Akali Dal leader
-
అమెరికాలో అకాలీ నేతపై దాడి
న్యూయార్క్ : అకాలీ దళ్ నేత, ఢిల్లీ సిక్కు గురుద్వారా మేనేజ్మెంట్ కమిటీ సభ్యుడు మంజీత్ సింగ్‌పై అమెరికాలోని కాలిఫోర్నియాలో గురుద్వార వెలుపల దాడి జరిగింది. మంజీత్‌పై దాడికి పాల్పడిన దుండగులు గురుద్వార నుంచి ఆయనను బయటకు ఈడ్చుకువచ్చి దారుణంగా కొట్టారు. తనపై 20 మందికి పైగా దాడికి తెగబడ్డారని, పవిత్ర గురుద్వార వద్ద ఈ ఘటన చోటుచేసుకోవడం విచారకరమని మంజీత్ పేర్కొన్నారు. తనపై దాడికి పాల్పడిన వారిపై ప్రతిదాడికి దిగవద్దని తన అనుచరులను వారించానని, సంయమనంతో వ్యవహరించాలని సూచించానన్నారు. కాగా దాడి ఘటనకు సంబంధించి ముగ్గురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మంజీత్‌పై దాడి ఘటనను శిరోమణి గురుద్వార ప్రబంధక్ కమిటీ (ఎస్జీపీసీ) అధ్యక్షుడు గోవింద్ సింగ్ లోంగోవాల్ ఖండించారు. అమెరికాలో సిక్కులపై దాడులు పునరావృతమవడం దురదృష్టకరమని వ్యాఖ్యానించారు. మంజీత్ సింగ్‌పై దాడి గర్హనీయమని కేంద్ర ఫుడ్‌ప్రాసెసింగ్ మంత్రి హర్సిమ్రత్ కౌర్ బాదల్ ఖండించారు.మరోవైపు సోమవారం న్యూయార్క్‌లోని ఓ టీవీ స్టూడియో వద్ద డీఎస్‌జీఎంసీ చీఫ్, ఆయన కుటుంబ సభ్యులపై ఖలిస్తాన్ సానుభూతిపరులు దాడి చేయడం కలకలం రేపింది. అమెరికాలో సిక్కులపై విద్వేష దాడులు పెరుగుతుండటం పట్ల ఆందోళన వ్యక్తమవుతోంది. -
గర్భిణీ నర్సుపై అకాలీదళ్ నేత దాడి
-
గర్భిణీ నర్సుపై అకాలీదళ్ నేత దాడి
మోగా: పంజాబ్‌లో అకాలీదళ్ పార్టీకి చెందిననేత రెచ్చిపోయాడు. కన్నుమిన్నుకానక ఓ గర్భవతి అయిన నర్సుపై చేయి చేసుకున్నాడు. దీంతో ఆమె కిందపడిపోయింది. ఈ ఘటన పంజాబ్ లోని మోగాలో గల ఓ ఆస్పత్రిలో చోటుచేసుకుంది. సీసీటీవీ కెమెరాలో ఈ దృశ్యాలు రికార్డయ్యాయి. ప్రస్తుతానికి ఆ నాయకుడు పరారీలో ఉన్నాడు. అతడిపై నేరం చేసే ఉద్దేశంతో పరిమితులున్న ప్రాంతంలోకి అక్రమంగా ప్రవేశించిన కేసు, ఉద్దేశ పూర్వకంగా గాయపరిచినట్లు ఆరోపణలు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం పరమ్‌జిత్ సింగ్ అతడి కుమారుడు గుర్జిత్ సింగ్ మోగాలోని గుప్తా ఆస్పత్రికి ఓ రోగిని తీసుకొని వెళ్లారు. కొద్ది సేపు ఎదురుచూడండని చెప్పినందుకు రమణదీప అనే నర్సుతో గొడవకు దిగారు. ఆమె ఎనిమిది వారాల గర్బిణీ. ఆ విషయం చెప్పినప్పటికీ ఆ తండ్రి కొడుకులు ఆమె విజ్ఞప్తిని పట్టించుకోకుండా తీవ్ర దుర్భాషలాడారు. అనంతరం లాగిపెట్టి కొట్టి కిందపడేశారు. 'మేం సర్పంచ్ ఇంటి వాళ్లం. మమ్మల్నే వెయిట్ చేయిస్తావా' అంటూ కన్నెర్ర చేశారు. పరమ్ జిత్ భార్య దల్జిత్ కౌర్ సర్పంచ్ గా పనిచేస్తుందట. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్రస్తుతం వారికోసం గాలిస్తున్నారు.