పోలీసులు నెలరోజులుగా వేట కొనసాగిస్తున్నారు. అయినా వేషాలు, వాహనాలు మార్చుతూ అతడు ఎవరికంటాపడకుండా తిరిగుతున్నాడు. అమృత్ పాల్ పరారీలో ఉన్నప్పటి నుంచి అతడి అనుచరులను ఒక్కొక్కరిగా అరెస్టు చేశారు పోలీసులు. మఖ్య సన్నిహితుడు పాపల్ ప్రీత్ సింగ్‌ను ఏప్రిల్ 11న అరెస్టు చేశారు. ఏప్రిల్ 15న జోగా సింగ్‌ను, ఏప్రిల్ 18న మరో ఇద్దరు అనుచరులను అదుపులోకి తీసుకున్నారు. ఫిబ్రవరిలో అమృత్‌పాల్ సన్నిహితుడు లవ్‌ప్రీత్ సింగ్‌ను పోలీసులు అరెస్టు చేశారు. దీంతో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసి తన మద్దతుదారులు పోలీస్ స్టేషన్‌పై దాడికి దిగెలా చేశాడు అమృత్‌పాల్ . వీరంతా ఫిబ్రవరి 23న పోలీస్ స్టేషన్లోకి ప్రవేశించి విధ్వంసం సృష్టించారు. లవ్‌ప్రీత్ సింగ్‌ను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈనేపథ్యంలోనే విద్వేష ప్రసంగాలు చేసినందుకు అమృత్‌పాల్ సింగ్‌పై కేసు నమోదైంది. అనంతరం అతడు పరారీలో ఉన్నాడు. అతనికి చెందిన ఆయుధాలు, వాహనాలను పోలీసులు సీజ్ చేశారు. #WATCH | Outside visuals from Rodewal Gurudwara in Moga, Punjab from where Waris Punjab De's #AmritpalSingh was arrested by Punjab Police today. pic.twitter.com/gHtlARqarn — ANI (@ANI) April 23, 2023 #WATCH | Earlier visuals of Waris Punjab De's #AmritpalSingh at Gurudwara in Moga, Punjab. He was arrested by Punjab Police from Moga this morning and is likely to be shifted to Dibrugarh, Assam. pic.twitter.com/2HMxTr50s7 — ANI (@ANI) April 23, 2023 చదవండి: మోదీపై ఆత్మాహుతి దాడి చేస్తాం -
అమృత్‌పాల్ భార్య కిరణ్‌దీప్‌కు భారీ షాక్..
అమృత్సర్: ఖలిస్తాన్ సానుభూతిపరుడు అమృత్‌పాల్ సింగ్ గత కొద్దిరోజులుగా పోలీసులకు దొరక్కకుండా తిరుగుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో భద్రతా బలగాలు, పంజాబ్ పోలీసులు.. అమృత్‌పాల్ కోసం గాలిస్తున్నారు. ఇదే సమయంలో అమృత్‌పాల్ సింగ్ కుటుంబ సభ్యులపై కూడా పోలీసులు ఫోకస్ పెట్టారు. అయితే, తాజాగా దేశం విడిచి వెళ్లేందుకు ప్రయత్నించిన అమృత్‌పాల్ భార్య కిరణ్‌దీప్ కౌర్ (28)ను పోలీసులు అమృత్సర్ విమానాశ్రయంలో అదుపులోకి తీసుకున్నారు. వివరాల ప్రకారం.. కిరణ్‌దీప్ కౌర్ గురువారం మధ్యాహ్నం లండన్ వెళ్లే క్రమంలో అమృత్సర్ విమానాశ్రయంలో ఇమిగ్రేషన్ పోలీసులు ఆమెను అడ్డుకుని అదుపులోకి తీసుకున్నారు. విమానం షెడ్యూల్ ప్రకారం లండన్‌కు 1.30 గంటలకు వెళ్లాల్సి ఉండగా.. కిరణ్‌దీప్‌ను పోలీసులు అడ్డుకుని విచారిస్తున్నారు. తమకు చెప్పకుండా ఆమెకు విదేశాలకు వెళ్లే ప్రయత్నం చేయడంతో పోలీసులు సీరియస్ అయ్యారు. ఇంత అర్జెంట్‌గా లండన్ ఎందుకు వెళ్తున్నారు అని ప్రశ్నిస్తున్నట్టు సమాచారం. కాగా, కిరణ్‌దీప్ కౌర్ బ్రిటిష్ పౌరురాలు. ఆమెపై పంజాబ్‌లో కానీ, దేశంలో కానీ ఎలాంటి కేసులు లేవు. అమృత్‌పాల్ భార్య కిరణ్‌దీప్ కౌర్ యూకేలో ఉంటూ బబ్బర్ ఖల్సా ఇంటర్నేషనల్‌లో క్రియాశీలక సభ్యురాలిగా ఉన్నారు. పరారీలో ఉన్న నిందితుల కుటుంబం, పరిచయస్తులను ప్రశ్నించే చట్టపరమైన ప్రక్రియ కింద కిరణ్‌దీప్ కౌర్‌ను ముందు జాగ్రత్త చర్యగా అదుపులోకి తీసుకున్నారు. అంతకుముందు.. మార్చిలో అమృతపాల్ సింగ్ కార్యకలాపాలకు విదేశీ నిధులు సమకూర్చిన ఆరోపణలపై ఆమెను జల్లుపూర్ ఖేడా గ్రామంలో ప్రశ్నించారు. మరోవైపు.. కిరణ్‌దీప్ లండన్ వెళ్తున్న నేపథ్యంలో అమృత్‌పాల్ కూడా లండన్‌కు వెళ్తున్నారా? అనే అనుమానాలను పోలీసులు వ్యక్తం చేస్తున్నారు. ఖలీస్థాన్ వేర్పాటువాద ఉద్యమంలో అతడి భవిష్యత్తు ప్రణాళికలు ఏంటి? అనేది ఆమెను ఆరా తీస్తున్నట్టు తెలుస్తోంది. కాగా, అమృత్‌పాల్ అనుచరులను పంజాబ్ పోలీసులు ఇటీవలే అరెస్ట్ చేశారు. VIDEO | Visuals from Amritsar Airport where fugitive pro-Khalistani leader Amritpal Singh's wife Kirandeep Kaur has been stopped by immigration officials. pic.twitter.com/KaCSfb6Fcr — Press Trust of India (@PTI_News) April 20, 2023 -
అమృత్ సహాయకుడి అరెస్ట్
చండీగఢ్: ఖలిస్తానీ అనుకూల బోధకుడు అమృత్‌పాల్ సింగ్ ముఖ్య సహాయకుడు మరొకరు పోలీసులకు చిక్కాడు. లూధియానాకు చెందిన జోగిసింగ్ ఉత్తరప్రదేశ్‌లోని పిలిభిత్‌లో డేరా నిర్వహిస్తున్నాడు. మార్చి 18 నుంచి పరారీలో ఉన్న అమృత్‌పాల్‌కు పిలిభిత్‌లో ఆశ్రయం ఇవ్వడంతోపాటు పంజాబ్ తిరిగి వచ్చేందుకు వాహనాలను సమకూర్చినట్లు పోలీసులు చెప్పారు. అతడిని సిర్హింద్‌లో అరెస్ట్ చేసినట్లు శనివారం పోలీసులు చెప్పారు. ఇతడితోపాటు అమృత్‌పాల్‌కు సహకరించిన హోషియార్పూర్ వాసి రాజ్‌దీప్‌సింగ్, జలంధర్‌కు చెందిన సరబ్జీత్ సింగ్‌లను కూడా అదుపులోకి తీసుకున్నామన్నారు. -
పప్పాల్‌ప్రీత్ సింగ్ అరెస్ట్.. ఇక అమృత్‌పాల్ దొరికినట్టేనా?
ఛండీఘర్: ఖలిస్తాన్ సానుభూతిపరుడు అమృత్‌పాల్ సింగ్ కోసం పంజాబ్ పోలీసులు సహా భద్రతా బలగాలు గాలిస్తున్న విషయం తెలిసిందే. కాగా, ఇటీవలే అమృత్‌పాల్ సిక్కులతో సమావేశమవుతారని ఇంటిలిజెన్స్ వర్గాలు హెచ్చరించాయి. ఈ క్రమంలో పోలీసులు తనిఖీలు ముమ్మరం చేశారు. ఇదిలా ఉండగా, అమృత్‌పాల్ సింగ్ కేసులో ట్విస్ట్ చోటుచేసుకుంది. అమృత్‌పాల్ సింగ్ సన్నిహితుడు పప్పాల్‌ప్రీత్ సింగ్‌ను పంజాబ్ ఇంటెలిజెన్స్ పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. కాగా, గత నెలలో వీరిద్దరూ పారిపోయిన విషయం తెలిసిందే. తాజాగా పంజాబ్ పోలీసులు పప్పాల్ సింగ్‌ను హోషియార్‌పూర్‌లో పట్టుకున్నారు. ఇక, అమృత్‌పాల్‌తో పాటు పప్పాల్‌సింగ్ కోసం కూడా పోలీసులు గాలిస్తున్నారు. పంజాబ్, ఢిల్లీ పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన ఆపరేషన్‌లో అతను చిక్కినట్టు పోలీసులు వెల్లడించారు. మరోవైపు.. అమృత్‌పాల్ సింగ్, పప్పాల్ సింగ్ కలిసి జలంధర్, హోషియార్పూర్, అమృత్సర్ జిల్లాల్లో ఆశ్రయం