Punjab government
-
ఢిల్లీలో దీపావళి కాలుష్యం.. తీవ్రంగా మండిపడ్డ సుప్రీంకోర్టు
న్యూఢిల్లీ: దీపావేళ వేళ బాణాసంచా నిషేధం అమలు విషయంలో ఢిల్లీ ప్రభుత్వంపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. దేశ రాజధానిలో బాణాసంచా కాల్చడంపై ఉన్న నిషేధం అమలుకావడం లేదని తెలిపింది. బాణాసంచా కాల్చడం వల్ల దీపావేళ తర్వాత ఢిల్లీలో గాలి నాణ్యత తీవ్రంగా క్షీణించిందని తెలిపింది. ఈ ఏడాది బాణాసంచా వినియోగంపై పూర్తి నిషేధం అమలుకు తీసుకున్న చర్యలను తెలుపుతూ అఫిడవిట్ దాఖలు చేయాలని ఆప్ ప్రభుత్వాన్ని, ఢిల్లీ పోలీస్ కమిషనర్‌ను సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించింది. అలాగే వచ్చే ఏడాది నిషేధానికి సంబంధించి కూడా ప్రతిపాదిత చర్యలను తెలపాలని జస్టిస్ అభయ్ ఓకా, జస్టిస్ అగస్టిన్ జార్జ్ మసీతో కూడిన ధర్మాసనం పేర్కొంది.కాగా దీపావళి సందర్భంగా బాణాసంచా కాల్చడం వల్ల ఢిల్లీ వాసులు తీవ్ర కాలుష్యాన్ని ఎదుర్కొంటున్నారు. నగరంలోని పలు ప్రాంతాల్లో ఏక్యూఐ(గాలి నాణ్యత సూచీ) 400 తీవ్రమైన మార్కును దాటడంతో సోమవారం గాలి నాణ్యత అధ్వాన్నంగా మారైంది. ప్రపంచంలోనే అత్యంత కాలుష్యమైన నగరంగా మారింది. దీనిపై సుప్రీంకోర్టు స్పందిస్తూ.. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది ఢిల్లీలో కాలుష్య స్థాయి గరిష్ఠ స్థాయికి చేరుకుందని తెలిపింది. గత రెండేళ్లతో పోలిస్తే ఇది చాలా ఎక్కువగా ఉందని పేర్కొంది. అంతేగాక దీపావళి నాటికి పంట వ్యర్థాల కాల్చివేతలు కూడా పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేసింది. గత పది రోజులలో పంట వ్యర్థాల దగ్దం కేసుల నమోదును తెలుపుతూ అఫిడవిట్లను దాఖలు చేయాలని పంజాబ్, హర్యానా ప్రభుత్వాలను సుప్రీంకోర్టు ఆదేశించింది. అలాగే ఢిల్లీ పరిధిలో పొలాల దహనం కేసుల నమోదును తెలపాలని ఢిల్లీ ప్రభుత్వాన్ని కోరింది. తదుపరి విచారణను నవంబర్ 14కు వాయిదా వేసింది. -
చట్టాల కోరలు తీశారు
న్యూఢిల్లీ: దేశంలో పర్యావరణ చట్టాల్లో సవరణలు చేసి, చివరకు వాటిని కోరల్లేనివిగా మార్చేశారని కేంద్ర ప్రభుత్వంపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసింది. పొరుగు రాష్ట్రాల్లో పంట వ్యర్థాలను దహనాన్ని నియంత్రించడానికి తీసుకొచి్చన ‘దేశ రాజధాని, పరిసర ప్రాంతాల్లో వాయు నాణ్యత నిర్వహణ కమిషన్(సీఏక్యూఎం) చట్టం–2021’ను ఎందుకు కఠినంగా అమలు చేయడం లేదని ప్రశ్నించింది. సీఏక్యూఎం చట్టం విషయంలో కేంద్రం తీరును న్యాయస్థానం తప్పుపట్టింది. చట్టం అమలుకు అవసరమైన యంత్రాంగాన్ని ఏర్పాటు చేయకుండానే ఈ చట్టాన్ని తీసుకొచ్చారని ఆక్షేపించింది. ఢిల్లీలో కాలుష్యం తీవ్రత, పంట వ్యర్థాల దహనం సమస్యపై జస్టిస్ అభయ్ ఎస్.ఓకా నేతృత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం బుధవారం విచారణ చేపట్టింది. కేంద్ర ప్రభుత్వం తరఫున అదనపు సొలిసిటర్ జనరల్ ఐశ్వర్య భాటీ వాదనలు వినిపించారు. సీఏక్యూఎం చట్టంలోని సెక్షన్ 15కు సంబంధించి మరికొన్ని నియంత్రణలను మరో 10 రోజుల్లో జారీ చేయబోతున్నట్లు తెలిపారు. ఈ చట్టాన్ని ప్రభావవంతంగా అమలు చేయడానికి ప్రత్యేకంగా ఒక అధికారిని నియమించడంతోపాటు అన్ని రకాల చర్యలు తీసుకుంటామని వివరించారు. పంజాబ్, హరియాణా అధికారులకు, కాలుష్య నియంత్రణ మండళ్లకు సీఏక్యూఎం ఇప్పటికే లేఖలు రాసిందని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. పంట వ్యర్థాలను దహనం చేస్తూ కాలుష్యానికి కారణమవుతునవారిపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదో చెప్పాలని ఆదేశించిందని అన్నారు. ధర్మాసనం స్పందిస్తూ.. క్షేత్రస్థాయిలో ఏం జరుగుతోందో తమకు తెలుసని పేర్కొంది. కాలుష్యాన్ని అరికట్టడంలో విఫలమవుతున్న అధికారులపై చర్యలు తీసుకోవాలని తేల్చిచెప్పింది. చటాన్ని ఉల్లంఘించే వారిపై పర్యావరణ పరిహార పన్నును మరింత పెంచేలా చట్టంలో సవరణ చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. పంజాబ్, హరియాణా ప్రభుత్వాల తీరుపైనా సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. పంట వ్యర్థాల దహనాన్ని ఎందుకు అరికట్టడం లేదని నిలదీసింది. సీఏక్యూఎం ఆదేశాలను ఆయా ప్రభుత్వాలు అమలు చేయడం లేదని మండిపడింది. కాలుష్య నియంత్రణ విషయంలో పంజాబ్, హరియాణా ప్రభుత్వాలు చేపడుతున్న చర్యలు కేవలం కంటితుడుపు తప్ప అందులో కార్యశీలత లేదని ఆక్షేపించింది. పంట వ్యర్థాలను దహనం చేసేవారికి కేవలం రూ.2,500 చొప్పున జరిమానా విధించడం ఏమిటని ప్రశ్నించింది. కేవలం నామమాత్రంగా జరిమానా విధించి, కాలుష్యానికి లైసెన్స్ ఇస్తున్నారా అని న్యాయస్థానం మండిపడింది. -
అమృత్‌పాల్ నిర్భందం ఏడాది పొడగింపు
చండీగఢ్: సిక్కు తీవ్రవాద ప్రబోధకుడు అమృత్‌పాల్ సింగ్ నిర్భందాన్ని ఏడాది పాటు పొడగిస్తూ పంజాబ్ ప్రభుత్వం ఈనెల 3న ఉత్తర్వులు జారీచేసింది. అయితే బుధవారం వీటిని బహిరంగ పర్చారు. వారిస్ దే పంజాబ్ చీఫ్ అమృత్‌పాల్, అతని తొమ్మిది మంది అనుచరులు జాతీయ భద్రతా చట్టం కింద అరెస్టయ్యి ప్రస్తుతం అస్సాంలోని డిబ్రూగఢ్ జైలులో ఉన్నారు. జైలులో ఉంటూనే అమృత్‌పాల్ లోక్‌సభ ఎన్నికల్లో పంజాబ్‌లోని ఖదూర్ సాహిబ్ స్థానం నుంచి స్వతంత్ర అభ్యరి్థగా పోటీచేసి సమీప కాంగ్రెస్ ప్రత్యరి్థపై 1.97 లక్షల మెజారిటీతో ఎంపీగా విజయం సాధించాడు. ఫలితాలు ఈనెల 4న వెలువడగా.. 3వ తేదీనే అమృత్‌పాల్ నిర్భందాన్ని ఏడాదిపాటు పొడగిస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. -
