Amritsar Airport
-
సిక్కు వేర్పాటువాది రెచ్చగొట్టే వ్యాఖ్యలు
ఖలిస్థానీ ఉగ్రవాది, నిషేధిత 'సిఖ్స్ ఫర్ జస్టిస్' నేత గురుపత్వంత్ సింగ్ మరోసారి భారత్‌లో హింసాకాండ రెచ్చగొట్టే ప్రకటన చేశాడు. అయోధ్యలో రామ మందిరంలో రాముడి ప్రాణప్రతిష్ట కార్యక్రమం జరిగే రోజు (జనవరి 22న) అమృత్సర్ నుంచి అయోధ్య వరకు ఎయిర్‌పోర్టులు మూసివేయాలన్నాడు. సిఖ్స్ ఫర్ జస్టిస్(SFJ)సైతం రామ మందిరాన్ని ముస్లింలు వ్యతిరేకించాలని రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసింది. ‘ఇప్పుడు సమయం వచ్చింది.. ముస్లిలంతా రామ మందిరాన్ని వ్యతిరేకించాలి’ అని రెచ్చగొడుతూ.. గరుపత్వంత్ సింగ్ సోమవారం వీడియో రిలీజ్ చేశాడు. దీంతో భారత్ అప్రమత్తమైంది. ఎలాంటి అవాంఛనీయ పరిణామాలు చోటుచేసుకోకుండా.. పోలీసులు అన్ని చోట్ల కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. ఇక.. అమెరికాలో ఖలిస్తానీ ఉగ్రవాది గురుపత్వంత్ సింగ్ పన్నూన్ హత్యకు కుట్ర జరిగిందని, దీనిని తాము భగ్నం చేశామని ఇటీవల అగ్రరాజ్యం ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. పన్నూన్ హత్యకు కుట్రలో 52 ఏళ్ల నిఖిల్ గుప్తా అనే భారత పౌరుడి ప్రమేయం ఉందంటూ యూఎస్‌లోని ఫెడరల్ ప్రాసిక్యూటర్లు అతనిపై అభియోగాలు మోపారు. గుప్తా భారత ప్రభుత్వ ఏజెన్సీ ఉద్యోగితో కుమ్మక్కయ్యాడని ఆరోపించారు. అతన్ని చెక్ రిపబ్లిక్లో అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. చదవండి: Ayodhya Ram Mandir: ‘అయోధ్య’ విరాళాల మొత్తం ఇప్పటివరకూ ఎంత? అధిక మొత్తం ఇచ్చిందెవరు? -
అమృత్‌పాల్ భార్య కిరణ్‌దీప్‌కు భారీ షాక్..
అమృత్సర్: ఖలిస్తాన్ సానుభూతిపరుడు అమృత్‌పాల్ సింగ్ గత కొద్దిరోజులుగా పోలీసులకు దొరక్కకుండా తిరుగుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో భద్రతా బలగాలు, పంజాబ్ పోలీసులు.. అమృత్‌పాల్ కోసం గాలిస్తున్నారు. ఇదే సమయంలో అమృత్‌పాల్ సింగ్ కుటుంబ సభ్యులపై కూడా పోలీసులు ఫోకస్ పెట్టారు. అయితే, తాజాగా దేశం విడిచి వెళ్లేందుకు ప్రయత్నించిన అమృత్‌పాల్ భార్య కిరణ్‌దీప్ కౌర్ (28)ను పోలీసులు అమృత్సర్ విమానాశ్రయంలో అదుపులోకి తీసుకున్నారు. వివరాల ప్రకారం.. కిరణ్‌దీప్ కౌర్ గురువారం మధ్యాహ్నం లండన్ వెళ్లే క్రమంలో అమృత్సర్ విమానాశ్రయంలో ఇమిగ్రేషన్ పోలీసులు ఆమెను అడ్డుకుని అదుపులోకి తీసుకున్నారు. విమానం షెడ్యూల్ ప్రకారం లండన్‌కు 1.30 గంటలకు వెళ్లాల్సి ఉండగా.. కిరణ్‌దీప్‌ను పోలీసులు అడ్డుకుని విచారిస్తున్నారు. తమకు చెప్పకుండా ఆమెకు విదేశాలకు వెళ్లే ప్రయత్నం చేయడంతో పోలీసులు సీరియస్ అయ్యారు. ఇంత అర్జెంట్‌గా లండన్ ఎందుకు వెళ్తున్నారు అని ప్రశ్నిస్తున్నట్టు సమాచారం. కాగా, కిరణ్‌దీప్ కౌర్ బ్రిటిష్ పౌరురాలు. ఆమెపై పంజాబ్‌లో కానీ, దేశంలో కానీ ఎలాంటి కేసులు లేవు. అమృత్‌పాల్ భార్య కిరణ్‌దీప్ కౌర్ యూకేలో ఉంటూ బబ్బర్ ఖల్సా ఇంటర్నేషనల్‌లో క్రియాశీలక సభ్యురాలిగా ఉన్నారు. పరారీలో ఉన్న నిందితుల కుటుంబం, పరిచయస్తులను ప్రశ్నించే చట్టపరమైన ప్రక్రియ కింద కిరణ్‌దీప్ కౌర్‌ను ముందు జాగ్రత్త చర్యగా అదుపులోకి తీసుకున్నారు. అంతకుముందు.. మార్చిలో అమృతపాల్ సింగ్ కార్యకలాపాలకు విదేశీ నిధులు సమకూర్చిన ఆరోపణలపై ఆమెను జల్లుపూర్ ఖేడా గ్రామంలో ప్రశ్నించారు. మరోవైపు.. కిరణ్‌దీప్ లండన్ వెళ్తున్న నేపథ్యంలో అమృత్‌పాల్ కూడా లండన్‌కు వెళ్తున్నారా? అనే అనుమానాలను పోలీసులు వ్యక్తం చేస్తున్నారు. ఖలీస్థాన్ వేర్పాటువాద ఉద్యమంలో అతడి భవిష్యత్తు ప్రణాళికలు ఏంటి? అనేది ఆమెను ఆరా తీస్తున్నట్టు తెలుస్తోంది. కాగా, అమృత్‌పాల్ అనుచరులను పంజాబ్ పోలీసులు ఇటీవలే అరెస్ట్ చేశారు. VIDEO | Visuals from Amritsar Airport where fugitive pro-Khalistani leader Amritpal Singh's wife Kirandeep Kaur has been stopped by immigration officials. pic.twitter.com/KaCSfb6Fcr — Press Trust of India (@PTI_News) April 20, 2023 -
విమానంలో భారత్‌కు వచ్చిన 125 మందికి కరోనా
-
అమృత్ సర్ విమానాశ్రయంలో భారీగా బంగారం పట్టివేత
అమృత్ సర్: శ్రీ గురు రామ్ దాస్ జీ అంతర్జాతీయ విమానాశ్రయంలో అక్రమంగా బంగారాన్ని తరలిస్తున్న వ్యక్తిని కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. దుబాయ్ నుంచి వచ్చిన ఒక ప్రయాణికుడి నుంచి 822 గ్రాముల కస్టమ్స్ అధికారులు బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. భద్రత సిబ్బందిని మోసగించే ప్రయత్నంలో ప్రయాణికుడు తన వద్ద ఉన్న మూడు ప్లాస్టిక్ కవర్లలో క్యాప్సూల్స్ ఆకారంలో బంగారాన్ని దాచిపెట్టాడని అధికారులు తెలిపారు. "ఎయిర్ ఇండియా విమాన నంబర్ 930లో దుబాయ్ నుంచి అమృత్ సర్ విమానాశ్రయానికి వచ్చిన ఒక ప్రయాణికుడిపై అనుమానం వచ్చి కస్టమ్స్ అధికారులు ప్రయాణికుడిని ప్రశ్నించినప్పుడు, మూడు క్యాప్సూల్స్ లో పేస్ట్ రూపంలో బంగారాన్ని దాచిపెట్టినట్లు అంగీకరించాడు" అని అమృత్ సర్ లోని కస్టమ్స్ ప్రివెంటివ్ కమీషనేట్ ప్రతినిధి తెలిపారు.స్వాధీనం చేసుకున్న బంగారం విలువ ₹.38లక్షలు అని అధికారులు తెలిపారు. దర్యాప్తులో భాగంగా ప్రయాణికుడి పేరును బయటికి వెల్లడించలేదు. ఆగస్టు 24న ఇలాగే, షార్జా నుంచి ఇండిగో విమానంలో విమానాశ్రయంలో దిగిన పురుష ప్రయాణికుడి నుంచి కస్టమ్స్ అధికారులు ₹.78 లక్షల విలువైన 1.600 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు.(చదవండి: మీరు పెట్టిన పెట్టుబడి ఎన్ని ఏళ్లలో రెట్టింపవుతుంది?) -
స్వదేశానికి ‘ఇరాక్ మృతదేహాలు’
అమృత్సర్/కోల్‌కతా: ఇరాక్‌లో ఐసిస్ ఉగ్రవాదుల చేతిలో చనిపోయిన 39 మంది భారతీయుల్లో 38 మృతదేహాలను ప్రత్యేక విమానంలో కేంద్రం సోమవారం భారత్‌కు తీసుకొచ్చింది. మరొక మృతదేహం ఎవరిదనే విషయం కచ్చితంగా నిర్ధారణ కాకపోవటంతో దాన్ని ఇరాక్‌లోనే ఉంచారు. మృతదేహాలను తీసుకొచ్చేందుకు విదేశాంగ శాఖ సహాయ మంత్రి వీకే సింగ్ ఆదివారం ఇరాక్ వెళ్లడం తెలిసిందే. 38 మృతదేహాల్లో 27 పంజాబ్‌కు, నాలుగు హిమాచల్ ప్రదేశ్‌కు చెందినవి కావడంతో ఆ 31 మృతదేహాలను అమృత్‌సర్‌లోని విమానాశ్రయంలో బంధువులకు అప్పగించారు. మిగిలిన ఏడింటిని కోల్‌కతా, పట్నా విమానాశ్రయాల్లో ఆప్తులకు అధీన పరిచారు. వీరంతా దాదాపు సంవత్సరం క్రితమే చనిపోయారనీ, భూమిలో పాతిపెట్టిన శవాలను ఇటీవల వెలికి తీసి తెచ్చినందున ఇప్పుడు ఈ శవపేటికలను తెరవడం మంచిది కాదని వీకే సింగ్ సూచించారు. శవాలను పాతిపెట్టిన స్థలంలో విషపదార్థాలు ఉండేవనీ, అలాగే మృతదేహాలను ఎంబామింగ్ చేసి శవపేటికల్లో పెట్టడంతో వాటిని తెరవడం ప్రమాదకరమని ఆయన హెచ్చరించారు. -
విమానాశ్రయంలో బాంబు కలకలం
అమృత్సర్: పంజాబ్‌లోని అమృత్సర్ విమానాశ్రయంలో బుధవారం బాంబు ఉందన్న సమాచారం కలకలం రేపింది. శ్రీ గురు రామ్‌దాస్ జీ అంతర్జాతీయ విమానాశ్రయం పార్కింగ్ ఏరియాలో గుర్తు తెలియని వ్యక్తులు ఉంచిన సూట్‌కేసును గుర్తించిన అధికారులు వెంటనే అప్రమత్తమయ్యారు. ఎయిర్పోర్ట్ కార్యకలాపాలను తాత్కాలికంగా నిలిపివేసిన అధికారులు పోలీసులకు సమాచారం అందించారు. బాంబ్ డిస్పోజల్ సిబ్బంది ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది. -
తృటిలో తప్పిన ప్రమాదం
అమృత్సర్: ఢిల్లీకి చెందిన స్పైస్ జెట్ విమానం తృటిలో భారీ ప్రమాదం నుంచి తప్పించుకుంది. అమృతసర్ విమానాశ్రయంలో సోమవారం ఉదయం విమానం గాల్లోకి ఎగరడానికి సిద్ధంగా ఉన్న క్షణంలో అకస్మాత్తుగా ఓ ట్రక్ రన్ వే పైకి దూసుకువచ్చింది. దీంతో కొద్దిసేపు అక్కడ ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. అత్యంత కట్టుదిట్టమైన భద్రతా వలయం మధ్య ఉండే రన్ వే ఒక వాహనం చొచ్చుకు రావడంతో ఎయిర్ ఫోర్స్ సిబ్బంది, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ సిబ్బంది మధ్య వివాదం రేగింది. రెడ్ సిగ్నల్ ఉన్నప్పటికీ ఐఎఎఫ్ ట్రక్ రన్ వే పైకి వచ్చిందని ఎటీసీ చెబుతోంది. కాగా తృటిలో భారీ ప్రమాదం తప్పడంతో ఊపిరిపీల్చుకున్న ప్రయాణికులు మాత్రం తమ భద్రతను గాలికొదిలేసిన ఇరువర్గాలపై ఆగ్రహం వ్యక్తం చేశారు.