పొందారు. వీరిద్దరూ ఫగ్వారా పట్టణం, నాద్లోన్, బీబీ గ్రామంలోని మూడు వేర్వేరు డేరాలలో బస చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఇక, వివాదాస్పద వ్యాఖ్యల అనంతరం.. మార్చి 18వ తేదీ నుంచి అమృత్‌పాల్ సింగ్‌ను అరెస్ట్ చేసేందుకు పోలీసులు గాలిస్తున్నారు. Source: Fugitive Amritpal's close aide Papalpreet Singh arrested from Hoshiarpur in a joint operation by Punjab Police and Punjab Counter Intelligence. pic.twitter.com/sBvQKqM8mI — Nikhil Choudhary (@NikhilCh_) April 10, 2023 -
భారత్‌కు రాకముందు సర్జరీ చేయించుకున్న అమృత్‌పాల్ సింగ్
ఖలిస్తాన్ సానుభూతిపరుడు, ‘వారిస్ పంజాబ్ దే’ చీఫ్ అమృత్‌పాల్ సింగ్ కోసం పంజాబ్ పోలీసుల వేట కొనసాగుతోంది. తాజాగా అమృత్‌పాల్ కేసులో సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. 2022లో భారత్‌కు తిరిగివచ్చే ముందు అమృత్‌పాల్ సింగ్ కాస్మొటిక్ సర్జరీ చేసుకునేందుకు జార్జియా వెళ్లిన్నట్లు విచారణలో వెల్లడైంది. ఒకప్పుడు ఖలిస్తాన్ ఉద్యమాన్ని నడిపిన వేర్పాటువాది జర్నైల్ సింగ్ బింద్రన్‌వాలా పోలికలతో కనిపించేందుకు కంటికి శస్త్ర చికిత్స చేయించుకున్నారని ఇంటెలిజెన్స్ వర్గాలు తెలిపాయి. జాతీయ భద్రతా చట్టంకింద అరెస్టయి ప్రస్తుతం దిబ్రూగఢ్ సెంట్రల్ జైలులో ఉన్న సింగ్ సన్నిహితులు విచారణలో ఈ విషయాన్ని వెల్లడించినట్లు పేర్కొన్నాయి. సింగ్ జార్జియాలో దాదాపు రెండు నెలలు (20/6/22 నుంచి 19/8/22 వరకు) ఉన్నట్లు సమాచారం. కాగా జర్నైల్ సింగ్ బింద్రన్ వాలా 1984 జూన్ 6న భారత ఆర్మీ చేపట్టిన ఆపరేషన్ బ్లూస్టార్‌లో హతమయ్యాడు. ప్రస్తుతం 'వారిస్ పంజాబ్ దే' సంస్థ చీఫ్‌గా ఉన్న అమృత్‌పాల్ కూడా అతడి విధానాన్ని అనుసరిస్తూ.. సిక్కులను తన బోధనలతో రెచ్చగొడుతున్నారు. బింద్రన్‌వాలే తరహాలోనే తన టర్బన్, సిక్కు దుస్తులు, సిక్కు గుర్తులు ధరించి అందరి దృష్టిని ఆకర్షించేందుకు ప్రయత్నించేవాడు. ఈ క్రమంలో బింద్రన్ వాలే 2.0గా ఫేమస్ అయ్యాడు. ప్రభుత్వం కీలక నిర్ణయం మరోవైపు వారీస్ పంజాబ్ దే అధినేతను పట్టుకునేందుకు పంజాబ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెల 14 తేదీ వరకూ పోలీసులకు సెలవులు రద్దు చేసింది. ఇదివరకే మంజూరైన సెలవులను రద్దు చేయటంతోపాటు కొత్తగా ఎవరికీ సెలవులు ఇవ్వొద్దని పంజాబ్ డీజీపీ.. పోలీసు అధికారులకు సూచించారు. మూడు వారాలుగా గాలింపు మార్చి 18న అమృత్ పాల్‌ను పట్టుకునేందుకు పంజాబ్ పోలీసులు భారీ ఎత్తున ఆపరేషన్ నిర్వహించగా.. చిక్కినట్టే చిక్కి తన మద్దతుదారుల సాయంతో తప్పించుకున్నాడు.. అప్పటి నుంచి అతను పరారీలో ఉన్నాడు. రకరకాల ప్రదేశాలు మారుస్తూ, మారువేషాల్లో తప్పించుకుంటున్నాడు. అయితే అతని సహాయకులు, మద్దతుదారులను పెద్దఎత్తున పోలీసులు అరెస్ట్ చేశారు. అమృత్‌పాల్ కేసులో అతని మామ హర్జిత్ సింగ్, దల్జిత్ సింగ్‌తో సహా ఎనిమిది మందిని ఎన్ఎస్ఏ చట్టం కింద అరెస్ట్ చేసి అస్సాంలోని డిబ్రూఘర్ జైలుకు తరలించారు. ఇప్పటికే ఇతడికి, ఇతని సన్నిహితులకు పాకిస్తాన్ గూఢాచర్య సంస్థ ఐఎస్ఐతో సంబంధం ఉన్నట్లు, విదేశాల్లోని ఖలిస్తానీ వేర్పాటువాద సంస్థల నుంచి ఆర్థిక సాయం అందినట్లు ఇంటెలిజెన్స్ వర్గాలు తేల్చాయి. -
అమృత్‌పాల్ పిలుపు.. పంజాబ్‌లో హైఅలర్ట్
ఛండీగఢ్: పరారీలో ఉన్న ఖలీస్తాన్ సానుభూతిపరుడు అమృత్‌పాల్ సింగ్.. పంజాబ్ పోలీసులకు లొంగిపోతాడనే ప్రచారం జోరందుకుంది. అకల్ తఖ్త్ సదస్సు నేపథ్యంలో లొంగిపోయే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే అమృతపాల్ సింగ్ వైశాఖి సందర్భంగా సిక్కుల సర్బత్ ఖల్సా సమావేశానికి పిలుపునిచ్చాడు. ఈ నేపథ్యంలో.. పంజాబ్‌లో హైఅలర్ట్ ప్రకటించారు. పంజాబ్‌లోని చారిత్రక నేపథ్యం ఉన్న ఏదైనా గురుద్వారాకు వచ్చి అమృత్‌పాల్ పోలీసులకు లొంగిపోవచ్చనే ప్రచారం నడుస్తోంది. అలా కానిపక్షంలో పోలీసులే అతన్ని అరెస్ట్ చేయొచ్చు. మరోవైపు ఏప్రిల్ 14వ తేదీ వరకు పంజాబ్ పోలీస్ శాఖలో సెలవుల్ని రద్దు చేశారు. పాక్ ప్రేరేపిత ఖలీస్తానీ గ్రూప్ తరపు నుంచి పంజాబ్‌లో విధ్వంసానికి అమృత్‌పాల్ సింగ్ ప్రణాళిక వేశాడని.. ఈ క్రమంలోనే తన అనుచరుడిని విడిపించుకునేందుకు అనుచర గణంతో అమృత్‌సర్‌కు దగ్గర్లో ఉన్న ఓ పోలీస్ స్టేషన్‌పై దాడి కూడా చేశాడనే అభియోగాలు అమృత్పాల్సింగ్పై నమోదు అయ్యాయి. మరోవైపు అతని అనుచరులను సైతం అరెస్ట్ చేసిన పంజాబ్ పోలీసులు.. జాతీయ భద్రతా చట్టం ప్రయోగించడం గమనార్హం. అమృత్‌పాల్ ఆచూకీ కోసం జరుగుతున్న గాలింపుపై రాజకీయ విమర్శలు సైతం వినిపిస్తున్నాయి. అమృత్‌పాల్ పేరిట సిక్కు హక్కుల సాధకులపై అణచివేత జరుగుతోందని, అమాయకపు యువతను అరెస్ట్ చేస్తున్నారంటూ పలు పార్టీల నేతలు విమర్శిస్తున్నారు. -
అమృత్‌పాల్ కోసం డ్రోన్‌తో గాలింపు
అమృత్‌పాల్ కోసం డ్రోన్‌తో గాలింపు -
Bhagwant Mann Daughter: ‘చంపేస్తాం’
ఢిల్లీ: పాక్ ప్రేరేపిత ఖలీస్తానీ సానుభూతిపరుడు, వేర్పాటువాది అమృత్‌పాల్ సింగ్ కోసం గాలింపు ఉధృతం అయిన తరుణంలో.. ఖలీస్తానీ మద్దతుదారులు తీవ్ర చర్యలకు దిగుతున్నారు. విదేశాల్లో ఉన్న భారతీయ విద్యార్థులపై దాడులు చేస్తామని, చంపేస్తామని బెదిరిస్తున్నారు. ఈ మేరకు తమకు బెదిరింపు లేఖలు, మెయిల్స్, సందేశాలు వచ్చినట్లు పలువురు విద్యార్థులు, రాజకీయ నేపథ్యం ఉన్న పలు భారతీయ కుటుంబాలు వాపోతున్నాయి. ఈ క్రమంలో పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ కూతురు సీరత్ కౌర్‌కు సైతం ఈ బెదిరింపులు వెళ్లినట్లు సమాచారం. ఈ విషయాన్ని ఢిల్లీ మహిళా కమిషన్ చీఫ్ స్వాతి మలివాల్ చెప్పారు. సియాటెల్(సీటెల్)లో ఉంటున్న సీరత్ కౌర్‌కు చంపేస్తామని బెదిరింపులు వెళ్లాయట. ఈ మేరకు ఆమెకు భద్రత కల్పించాలని అమెరికాలోని భారత రాయబార కార్యాలయాన్ని స్వాతి మలివాల్ కోరుతున్నారు. మరోవైపు ఈ బెదిరింపులకు సంబంధించిన విషయాన్ని హర్మీత్ బ్రార్ అనే అడ్వొకేట్ తన ఫేస్బుక్ పోస్ట్‌లో ప్రస్తావించారు. బెదిరించినంత మాత్రానా?.. పిల్లలను తిట్టినంత మాత్రానా మీకు ఖలీస్తాన్ సిద్ధిస్తుందా? అని ఖలీస్తానీ మద్దతుదారులను ఉద్దేశించి పోస్ట్‌చేశారు. బెదిరింపులను సీరత్ కౌర్ తల్లి ఇందర్‌ప్రీత్ కౌర్ గ్రెవాల్ ధృవీకరించారు. ఈ వ్యవహారంతో తమకు సంబంధం లేదని, తమను వదిలేయాలంటూ ఆమె ఖలీస్తానీలకు విజ్ఞప్తి చేస్తోంది. ఇక.. స్థానిక గురుద్వారా నుంచే ఈ బెదిరింపులు వచ్చినట్లు అక్కడి పోలీసులు గుర్తించారు. ఇదిలా ఉంటే.. ఇందర్‌ప్రీత్, భగవంత్ మాన్కు మొదటి భార్య. వీళ్లకు ఇద్దరు సంతానం. కూతురు సీరత్, కొడుకు దిల్షాన్ ఉన్నారు. 2015 నుంచి వీళ్లిద్దరూ విడిగా ఉంటుండగా.. తర్వాత విడాకులు తీసుకున్నారు. ఆపై కొడుకు, కూతురితో ఇందర్‌ప్రీత్ విదేశాలకు వెళ్లి స్థిరపడింది. ఇదిలా ఉంటే.. కిందటి ఏడాది మాన్, గుర్ప్రీత్ కౌర్ అనే వైద్యురాలిని రెండో వివాహం చేసుకున్నారు. ఖలీస్తానీ మద్దతుదారులు రెచ్చిపోతున్నారు. అమెరికాకు చెందిన వేర్పాటువాద గ్రూప్, ‘సిక్స్ ఫర్ జస్టిస్’.. విదేశాల్లో చదువుతున్న భారతీయ విద్యార్థులకు, రాజకీయ నేపథ్యం ఉన్న పలు భారతీయ కుటుంబాలకు హెచ్చరికలు జారీ చేసింది. ఇందుకు సంబంధించిన ఫోన్ కాల్స్ బయటకు వచ్చాయి కూడా. అమెరికాతో పాటు యూరప్, ఆస్ట్రేలియాలో ఉన్న పలు ప్రాంతాల్లోనూ ఈ బెదిరింపులు వచ్చినట్లు సమాచారం. ఖలీస్తానీ నేత(ఉగ్రవాది) జర్నైల్ సింగ్ భింద్రావాలేకు ప్రతిరూపంగా.. భింద్రావాలే 2.0 గా అమృత్‌పాల్‌సింగ్‌ను పిలుచుకుంటున్నారు ఖలీస్తానీ మద్దతుదారులు. గత 14 రోజులుగా అతని ఆచూకీ కోసం పంజాబ్ పోలీసులు విస్తృతంగా గాలింపు చేస్తున్నారు. ఈ క్రమంలో అతని అనుచరులను వంద మందికిపైగా అరెస్ట్ చేసి.. జాతీయ భద్రతా చట్టం కింద కేసులు నమోదు చేశారు. మరోవైపు పలు ప్రాంతాలు తిరుగుతూ, వేషాలు మారుస్తున్న అమృత్‌పాల్ సింగ్ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ చక్కర్లు కొడుతున్నాయి. -
అమృత్‌పాల్ కోసం డేరాల్లో గాలింపు
హోషియార్పూర్: వివాదాస్పద సిక్కు మత బోధకుడు, ‘వారిస్ దే పంజాబ్’ చీఫ్ అమృత్‌పాల్ సింగ్ ఆచూకీ ఇంకా లభించలేదు. అతడి కోసం పంజాబ్ పోలీసులు వేట మరింత ముమ్మరం చేశారు. హోషియార్పూర్ జిల్లాలో ప్రస్తుతం గాలింపు ఉధృతంగా కొనసాగుతోంది. సిక్కు మత సంస్థలైన ‘డేరా’ల్లోనూ పోలీసులు సోదాలు నిర్వహిస్తున్నారు. హోషియార్పూర్ జిల్లాలోని మర్నియాన్తోపాటు సమీప గ్రామాల్లో వాహనాలను క్షుణ్నంగా తనిఖీ చేస్తున్నారు. నివాసిత ప్రాంతాలే కాకుండా పశువుల పాకలు, పొలాల్లో బోరుబావుల వద్ద ఉండే గదులను సైతం వదిలిపెట్టడం లేదు. డేరాల్లో అమృత్‌పాల్ తలదాచుకొని ఉండొచ్చని అనుమానిస్తున్నారు. ఆ దిశగా గాలింపు కొనసాగిస్తున్నట్లు చెబుతున్నారు. పోలీసులు ఇంటింటికీ తిరిగి అనుమానితులను ప్రశ్నిస్తున్నారు. -
‘అమృత్‌పాల్ సింగ్ పాక్‌కు పారిపోవాలి’
‘‘నేనేం పరారీలో లేను. ఎక్కడికీ పారిపోలేదు. పోలీసుల ఎదుట లొంగిపోయే ఉద్దేశమూ లేదు. త్వరలోనే ప్రజల ముందుకు వస్తా. అన్ని వాస్తవాలను వివరిస్తా. ఓపిక పట్టండి. సిక్కు సంఘాలన్నీ ఐక్యం కావాల్సిన తరుణం వచ్చింది’’ అంటూ అమృత్‌పాల్ సింగ్ ఓ వీడియో, ఆడియో క్లిప్ విడుదల చేయడం తెలిసిందే. అయితే.. ఈ ఖలీస్తానీ సానుభూతిపరుడి వ్యవహారంపై శోరోమణి అకాలీ దళ్(అమృత్సర్) చీఫ్, లోక్‌సభ ఎంపీ సిమ్రన్‌జిత్ సింగ్ మాన్ మరోలా స్పందించారు. అతను(అమృత్‌పాల్‌ను ఉద్దేశించి.. ) లొంగిపోకూడదని, పారిపోవాలని ఎంపీ సిమ్రన్‌జిత్ సింగ్ సూచించారు. ‘‘అమృత్‌పాల్ సింగ్ పోలీసులకు లొంగిపోకూడదు. రావి నది దాటేసి.. పాకిస్తాన్‌కు పారిపోవాలి. 1984లో మేం(సిక్కులం) అలాగే పాకిస్తాన్‌కు పారిపోలేదా? అలాగే ఇప్పుడు అమృత్‌పాల్ సింగ్ కూడా అలాగే పారిపోవాలి. అప్పుడే అతను తన ప్రాణాలను నిలబెట్టుకోగలడు’’.. అంటూ వ్యాఖ్యానించారాయన. నాటి పరిస్థితుల తరహాలోనే సిక్కు చరిత్రకు న్యాయం జరగాలంటే.. అతను పాక్‌కు పారిపోవడమే సరైన పని అంటూ సిమ్రన్‌జిత్ వ్యాఖ్యానించారు. ఇక ప్రభుత్వాలు సిక్కులను అణచివేస్తోందని, హక్కులను కాలరాజేసే కుట్ర చేస్తోందని మండిపడ్డారాయన. ఇదిలా ఉంటే.. వివాదాలకు సిమ్రన్‌జిత్ సింగ్ మాన్ కేరాఫ్. కిందటి ఏడాది పంజాబ్ సంగ్రూర్ నిజయోకవర్గ ఎంపీగా నెగ్గిన ఆయన.. మొదటి నుంచి ఖలీస్తానీ అనుకూల వ్యాఖ్యలు చేస్తున్నారు. అంతెందుకు.. తన విజయాన్ని ఖలీస్థానీ మిలిటెంట్ జర్నైల్ సింగ్ భింద్రావాలేకు అంకితం చేస్తున్నానని, కశ్మీర్లో భారత ఆర్మీ అకృత్యాలను పార్లమెంట్లో వినిపిస్తానంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు. గిరిజన అమాయకులను నక్సలైట్ల పేరుతో చంపుతున్నారంటూ వ్యాఖ్యలు చేశారు కూడా. ఆపై భగత్ సింగ్‌ను ఉగ్రవాదిగా పేర్కొంటూ చేసిన వ్యాఖ్యలు పెనుదుమారం రేపాయి. ఇదిలా ఉంటే.. 1984 సిక్కు వ్యతిరేక అల్లర్లను ఉద్దేశించి సిమ్రన్‌జిత్ వ్యాఖ్యలు చేశారు. ఆసమయంలో ఇందిరా గాంధీ దేశప్రధానిగా ఆపరేషన్ బ్లూస్టార్‌కు ఆదేశాలు ఇచ్చారు. సిక్కు ఉగ్రవాదిగా పేరున్న జర్నైల్ సింగ్ భింద్రావాలే, ఇతర ఖలీస్తానీ తీవ్రవాదుల ఏరివేత కోసం ఈ ఆపరేషన్ కొనసాగింది. అయితే.. సిక్కుల ఊచకోతకు ప్రతీకారగానే అదే ఏడాదిలో ఇందిరాగాంధీ తన సిక్కు బాడీగార్డుల చేతిలో దారుణంగా హత్యకు గురయ్యారు. మరోవైపు ఆపరేషన్ బ్లూస్టార్ పర్యవేక్షకుడైన లెప్టినెట్ జనరల్ కేఎస్ బ్రార్.. ఖలీస్తానీ వేర్పాటు వాదుల ఉద్యమం వెనుక పాక్ హస్తం ఉండొచ్చని, ప్రత్యేక దేశం కోసం డిమాండ్‌తో వాళ్లు ముందుకు సాగొచ్చని అభిప్రాయపడ్డారు కూడా. పాక్ సాయంతో పంజాబ్‌లో అలజడి, అల్లకల్లోలం సృష్టించేందుకు ఖలీస్తానీ సానుభూతిపరుడు అమృత్‌పాల్ సింగ్ ప్రణాళిక రచించాడని కేంద్ర నిఘా వర్గాలతో పాటు పంజాబ్ పోలీసులు కూడా ప్రకటించారు. ఈ క్రమంలోనే వారిస్ పంజాబీ దే అనే సిక్కు విభాగం నెలకొల్పాడని, కానీ అది ఖలీస్తానీ అనుకూల విభాగమని అధికారులు చెప్తున్నారు. అమృత్‌సర్‌కు