మూసేవాలా తల్లి ఐవీఎఫ్ చికిత్సపై నివేదిక ఇవ్వండి
న్యూఢిల్లీ: దివంగత పంజాబీ గాయకుడు సిద్ధూ మూసేవాలా తల్లి చరణ్ కౌర్‌కు 58 ఏళ్ల వయసులో ప్రసవానికి కారణమైన ఇన్విట్రో ఫెర్టిలైజేషన్ (ఐవీఎఫ్) చికిత్సపై వివరణాత్మక నివేదిక ఇవ్వాలని పంజాబ్ ప్రభుత్వాన్ని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ కోరింది. అసిస్టెడ్ రిప్రొడక్టివ్ టెక్నాలజీ సేవలు పొందే మహిళ వయసు 21– 50 మధ్య ఉండాలి. మూసేవాలా హత్యకు గురైన రెండేళ్లకు ఆయన తల్లి చరణ్ కౌర్ మార్చి 17న మగబిడ్డను ప్రసవించారు. -
బిల్లుల ఆమోదంలో జాప్యం.. గవర్నర్ల తీరుపై సుప్రీంకోర్టు ఘాటు వ్యాఖ్యలు
న్యూఢిల్లీ: పలు రాష్ట్రాల్లో గవర్నర్ల తీరుపై సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. గవర్నర్లకు ఆత్మపరీశీలన అవసరమని వ్యాఖ్యానించింది. పంజాబ్ గవర్నర్ బన్వరీలాల్ పురోహిత్ బిల్లుల ఆమోదించడంలో చేస్తున్న జాప్యంపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి భగవంత్ మాన్ నేతృత్వంలోని ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ సందర్భంగా అత్యున్నత న్యాయస్థానం సోమవారం ఈ ఘాటు వ్యాఖ్యలు చేసింది. రాష్ట్రాల అసెంబ్లీలు ఆమోదించిన బిల్లుల అంశం తమ వద్దకు చేరక ముందే గవర్నర్లు తప్పనిసరిగా చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. బిల్లుల ఆమోదంలో జాప్యంపై దాఖలైన కేసుపై సీజేఐ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది. ‘బిల్లుల విషయాలు సుప్రీంకోర్టు వద్దకు రాకముందే గవర్నర్లు చర్యలు తీసుకోవాలి. గవర్నర్లు అలా వ్యవహరించినప్పుడే ఈ సమస్యలు పరిష్కారం అవుతాయి. గవర్నర్లకు ఆత్మ పరిశీలన అవసరం. అలాగే వారు ఎన్నికైన ప్రజాప్రతినిధులు కాదన్న విషయం వారు తెలుసుకోవాలి’ అని ధర్మాసనం పేర్కొంది. పెండింగ్ బిల్లులపై పంజాబ్ గవర్నర్ పురోహిత్ తీసుకున్న చర్యలకు సంబంధించిన తాజా పరిస్థితిపై నివేదికను నవంబర్ 10 నాటికి సమర్పించాలని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతాను సుప్రీంకోర్టు ఆదేశించింది. అప్పటి వరకు విచారణను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. చదవండి: ప్రమాదస్థాయిలో వాయు కాలుష్యం.. ఢిల్లీలో మళ్లీ సరి-బేసి విధానం ఇదిలా ఉంటే... ముఖ్యమంత్రి భగవంత్ మాన్ నేతృత్వంలోని పంజాబ్ ప్రభుత్వానికి ఆ రాష్ట్ర గవర్నర్ పురోహిత్ మధ్య ఇటీవలి కాలంలో విబేధాలు తలెత్తాయి. ఈ నేపథ్యంలో ఆమ్ ఆద్మీ ప్రభుత్వం అసెంబ్లీలో ఆమోదించిన 27 బిల్లుల్లో 22 బిల్లులకు గవర్నర్ ఆమోదం తెలిపారు. కానీ... అక్టోబరు 20న నాల్గవ బడ్జెట్ ప్రత్యేక సమావేశాల్లో ప్రవేశపెట్టేందుకు ప్రభుత్వం ప్రతిపాదించిన మూడు ద్రవ్య బిల్లులకు మాత్రం ఆమోదం తెలుపలేదు. మూడు ద్రవ్య బిల్లులకు ఆమోదించకుండా అక్టోబరు 19న పంజాబ్ ముఖ్యమంత్రికి గవర్నర్ లేఖ రాశారు. బడ్జెట్ సమావేశాలను పొడిగించడమనేది అక్రమం, చట్ట విరుద్దమని పేర్కొన్నారు. అసెంబ్లీలో ప్రవేశపెట్టేముందు ప్రతిపాదిత చట్టాలన్నింటినీ మెరిట్‌పై పరిశీలిస్తానని చెప్పారు. ఈ నేపథ్యంలో అక్టోబర్ 20, 21న రెండు రోజులపాటు జరుగాల్సిన బడ్జెట్ పొడిగింపు సమావేశాలను పంజాబ్ ప్రభుత్వం కుదించింది. గవర్నర్ ఆమోదించని వాటిలో పంజాబ్ ఆర్థిక, బడ్జెట్ నిర్వహణ (సవరణ) బిల్లు 2023, పంజాబ్ వస్తు సేవల పన్ను (సవరణ) బిల్లు 2023, ఇండియన్ స్టాంప్ (పంజాబ్ సవరణ) బిల్లు 2023 బిల్లులు ఉన్నాయి వీటి ఆమోదంపైనే పంజాబ్ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. అయితే నవంబర్ 1న పురోహిత్ మూడు ద్రవ్య బిల్లులలో రెండింటికి ఆమోదం తెలిపారు. ద్రవ్య బిల్లులు అసెంబ్లీలో ప్రవేశపెట్టాలంటే అందుకు గవర్నర్ ఆమోదం తప్పనిసరి అన్న విషయం తెలిసిందే. -
పంజాబ్‌ను నీళ్లడిగాం..పొగ కాదు: హరియాణా మినిస్టర్
చండీగఢ్: పంజాబ్‌లోని ఆప్ ప్రభుత్వంపై హరియాణా మంత్రిప్రకాష్ దలాల్ మండిపడ్డారు.తాము పంజాబ్‌ను నీళ్లడిగామని, పొగ కాదని సెటైర్ వేశారు. మూడురోజులుగా పంజాబ్,హరియాణాల్లోని పొలాల్లో తగలబెడుతున్న పంటవ్యర్థాల గణాంకాలను దలాల్ శనివారం ట్విటర్లో వెల్లడించారు.పంజాబ్‌లోనే ఎక్కువగా పంట వ్యర్థాలు కాల్చేస్తున్నారని ఆరోపించారు. కాగా,దలాల్ ఆరోపణలపై పంజాబ్ సర్కారు స్పందించింది.హరియాణా మంత్రి అన్నీఅబద్ధాలు వ్యాప్తి చేస్తున్నారని మండిపడింది. దేశంలోని 52 అత్యంత కాలుష్య జిల్లాల్లో ఎక్కువ హర్యానాలో ఉన్నవేనని కౌంటర్ ఇచ్చింది. -
ఆరోగ్య పంజాబ్ సృష్టికి తీవ్ర కృషి: సీఎం మాన్
అమృత్సర్: పంజాబ్‌ను ఆరోగ్యకరంగా, శక్తివంతంగా మార్చేందుకు తమ ప్రభుత్వం తీవ్ర కృషి చేస్తోందని ముఖ్యమంత్రి భగవంత్ సింగ్ మాన్ చెప్పారు. ప్రతి రంగంలోనూ రాష్ట్రం సమగ్ర అభివృద్ధి సాధించడమే తమ లక్ష్యమన్నారు. శుక్రవారం అమృత్‌సర్‌లో ఆయన ఆప్ జాతీయ కన్వీనర్, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌తో కలిసి 400 ఆమ్ ఆద్మీ క్లినిక్‌లను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగించారు. ఎన్నికల సమయంలో తమ పార్టీ ఇచ్చిన హామీలన్నిటినీ మాన్ సర్కార్ నెరవేరుస్తుందని కేజ్రీవాల్ చెప్పారు. ఆప్‌పై ఎన్నో ఆశలు పెట్టుకున్న పంజాబ్ ప్రజలు ఆకాంక్షలు నెరవేరేందుకు కొద్దిగా ఓపిక పట్టాలన్నారు. అధికారంలోకి వచ్చిన 10 నెలల్లోనే 500 ఆమ్ ఆద్మీ క్లినిక్కులను ఏర్పాటు చేయనుండటం సంతోషకరమని చెప్పారు. -
భగత్‌సింగ్‌ను ఉరితీసిన రోజున పంజాబ్ సీఎం సంచలన ప్రకటన.. దేశంలోనే ఫస్ట్..?
ఛండీగఢ్: పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ భారీ విజయాన్ని అందుకుంది. ఈ క్రమంలో సీఎంగా భగవంత్ మాన్ బాధ్యతలు స్వీకరించారు. కేజ్రీవాల్, భగవంత్ మాన్ ఆలోచనలతో పంజాబ్‌లో వినూత్న కార్యక్రమాలు చేపడుతోంది ఆప్ ప్రభుత్వం. ఇప్పటికే ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పి, మంత్రులకు టార్గెట్ విధించిన ఆప్ సర్కార్ తాజాగా మరో కీలక ప్రకటన చేసింది. బుధవారం భగత్ సింగ్ బలిదానం చేసిన రోజైన షహీద్ దివస్ (మార్చి 23) సందర్భంగా ఖట్కర్ కలాన్‌లో సీఎం మాన్ నివాళి అర్పించారు. ఈ సందర్భంగా భగత్ సింగ్, రాజ్ గురు, సుఖ్ దేవ్ ల విగ్రహాల వద్ద నివాళి అర్పించిన అనంతరం పంజాబ్‌లో అవినీతిపరుల ఆట కట్టించేందుకు యాంటీ కరప్షన్ హెల్ప్ లైన్ నంబర్(9501200200)ను సీఎం ప్రకటించారు. అందులో భాగంగానే యాంటీ కరప్షన్ యాక్షన్ లైన్ పేరుతో ఒక వాట్సాప్ నంబర్(9501200200)ను విడుదల చేశారు. ఈ క్రమంలో ఆయన ట్విట్టర్ ఓ వీడియో పోస్ట్ విడుదల చేశారు. పంజాబ్‌లో ఎవరైనా లంచం అడిగినా, మరేదైనా అవినీతికి పాల్పడినట్లు ప్రజల దృష్టికి వస్తే ఈ వాట్సాప్ నంబర్‌కు వీడియో లేదా ఆడియో రికార్డింగ్ చేసి పంపించాలన్నారు. అనంతరం సీఎం పర్యవేక్షణలో ఉన్న ఓ టీమ్ వాటిని పరిశీలించి తగు చర్యలు తీసుకుంటుందని వెల్లడించారు. పంజాబ్‌ను అవినీతిమయం కాకుండా కాపాడుకుందామని సీఎం పిలుపునిచ్చారు. పంజాబ్‌ను అవినీతి రహితం చేస్తే అదే మనం స్వాతంత్ర్య సమర యోధులకు ఇచ్చి నివాళి అంటూ వ్యాఖ్యలు చేశారు. AAP PUNJAB GOVT LAUNCHES ANTI-CORRUPTION ACTION LINE! 📞 WhatsApp: 9501-200-200 "कोई रिश्वत मांगे तो मना मत करना! उसकी Audio/Video Recording कर लेना, हम उसके ख़िलाफ़ एक्शन लेंगे!" - CM @BhagwantMann #AAPagainstCorruption pic.twitter.com/TsXHUKH9Iq — AAP (@AamAadmiParty) March 23, 2022 -
పంజాబ్‌లో టీకా తీసుకోకుంటే లీవ్‌పై వెళ్లాల్సిందే
చండీగఢ్: కోవిడ్ టీకా ఒక్క డోసు కూడా తీసుకోని ప్రభుత్వ ఉద్యోగులను సెలవుపై పంపించాలని పంజాబ్ ప్రభుత్వం కఠిన నిర్ణ యం తీసుకుంది. వైద్య సంబంధ, ఇత రత్రా కారణాలున్న వారికి మినహా అందరికీ ఈ నిబంధన వర్తిస్తుందని స్పష్టం చేసింది. ఈనెల 15వ తేదీ నుంచి ఇది అమల్లోకి వస్తుందని తెలిపింది. మహమ్మారి నుంచి ప్రజలను కాపాడటానికే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సీఎం అమరీందర్ సింగ్ తెలిపారు. ఇప్పటి వరకు టీకా తీసుకోకుండా తప్పించుకుంటు న్న వారిని, కనీసం ఒక్క డోసైనా తీసుకునే వరకు లీవ్‌పై పంపిస్తామని తెలిపారు. రాష్ట్రం లో కోవిడ్ వ్యాప్తిని నివారిం చేందుకు అమల్లో ఉన్న ఆంక్షలను ఈ నెల 30వ తేదీ వరకు పొడిగిస్తున్నట్లు కూడా ఆయన చెప్పారు. అన్ని రకాల సభలు, సమా వేశాల్లో ప్రస్తుతం ఉన్న పరిమితికి సడలింపు ఇస్తున్నట్లు పేర్కొన్నారు. -
కరెంట్ ఆదా చేస్తే కాసులొస్తాయ్!
