పోలీసులను ముప్పు తిప్పులు పెడుతున్న ఖలిస్థానీ సానుభూతిపరుడు, 'వారిస్ పంజాబ్ దే' చీఫ్ అమృత్ పాల్ సింగ్‌ను ఆదివారం అరెస్టు అయిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై అతడి తల్లి స్పందిస్తూ..తన కొడుకు ఓ యోధుడిలా లొంగిపోయినందుకు గర్వంగా ఉందన్నారు. అతని అరెస్టుకు వ్యతిరేకంగా న్యాయ పోరాటం చేస్తామని అతడి తల్లి బల్వీందర్ కౌర్ అన్నారు. అలాగే అతడి తండ్రి తార్సేమ్ సింగ్ ప్రజలు వేధింపులకు గురవుతున్నందున అమృత్‌పాల్‌ని లొంగిపోవాలిన తాను కోరినట్లు చెప్పారు. ఈ కేసుపై తాము పోరాడతామన్నారు. అంతేగాదు అతని గురించి మొత్తం సమాజం పోరాడాలన్నారు.
అమృత్‌పాల్ డ్రగ్స్ ముప్పు నుంచి ప్రజలను రక్షించడానికి పనిచేస్తున్నాడని తాను కూడా అందు కోసమే కృషి చేస్తున్నాని చెప్పుకొచ్చారు తార్సేమ్. కాగా, వారిస్ పంజాబ్ దేపై పంజాబ్ పోలీసులు అణిచివేత ప్రారంభించిన తర్వాత నుంచి అమృతపాల్ పరారీలో ఉన్నాడు. అతని అనుచరులను ఒక్కొక్కరిగా అదుపులోకి తీసుకుంటూ..35 రోజుల వేట అనంతరం పక్కా సమాచారంతో మోగా జిల్లాలోని గురుద్వార్ వద్ద అమృత్‌పాల్‌ని అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు. అతనిపై కఠినమైన జాతీయ భద్రత చట్టం కింద కేసు నమోదు చేశారు పోలీసులు. ఈ మేరకు పోలీసులు అమృత్‌పాల్‌ని భద్రత దృష్ట్యా అసంలోని దిబ్రూఘర్ జైలుకి తరలించారు.
(చదవండి: హెలికాప్టర్ వద్ద సెల్ఫీ తీసుకుంటుండంగా..అంతలోనే..)
Comments
Please login to add a commentAdd a comment