Moga
-
35 రోజులుగా వేట.. అమృత్‌పాల్ సింగ్‌ను అరెస్టు చేసిన పోలీసులు!
చండీగడ్: 35 రోజులుగా పోలీసులను ముప్పు తిప్పులు పెడుతున్న ఖలిస్థానీ సానుభూతిపరుడు, 'వారిస్ పంజాబ్ దే' చీఫ్ అమృత్ పాల్ సింగ్‌ను పోలీసులు అరెస్టు చేశారు. ఆదివారం ఉదయం మోగా జిల్లాలోని ఓ గురుద్వార్ అతడు ఉన్నట్లు పక్కా సమాచారం అందుకున్న పోలీసులు.. చాకచక్యంగా చుట్టుముట్టి అతడ్ని అదుపులోకి తీసుకున్నారు. ఎట్టకేలకు అతడు చిక్కడంతో ఊపిరిపీల్చుకున్నారు. అయితే అమృత్‌పాల్ సింగ్ తనంతట తానే పోలీసులకు లొంగిపోయినట్లు తెలుస్తోంది. పోలీసులపైకి ప్రతిఘటించే ప్రయత్నం కూడా చేయేలదని సన్నిహిత వర్గాలు తెలిపాయి. అతని లొంగిపోడవం తప్ప మరో ఆప్షన్ లేదని పోలీసు ఉన్నతాధికారి తెలిపారు. అతనిపై ఎన్ఎస్ఏ వారెంట్ జారీ అయినట్లు పేర్కొన్నారు. పంజాబ్ పోలీసులు అమృత్ పాల్ సింగ్‌ను భద్రతా కారణాల దృష్ట్యా అసోంలోని డిబ్రూగఢ్ జైలుకు తరలించినట్లు అధికారిక వర్గాలు తెలిపాయి. ఇప్పటికే అరెస్టైన అతని అనుచరులను కూడా పంజాబ్ నుంచి వేరే రాష్ట్రానికి తరలించినట్లు సమాచారం. అమృత్‌పాల్ అత్యంత సన్నిహితుడు పాపల్ ప్రీత్ సింగ్‌ను కూడా అసోం దిబ్రూగఢ్ సెంట్రల్ జైలులోనే ఉంచారు. అమృత్‌పాల్ సింగ్‌ను అత్వి త్వరలోనే అరెస్టు చేస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్‌షా శనివారమే వ్యాఖ్యానించడం గమనార్హం. గతంలో అతను స్వేచ్ఛగా తిరిగేవాడని, కానీ ఇప్పుడు అది సాధ్యం కాదని పేర్కొన్నారు. ఆ మరునాడే పోలీసులు అమృత్‌పాల్‌ను అరెస్టు చేశారు. విద్వేష ప్రసంగాలతో యువతను రెచ్చగొడుతున్న అమృత్‌పాల్ సింగ్ మార్చి 18 నుంచి పరారీలో ఉన్నాడు. అతడి కోసం వేల మంది పోలీసులు నెలరోజులుగా వేట కొనసాగిస్తున్నారు. అయినా వేషాలు, వాహనాలు మార్చుతూ అతడు ఎవరికంటాపడకుండా తిరిగుతున్నాడు. అమృత్ పాల్ పరారీలో ఉన్నప్పటి నుంచి అతడి అనుచరులను ఒక్కొక్కరిగా అరెస్టు చేశారు పోలీసులు. మఖ్య సన్నిహితుడు పాపల్ ప్రీత్ సింగ్‌ను ఏప్రిల్ 11న అరెస్టు చేశారు. ఏప్రిల్ 15న జోగా సింగ్‌ను, ఏప్రిల్ 18న మరో ఇద్దరు అనుచరులను అదుపులోకి తీసుకున్నారు. ఫిబ్రవరిలో అమృత్‌పాల్ సన్నిహితుడు లవ్‌ప్రీత్ సింగ్‌ను పోలీసులు అరెస్టు చేశారు. దీంతో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసి తన మద్దతుదారులు పోలీస్ స్టేషన్‌పై దాడికి దిగెలా చేశాడు అమృత్‌పాల్ . వీరంతా ఫిబ్రవరి 23న పోలీస్ స్టేషన్లోకి ప్రవేశించి విధ్వంసం సృష్టించారు. లవ్‌ప్రీత్ సింగ్‌ను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈనేపథ్యంలోనే విద్వేష ప్రసంగాలు చేసినందుకు అమృత్‌పాల్ సింగ్‌పై కేసు నమోదైంది. అనంతరం అతడు పరారీలో ఉన్నాడు. అతనికి చెందిన ఆయుధాలు, వాహనాలను పోలీసులు సీజ్ చేశారు. #WATCH | Outside visuals from Rodewal Gurudwara in Moga, Punjab from where Waris Punjab