విమానాశ్రయంలో బాంబు కలకలం | Operations at Amritsar Airport suspended after suspected bomb threat | Sakshi
Sakshi News home page

విమానాశ్రయంలో బాంబు కలకలం

Published Wed, Mar 15 2017 10:22 AM | Last Updated on Tue, Nov 6 2018 8:50 PM

విమానాశ్రయంలో బాంబు కలకలం - Sakshi

విమానాశ్రయంలో బాంబు కలకలం

అమృత్‌సర్‌: పంజాబ్‌లోని అమృత్‌సర్‌ విమానాశ్రయంలో బుధవారం బాంబు ఉందన్న సమాచారం కలకలం రేపింది. శ్రీ గురు రామ్‌దాస్‌ జీ అంతర్జాతీయ విమానాశ్రయం పార్కింగ్‌ ఏరియాలో గుర్తు తెలియని వ్యక్తులు ఉంచిన సూట్‌కేసును గుర్తించిన అధికారులు వెంటనే అప్రమత్తమయ్యారు.

ఎయిర్‌పోర్ట్‌ కార్యకలాపాలను తాత్కాలికంగా నిలిపివేసిన అధికారులు పోలీసులకు సమాచారం అందించారు. బాంబ్‌ డిస్పోజల్‌ సిబ్బంది ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement