గర్భిణీ నర్సుపై అకాలీదళ్ నేత దాడి | Akali Dal Leader, Son Caught On Camera Assaulting Pregnant Nurse | Sakshi
Sakshi News home page

గర్భిణీ నర్సుపై అకాలీదళ్ నేత దాడి

Published Fri, Sep 23 2016 2:28 PM | Last Updated on Mon, Sep 4 2017 2:40 PM

గర్భిణీ నర్సుపై అకాలీదళ్ నేత దాడి

గర్భిణీ నర్సుపై అకాలీదళ్ నేత దాడి

మోగా: పంజాబ్లో అకాలీదళ్ పార్టీకి చెందిననేత రెచ్చిపోయాడు. కన్నుమిన్నుకానక ఓ గర్భవతి అయిన నర్సుపై చేయి చేసుకున్నాడు. దీంతో ఆమె కిందపడిపోయింది. ఈ ఘటన పంజాబ్ లోని మోగాలో గల ఓ ఆస్పత్రిలో చోటుచేసుకుంది. సీసీటీవీ కెమెరాలో ఈ దృశ్యాలు రికార్డయ్యాయి. ప్రస్తుతానికి ఆ నాయకుడు పరారీలో ఉన్నాడు. అతడిపై నేరం చేసే ఉద్దేశంతో పరిమితులున్న ప్రాంతంలోకి అక్రమంగా ప్రవేశించిన కేసు, ఉద్దేశ పూర్వకంగా గాయపరిచినట్లు ఆరోపణలు నమోదు చేశారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం పరమ్జిత్ సింగ్ అతడి కుమారుడు గుర్జిత్ సింగ్ మోగాలోని గుప్తా ఆస్పత్రికి ఓ రోగిని తీసుకొని వెళ్లారు. కొద్ది సేపు ఎదురుచూడండని చెప్పినందుకు రమణదీప అనే నర్సుతో గొడవకు దిగారు. ఆమె ఎనిమిది వారాల గర్బిణీ. ఆ విషయం చెప్పినప్పటికీ ఆ తండ్రి కొడుకులు ఆమె విజ్ఞప్తిని పట్టించుకోకుండా తీవ్ర దుర్భాషలాడారు. అనంతరం లాగిపెట్టి కొట్టి కిందపడేశారు. 'మేం సర్పంచ్ ఇంటి వాళ్లం. మమ్మల్నే వెయిట్ చేయిస్తావా' అంటూ కన్నెర్ర చేశారు. పరమ్ జిత్ భార్య దల్జిత్ కౌర్ సర్పంచ్ గా పనిచేస్తుందట. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్రస్తుతం వారికోసం గాలిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement