preacher
-
Malaysia PM: సాక్ష్యాధారాలు సమర్పిస్తే జకీర్ నాయక్‌ను అప్పగిస్తాం
న్యూఢిల్లీ: వివాదాస్పద మత బోధకుడు జకీర్ నాయక్‌ను భారత్‌కు అప్పగించే విషయంలో మలేషియా ప్రధానమంత్రి అన్వర్ ఇబ్రహీం సానుకూలంగా స్పందించారు. అతడిపై వచ్చిన ఆరోపణలపై తగిన ఆధారాలు సమర్పిస్తే భారత్‌కు అప్పగించడానికి తమకు ఎలాంటి అభ్యంతరం లేదని స్పష్టంచేశారు. భారత్‌లో పర్యటిస్తున్న ఇబ్రహీం బుధవారం ఓ వార్తా సంస్థకు ఇంటర్వ్యూ ఇచ్చారు. భారత్‌కు వ్యతిరేకంగా మలేషియాలో జకీర్ ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదన్నారు. తమ దేశ భద్రతకు జకీర్ వల్ల ఎలాంటి ముప్పు వాటిల్లనంతవరకు, ఎలాంటి సమస్యలు రానంత వరకు అతడి విషయంలో తాము కలుగజేసుకోబోమని తెలిపారు. అయితే, తగిన సాక్ష్యాధారాలు సమర్పిస్తే చట్టప్రకారం భారత్ అప్పగించడానికి సిద్ధంగా ఉన్నామని ప్రధాని అన్వర్ ఇబ్రహీం స్పష్టం చేశారు. -
అమృత్‌పాల్ నిర్భందం ఏడాది పొడగింపు
చండీగఢ్: సిక్కు తీవ్రవాద ప్రబోధకుడు అమృత్‌పాల్ సింగ్ నిర్భందాన్ని ఏడాది పాటు పొడగిస్తూ పంజాబ్ ప్రభుత్వం ఈనెల 3న ఉత్తర్వులు జారీచేసింది. అయితే బుధవారం వీటిని బహిరంగ పర్చారు. వారిస్ దే పంజాబ్ చీఫ్ అమృత్‌పాల్, అతని తొమ్మిది మంది అనుచరులు జాతీయ భద్రతా చట్టం కింద అరెస్టయ్యి ప్రస్తుతం అస్సాంలోని డిబ్రూగఢ్ జైలులో ఉన్నారు. జైలులో ఉంటూనే అమృత్‌పాల్ లోక్‌సభ ఎన్నికల్లో పంజాబ్‌లోని ఖదూర్ సాహిబ్ స్థానం నుంచి స్వతంత్ర అభ్యరి్థగా పోటీచేసి సమీప కాంగ్రెస్ ప్రత్యరి్థపై 1.97 లక్షల మెజారిటీతో ఎంపీగా విజయం సాధించాడు. ఫలితాలు ఈనెల 4న వెలువడగా.. 3వ తేదీనే అమృత్‌పాల్ నిర్భందాన్ని ఏడాదిపాటు పొడగిస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. -
గురువు సందేశం తర్వాత..ఇంత నిశబ్దమా! ఇదేలా సాధ్యం?
అది చంపానగర సమీపంలో ఉన్న గర్ఘరా పుష్కరిణీ తీరం. ఆ పుష్కరిణి దక్షిణపు ఒడ్డున సువిశాలమైన మర్రిచెట్టు. ఆ చెట్టుకింద బుద్ధుడు తన భిక్షుసంఘంతో కూర్చొని ఉన్నాడు. ఆ సమయంలో ఏనుగులకు శిక్షణ ఇచ్చే పేస్సుడు, కందరకుడు అనే పరివ్రాజకుడు ఇద్దరూ వచ్చారు. వారు వచ్చి మౌనంగా ఒకపక్క కూర్చున్నారు. కొంతసేపటికి బుద్ధుని ప్రబోధం ముగించాడు. అప్పుడు వారిద్దరూ బుద్ధుని దగ్గరకు వెళ్ళారు. కొన్ని అనుమానాలు అడిగి నివృత్తి చేసుకున్నారు. అప్పటికి చాలా సమయం గడిచింది. భిక్షుసంఘం అంతసమయం నిశ్శబ్దంగానే ఉండటం చూసి వారిద్దరూ ఆశ్చర్యపడ్డారు. వారు అనేక ఇతర పరివ్రాజక సంఘాల్ని చూశారు. గురువులు చెప్పే సందేశాలు ముగిశాక గానీ ఇంత ప్రశాంతత కానరాదు. ఎవరో ఒకరు మాట్లాడుకుంటూనో, గుసగుసలాడుకుంటూనో, గొణుక్కుంటూనో ఉంటారు. ఆ గురువులు ‘నిశ్శబ్దం నిశ్శబ్దం’ అని అరుస్తూనే ఉంటారు. కానీ ఇక్కడ అలాంటిదేమీలేదు. ఎవ్వరూ అసహనంగా లేరు. ఇతరుల్ని సహనాన్ని చెడగొట్టడం లేదు. తాము బాధపడటం లేదు, ఇతరుల్ని బాధపెట్టడం లేదు. అప్పుడు కందరకుడు ‘‘భగవాన్! విచిత్రం! మనుషుల ప్రవర్తన రకరకాలుగా ఉంటుంది. కానీ, ఇక్కడ అందరూ ఒకే శ్రద్ధతో ఉన్నారు’’ అని ఆశ్చర్యంగా అడిగాడు. అప్పుడు బుద్ధుడు–‘‘కందరకా! మనుషుల్లో ముఖ్యంగా తాపసుల్లో నాలుగు రకాల వారు ఉంటారు. మొదటి రకం వారు, తమని తామే బాధించుకుంటారు. తాము బాధపడుతూ తమ శరీరాల్ని అతిగా బాధలకి గురిచేస్తారు. నిరాహారంతో శుష్కింపచేస్తారు. అతి చలికి, అతి వేడిమికి గురిచేస్తారు. తినకూడని పదార్థాల్ని తింటారు. అలా తమని తాము శిక్షించుకోవడమే సరైన శిక్షగా భావిస్తారు. ఇంకొందరు ఇతరుల్ని బాధించి తాము సుఖంగా బతకాలనుకుంటారు. దొంగలూ దోపిడీదారులు, ఇతర జీవుల్ని పట్టి చంపి వాటి మాంసాన్ని అమ్మేవారు. ఇలా పరుల్ని నష్టపరచి తాము లాభాలు పొందాలనుకునే వారంతా ఈ కోవలోకి వస్తారు. అలాగే తాము దుఃఖపడుతూ ఇతరుల్ని దుఃఖపరిచే వారు మూడోరకం. ఒక మహారాజు గొప్ప యజ్ఞం చేయాలనుకుంటాడు. దాని నిర్వహణ కోసం ఎంతో సొమ్ము... ఎన్నో జంతువులూ కావాలి. కాబట్టి ఆజ్ఞలు జారీ చేస్తాడు. ఆ ఆజ్ఞల్ని అమలు చేయడానికి ఉద్యోగుల్నీ, సైనికుల్నీ నియమిస్తాడు. వారు గ్రామాల మీద పడి పేద ప్రజల నుండి, సామాన్య రైతుల నుండి పశువుల్ని, డబ్బుల్నీ బలవంతాన లాక్కు వస్తారు. అలా వారు తమకి ఇష్టం లేకపోయినా బాధపడుతూనే... బలవంతంగా ఆ పనులు చేస్తారు. తాము బాధపడుతూ, ఇతరుల్నీ బాధపెడతారు.’’ ఇక కొందరు తమ శరీరాన్ని, తమ మనస్సునీ తాము బాధించుకోరు. తమ సుఖం కోసం పరుల్నీ బాధించరూ– ఇలాంటి వారు స్వీయ క్రమశిక్షణతో నడుచుకుంటారు. అలా ఉంటే ఆ వినేది తామూ శ్రద్ధతో వింటారు. పక్కనున్న వారినీ విననిస్తారు. అది ఉభయులకీ శ్రేయస్సునిస్తుంది. నా భిక్షువులు అలాంటి వారు’’ అన్నాడు బుద్ధుడు. శ్రద్ధ, స్వీయ క్రమశిక్షణ ఎంత అవసరమో వారికర్థమయ్యింది. ఇద్దరూ బుద్ధునికి ప్రణమిల్లి ‘‘మమ్మల్ని, మీ సంఘంలో చేర్చుకోండి’’ అని ప్రార్థించారు. బుద్ధుడు అంగీకరించాడు. – డా. బొర్రా గోవర్ధన్ (చదవండి: "కృష్ణ భక్తి" ఎంతపనైనా చేస్తుంది అంటే ఇదే కదా..ఏకంగా 88) -
రైతులకు మద్దతుగా ఆత్మహత్య
న్యూడిల్లీ: వివాదాస్పద వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న రైతులకు సంఘీభావంగా హరియాణాలోని కర్నాల్‌కు చెందిన మత ప్రబోధకుడు సంత్ బాబా రామ్ సింగ్(65) బుధవారం ఆత్మహత్య చేసుకున్నారు. ఢిల్లీ శివార్లలోని సింఘు సరిహద్దు వద్ద తుపాకీతో కాల్చుకున్నారు. రామ్‌సింగ్‌కు పంజాబ్, హరియాణాల్లో అనుయాయులు ఉన్నారు. హరియాణా శిరోమణి గురుద్వారా ప్రబంధక్ కమిటీ (ఎస్జీపీసీ) సహా పలు ఆధ్యాత్మిక సంస్థల్లో ఆయన సభ్యుడిగా ఉన్నారు. బాబా రామ్‌సింగ్ మృతదేహం సమీపంలో ఆయన పంజాబీలో రాసిన ఆత్మాహుతి లేఖ లభించింది. ‘హక్కుల కోసం రోడ్డుపై ఆందోళన చేస్తున్న రైతుల దీనస్థితిని, వారికి న్యాయం చేయకుండా ప్రభుత్వం అనుసరిస్తున్న అణచివేతను చూసి తట్టుకోలేకపోతున్నాను’ అని ఆ లేఖలో ఆయన పేర్కొన్నారు. రైతులకు మద్దతుగా పలువురు తమకందిన ప్రభుత్వ పురస్కారాలను వెనక్కు ఇచ్చిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ‘రైతులకు మద్దతుగా, ప్రభుత్వ తీరుకు నిరసనగా ఈ సేవకుడు ఆత్మహత్య చేసుకుంటున్నాడు. ఇది ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా, రైతులకు మద్దతుగా తీసుకుంటున్న చర్య’ అని వివరించారు. ఈ లేఖను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆత్మహత్యపై కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు. రామ్‌సింగ్ మృతికి కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఆత్మహత్యకు మోదీ ప్రభుత్వమే కారణమని ఆరోపించారు. మోదీ ప్రభుత్వ రాక్షసత్వం అన్ని హద్దులు దాటిందని మండిపడ్డారు. రైతు వ్యతిరేక చట్టాలను వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కమిటీతో లాభం లేదు రైతు ఆందోళనలపై సుప్రీంకోర్టు సూచించినట్లుగా కమిటీని ఏర్పాటు చేయడం వల్ల పరిష్కారం లభించదని రైతు సంఘాలు స్పష్టం చేశాయి. వివాదాస్పద వ్యవసాయ చట్టాల రద్దే ఏకైక పరిష్కారమని పేర్కొన్నాయి. కమిటీని ఏర్పాటు చేస్తామని చర్చల సందర్భంగా ప్రభుత్వం ఇప్పటికే ప్రతిపాదించిందని, ఆ ప్రతిపాదనను అప్పుడే తిరస్కరించామని రాష్ట్రీయ కిసాన్ మజ్దూర్ సభ నేత అభిమన్యు కోహర్ వెల్లడించారు. ఇప్పటివరకు చర్చలు జరిపిన ప్రభుత్వ ప్రతినిధులు, రైతు ప్రతినిధులు కమిటీతో సమానమేనని వ్యాఖ్యానించారు. సుప్రీంకోర్టు ఆదేశాలను పూర్తిగా అధ్యయనం చేసిన తరువాత, దానిపై ప్రభుత్వ స్పందనను గమనించిన తరువాత ఈ విషయంపై మాట్లాడుతామని భారతీయ కిసాన్ యూనియన్ నేత రాకేశ్ తికాయత్ పేర్కొన్నారు. మరోవైపు, ఇతర రైతు సంఘాలతో సమాంతర చర్చలను నిలిపేయాలని ఢిల్లీ సరిహద్దుల్లో ఆందోళనల్లో పాల్గొంటున్న 40 రైతు సంఘాల ఐక్య కూటమి ‘సంయుక్త కిసాన్ మోర్చా’ కేంద్రానికి లేఖ రాసింది. యూపీ సహా పలు రాష్ట్రాలకు చెందిన రైతు సంఘాలతో ఇటీవల కేంద్ర ప్రతినిధులు భేటీకావడం తెల్సిందే. వ్యవసాయ చట్టాలకు సవరణలు చేస్తామన్న ప్రభుత్వ ప్రతిపాదనను తిరస్కరిస్తున్నామని కేంద్రానికి రాసిన లేఖలో స్పష్టం చేశారు. మరోవైపు, చిల్లా సరిహద్దు వద్ద భద్రతను మరింత పెంచారు. చిల్లా సరిహద్దును దిగ్బంధిస్తామని రైతు నేతలు హెచ్చరించిన నేపథ్యంలో ఢిల్లీ–నోయిడా మార్గంలోని చిల్లా సరిహద్దులో బలగాలను మోహరించారు. -
అంత్యక్రియలకు 10 వేల మంది
గువాహటి: కరోనా వైరస్ వ్యాప్తి తీవ్రమవుతున్న సమయంలోనే.. మత ప్రబోధకుడి అంత్యక్రియలకు వేలాదిగా జనం హాజరుకావడంతో అస్సాం ప్రభుత్వం అప్రమత్తమైంది. ఆ ఘటన జరిగిన చుట్టుపక్కల మూడు గ్రామాల్లో లాక్డౌన్ ప్రకటించింది. ఆల్ ఇండియా జమాయిత్ ఉలేమా ఉపాధ్యక్షుడు, ఈశాన్య రాష్ట్రాల అమిర్–ఇ–షరియత్ అయిన ఖైరుల్ ఇస్లాం(87)అంత్యక్రియలు ఈ నెల 2వ తేదీన జరిగాయి. ఖైరుల్ ఇస్లాం కుమారుడు, ఆల్ ఇండియా యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ పార్టీకి చెందిన అమినుల్ ఇస్లాం నగౌన్ జిల్లా ధింగ్ నియోజకవర్గం ఎమ్మెల్యే కూడా. తన తండ్రి అంత్యక్రియలకు సంబంధించిన ఫొటోలను ఆయన సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. లాక్డౌన్ నిబంధనలను పట్టించుకోకుండా అంత్యక్రియలకు 10 వేల మందికి పైగా హాజరుకావడంతో పోలీసులు పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఆ పరిసరాల్లో ఉన్న 3 గ్రామాల్లో వైరస్ వ్యాప్తి చెందకుండా లాక్డౌన్ ప్రకటించారు. కేరళలో కోవిడ్–19 ఆంక్షలు మరో ఏడాది తిరువనంతపురం: కోవిడ్–19కు సంబంధిం చిన ఆంక్షలు మరో ఏడాది పాటు అమల య్యేలా కేరళ ప్రభుత్వం ఆదివారం ఆదేశాలు జారీ చేసింది. ఈ ఏడాది మార్చి 27వ తేదీ నుంచి అమలవుతున్న ఆదేశాలకు తోడుగా మరో ఏడాది పాటు కొనసాగేందుకు వీలు కల్పించేలా కేరళ ఎపిడెమిక్ డిసీజెస్ ఆర్డినెన్స్– 2020కి అదనపు నిబంధనలను జోడించింది. అవి.. మరో ఏడాది పాటు పెద్ద సంఖ్యలో జనం గుమికూడటంపై నిషేధం కొనసాగు తుంది. బహిరంగ ప్రదేశాల్లో అన్ని సమ యాల్లో ఆరడుగుల భౌతికదూరం పాటిం చాలి. రహదారులు, కాలిబాటలు సహా అన్ని బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మి వేయరాదు. -