దగ్గర్లోని అజ్నాలా పోలీస్ స్టేషన్ దగ్గర వందలాది మంది అమృత్‌పాల్ సింగ్ అనుచరులు మారణాయుధాలతో దాడి చేసి.. సింగ్ ప్రధాన అనుచరుడిని విడిపించిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారాన్ని తీవ్రంగా పరిగణించిన కేంద్రం, పంజాబ్ పోలీసుల సమన్వయతో అమృత్‌పాల్ సింగ్‌ను పట్టుకునేందుకు ఆపరేషన్ చేపట్టాయి. ఒకవైపు 30 ఏళ్ల అమృత్‌పాల్ సింగ్ తప్పించుకుంటూ తిరుగుతూ పంజాబ్ పోలీసులను ముప్పుతిప్పలు పెడుతున్నాడు. దాదాపు 13 రోజుల నుంచి అతని ఆచూకీని పోలీసులు కనిపెట్టలేకపోగా.. పంజాబ్-హర్యానా ఉమ్మడి హైకోర్టు సైతం పంజాబ్ పోలీసులపై మండిపడింది. మరోవైపు పంజాబ్‌లోని పలు రాజకీయ పార్టీలు సహా సిక్కు సంఘాలు అమృత్‌పాల్ సెర్చ్ ఆపరేషన్‌పై మండిపడుతున్నాయి. అమృత్‌పాల్ అనుచరుల పేరుతో అమాయకులను జైల్లో పెడుతూ.. సిక్కుల హక్కులను కాలరాస్తున్నారంటూ ప్రభుత్వాలపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఇంకోవైపు జతేదర్ ఆఫ్ అకాల్ తక్త్ అనే సిక్కు సంఘం.. పరారీలో ఉన్న అమృత్‌పాల్ సింగ్‌ను లొంగిపోవాలంటూ పిలుపు ఇచ్చింది. ఈ తరుణంలో వైశాఖి సందర్భంగా జరిగే కార్యక్రమం ద్వారా పోలీసులకు లొంగిపోవచ్చనే ప్రచారం తెర మీదకు వచ్చింది. కానీ, అదే వేదికగా సిక్కు సంఘాలు ఒక్కచోట చేరి తమ ఐక్యతను ప్రదర్శించాల్సిన అవసరం ఉందని చెబుతూ.. వీడియో సందేశం ద్వారా తనకు లొంగిపోయే ఉద్దేశం లేదని అమృత్‌పాల్ సింగ్ ప్రకటించాడు. ఇదీ చదవండి: డ్రోన్ ద్వారా గాలింపు.. వర్కవుట్ అవుతుందా? -
అమృత్‌పాల్ కోసం డ్రోన్‌తో గాలింపు
హోషియార్పూర్: వివాదాస్పద సిక్కు మత బోధకుడు అమృత్‌పాల్ సింగ్ జాడ కోసం పంజాబ్ పోలీసులు వేట ముమ్మరం చేశారు. గురువారం డ్రోన్‌ను రంగంలోకి దించారు. హోషియార్పూర్ జిల్లాలోని మర్నాయిన్ గ్రామంలో, చుట్టుపక్కల ప్రాంతాల్లో డ్రోన్‌తో గాలింపు చర్యలు చేపట్టారు. రెండు రోజుల క్రితం ఇదే గ్రామంలో కొందరు అనుమానితులు తమకారును వదిలేసి పారిపోయారు. వారిలో అమృత్‌పాల్ ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. కాగా, తాను ఎక్కడికీ పారిపోలేదని, త్వరలోనే ప్రపంచం ఎదుటకు వస్తానని అమృత్‌పాల్ వెల్లడించాడు. ఈ మేరకు గురువారం మరో వీడియో తెరపైకి వచ్చింది. చావంటే తనకు భయం లేదని ఆ వీడియోలో వ్యాఖ్యానించాడు. -
పోలీసులకు లొంగిపోయే యోచనలో అమృత్‌పాల్ సింగ్?.. వీడియో విడుదల
పోలీసుల నుంచి తప్పించుకుని తిరుగుతున్న ఖలిస్తాన్ వేర్పాటువాది, ‘వారిస్ పంజాబ్ దే చీఫ్ అమృత్‌పాల్ సింగ్ తిరిగి పంజాబ్‌లో అడుగుపెట్టినట్లు తెలుస్తోంది. గోల్డెన్ టెంపుల్ వద్ద పోలీసుల ముందు లొంగిపోవాలని యోచిస్తున్నట్లు సమాచారం. తప్పించుకునే అవకాశం లేకపోవడంతో భయంతో అమృత్‌పాల్.. చివరకు తన మనసు మార్చుకున్నట్లు పోలీసు వర్గాలు తెలిపాయి. పోలీసులకు లోంగిపోతాడనే ఊహాగానాల మధ్య పరారీలో ఉన్న ఖలిస్థాన్ సానుభూతిపరుడు అమృతపాల్ సింగ్ బుధవారం వీడియో విడుదల