చండీగడ్: 35 రోజులుగా పోలీసులను ముప్పు తిప్పులు పెడుతున్న ఖలిస్థానీ సానుభూతిపరుడు, 'వారిస్ పంజాబ్ దే' చీఫ్ అమృత్ పాల్ సింగ్‌ను పోలీసులు అరెస్టు చేశారు. ఆదివారం ఉదయం మోగా జిల్లాలోని ఓ గురుద్వార్ అతడు ఉన్నట్లు పక్కా సమాచారం అందుకున్న పోలీసులు.. చాకచక్యంగా చుట్టుముట్టి అతడ్ని అదుపులోకి తీసుకున్నారు. ఎట్టకేలకు అతడు చిక్కడంతో ఊపిరిపీల్చుకున్నారు.
అయితే అమృత్‌పాల్ సింగ్ తనంతట తానే పోలీసులకు లొంగిపోయినట్లు తెలుస్తోంది. పోలీసులపైకి ప్రతిఘటించే ప్రయత్నం కూడా చేయేలదని సన్నిహిత వర్గాలు తెలిపాయి. అతని లొంగిపోడవం తప్ప మరో ఆప్షన్ లేదని పోలీసు ఉన్నతాధికారి తెలిపారు. అతనిపై ఎన్‌ఎస్‌ఏ వారెంట్ జారీ అయినట్లు పేర్కొన్నారు.
పంజాబ్ పోలీసులు అమృత్ పాల్ సింగ్‌ను భద్రతా కారణాల దృష్ట్యా అసోంలోని డిబ్రూగఢ్ జైలుకు తరలించినట్లు అధికారిక వర్గాలు తెలిపాయి. ఇప్పటికే అరెస్టైన అతని అనుచరులను కూడా పంజాబ్ నుంచి వేరే రాష్ట్రానికి తరలించినట్లు సమాచారం. అమృత్‌పాల్ అత్యంత సన్నిహితుడు పాపల్ ప్రీత్ సింగ్‌ను కూడా అసోం దిబ్రూగఢ్ సెంట్రల్ జైలులోనే ఉంచారు.
అమృత్‌పాల్ సింగ్‌ను అత్వి త్వరలోనే అరెస్టు చేస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్‌షా శనివారమే వ్యాఖ్యానించడం గమనార్హం. గతంలో అతను స్వేచ్ఛగా తిరిగేవాడని, కానీ ఇప్పుడు అది సాధ్యం కాదని పేర్కొన్నారు. ఆ మరునాడే పోలీసులు అమృత్‌పాల్‌ను అరెస్టు చేశారు.
విద్వేష ప్రసంగాలతో యువతను రెచ్చగొడుతున్న అమృత్‌పాల్ సింగ్ మార్చి 18 నుంచి పరారీలో ఉన్నాడు. అతడి కోసం వేల మంది పోలీసులు నెలరోజులుగా వేట కొనసాగిస్తున్నారు. అయినా వేషాలు, వాహనాలు మార్చుతూ అతడు ఎవరికంటాపడకుండా తిరిగుతున్నాడు. అమృత్ పాల్ పరారీలో ఉన్నప్పటి నుంచి అతడి అనుచరులను ఒక్కొక్కరిగా అరెస్టు చేశారు పోలీసులు. మఖ్య సన్నిహితుడు పాపల్ ప్రీత్ సింగ్‌ను ఏప్రిల్ 11న అరెస్టు చేశారు. ఏప్రిల్ 15న జోగా సింగ్‌ను, ఏప్రిల్ 18న మరో ఇద్దరు అనుచరులను అదుపులోకి తీసుకున్నారు.
ఫిబ్రవరిలో అమృత్‌పాల్ సన్నిహితుడు లవ్‌ప్రీత్ సింగ్‌ను పోలీసులు అరెస్టు చేశారు. దీంతో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసి తన మద్దతుదారులు పోలీస్ స్టేషన్‌పై దాడికి దిగెలా చేశాడు అమృత్‌పాల్ . వీరంతా ఫిబ్రవరి 23న పోలీస్ స్టేషన్‌లోకి ప్రవేశించి విధ్వంసం సృష్టించారు. లవ్‌ప్రీత్ సింగ్‌ను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈనేపథ్యంలోనే విద్వేష ప్రసంగాలు చేసినందుకు అమృత్‌పాల్ సింగ్‌పై కేసు నమోదైంది. అనంతరం అతడు పరారీలో ఉన్నాడు. అతనికి చెందిన ఆయుధాలు, వాహనాలను పోలీసులు సీజ్ చేశారు.
#WATCH | Outside visuals from Rodewal Gurudwara in Moga, Punjab from where Waris Punjab De's #AmritpalSingh was arrested by Punjab Police today. pic.twitter.com/gHtlARqarn
— ANI (@ANI) April 23, 2023
#WATCH | Earlier visuals of Waris Punjab De's #AmritpalSingh at Gurudwara in Moga, Punjab.
— ANI (@ANI) April 23, 2023
He was arrested by Punjab Police from Moga this morning and is likely to be shifted to Dibrugarh, Assam. pic.twitter.com/2HMxTr50s7
చదవండి: మోదీపై ఆత్మాహుతి దాడి చేస్తాం
Comments
Please login to add a commentAdd a comment