ఖలిస్థానీ ఉగ్రవాది, నిషేధిత 'సిఖ్స్ ఫర్ జస్టిస్' నేత గురుపత్వంత్ సింగ్ మరోసారి భారత్‌లో హింసాకాండ రెచ్చగొట్టే ప్రకటన చేశాడు. అయోధ్యలో రామ మందిరంలో రాముడి ప్రాణప్రతిష్ట కార్యక్రమం జరిగే రోజు (జనవరి 22న) అమృత్‌సర్ నుంచి అయోధ్య వరకు ఎయిర్‌పోర్టులు మూసివేయాలన్నాడు. సిఖ్స్ ఫర్ జస్టిస్(SFJ)సైతం రామ మందిరాన్ని ముస్లింలు వ్యతిరేకించాలని రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసింది.
‘ఇప్పుడు సమయం వచ్చింది.. ముస్లిలంతా రామ మందిరాన్ని వ్యతిరేకించాలి’ అని రెచ్చగొడుతూ.. గరుపత్వంత్ సింగ్ సోమవారం వీడియో రిలీజ్ చేశాడు. దీంతో భారత్ అప్రమత్తమైంది. ఎలాంటి అవాంఛనీయ పరిణామాలు చోటుచేసుకోకుండా.. పోలీసులు అన్ని చోట్ల కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు.
ఇక.. అమెరికాలో ఖలిస్తానీ ఉగ్రవాది గురుపత్వంత్ సింగ్ పన్నూన్ హత్యకు కుట్ర జరిగిందని, దీనిని తాము భగ్నం చేశామని ఇటీవల అగ్రరాజ్యం ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. పన్నూన్ హత్యకు కుట్రలో 52 ఏళ్ల నిఖిల్ గుప్తా అనే భారత పౌరుడి ప్రమేయం ఉందంటూ యూఎస్‌లోని ఫెడరల్ ప్రాసిక్యూటర్లు అతనిపై అభియోగాలు మోపారు. గుప్తా భారత ప్రభుత్వ ఏజెన్సీ ఉద్యోగితో కుమ్మక్కయ్యాడని ఆరోపించారు. అతన్ని చెక్ రిపబ్లిక్‌లో అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే.
చదవండి: Ayodhya Ram Mandir: ‘అయోధ్య’ విరాళాల మొత్తం ఇప్పటివరకూ ఎంత? అధిక మొత్తం ఇచ్చిందెవరు?
Comments
Please login to add a commentAdd a comment