చేశాడు. ఇందులో పంజాబ్ పోలీసులపై విమర్శలు గుప్పించాడు. ఒకవేళ పోలీసులకు తనను అరెస్టు చేయాలనే ఉద్దేశ్యం ఉంటే.. ఇంటికి వచ్చి అరెస్టు చేసేవారని అన్నాడు. తను అరెస్ట్‌కు భయపడే వ్యక్తి కాదని చెప్పాడు. పంజాబ్ ప్రభుత్వం నా అరెస్ట్ కోసం కాదు.. మొత్తం సిక్కు సమాజంపై దాడి చేసేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపించారు. దీనికి వ్యతిరేకంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న సిక్కులందరూ ఏకం కావాలని పిలుపునిచ్చారు. అతని సన్నిహతులను అరెస్టు చేయడం, అస్సాం జైలులో వారిని నిర్బంధించడం గురించి కూడా వీడియోలో మాట్లాడాడు. ప్రజల మనస్సులలో ప్రభుత్వం సృష్టించిన భయాన్ని తొలగించడానికి బైస్కాహి సందర్భంగా తల్వాండి సబోలో సమావేశం నిర్వహించాలని అకల్ తఖ్త్ జాతేదార్ గియానీ హర్‌ప్రీత్ సింగ్‌ను అభ్యర్థించినట్లు తెలిపాడు. పోలీసుల నుంచి పారిపోయిన తర్వాత వారిస్ పంజాబ్ దే చీఫ్ విడుదల చేసిన మొట్టమొదటి వీడియో ఇదే కావడం గమనార్హం. అయితే అమృత్‌పాల్ ఈ వీడియోలో ప్రత్యేక రాష్ట్రం లేదా ఖలిస్తాన్ గురించి ఎటువంటి ప్రస్తావన చేయలేదు. #BREAKING: Khalistani Radical Amritpal Singh releases a new video from hiding in Punjab. Requests Jathedar of Akal Takht to call Sarbad Khalsa (congregation of Sikhs) to discuss issues to save Punjab. Dares Punjab CM Bhagwant Mann and Punjab Police. pic.twitter.com/vhcDN1lBaE — Aditya Raj Kaul (@AdityaRajKaul) March 29, 2023 కాగా ఖలిస్తాన్ సానూభూతి పరుడు అమృత్‌పాల్ సింగ్ కోసం పోలీసులు 10 రోజులుగా విస్తృతంగా గాలింపు చేపడుతున్నారు. ఈ నెల 18వ తేదీన పంజాబ్ పోలీసుల నుంచి తప్పించుకున్న అతడు వేషాలు మార్చకుంటూ పారిపోతున్నాడు. ఈ క్రమంలోనే రాష్ట్రం విడిచి వెళ్లిన్నట్లు గుర్తించారు. అయితే తాజాగా వారిస్ పంజాబ్ దే చీఫ్ మంగళవారం హోషియార్పూర్ మీదుగా అమృత్‌సర్‌కు వచ్చిన్నట్లు పోలీసులకు సమాచారం వచ్చింది. అమృతపాల్ సింగ్, అతని సహాయకులు మంగళవారం అర్థరాత్రి తర్వాత హోషియపూర్లోని ఓ గ్రామంలో దాక్కున్నారనే సమాచారంతో పంజాబ్ పోలీసులు సెర్చ్ ఆపరేషన్‌ను ప్రారంభించారు. అతన్ని పట్టుకునే ప్రయత్నం చేయగా.. మార్నియన్ గ్రామంలోని గురుద్వారా వద్ద అమృతపాల్ సింగ్ ఇన్నోవా కారును వదిలిపెట్టి అక్కడి పొలాల్లోకి పారిపోయాడు. కారును స్వాధీనం చేసుకున్న పోలీసులు ఖలిస్తాన్ నేత కోసం విస్తృతంగా గాలింపు చేపడుతున్నారు. అనుమానితుల్ని పట్టుకునేందుకు రోడ్లపై చెక్‌పోస్టులు, బారికేడ్లు ఏర్పాటు చేశారు. చుట్టు పక్కల ప్రాంతాల్లోని గ్రామాల్లో పోలీసులు జల్లెడ పడుతున్నారు. గోల్డెన్ టెంపుల్ చుట్టూ, అకల్ తఖ్త్ దగ్గర భారీగా పోలీసులు మోహరించారు. త్వరలోనే అతను లొంగిపోయే అవకాశం ఉన్నందున అమృత్సర్ అంతటా హై అలర్ట్ కొనసాగుతోంది. చదవండి: 2025 కాదు 2050లో కూడా బీజేపీ గెలవదు.. కేజ్రీవాల్ జోస్యం..