అమృత్‌సర్: ఖలిస్తాన్ సానుభూతిపరుడు అమృత్‌పాల్ సింగ్ గత కొద్దిరోజులుగా పోలీసులకు దొరక్కకుండా తిరుగుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో భద్రతా బలగాలు, పంజాబ్ పోలీసులు.. అమృత్‌పాల్ కోసం గాలిస్తున్నారు. ఇదే సమయంలో అమృత్‌పాల్ సింగ్ కుటుంబ సభ్యులపై కూడా పోలీసులు ఫోకస్ పెట్టారు. అయితే, తాజాగా దేశం విడిచి వెళ్లేందుకు ప్రయత్నించిన అమృత్‌పాల్ భార్య కిరణ్‌దీప్ కౌర్ (28)ను పోలీసులు అమృత్‌సర్ విమానాశ్రయంలో అదుపులోకి తీసుకున్నారు.
వివరాల ప్రకారం.. కిరణ్‌దీప్ కౌర్ గురువారం మధ్యాహ్నం లండన్ వెళ్లే క్రమంలో అమృత్‌సర్ విమానాశ్రయంలో ఇమిగ్రేషన్ పోలీసులు ఆమెను అడ్డుకుని అదుపులోకి తీసుకున్నారు. విమానం షెడ్యూల్ ప్రకారం లండన్‌కు 1.30 గంటలకు వెళ్లాల్సి ఉండగా.. కిరణ్‌దీప్‌ను పోలీసులు అడ్డుకుని విచారిస్తున్నారు. తమకు చెప్పకుండా ఆమెకు విదేశాలకు వెళ్లే ప్రయత్నం చేయడంతో పోలీసులు సీరియస్ అయ్యారు. ఇంత అర్జెంట్‌గా లండన్ ఎందుకు వెళ్తున్నారు అని ప్రశ్నిస్తున్నట్టు సమాచారం.
కాగా, కిరణ్‌దీప్ కౌర్ బ్రిటిష్ పౌరురాలు. ఆమెపై పంజాబ్‌లో కానీ, దేశంలో కానీ ఎలాంటి కేసులు లేవు. అమృత్‌పాల్ భార్య కిరణ్‌దీప్ కౌర్ యూకేలో ఉంటూ బబ్బర్ ఖల్సా ఇంటర్నేషనల్‌లో క్రియాశీలక సభ్యురాలిగా ఉన్నారు. పరారీలో ఉన్న నిందితుల కుటుంబం, పరిచయస్తులను ప్రశ్నించే చట్టపరమైన ప్రక్రియ కింద కిరణ్‌దీప్ కౌర్‌ను ముందు జాగ్రత్త చర్యగా అదుపులోకి తీసుకున్నారు. అంతకుముందు.. మార్చిలో అమృతపాల్ సింగ్ కార్యకలాపాలకు విదేశీ నిధులు సమకూర్చిన ఆరోపణలపై ఆమెను జల్లుపూర్ ఖేడా గ్రామంలో ప్రశ్నించారు.
మరోవైపు.. కిరణ్‌దీప్ లండన్ వెళ్తున్న నేపథ్యంలో అమృత్‌పాల్ కూడా లండన్‌కు వెళ్తున్నారా? అనే అనుమానాలను పోలీసులు వ్యక్తం చేస్తున్నారు. ఖలీస్థాన్ వేర్పాటువాద ఉద్యమంలో అతడి భవిష్యత్తు ప్రణాళికలు ఏంటి? అనేది ఆమెను ఆరా తీస్తున్నట్టు తెలుస్తోంది. కాగా, అమృత్‌పాల్ అనుచరులను పంజాబ్ పోలీసులు ఇటీవలే అరెస్ట్ చేశారు.
VIDEO | Visuals from Amritsar Airport where fugitive pro-Khalistani leader Amritpal Singh's wife Kirandeep Kaur has been stopped by immigration officials. pic.twitter.com/KaCSfb6Fcr
— Press Trust of India (@PTI_News) April 20, 2023
Comments
Please login to add a commentAdd a comment