De's #AmritpalSingh was arrested by Punjab Police today. pic.twitter.com/gHtlARqarn — ANI (@ANI) April 23, 2023 #WATCH | Earlier visuals of Waris Punjab De's #AmritpalSingh at Gurudwara in Moga, Punjab. He was arrested by Punjab Police from Moga this morning and is likely to be shifted to Dibrugarh, Assam. pic.twitter.com/2HMxTr50s7 — ANI (@ANI) April 23, 2023 చదవండి: మోదీపై ఆత్మాహుతి దాడి చేస్తాం -
పర్ర భూములను చెరబడుతున్న ఆక్వా చెరువులు
సాక్షి, అమలాపురం(కోనసీమ జిల్లా): వేలాది ఎకరాల పంట భూముల నుంచి ముంపు నీరు, ఇతర డ్రెయిన్ల నీరు దిగడానికి సముద్రపు మొగలు ఎంతో అవసరం. సరిగ్గా ఇక్కడే సహజసిద్ధంగా ఏర్పడిన పర్ర భూములను కొంతమంది స్వార్థపరులు కబ్జా చేసి, అక్రమంగా ఆక్వా చెరువులు ఏర్పాటు చేయడంతో మొగలు పూడుకుపోతున్నాయి. ఫలితంగా ఏటా వేలాది ఎకరాల్లో పంటలు ముంపు బారిన పడి, కోనసీమ రైతులు భారీగా నష్టపోతున్నారు. కోస్టల్ రెగ్యులేషన్ జోన్ (సీఆర్‌జెడ్), మద్రాస్ కన్జర్వెన్స్ యాక్టులను తోసిరాజని మరీ పర్ర భూముల్లో ఆక్వా చెరువులు తవ్వేస్తున్నా.. వేలాది ఎకరాల వరి ఆయకట్టు ముంపునకు కారణమవుతున్నా పట్టించుకునే వారే లేకుండా పోయారు. కొల్లేరు ఆపరేషన్ తరహాలో అక్రమ చెరువులను ధ్వంసం చేసి, రెగ్యులేటర్లు నిర్మిస్తేనే ఇక్కడ ముంపు సమస్యకు మోక్షం కలుగుతుందని ఇరిగేషన్ నిపుణులు, రైతులు చెబుతున్నారు. పులికాట్, కొల్లేరు తరహాలోనే కోనసీమలోని కాట్రేనికోన మండలం వృద్ధ గౌతమి నదీపాయ నుంచి అల్లవరం మండలం వైనతేయ నదీపాయ వరకూ సుమారు 6 వేల ఎకరాల్లో పర్ర భూములున్నాయి. మధ్య డెల్టాలో 1.72 లక్షల ఎకరాల్లో వరి సాగు జరుగుతోంది. రామేశ్వరం, కూనవరం మొగల ద్వారా సుమారు 65 వేల ఎకరాల ఆయకట్టు ఉంది. ఇందులో 45 వేల ఎకరాలు వరి ఆయకట్టు ఉంది. మిగిలింది ఆక్వా చెరువులుగా మారిపోయింది. మొత్తం 45 వేల ఎకరాల ఆయకట్టు ముంపు నీరు ఈ మొగల ద్వారానే దిగాల్సి ఉంది. అయితే మొగలు పూడుకుపోవడం, వీటిని తెరచినా ముంపునీరు దిగకపోవడంతో రైతులు ఏటా రూ.60 కోట్ల మేర పంటలు నష్టపోతున్నారని అంచనా. పర్ర భూముల కబ్జా మొగల ద్వారా నేరుగా సముద్రంలోకి నీరు దిగే అవకాశం తక్కువ. భారీ వర్షాల సమయంలో ముంపునీరు రామేశ్వరం, కూనవరం డ్రెయిన్ల నుంచి పర్ర భూముల్లోకి వెళ్లేది. కూనవరం డ్రెయిన్ నీరు చిర్రయానం పర్ర భూమి ద్వారా వెళ్లి పల్లం, నీళ్లరేవు, ఏటిమొగ వద్ద సముద్రంలోకి వెళ్లేది. దీనివల్ల భారీ వర్షాల సమయంలో చేలు ముంపు బారిన పడినా రెండు మూడు రోజుల్లోనే నీరు తీసేది. కొన్నేళ్లుగా పర్ర భూముల్లో పెద్ద ఎత్తున ఆక్వా చెరువులు ఏర్పాటయ్యాయి. రామేశ్వరం పర్ర భూముల్లో 480 ఎకరాలు, ఎస్.యానాం, చిర్రయానాం పర్ర భూముల్లో సుమారు 1,650 ఎకరాల విస్తీర్ణంలో అక్రమ ఆక్వా సాగు జరుగుతున్నట్టు అంచనా. సుమారు 2,130 ఎకరాల భూమి కబ్జాల బారిన పడటంతో డ్రెయిన్ల ద్వారా వస్తున్న ముంపునీరు పర్ర భూముల్లోకి వెళ్లే సామర్థ్యం పడిపోయింది. ఆక్వా చెరువుల వల్ల ముంపునీరు పర్రభూముల ద్వారా కాకుండా మొగల ద్వారానే సముద్రంలో కలవాల్సి వస్తోంది. ఇసుక మేటలు వేయడంతో మొగల వెడల్పు కుదించుకుపోతోంది. కూనవరం స్ట్రెయిట్ కట్ ద్వారా 25 క్యూమిక్స్ (క్యూబిక్ మీటర్ పర్ సెకన్) నీరు సముద్రంలోకి దిగాల్సి ఉండగా, మొగ తెరచిన తరువాత కూడా 10 క్యూమిక్స్ కూడా దిగడం లేదు. కొల్లేరు తరహాలోనే.. పూర్వపు పశ్చిమ, కృష్ణా జిల్లాల సరిహద్దులో ఉన్న కొల్లేరు సరస్సులో కబ్జాలు చేసి, ఏర్పాటు చేసిన ఆక్వా చెరువులను నాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో ధ్వంసం చేశారు. ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి హయాంలో అక్కడ రూ.412 కోట్లతో మూడుచోట్ల రెగ్యులేటర్లు నియమిస్తున్నారు. ఇదేవిధంగా పర్ర భూముల్లోని ఆక్రమణలను సైతం తొలగించాలని ఇక్కడి రైతులు కోరుతున్నారు. మొగల పరిస్థితిపై గతంలో కూనా ఓషనోగ్రఫీ, ఉస్మానియా ఓషనోగ్రఫీ విభాగాలు సర్వేలు చేశాయి. డ్రెయిన్ నుంచి మొగ దాటుకుని సముద్రంలోకి 200 మీటర్ల మేర లాంగ్ రివిట్మెంట్లు నిర్మించాలని సూచించాయి. వీటికి ఆటోమెటిక్ రెగ్యులేటర్లు నిర్మించాలని సిఫారసు చేశాయి. డ్రెయిన్‌లో నీరు ఎక్కువగా ఉన్నప్పుడు తెరచుకునేలా.. సముద్రం పోటు సమయంలో మూసుకుపోయేలా ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదన ప్రకారం రెగ్యులేటర్లు నిర్మించాలని రైతులు కోరుతున్నారు. అనధికార చెరువులపై చర్యలు పర్ర భూముల్లో అనధికారికంగా ఆక్వా చెరువులు సాగు చేస్తున్న విషయం మా దృష్టికి వచ్చింది. అలాగే పంచనదిని ఆనుకుని కూడా చెరువులున్నాయి. వీటిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాం. – ఆర్.నాగార్జున,డీఈఈ, డ్రెయిన్ అమలాపురం మొగల స్వరూపమిదీ.. కూనవరం ప్రధాన మురుగు కాలువ ద్వారా ఉప్పలగుప్తం, కాట్రేనికోన, ముమ్మిడివరం, అమలాపురం మండలాల్లోని సుమారు 35 వేల ఎకరాల్లోని ముంపునీరు దిగాల్సి ఉంది. రంగరాజు, ఓల్డ్ సమనస, అయినాపురం, గొరగనమూడి మీడియం డ్రెయిన్ల నీరు కూడా దీని ద్వారానే వస్తోంది. 1996 తుపాను సమయంలో దీనికి గండి పడింది. తరువాత ఏప్రిల్ నుంచి జూలై వరకూ పూడుకుపోయి, మిగిలిన సమయంలో అప్పుడప్పుడు కొద్దిమేర తెరచుకుంటోంది. అల్లవరం మండలం రామేశ్వరం మొగ ద్వారా వాసాలతిప్ప, పంచనది డ్రెయిన్ల నుంచి వస్తున్న ముంపునీరు దిగుతోంది. అమలాపురం, ఉప్పలగుప్తం, అల్లవరం మండలాలకు చెందిన సుమారు 25 వేల ఎకరాల్లోని ముంపునీరు దీని ద్వారా దిగాల్సి ఉంది. ముంపునీరు రామేశ్వరం మొగ వద్దకు వచ్చి ఇక్కడున్న పర్ర భూమిలోకి చేరుతోంది. అక్కడి నుంచి కిలోమీటరు ప్రవహించి సముద్రంలో కలుస్తోంది. (క్లిక్: పంట కాలువను కబ్జా చేసిన అయ్యన్న) -
సోనూసూద్ ఎస్‌యూవీని స్వాధీనం చేసుకున్న పోలీసులు!
పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా మోగా పోలింగ్ బూత్ వద్ద బాలీవుడ్ నటుడు, సామాజిక కార్యకర్త అయిన సోనూసూద్ ఎస్యూవీ వాహనాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మోగా నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా సోనూ సూద్ సోదరి మాళవికా సూద్ సచార్ పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ మేరకు ఆయన తన సోదరి మాళవిక సూద్ సచార్ కోసం బాలీవుడ్ నటుడు మోగాలో క్యాంప్ చేస్తున్నాడు. అయితే మోగా జిల్లాలోని లంధేకే గ్రామంలో అనుమానాస్పద కార్యకలాపాలు జరుగుతున్నాయంటూ వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో సోనూ సూద్ స్పోర్ట్స్ యుటిలిటీ వాహనాన్ని (ఎస్యూవీ) పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఎన్నికల పరిశీలకుల సూచన మేరకు వాహనాన్ని సీజ్ చేసినట్లు పోలీసులు తెలిపారు. అంతేకాకుండా ఎస్డీఎం-కమ్-రిటర్నింగ్ అధికారి సత్వంత్ సింగ్ కూడా సోనూ సూద్ ఇంటిపై వీడియో నిఘాను ఆదేశించారు. ఈ మేరకు సిటీ పోలీస స్టేషన్ ఆఫీసర్ దేవిందర్ సింగ్ మాట్లాడుతూ ..అనుమానాస్పద కార్యాచరణ ఆధారంగా ఎస్‌యూవీని స్వాధీనం చేసుకున్నాము. లంధేకే గ్రామంలోని పోలింగ్ బూత్ దగ్గర ఎస్యూవీ తిరుగుతున్నట్లు మాకు ఫిర్యాదు అందింది. మేము దానిని స్వాధీనం చేసుకున్నాము. అంతేకాదు అతను మోగాలో ప్రచారం చేస్తున్నప్పుడు ఆ వాహనాన్ని ఉపయోగించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. సోనూ సూద్‌కు మోగా నియోజకవర్గంలో ఓటు లేనందున ఆ ప్రాంతంలోకి వెళ్లడానికి వీల్లేదని ఇంట్లోనే ఉండాలని ఎస్డీఎం-కమ్-రిటర్నింగ్ అధికారి సత్వంత్ సింగ్ కూడా ఆదేశించారు. అయితే అతను ఆ ఆదేశాలను ఉల్లంఘించాడు. తదుపరి విచారణలు జరుగుతున్నాయి. అని అన్నారు. ఈ విషయమై సోనూసూద్‌ను మాట్లాడుతూ.. “శిరోమణి అకాలీదళ్ అభ్యర్థి బర్జిందర్ సింగ్, అలియాస్ మఖన్ బ్రార్, నాపై తప్పుడు ఫిర్యాదు చేశారు. ఇది కేవలం పార్కింగ్ సమస్య మాత్రమే. వాహనం సరిగ్గా పార్క్ చేయలేదు. ఇంకేమీ లేదు" అని చెప్పారు. (చదవండి: కాంగ్రెస్‌కే ఓటు వేయండి అని బీజేపీ ప్రచారం ! తప్పుగా అర్థం చేసుకున్నారంటూ వివరణ) -
సిద్ధూ ప్రమాణస్వీకారంలో అపశ్రుతి: ముగ్గురి మృతి
ఛండీఘడ్: కాంగ్రెస్ పార్టీ పంజాబ్ రాష్ట్ర అధ్యక్షుడిగా నవ్‌జ్యోత్ సింగ్ సిద్ధూ ప్రమాణస్వీకారంలో అపశ్రుతి చోటుచేసుకుంది. ఆయన ప్రమాణస్వీకార కార్యక్రమానికి వెళ్తున్న కార్యకర్తలు రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందారు. కార్యకర్తలు ప్రయాణిస్తున్న బస్సు, ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంపై ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. బాధితులకు సత్వర వైద్య సేవలు అందించాలని జిల్లా అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. ఈ ఘటన తనను కలచి వేసిందని పార్టీ అధ్యక్షుడు నవ్‌జ్యోత్ సింగ్ తెలిపారు. కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడిగా నవ్‌జ్యోత్ సింగ్ శుక్రవారం ఉత్సాహ వాతావరణంలో ప్రమాణస్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర నలుమూలలా నుంచి పెద్ద ఎత్తున పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తరలివచ్చారు. ఈ కార్యక్రమానికి మోగ జిల్లాలోని లోహరా గ్రామం నుంచి పార్టీ నాయకులు, కార్యకర్తలు ఛండీఘర్‌లో జరిగే సిద్ధూ కార్యక్రమానికి మినీ బస్సులో బయల్దేరారు. మార్గమధ్యలో మార్గమధ్యలో ఆర్టీసీ బస్సును వీరి బస్సు వేగంగా ఢీకొట్టింది. మినీ బస్సు నుజ్జునుజ్జయ్యింది. పెద్ద ఎత్తున పార్టీ కార్యకర్తలు గాయపడ్డారు. తీవ్ర గాయాలవడంతో వెంటనే స్పందించిన స్థానికులు పోలీసుల సహాయంతో ఆస్పత్రికి తరలించారు. అయితే తీవ్ర గాయాలతో అక్కడికక్కడే ముగ్గురు మృతి చెందారు. గాయపడిన వారిలో మరికొందరి పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తోంది. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. Saddened to learn of the bus accident in Moga district in which 3 Congress workers have reportedly died & many persons are injured. Have directed DC Moga to immediately provide full medical treatment to all the injured and to send a report to the Government. — Capt.Amarinder Singh (@capt_amarinder) July 23, 2021 -
పేదలకు మరో సహాయం చేసిన సోనూసూద్
చండీఘర్: కరోనా వైరస్ ప్రభావంతో కష్టాలు పడుతున్న వారికి అండగా నిలుస్తున్న ఒకేఒక్క వ్యక్తి నటుడు సోనూసూద్. తెలుగు, హిందీతో పాటు అన్ని భాషల సినిమా ప్రేక్షకులకు తెలిసిన సోనూ కరోనా అనంతరం పేదలకు సహాయం చేస్తూ భారతదేశంతో పాటు ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సొంతం చేసుకున్నాడు. రియల్ హీరోగా పేరుపొందిన సోనూ ఇప్పుడు మరోసారి గొప్ప సహాయం చేశారు. తాజాగా తన సొంత గ్రామం పంజాబ్‌లోని మోగా పట్టణంలో 8 మంది నిరుద్యోగులకు సహాయం చేశారు. వారి ఉపాధి కోసం ఆ 8 మందికి ఈ-రిక్షాలు అందించారు. తన సోదరి మాళవిక సచార్, బావ గౌతమ్ సచార్‌తో కలిసి నిరుద్యోగులకు రిక్షాలను ఇచ్చారు. దేశవ్యాప్తంగా 150 ఈ-రిక్షాలు పంచాలని నిర్ణయించుకున్నట్లు సోనూసూద్ మీడియాతో చెప్పారు. ఈ విధంగా చేయడంతో కొంతమందికి ఉపాధి దొరుకుతుందని తెలిపారు. ప్రతి ఒక్కరూ అవసరమైన వారికి తోచినంత సాయం చేయండి అని పిలుపునిచ్చారు. తాను తన తల్లిదండ్రుల నుంచి ఈ సేవా గుణాన్ని అలవర్చుకున్నట్లు పేర్కొన్నారు. తాను దేవుణ్ని కాదని అందరిలాగే అవసరమైన వారికి సాయం చేస్తూ తన బాధ్యత నిర్వర్తిస్తున్నట్లు సోనూసూద్ తెలిపారు. ఇటీవల బెల్లంకొండ శ్రీనివాస్ నటించిన ‘అల్లుడు అదుర్స్’ సినిమాలో సోనూసూద్ నటించి నవ్వులు పూయించిన విషయం తెలిసిందే. -
తల్లికి అరుదైన గౌరవం: సోనూసూద్ భావోద్వేగం
ముంబై: ‘‘నేను కలగన్న, నా జీవితాశయం నేడు నెరవేరింది. మా స్వస్థలం మోగాలో మా అమ్మ పేరిట.. ‘‘ప్రొఫెసర్. సరోజ్ సూద్ రోడ్’’గా రహదారికి నామకరణం చేశారు. నా జీవితంలో ఇదొక ముఖ్యమైన అధ్యాయం. అమ్మ ఏ రోడ్డు గుండా తన జీవితకాలం ప్రయాణం చేసిందో ఇప్పుడు అదే రహదారికి ఆమె పేరు పెట్టారు. ఆ మార్గం గుండానే తను కాలేజి నుంచి ఇంటికి, ఇంటి నుంచి కాలేజీకి వెళ్లేవారు. స్వర్గంలో ఉన్న నా తల్లిదండ్రులు ఈ విషయం తెలిసి కచ్చితంగా సంతోషిస్తారు. ఈ విషయాన్ని సుసాధ్యం చేసిన హర్జోట్ కమల్, సందీప్ హాన్స్, అనితా దర్శి గారికి ధన్యవాదాలు. ఇప్పుడు నేను గర్వంగా చెప్పగలను. ఈ ప్రపంచంలో నాకు అత్యంత ఇష్టమైన ప్రదేశం..‘‘ప్రొఫెసర్ సరోజ్ సూద్ రోడ్.. నా విజయానికి మార్గం’’అంటూ రియల్ ‘హీరో’ సోనూసూద్ ఉద్వేగానికి లోనయ్యారు. పంజాబ్‌లోని తమ స్వస్థలంలో ఓ రహదారికి తన తల్లి పేరు పెట్టడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. (చదవండి: సోనూసూద్ వల్లే నేడు ఈ స్థాయిలో..) కాగా కరోనా లాక్డౌన్ కాలంలో సేవా కార్యక్రమాలు ప్రారంభించిన సోనూసూద్ నేటికీ వాటిని కొనసాగిస్తున్నారు. ఇతర రాష్ట్రాల్లో చిక్కుకుపోయిన వలస కార్మికులను సొంతరాష్ట్రాలకు చేర్చడంతో మొదలై.. కష్టం వచ్చిందంటే చాలు ‘‘మనకు సోనూ ఉన్నాడు’’ అనే ధీమా కలిగిస్తూ అపర కర్ణుడిగా నీరాజనాలు అందుకుంటున్నారు. ఈ క్రమంలో ఇప్పటికే ఐక్యరాజ్యసమితి హ్యుమానిటేరియన్ అవార్డు వంటి ఎన్నెన్నో ప్రతిష్టాత్మక పురస్కారాలు ఆయనను వరించాయి. వాటన్నింటికీ మించి ప్రజల గుండెల్లో దేవుడిగా సోనూసూద్ స్థానం సంపాదించుకున్నారు. ఇక తన సేవాగుణానికి తల్లి సరోజ్ సూద్ పెంపకమే కారణమని ఇప్పటికే పలుమార్లు చెప్పిన విషయం తెలిసిందే. View this post on Instagram A post shared by Sonu Sood (@sonu_sood) -
రాష్ట్రపతికి రక్తంతో లేఖ రాసిన యువతులు
మోగ : పోలీసులు తమపై తప్పుడు కేసులు పెట్టి వేధిస్తున్నారని, న్యాయం చేయాలని కోరుతూ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌కి రక్తంతో లేఖ రాశారు ఇద్దరు పంజాబీ యువతులు. తమకు న్యాయం జరగకపోతే కుటుంబంతో సహా అత్మహత్య చేసుకుంటామని లేఖలో పేర్కొన్నారు. పంజాబ్‌లోని మోగా జిల్లాకు చెందిన నిషా, అమాన్ జాట్ కౌర్ అనే యువతులు ఈ లేఖ రాశారు. తమపై పెట్టిన కేసులు తప్పని చెప్పినా పోలీసులు పట్టించుకోలేదని ఆరోపించారు. అనంతరం వారు ఓ జాతీయ మీడియాతో మాట్లాడతూ... ‘ డబ్బులు తీసుకొని మోసం చేశామని మాపై కొంత మంది తప్పుడు కేసులు పెట్టారు. అవి తప్పుడు కేసులని, వాటిపై విచారణ చేపట్టాలని పోలీసులను వేడుకున్నా పట్టించుకోలేదు. విచారణ పేరుతో మమ్మల్ని వేధిస్తున్నారు. మా కుటుంబ సభ్యులను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. రాష్ట్రపతి చొరవ చూపి మాకు న్యాయం చేయాలి. న్యాయం జరగకపోతే కుటుంబ సభ్యులతో కలిసి ఆత్మహత్యలు చేసుకుంటాం’ అని హెచ్చరించారు. కాగా యువతుల ఆరోపణలను మోగ జిల్లా డీఎస్పీ కొట్టిపారేశారు. వారిపై క్రిమినల్ కేసులు నమోదయ్యాయని, విచారణ చేస్తున్నామని చెప్పారు. విదేశాలను పంపిస్తామని చెబుతూ ఏజెంట్ల రూపంలో ఈ ఇద్దరు యువతులు డబ్బులు వసూలు చేసి మోసం చేశారని ఫిర్యాదు అందయన్నారు. దానిపైనే విచారణ చేశామన్నారు. రాష్ట్రపతికి లేఖ రాసిన విషయం తనకు తెలియదని, అధికారికంగా తనకు ఎలాంటి ఆదేశాలు రాలేదని డీఎస్పీ పేర్కొన్నారు. -
గర్భిణీ నర్సుపై అకాలీదళ్ నేత దాడి
-
గర్భిణీ నర్సుపై అకాలీదళ్ నేత దాడి
మోగా: పంజాబ్‌లో అకాలీదళ్ పార్టీకి చెందిననేత రెచ్చిపోయాడు. కన్నుమిన్నుకానక ఓ గర్భవతి అయిన నర్సుపై చేయి చేసుకున్నాడు. దీంతో ఆమె కిందపడిపోయింది. ఈ ఘటన పంజాబ్ లోని మోగాలో గల ఓ ఆస్పత్రిలో చోటుచేసుకుంది. సీసీటీవీ కెమెరాలో ఈ దృశ్యాలు రికార్డయ్యాయి. ప్రస్తుతానికి ఆ నాయకుడు పరారీలో ఉన్నాడు. అతడిపై నేరం చేసే ఉద్దేశంతో పరిమితులున్న ప్రాంతంలోకి అక్రమంగా ప్రవేశించిన కేసు, ఉద్దేశ పూర్వకంగా గాయపరిచినట్లు ఆరోపణలు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం పరమ్‌జిత్ సింగ్ అతడి కుమారుడు గుర్జిత్ సింగ్ మోగాలోని గుప్తా ఆస్పత్రికి ఓ రోగిని తీసుకొని వెళ్లారు. కొద్ది సేపు ఎదురుచూడండని చెప్పినందుకు రమణదీప అనే నర్సుతో గొడవకు దిగారు. ఆమె ఎనిమిది వారాల గర్బిణీ. ఆ విషయం చెప్పినప్పటికీ ఆ తండ్రి కొడుకులు ఆమె విజ్ఞప్తిని పట్టించుకోకుండా తీవ్ర దుర్భాషలాడారు. అనంతరం లాగిపెట్టి కొట్టి కిందపడేశారు. 'మేం సర్పంచ్ ఇంటి వాళ్లం. మమ్మల్నే వెయిట్ చేయిస్తావా' అంటూ కన్నెర్ర చేశారు. పరమ్ జిత్ భార్య దల్జిత్ కౌర్ సర్పంచ్ గా పనిచేస్తుందట. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్రస్తుతం వారికోసం గాలిస్తున్నారు. -
మోగా ఘటనపై దద్దరిల్లిన లోక్‌సభ
న్యూఢిల్లీ: పంజాబ్‌లోని మోగాలో జరిగిన ఘటనపై మంగళవారం లోక్‌సభ దద్దరిల్లింది. ఆ ఘటనపై చర్చ జరపాల్సిందేనంటూ కాంగ్రెస్ పార్టీ వాయిదా తీర్మానం ఇచ్చింది. దీనిని స్పీకర్ తిరస్కరించడంతో గందరగోళం నెలకొంది. చర్చ జరపాల్సిందేనని కాంగ్రెస్ నేతలు పట్టుబట్టారు. ఎంత చెప్పిన విపక్ష సభ్యలు ఆందోళనకు దిగడంతో లోక్‌సభ మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా పడింది. అంతకు ముందు ప్రత్యేక హైకోర్టు కోసం తెలంగాణ ఎంపీలు ఆందోళన చేయడంతో సభ వాయిదా పడింది. మరోపక్క, రాజ్యసభలో కూడా విపక్ష సభ్యులు మోగా ఘటనపై ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో అక్కడా సభ 10 నిమిషాల పాటు వాయిదా పడింది. -
పాపం.. పోలీసు కావాలనుకుంది
మోగా: పంజాబ్‌లోని మోగాలో కదులుతున్న బస్సులోంచి తోసేసి 14 ఏళ్లబాలికను దారుణంగా హత్య చేసిన ఘటనలో లండకే గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. గ్రామస్తులు, గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్న ఆ బాలిక స్నేహితులు, తోటి విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. తన భవిష్యత్తు గురించి ఆమె చాలా కలలు కంది. తన కలల సాకారం కోసం బాగా చదువుకోవాలనుకుంది. ఆమె క్లాసులో చాలా తెలివైన విద్యార్థిని.