చండీగఢ్: సిక్కు తీవ్రవాద ప్రబోధకుడు అమృత్‌పాల్ సింగ్ నిర్భందాన్ని ఏడాది పాటు పొడగిస్తూ పంజాబ్ ప్రభుత్వం ఈనెల 3న ఉత్తర్వులు జారీచేసింది. అయితే బుధవారం వీటిని బహిరంగ పర్చారు. వారిస్ దే పంజాబ్ చీఫ్ అమృత్‌పాల్, అతని తొమ్మిది మంది అనుచరులు జాతీయ భద్రతా చట్టం కింద అరెస్టయ్యి ప్రస్తుతం అస్సాంలోని డిబ్రూగఢ్ జైలులో ఉన్నారు.
జైలులో ఉంటూనే అమృత్‌పాల్ లోక్‌సభ ఎన్నికల్లో పంజాబ్‌లోని ఖదూర్ సాహిబ్ స్థానం నుంచి స్వతంత్ర అభ్యరి్థగా పోటీచేసి సమీప కాంగ్రెస్ ప్రత్యరి్థపై 1.97 లక్షల మెజారిటీతో ఎంపీగా విజయం సాధించాడు. ఫలితాలు ఈనెల 4న వెలువడగా.. 3వ తేదీనే అమృత్‌పాల్ నిర్భందాన్ని ఏడాదిపాటు పొడగిస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి.
Comments
Please login to add a commentAdd a comment