ఆవగింజంత విశ్వాసంతో అనూహ్యమైన దీవెనలు
ఎలీషా ప్రవక్త శిష్యుల్లో ఒకాయన చనిపోవడంతో అతని కుటుంబమంతా రోడ్డున పడింది. విధవరాలైన అతని భార్య అప్పుతీర్చలేదని తెలిసి, అప్పులవాళ్ళు ఆమె కొడుకులిద్దరినీ తమకు బానిసలుగా చేసుకోవడానికి సిద్ధమయ్యారు. చివరికి ఇంట్లో భోజనానికి గడవడం కూడా ఇబ్బందే అయ్యింది. రోజూ సమస్యలతోనే ఆరంభమై సమస్యలతోనే ముగుస్తున్న ఎంతో విషాదమయ జీవితం ఆమెది. ఎన్నో సమస్యలు నెత్తినపడిన అశక్తత, దిక్కుతోచని స్థితిలో, ఎలీషా ప్రవక్త ’నేను నీకేమి చెయ్యాలని కోరుకొంటున్నావు? నీ వద్ద ఏముంది?’ అనడిగాడు. ’కుండలో కొంచెం నూనె ఉంది’ అని ఆమె జవాబిచ్చింది. ’వెళ్లి అందరి వద్దా వంట పాత్రలు అరువు తెచ్చుకొని వాటిలో ఆ నూనెను పొయ్యడం ఆరంభిస్తే ఆ పాత్రలన్నీ నూనెతో నిండుతాయని, ఆ నూనె అంతా అమ్మి అప్పులు తీర్చుకొని, మిగిలిన దానితో నీవు నీ పిల్లలు బతకమని ఎలీషా చెప్పగా, ఆమె అలాగే చేసింది. అవమానంతో జీవించవలసిన ఆమెను, ఆమె కుటుంబాన్ని దేవుడు ఇలా అనూహ్యంగా స్వాభిమానం, సమద్ధి, ప్రశాంతత వైపునకు నడిపించాడు(2 రాజులు 4:1–7) నీవద్ద ఏముంది? అన్న ఎలీషా ప్రశ్నకు, నా వద్ద ఉన్నవి ఇవీ అంటూ తన సమస్యలన్నీ ఏకరువు పెట్టినా, తన వద్ద ఏమీ లేదని ఆమె జవాబిచ్చినా అక్కడ అద్భుతం జరిగి ఉండేది కాదు. ‘కానీ నావద్ద కొంచెం నూనె ఉంది’ అన్న ఆమె జవాబే పరిస్థితినంతా దేవుడు మార్చడానికి దోహదం చేసింది. మరో విధంగా చెప్పాలంటే, ’ ఇన్ని బాధల్లోనూ ’నా వద్ద ఆవగింజంత విశ్వాసముంది’ అని ఆమె పరోక్షంగా చెప్పింది. ఇంట్లో ఒక అకాల మరణం, అప్పులవాళ్ళ వేధింపులు, పూటగడవని లేమి, ఒంటరితనం, బెదిరింపులు, నిస్సహాయత్వం, భరించలేని వత్తిడి, చుట్టూ అంధకారమే, శూన్యమే తప్ప జీవితం పైన ఆశలేమాత్రం లేని పరిస్థితుల్లో ఆమెకున్న ’ఆవగింజంత విశ్వాసమే’ ఆశీర్వాదాలకు ద్వారం తెరిచింది. జీవితంలో ఏమీ లేకున్నా దేవుడు నాకు పీల్చుకోవడానికి గాలినిచ్చాడు చాలు అన్న సంతప్తి, కతజ్ఞత కలిసిన విశ్వాసమే దేవుని అద్భుతాలకు కారణమవుతుంది. ఆ విధవరాలికున్న ప్రధాన సమస్య డబ్బు లేకపోవడం కాని ఆమెకున్న అతి గొప్ప ఆశీర్వాదం, ఆమెలోని ఆవగింజంత విశ్వాసం. ‘చనిపోయిన నా భర్త భక్తిపరుడు’ అని ఆమె ఎలీషాకు చెప్పింది. తన భర్త విశ్వాస జీవితాన్ని బట్టి దేవుడు తన కుటుంబాన్ని అన్ని సమస్యల నుండి గట్టెక్కిస్తాడన్న ఆమె విశ్వాసమే ఆమెను కాపాడింది. వ్యక్తులుగా మనం అశక్తులమే కానీ విశ్వాసులముగా మనం మహా బలవంతులం!! దేవుడు తీర్చలేని కొరతలు, పరిష్కరించలేని సమస్యలు, కూల్చలేని అడ్డుగోడలు తన జీవితంలో ఉండవని విశ్వాసి తెలుసుకోవాలి. చైనాలో మిషనేరీగా గొప్ప పరిచర్య చేసిన హడ్సన్ టేలర్ ఇంగ్లాండ్ లోని తన భార్యకు ఒకసారి ఉత్తరం రాస్తూ, ‘చుట్టూ బోలెడు సమస్యలున్నాయి, జేబులో ఒక చిన్న నాణెం మాత్రమే ఉంది కాని నా గుండెలో దేవునిపట్ల కొండంత విశ్వాసముంది, అందువల్ల ఆనందంగా ఉన్నాను, నువ్వు దిగులుపడకు ’ అని ఆయన పేర్కొన్నాడు. కొండంత అవసరం లేదు, ఆవగింజంత విశ్వాసంతో లోకాన్నెదుర్కొనవచ్చని యేసుప్రభువే చెప్పాడు. – రెవ.డా.టి.ఎ.ప్రభుకిరణ్ -
జకీర్ నాయక్‌పై ఈడీ చార్జిషీట్
న్యూఢిల్లీ: వివాదాస్పద ఇస్లాం మత బోధకుడు జకీర్ నాయక్‌పై ఈసీ తొలిసారిగా నేరుగా అభియోగపత్రం దాఖలుచేసింది. రూ. 193 కోట్ల నల్లధనాన్ని జకీర్ నాయక్ అక్రమంగా రవాణా చేశారనీ, అలాగే భారత్‌తోపాటు ఇతర దేశాల్లోనూ అక్రమంగా స్థిరాస్తులను సంపాదించారని జకీర్ నాయక్‌పై ఈడీ అభియోగాలు మోపింది. అలాగే నాయక్ చేసిన పలు ద్వేష ప్రసంగాల వల్ల అనేకమంది ముస్లిం యవకులు చట్టవ్యతిరేక కార్యకాలపాలకు పాల్పడటం, ఉగ్రవాదులుగా మారడం జరిగిందని ఈడీ పేర్కొంది. జకీర్ ఆలోచనల వల్ల సమాజంలోని వివిధ మతాల ప్రజల మధ్య సామరస్యం దెబ్బతిన్నదనీ, వారి మధ్య విద్వేషం రగిలిందని ఈడీ తెలిపింది. -
ముఖ్యమైన వాళ్లు
మీకు తెలిసిన కథే. ఒక వైద్యుడు, ఒక న్యాయవాది, ఒక మతబోధకుడు, ఒక చిన్నపిల్లవాడు ఓ చిన్న విమానంలో ప్రయాణిస్తున్నారు. అనూహ్యంగా విమానంలో ఏదో లోపం తలెత్తింది. లోపల ఉండే నిపుణులు ప్రయత్నించారు కానీ మరమ్మతు చేయలేకపోయారు. చివరికి పైలట్ నుంచి ప్రకటన వెలువడింది. ‘‘నన్ను క్షమించండి. నా చేతుల్లో ఏమీ లేకుండా పోయింది’’ అని చెప్తూనే ప్యారాచ్యూట్ నుంచి కిందికి దూకేశాడు. దురదృష్టవశాత్తూ విమానంలో ఇంకా మూడు మాత్రమే ప్యారాచ్యూట్లు మిగిలి ఉన్నాయి. వెంటనే వైద్యుడు ఒక ప్యారాచ్యూట్ అందుకున్నాడు. ‘‘నా జీవితం చాలా ముఖ్యమైనది. నేను బతికి ఉండడం చాలా ముఖ్యం. నేను బతికి ఉంటే నా జీవితకాలంలో అనేకమందిని నా వైద్యంతో బతికించవచ్చు’’ అని చెప్పి విమానం నుంచి కింది దూకేశాడు. రెండో ప్యారాచ్యూట్ను న్యాయవాది లాగేసుకున్నాడు. ‘‘నేను తెలివైన వాడిని. నా వంటి తెలివైన వాడు లోకానికి అవసరం’’ అని నిముషం కూడా ఆలస్యం చేయకుండా దడేల్మని కింది దూకేశాడు. ఇక మిగిలింది ఒకటే ప్యారాచ్యూట్. మిగిలినవారు ఆ పిల్లవాడు, ఆ మత బోధకుడు. ‘‘త్వరగా ఆ ప్యారాచ్యూట్ తీసుకుని కిందికి దూకెయ్. నేను ఎంతో జీవితాన్ని గడిపాను. నువ్వు చిన్నపిల్లవాడివి నీకింకా చాలా జీవితం ఉంది. నువ్వు బతకాలి, దూకెయ్’’ అని తొందరపెట్టాడు మతబోధకుడు. ఆ బాలుడు మత బోధకునికి ప్యారాచ్యూట్ ఇచ్చి, ‘‘మీరూ దూకేయొచ్చు ఫాదర్. ఇంతక్రితం ఆ న్యాయవాది తీసుకెళ్లింది ప్యారాచ్యూట్ కాదు, నా లెదర్ బ్యాగ్’’ అని చెప్పాడు. తెలివైనవాళ్లమని, ప్రపంచానికి ముఖ్యులం అని అనుకుంటూ తిరిగేవాళ్లు చాలాసార్లు తమను తాము తెలుసుకోవడంలో తప్పటడుగు వేస్తారు. (కథ కోసం ఇందులో కొన్ని వృత్తులను పేర్కొడం జరిగింది తప్ప, ఎవరినీ వేలెత్తి చూపాలన్న ఉద్దేశం లేదు) -
ఫెడరర్... మరో రికార్డు
అత్యధిక గ్రాండ్‌స్లామ్ మ్యాచ్‌లు గెలిచిన ప్లేయర్‌గా గుర్తింపు వింబుల్డన్ ప్రిక్వార్టర్ ఫైనల్లోకి నేడు దిమిత్రోవ్‌తో పోరు సాయంత్రం గం. 5.30 నుంచి స్టార్ స్పోర్ట్స్ సెలెక్ట్–1లో ప్రత్యక్ష ప్రసారం లండన్: తనకెంతో కలిసొచ్చిన వింబుల్డన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నమెంట్ వేదికగా స్విట్జర్లాండ్ టెన్నిస్ దిగ్గజం రోజర్ ఫెడరర్ మరో రికార్డు తిరగరాశాడు. భారత కాలమానం ప్రకారం శనివారం అర్ధరాత్రి దాటాక ముగిసిన పురుషుల సింగిల్స్ మూడో రౌండ్ మ్యాచ్‌లో ఏడుసార్లు చాంపియన్ ఫెడరర్ 7–6 (7/3), 6–4, 6–4తో 27వ సీడ్ మిషా జ్వెరెవ్ (జర్మనీ)పై గెలిచాడు. ఈ క్రమంలో అత్యధికంగా 317 గ్రాండ్‌స్లామ్ మ్యాచ్‌ల్లో విజయం సాధించిన ప్లేయర్‌గా అతను గుర్తింపు పొందాడు. సెరెనా విలియమ్స్ (అమెరికా–316 విజయాలు) పేరిట ఉన్న రికార్డును ఫెడరర్ అధిగమించాడు. మార్టినా నవ్రతిలోవా (అమెరికా–306), క్రిస్ ఎవర్ట్ (అమెరికా–296), స్టెఫీ గ్రాఫ్ (జర్మనీ–280), వీనస్ విలియమ్స్ (అమెరికా–254), జొకోవిచ్ (సెర్బియా–236), జిమ్మీ కానర్స్ (అమెరికా–233), అగస్సీ (అమెరికా–224), ఇవాన్ లెండిల్ (చెకోస్లొవేకియా/అమెరికా–222 విజయాలు) టాప్–10లో ఉన్నారు. వింబుల్డన్ టోర్నీలో వరుసగా 19వ ఏడాది ఆడుతోన్న ఫెడరర్ ఈ టోర్నీలో మొత్తం 98 సింగిల్స్ మ్యాచ్‌లు ఆడి 87 విజయాలు సాధించాడు. అంతేకాకుండా 15వసారి ప్రిక్వార్టర్ ఫైనల్ దశకు అర్హత సాధించాడు. ఆదివారం విశ్రాంతి దినం తర్వాత సోమవారం పురుషుల, మహిళల సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్స్ జరగనున్నాయి. ప్రిక్వార్టర్ ఫైనల్లో 13వ సీడ్ దిమిత్రోవ్ (బల్గేరియా)తో ఫెడరర్ తలపడతాడు. ముఖాముఖి రికార్డులో ఫెడరర్ 5–0తో ఆధిక్యంలో ఉన్నాడు. మరోవైపు మిక్స్డ్ డబుల్స్ విభాగంలో సానియా మీర్జా (భారత్)–ఇవాన్ డోడిగ్ (క్రొయేషియా) జంట ప్రిక్వార్టర్ ఫైనల్‌కు చేరింది. శనివారం జరిగిన రెండో రౌండ్లో సానియా–డోడిగ్ ద్వయం 7–6 (7/5), 6–2తో యుసుకె వటానుకి–మకోటో నినోమియా (జపాన్) జోడీపై విజయం సాధించింది. -
'నేను టీచర్నే.. ప్రీచర్ని కాదు'
న్యూఢిల్లీ: 'నిషేధిత మావోయిస్టు పార్టీకి ఆయన జనరల్ పోస్ట్ ఆఫీస్ (జీపీవో) లాగా పనిచేస్తున్నాడు. ఆయుధాలతో అడవుల్లో తిరిగేవాళ్లకు.. నగరాల్లో ఉంటూ వాళ్లను సమర్థించేవాళ్లకు మధ్య వారధిగా ఉంటున్నాడు' ఇవీ.. ఢిల్లీ యూనివర్సిటీ ఇంగ్లీష్ ప్రొఫెసర్ జి. సాయిబాబాపై పోలీసులు మోపిన అభియోగాలు. విచారణ ఖైదీగా నాగపూర్ జైలులో దాదాపు ఏడాదిన్నరపాటు దుర్భర కాలాన్ని గడిపిన ఆయన బాంబే హైకోర్టు ఆదేశాల ప్రకారం తాత్కాలిక బెయిల్ పై జులై 4న విడుదలయ్యారు. తన అరెస్టు, జైలు జీవితంపై ఆదివారం తొలిసారిగా స్పందించారు. 'పోలీసులు చెబుతున్నట్లు నేను పోస్టాఫీస్ లాంటివాణ్నే అయితే నన్ను అరెస్టు చేయడం దేనికి? ఆ విధంగా మరింత సమాచారాన్ని రాబట్టే అవకాశాన్ని పోలీసులు కోల్పోయినట్లేకదా! ఇక్కడ మనం ఒక విషయాన్ని గమనించాలి. ఒక వ్యక్తి లేదా ఒక గ్రూప్ సాగించే హింస కంటే ప్రభుత్వ హింసే విసృతమైనది. నిజానికి నేను బోధకుడ్ని (టీచర్‌ను) మాత్రమే. సిద్ధాంతాల ప్రబోధకుడ్ని (ప్రీచర్ ను) కాదు. నాతో చదువుకున్న, నాకు తెలిసిన చాలామంది మావోయిస్టు పార్టీలో చేరారు. వారిలో చాలామంది చనిపోయారు కూడా. ఆ పరిచయాలతోపాటు హక్కుల పోరాటంలో ముందుండటం వల్లే పోలీసులకు నామీద అలాంటి అభిప్రాయం కలిగి ఉండొచ్చు. నిజానికి నిర్బంధం ఏ రూపంలో ఉన్నా వ్యతిరేకించవలసిందే. అణిచివేతకు గురయ్యేది మావోయిస్టులు కానివ్వండి లేదా ఆరెస్సెస్ కానివ్వండి ఎవరి తరఫునైనా పోరాడేందుకు నేను సిద్ధంగా ఉంటా. చర్చలతో సమస్యలు పరిష్కారమవుతాయని నా నమ్మకం. అంతమాత్రాన మావోయిస్టులు, ప్రభుత్వానికి మధ్య మధ్యవర్తిగా వ్యవహరించలేను' అని చెప్పుకొచ్చారు ప్రొఫెసర్ సాయిబాబా. జైలులో తనను ఎవరు కూడా ఎలాంటి శారీరక వేధింపులకు గురిచేయలేదని ఆయన స్పష్టం చేశారు. -
గుడ్ మార్నింగ్... 2015!
