పంజాబ్లోని మోగాలో జరిగిన ఘటనపై మంగళవారం లోక్సభ దద్దరిల్లింది.
న్యూఢిల్లీ: పంజాబ్లోని మోగాలో జరిగిన ఘటనపై మంగళవారం లోక్సభ దద్దరిల్లింది. ఆ ఘటనపై చర్చ జరపాల్సిందేనంటూ కాంగ్రెస్ పార్టీ వాయిదా తీర్మానం ఇచ్చింది. దీనిని స్పీకర్ తిరస్కరించడంతో గందరగోళం నెలకొంది. చర్చ జరపాల్సిందేనని కాంగ్రెస్ నేతలు పట్టుబట్టారు.
ఎంత చెప్పిన విపక్ష సభ్యలు ఆందోళనకు దిగడంతో లోక్సభ మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా పడింది. అంతకు ముందు ప్రత్యేక హైకోర్టు కోసం తెలంగాణ ఎంపీలు ఆందోళన చేయడంతో సభ వాయిదా పడింది. మరోపక్క, రాజ్యసభలో కూడా విపక్ష సభ్యులు మోగా ఘటనపై ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో అక్కడా సభ 10 నిమిషాల పాటు వాయిదా పడింది.