బలహీనవర్గాలు, అణచివేతకు గురవుతున్న వారి హక్కుల కోసం పోరాడాలనుకుంది. అందుకే పోలీసశాఖలో చేరాలనుకుంది. ఏదో ఒక రోజు తను కచ్చితంగా పోలీసు ఆఫీసర్ అవుతానని తన స్నేహితులతో తరచూ చెప్పేది. ఇదీ ఆ బాలిక బంధువు సందీప్ సింగ్, బాల్య స్నేహితురాలు సోమ రాణి ఆవేదన. తన స్నేహితురాలి జ్ఞాపకాలను మీడియాతో పంచుకున్న వారు ఆమెకు శుభ్రంగా ఉండడమన్నా, మంచి దుస్తులు వేసుకోవడం అన్నా చాలా ఇష్టమని తెలిపారు. పక్కవాళ్ళకు సాయంచేయడంలో ఎపుడూ ముందుండేదన్నారు. పోలీసు అవ్వాలనుకున్న ఆ బాలిక, తాను ఈ చిన్న వయసులో ప్రపంచానికి దూరమవుతానని... తన మరణం కారణంగా ఈరోజు ఇంతమంది పోలీసులు తన గ్రామంలో మోహరిస్తారని ఊహించి ఉండి ఉండదంటూ కన్నీటి పర్యంతమయ్యారు గ్రామానికి దర్శన్ సింగ్. తనను ఎపుడూ బాబా అని పిలిచేదని, ఆమె కలల్ని దుర్మార్గులు ఛిద్రం చేశారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కాగా గురుద్వారాకు వెళ్తున్నతల్లీ కూతుళ్లను వేధించి, కదులుతున్న బస్సులోంచి తోసేసి 14 ఏళ్ల వయసున్న బాలిక హత్య చేసిన ఘటన ప్రకంపనలు సృష్టించిన సంగతి తెలిసిందే. -
యువతిపై 11 మంది లైంగికదాడి
మోగా: పంజాబ్‌లో మరో దారుణం.. అదే జిల్లా అదే ప్రాంతంలో మరో పైశాచిక చర్య. కదులుతున్న బస్సులో లైంగిక వేధింపులకు పాల్పడి బస్సులోంచి తోసివేయడంతో యువతి మరణించిన ఘటన జరిగిన కొన్ని గంటల్లోనే మోగా జిల్లాలో మరో దుర్మార్గం చోటుచేసుకుంది. దాదాపు పదకొండు మంది వ్యక్తులు ఓ యువతిపై సామూహిక లైంగిక దాడికి పాల్పడ్డారు. ఈదారుణానికి పాల్పడినవారిలో బాధితురాలి స్నేహితురాలి భర్త కూడా ఉన్నాడు. పోలీసులు వివరాల ప్రకారం.. బాధితురాలు తన స్నేహితురాలిని కలిసేందుకు వెళ్లింది. స్నేహితురాలి కోసం ఎదురుచూస్తుండగా అంతలో వచ్చిన ఆమె భర్త మరికొందరు కలసి అదే గ్రామంలోని ఓ పాడుబడ్డ ఇంట్లోకి ఎత్తుకెళ్లారు. బాధితురాలు వారిని నిలువరించేందుకు ఎంత ప్రయత్నించినా కొట్టి మరీ సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ మేరకు వివరాలు సేకరించిన పోలీసులు బాధితురాలిని మెడికల్ పరీక్షల కోసం పంపించారు. ఆమె స్నేహితురాలు, భర్త మిగితావారిపై కేసు నమోదు చేశారు. అయితే, ఇప్పటి వరకు ఎవరినీ అదుపులోకి తీసుకోక పోవడం గమనార్హం. -
ఏకంగా ఏటీఎంనే ఎత్తుకెళ్లారు!
మోగా: ఇప్పటి వరకు ఏటీఎంలో డబ్బులు దొంగిలించిన సంఘటనల్నే చూశాం. కాని ఏకంగా ఏటీఎంను ఎత్తుకెళ్లిన సంఘటన పంజాబ్ లో చోటు చేసుకుంది. ఈ ఘటన పంజాబ్ లోని మోగా-ఫిరోజ్ పూర్ రోడ్డులో చోటు చేసుకుంది. ఏటీఎంకు కాపాలదారుడిగా ఉన్న సెక్యూరిటీ గార్డు కళ్లల్లో రసాయన పదార్ధాలు చల్లి ఎత్తుకెళ్లినట్టు పోలీసులు తెలిపారు. ప్రస్తుతం సెక్యూరిటీ గార్డు పరిస్థితి విషమంగా ఉందని, కళ్లు కనిపించడం లేదని పోలీసులు వెల్లడించారు. ఎత్తుకెళ్లిన ఏటీఎంలో 1,70,600 రూపాయలు ఉన్నట్టు బ్యాంకు అధికారులు తెలిపారు. మోటార్ వాహనంలో ఏటీఎంను తరలించారని, హంతకుల కోసం గాలింపు చర్యలు చేపట్టామని పోలీసులు తెలిపారు.