బాధ జీవితానికి పర్యాయ పదమైనప్పుడు మనం కోల్పోయే వాటన్నింటిలోకీ సుస్థిర ఆదర్శం ఆ భగవంతుడే. న్యాయం మనకు తీవ్ర అవసరం కాబట్టే, నర కాన్ని అత్యంత క్రూరమైనదిగా ఊహిస్తాం. ప్రతి మతమూ ఇహ లోక కాలంలోని కొన్ని రోజులను ఏటా తాత్కాలిక స్వర్గం కోసం కేటాయిస్తుంది. ఆ రోజుల్లో మనుషులు తమ అంతఃచేతనలోని దేవ దూతల నేపథ్య బృందగానంలో కరుణను, ప్రేమను గుర్తిస్తారు. అధికారికంగానే ఆ కాలాన్ని ఔదార్యం, శాంతులతో కూడినవిగా ప్రకటిస్తారు. మానవుడు భగవంతుని అద్భుత సృష్టి. మనం భగవంతుణ్ణి విశ్వసించడానికి కారణం మాత్రం అది కాదు. నైతికంగా రెండు భిన్న ధ్రువాలుగా చీలిపోయి ఉన్న మానవ జాతి ఇంతవరకు తాను సాధించిన దాని నుండి ఇంకా నేర్చుకోవాల్సింది పెద్దగా ఏం లేదు. గతంలో సుల్తాన్ మొహ్మద్ గజనీ భారత దేశాన్ని కొల్లగొట్టి వెళ్లాక, సూఫీ శాంతి ప్రబోధకుడు ఖ్వాజా మొయినుద్దీన్ చిస్తీ వచ్చాడు. వర్తమానంలోనైతే నరహంతక తాలిబాన్‌కు ముందటి గాంధేయ వాది ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్‌ను అలాగే చెప్పుకోవచ్చు. ఇలాంటి పోలిక తేవడం... ఉద్రిక్తపూరితమైన ఈ భూమి అనే తిరిగే గోళం మీద మంచీచెడు సగం-సగం, ఒకదానికొకటి సరి అనే బూటకపు సమానత్వా న్ని సూచించనూ వచ్చు. హింసను, దాని ఆటవిక చుట్టపట్టాలను చల్లార్చడంతోనే లేదా వ్యవహరించడంతోనే మన సమయంలో చాలా ఖర్చయిపోతోంది. బాధ జీవించడానికి పర్యాయ పదమైనప్పుడు మనం కోల్పోయే వాటన్నిటిలోకీ సుస్థిర ఆదర్శం ఆ భగవంతుడే. న్యాయం మనకు తీవ్ర అవసరం. కాబట్టే నర కాన్ని మనం అత్యంత క్రూరమైనదిగా ఊహిస్తాం. ప్రతి మతమూ ఇహలోక కాలంలోని కొన్ని రోజుల భాగాన్ని ఏటా తాత్కాలిక స్వర్గం కోసం విడిగా కేటాయిస్తుంది. ఆ రోజుల్లో మనుషులు తమ అంతఃచేతనలోని దేవదూతల నేపథ్య బృందగానంలో కరుణను, ప్రేమను గుర్తిస్తారు. అధికారికంగానే ఆ కాలాన్ని ఔదార్యం, శాంతులతో కూడినవిగా ప్రకటిస్తారు. దాతృత్వం అనే పదం దర్పాన్ని సూచించే చికాకైన పదం. అందుకు ఇస్లాం సిద్ధాంతం పరిష్కారాన్ని సూచించింది. చీదర పుట్టించే విధంగా అహంకార ప్రదర్శనకు తావే లేకుండా నిర్మూలించడం కోసం దాతృత్వం గుప్తంగానే జరగాలని శాసించింది. ఇవ్వడానికి తగిన పద్ధతి ఉండేట్టయితే, తీసుకోడానికి కూడా అలాగే తగిన పద్ధతి ఉండాలి. తీసుకునేదాన్ని అది బాల దృష్టితో, హృదయంతో చూసేదిగా ఉండాలి. బాలలు కోరినది కావాలనుకుంటారంతే. డబ్బు విషయం వారికి పట్టదు. అలాంటప్పుడు విలువను లెక్కగట్టేది సంతోషంతోనే తప్ప, వ్యయంతో కాదు. మనకు కనిపించేదానికి భిన్నంగా పిల్లలు వాస్తవికవాదులు. పెద్దవారు దురాశతో లేదా ఆకాంక్షతో లేదా పైకి ఎగబాకడం లేదా కిందికి దిగజారడం వల్ల ప్రేరేపితులై ఉంటారు. కాబట్టి బెలూన్ అవసరమైన చోట అంతరిక్ష నౌక కావలసి వస్తుంది. అదే పిల్లాడైతే బెలూన్‌నే రోదసి నౌకగా మార్చేసుకోగలుగుతాడు. పిల్లవాడికి అతి మంచి కానుక... ఏ చెట్టుకో వేలాడదీసినది, చక్కగా ప్యాకింగ్ చేసి ఉన్నది కానవసరం లేదు. దాన్ని ఇచ్చిన సమయమనేదే ముఖ్యం. క్రిస్మస్కు కేంద్ర బిందువు జీసస్ క్రిస్ట్ జననం. ఆ కథనం స్థానికతను ఎప్పుడో అరుదుగా గానీ ప్రశ్నించరు. ఎందుకంటే పాత నిబంధన దాన్ని ముందుగానే చెప్పింది. రాజులు భగవంతుని పాదాల ముందు బంగారం, సాంబ్రాణి, గుగ్గిలం సమర్పించి కొలవడం ఆ వేడుక పాటలో ఉన్నాయి. ఆ బిడ్డకు తల్లి మేరీ అతను తన ఒడి నుండి శిలువనెక్కేవరకు ఏం ఇచ్చింది? ముగ్గురు జ్ఞానులు లేదా రుషులు లేదా రాజులు సమర్పించిన మూడు ద్రవ్యాలు అప్పటికే చాలా కాలంగా ఏ ఒక్క మతానికో చెందనివి అన్న గుర్తింపును పొందిన సుప్రసిద్ధ కానుకలు. జ్ఞాపకాలన్నిటిలాగే, ఈ విషయంలో కూడా ఒకటికి మించిన కథనాలున్నాయి. ఒక నక్షత్రాన్ని అనుసరించి ముగ్గురు రాజులు బెత్లహామ్‌కు చేరారని సెయింట్ మాథ్యూ నిబంధన తెలుపుతోంది. విశ్వాసాన్ని నిర్దిష్టమైన పుట్టుపూర్వోత్తరాల గొలుసుగా చూపాలని పండితులకు తెగ ఆత్రుత. ఆ ముగ్గురు రుషులు పర్షియాకు చెందినవారని, పవిత్రాగ్నికి కావలిదారులని, ఖగోళశాస్త్రం, జ్యోతిష్యశాస్త్రం, వైద్యశాస్త్రాలలో ఉద్దండులని వారు భావిస్తున్నారు. పర్షియా లేక భారతదేశం నుండి వారు వచ్చి ఉండాలి. నేడు దేవుడేలేని చైనా, కమ్యూనిస్టు వ్యామోహంతో వెంటబడుతున్న సిల్క్ రూట్ వెంబడే వాళ్లు అక్కడికి చేరి ఉండాలి. ఏదేమైనా వాళ్లు తూర్పు దిక్కు నుంచి వచ్చిన వారేనని అంతా అంగీకరిస్తారు. క్రైస్తవ మతం పాశ్చాత్య విశ్వాసంగా ఎంత ప్రబలంగా విస్తరించిందంటే... అది మనం దాని ఆసియా మూలాలను మరిచిపోయేట్టు చేస్తుంటుంది. ఆ మతానికి చెందిన ప్రథమ కుటుంబాన్ని గోధుమ వర్ణపు ఛాయలతో ప్రాచీన చర్చి మత చిత్రకళ సరిగ్గానే చిత్రించింది. ఆ తదుపరి తొలి పునరుజ్జీవనోద్యమ కాలంనాటి శ్వేత వర్ణ ఛాయలతో కూడిన చిత్రాలకు అవి భిన్నమైనవి. మేరీ తల అప్పుడూ, ఇప్పుడూ నిరాడంబరమైన శిరోవస్త్రాన్ని ధరించి ఉంటుంది. అది ఆమె యుగపు అలవాటు. ఖురాన్లో మేరీ గురించి ఒక అధ్యాయం ఉన్నదని, ముస్లింలు జీసన్‌ను (ఇసాగా పిలుస్తారు) తమ గొప్ప ప్రవక్తలలో ఒకరిగా మన్నిస్తారని కూడా మనం అంతే సులువుగా మరుస్తుంటాం. ఖురాన్, ఇసాను రుహుల్లా లేదా అల్లా ఆత్మగా స్తుతిస్తుంది. జీసస్‌ను శిలువ వేశారని ముస్లింలు అంగీకరించరు. ఆయనను రక్షించి, తిరిగి ఆరోగ్యవంతుణ్ణి చేశారని, ఆ తదుపరి ఆయన రోమన్ సామ్రాజ్యానికి వెలుపల తన బోధనను కొనసాగించడానికి తూర్పు దిశకు వెళ్లాడని చెబుతుంది. క్రిస్మస్ వివాదాలకు సంబంధించినది కాదు. ముస్లిం టర్కీ ఒకప్పటి తమ అత్యంత సుప్రసిద్ధ పూర్వీకులలో ఒకరైన శాంతాక్లాజ్ ఖ్యాతికి సంతోషించనిద్దాం. క్రిస్మస్ కానుకలకు ఉండే దైవాంశను కలిగిన స్లెడ్జిబండిపై పయనించే ముసలాయన నార్డిక్ జాతివాడు కాదు. ఆయన సెయింట్ నికోలస్. 270లో దక్షిణ టర్కీలో, అది ప్రధానంగా క్రైస్తవ ప్రాంతంగా ఉన్న కాలంలో జన్మించి, మైరాకు బిషప్‌గా ఎదిగాడు. నేడు ఆ పట్టణాన్ని దెమ్రెగా అని పిలుస్తారు. స్థానికులు తమ హీరోను ‘‘నోయెల్ బాబా’’గా గౌరవిస్తారు. ఆయన చ ర్చి పర్యాటకులకు ప్రధాన ఆకర్షణ. బిషప్ తన మహిమతో తండ్రులు నరికేయగా మరణించిన ముగ్గురు కుమారులను బతికించాడు. అందుకే మరణించిన కొద్దికాలానికే ఆయనను పవిత్ర ప్రబోధకునిగా గుర్తించారు. మరొక గాథ, వరకట్నం చెల్లించలేక బానిసలుగా అమ్మేస్తున్న ముగ్గురు కుమార్తెలకు సంబంధించినది. ఆయన సంచి నిండా బంగారాన్ని వారి ఇంటికి తెచ్చాడు. ఆ తర్వాత అంతా సంతోషంగా గడిపారు. ఆసక్తి ఉన్నవారికి మరొక విశేషం... సెయింట్ నికోలస్ ఎన్నడూ ఎర్ర గౌను వేసుకొని ఎరగడు. అది కోకా కోలా మార్కెటింగ్ శాఖ పాప్ సంస్కృతికి చే సిన చేర్పు. ఎప్పటిలాగే మనమంతా భవిష్యత్తుపట్ల ఆత్రుతతో 2015 కోసం వేచి చూస్తూ, సుహృద్భావాన్ని కోరడం, శాంతి కోసం ప్రార్థించడం మరీ పెద్ద కోరికేమోనని ఎవరైనాగానీ ఆశ్చర్యపోవాల్సిందే. కాబట్టి నేను కూడా ఓ పిల్లవాడిలాగా సాధ్యమైనదానితోనే సరిపెట్టుకుంటాను. భారతదేశంలో శాంతి విలిసిల్లాలని, వచ్చే 51 వారాల్లో భారతీయులందరి మధ్యనా సుహృద్భావం నెలకొనాలని కోరుకుంటాను. ఇక ఆ 52వ వారం సంగతి అదే చూసుకుంటుంది.