ఖలీస్థానీ వేర్పాటువాది అమృత్‌పాల్‌కి ‘మైక్‌’ గుర్తు కేటాయింపు | EC Allots 'Mike' Symbol For Jailed Separatist Amritpal Singh | Sakshi
Sakshi News home page

ఖలీస్థానీ వేర్పాటువాది అమృత్‌పాల్‌కి ‘మైక్‌’ గుర్తు కేటాయింపు

Published Mon, May 20 2024 10:09 AM | Last Updated on Mon, May 20 2024 10:46 AM

EC Allots 'Mike' Symbol For Jailed Separatist Amritpal Singh

జైలులో ఉన్న ఖలీస్థానీ వేర్పాటువాది అమృత్‌పాల్‌ సింగ్‌ లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. పంజాబ్‌లోని ఖదూర్ సాహిబ్ పార్లమెంట్‌ స్థానం నుంచి అమృత్‌ పాల్‌ స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్‌ దాఖలు చేసిన విషయం తెలిసిందే. 

కాగా, ఆయనకు కేంద్ర ఎన్నికల సంఘం పోలింగ్‌కు ‘మైక్‌’ గుర్తును కేటాయించింది. పోలింగ్‌ గుర్తులు కేటాయించిన మొత్తం 169 స్వతంత్ర అభ్యర్థుల్లో అమృత్‌ పాల్‌ సింగ్‌ ఒకరు. ‘వారిస్‌ పంజాబ్‌ దే’ సంస్థకు చీఫ్‌ అయిన అమృత్‌ పాల్‌.. జాతీయ భద్రతా చట్టం కింద అరెస్టై.. ప్రస్తుతం అసోంలోని దిబ్రూగఢ్‌ జైలులో ఉ‍న్నారు. 

అదే విధంగా ఫరీద్‌కోట్( రిజర్వు​) స్థానం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ  చేస్తున్న సరబ్‌జిత్‌ సింగ్‌ ఖాస్లాకు ‘చెరుకు రైతు’ గుర్తును ఈసీ కేటాయించింది. మాజీ ప్రధాని ఇందిరా గాంధీని హత్య చేసిన నిందితుల్లో ఒకరైన బియాంత్ సింగ్ కుమారుడే సరబ్‌జిత్‌ సింగ్‌. ఇక.. పంజాబ్‌లోని 13 స్థానాలకు  చివరి ఏడో విడతలో జూన్‌ 1న పోలింగ్‌ జరగనుంది. 
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement