ఇటీవల లోక్‌సభ, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ ముగిసిన సంగతి తెలిసిందే. ఆ ఎన్నికల్లో గెలిచిన అభ్యర్థులు, పార్టీ కార్యకర్తలు బాణా సంచాలతో, మిఠాయిలతో ఆ విజయోత్సాహాన్ని ఆనందంగా జరుపుకుంటారు. ఎవ్వరైనా ఇలానే చేస్తారు. మరొకందరూ వారీ మతానుసారంగా పూజలు, మొక్కలు, చెల్లించుకోవడం చేస్తారు. మహా అయితే అన్నదానాలు చేస్తారు. కానీ ఈ ఎంపీలా ఇలా సెలబ్రేట్ చేసుకోవాలని ఎవ్వరూ ఆలోచించరేమో..!. అతడేమీ మిగతా అభ్యర్థుల్లా స్వేచ్ఛగా ప్రచార ర్యాలీతో ఎన్నికల బరిలోకి దిగిన వ్యక్తి కాదు. అయినప్పటికీ ఎన్నికల్లో విజయకేతనం ఎగరువేయడమే గాక ఆ సంతోషాన్ని ఇలా సెలబ్రేట్ చేయమని తన అభ్యర్థులను కోరి..అందర్నీ ఆశ్చర్యపరిచాడు. అతడి వినూత్న ఆలోచన చూసి..'వాటే ఎంపీ' అంటూ అంతా ప్రశంసిస్తున్నారు.
అతడే అమృత్‌పాల్. 2024 లోక్‌సభ ఎన్నికల ఫలితాల్లో అత్యంత ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే..కొందరు అభ్యర్థులు జైల్లో ఉన్నప్పటికీ ఎంపీ ఎన్నికల్లో విజయం సాధించారు.వారిలో ఒక అభ్యర్థే ఈ అమృత్‌పాల్. స్వతంత్ర అభ్యర్థి అమృతపాల్ సింగ్ పంజాబ్‌లోని ఖదూర్ సాహిబ్ లోక్‌సభ స్థానం నుంచి గెలుపొందారు. ఇతడు రాడికల్ సిక్కు బోధకుడు, ఖలిస్థానీ అనుకూల గ్రూప్ ‘వారిస్ పంజాబ్ దే’ అధినేత. ఖదూర్ సాహిబ్ లోక్‌సభ స్థానం నుంచి అమృతపాల్ సింగ్ దాదాపు లక్షా 90 వేల ఓట్ల ఆధిక్యంతో గెలిచారు.
ప్రస్తుతం అసోం జైలులో ఉన్నారు. జాతీయ భద్రతా చట్టం కింద అమృతపాల్‌ను అరెస్టు చేశారు. అమృతపాల్ సింగ్ జైలులో ఉండగానే పెద్ద విజయం సాధించారు. అయితే ఈ విజయాన్ని మిఠాయలతో సెలబ్రేట్ చెయ్యొద్దని అన్నారు. అందరికి ఉచితంగా మొక్కలను పంపిణీ చేసి వేడుక చేసుకోవాలని తన అభ్యర్థులకు సూచించారు. అంతేగాదు దాదాపు 5 లక్షల మొక్కలను పంపిణీ చేసేలా యత్నించమని అన్నారు.
తాను వేడి, కాలుష్యం పట్ల ఆందోళన చెందుతున్నానని, అందువల్ల పర్వావరణ హితార్థం ఇలా మొక్కలు పంచండని అభ్యర్థులను కోరారు. వారు కూడా అతడు చెప్పినట్లు అతడి పేరుతో మొక్కలను డిస్ట్రూబ్యూట్ చేశారు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. దీన్ని చూసిన నెటిజన్లు పర్యావరణం పట్ల స్ప్రుహ కలిగిన గొప్ప నేత అంటూ ప్రశంసిస్తూ పోస్టులు పెట్టారు.
Amritpal requested his supporters not to distribute sweets but plants after his victory. A target of distribution of 5 lakh plants has been set. Amritpal said he is worried about the rising heat and pollution. pic.twitter.com/3FwGEztaDP
— Poor Vegitarian Majdoor 🤡(Modi ka Parivar) (@Nayak_Khalnyak) June 5, 2024
Comments
Please login to add a commentAdd a comment