పథకం ఇదీ.. పంజాబ్ రాష్ట్ర ప్రభుత్వం ఆరు గ్రామీణ ఫీడర్ల పరిధిలో పైలట్ ప్రాజెక్టుగా ఒక ప్రత్యేక పథకాన్ని చేపట్టింది. ఆ ఫీడర్ల పరిధిలోని రైతుల పంపుసెట్లకు ఏఎంఆర్ (ఆటోమేటిక్ మీటర్ రీడింగ్) మీటర్లను బిగించింది. పంపుసెట్ల సామర్థ్యం, పంటల సాగుకు అవసరమయ్యే నీటి పరిమాణాన్ని లెక్కించి.. ఒక నెలలో అవసరమయ్యే సగటు విద్యుత్ పరిమాణాన్ని నిర్ధారించింది. ఈ నిర్దేశిత పరిమాణం కన్నా తక్కువ విద్యుత్ వినియోగిస్తే.. ఆదా చేసిన ఒక్కో యూనిట్ విద్యుత్‌కు రూ.4 చొప్పున ప్రోత్సాహకంగా అందిస్తామని ప్రకటించింది. నిర్దేశించినపరిమాణం కన్నా అధికంగా విద్యుత్ వినియోగించుకున్నా ఎలాంటి చర్యలు ఉండవని రైతులకు భరోసా ఇచ్చింది. రెండేళ్లలో 4 వేల మంది రైతులు 9.68 లక్షల యూనిట్ల విద్యుత్ ఆదాచేసి.. రూ.38.72 లక్షలు ప్రోత్సాహకంగా పొందారు. సాక్షి, హైదరాబాద్: ‘విద్యుత్ ఆదా చేయండి.. భూగర్భ జలాలను సంరక్షించండి.. ఆ మేర డబ్బులు పొందండి’ పంజాబ్ ప్రభుత్వం అమలు చేస్తున్న సరికొత్త పథకం ఇది. చాలా మంది రైతులు నిర్దేశిత పరిమాణం కన్నా తక్కువ విద్యుత్‌ను వాడి.. పొదుపు చేసిన విద్యుత్‌కు సంబంధించిన నగదు ప్రోత్సాహకాన్ని అందుకున్నారు. పంజాబ్‌లో ఈ పథకం విజయ వంతంగా కొనసాగుతోందని.. ఇతర రాష్ట్రాల్లో కూడా అమలు చేయాలని నీతి ఆయోగ్ సిఫార్సు చేసింది. భూగర్భ జలాల పరిరక్షణతోపాటు విద్యుత్ పొదుపును ప్రోత్సహించడానికి దోహదపడుతుందని సూచించింది. చదవండి: చలానా పెండింగ్ ఉంటే బండి సీజ్ వృథా అవుతుండటంతో.. పంజాబ్ రాష్ట్రంలో దేశంలోనే అత్యధిక విస్తీర్ణంలో వరి, గోధుమ పంటల సాగు జరుగుతోంది. నీటి అవసరం అధికంగా ఉండే ఈ పంటల కోసం అక్కడి రైతులు.. పెద్ద మొత్తంలో భూగర్భ జలాలను, విద్యుత్‌ను వినియోగిస్తున్నారు. వ్యవసాయానికి ఉచిత విద్యుత్ సరఫరా చేస్తుండడంతో.. రైతులు నిరంతరం మోటార్లు నడిపిస్తున్నట్టు అక్కడి అధికారులు గుర్తించారు. అవసరానికి మించి భూగర్భ జలాలను తోడుతుండడంతో.. ఓవైపు భూగర్భ జలాలు అడుగంటుతున్నాయని.. మరోవైపు విద్యుత్ వృధా అవుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. దీనికి పరిష్కారంగా పంజాబ్ ప్రభుత్వం ‘పానీ బచావో.. పైసే కమావో’పథకాన్ని తెరపైకి తెచ్చింది. ప్రపంచబ్యాంక్ భాగస్వామ్యంతో మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎంఐటీ) ఆధ్వర్యంలోని ‘అబ్దుల్ లతీఫ్ జమీల్ పావర్టీ యాక్షన్ ల్యాబ్ (జే–పాల్)’ దీనికి రూపకల్పన చేసింది. పైలట్ ప్రాజెక్టుగా.. పంజాబ్ స్టేట్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ (పీఎస్‌పీసీఎల్) 2018లో ఆరు గ్రామీణ ఫీడర్ల పరిధిలో పైలట్ ప్రాజెక్టుగా ఈ పథకాన్ని చేపట్టింది. ఆయా ఫీడర్ల పరిధిలోని రైతుల పంపుసెట్లకు ఏఎంఆర్ (ఆటోమేటిక్ మీటర్ రీడింగ్) మీటర్లను బిగించింది. పంపుసెట్ల సామర్థ్యం, పంటల సాగుకు అవసరమయ్యే నీటి పరిమాణాన్ని లెక్కించి.. ఒక నెలలో అవసరమయ్యే సగటు విద్యుత్ పరిమాణాన్ని నిర్ధారించింది. ఈ నిర్దేశిత పరిమాణం కన్నా తక్కువ విద్యుత్ వినియోగిస్తే.. ఆదా చేసిన ఒక్కో యూనిట్ విద్యుత్‌కు రూ.4 చొప్పున ప్రోత్సాహకంగా అందిస్తామని ప్రకటించింది. నిర్దేశించిన పరిమాణం కన్నా అధికంగా విద్యుత్ వినియోగించుకున్నా ఎలాంటి చర్యలు ఉండవని రైతులకు భరోసా ఇచ్చింది. చదవండి: డేంజర్ డెంగీ 4 వేల మంది రైతులు.. పంజాబ్ ప్రభుత్వం ప్రతి నెలా ఏ రైతు ఎంత విద్యుత్ ఆదా చేశారు, ఎంత సొమ్ము పొందుతున్నారన్న దానిపై ప్రతినెలా వారికి ఎస్ఎంఎస్లు పంపుతోంది. ఇప్పటివరకు పైలట్ ప్రాజెక్టును అమలు చేస్తున్న 6 ఫీడర్ల పరిధిలో 4వేల మందికిపైగా రైతులు విద్యుత్ ఆదా చేసి ప్రోత్సాహకాలు పొందారు. 2018 నుంచి 2020 వరకు వారు ఏకంగా 9.68 లక్షల యూనిట్లు విద్యుత్ ఆదాచేసి.. రూ.38.72 లక్షలను ప్రోత్సాహకంగా అందుకున్నారు. ప్రోత్సాహకానికి అర్హత సాధించని ఇతర రైతులు కూడా భారీగానే విద్యుత్, భూగర్భ జలాలను పొదుపు చేసి ఉంటారని అధికారులు చెప్తున్నారు. పంజాబ్‌లో మొత్తం 5,900 గ్రామీణ ఫీడర్ల పరిధిలో 14.16 లక్షల బోరుబావులు ఉన్నాయి. దశలవారీగా అన్ని ఫీడర్ల పరిధిలో పథకాన్ని అమలు చేస్తామని అధికారవర్గాలు తెలిపాయి. దీర్ఘకాలికంగా దీని ఫలితాలు చాలా బాగుంటాయని, త్వరలోనే మరో 250 ఫీడర్ల పరిధిలో అమలు చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని వెల్లడించాయి. ఈ పథకం అమలుకు ‘ది ఎనర్జీ అండ్ రిసోర్స్ ఇన్స్టిట్యూట్ (టెరీ), పంజాబ్ వ్యవసాయ వర్సిటీ, ఐటీ పవర్ ఇండియా (ఐటీపీఐ)’సంస్థలు సహకారం అందిస్తున్నాయి. ఇక్కడా అమలు చేస్తే ప్రయోజనమే.. తెలంగాణలో 25.34 లక్షల వ్యవసాయ కనెక్షన్లకు ఉచిత విద్యుత్ సరఫరా అవుతోంది. గతంలో వ్యవసాయానికి రోజుకు రెండు విడతల్లో ఆరేడు గంటల పాటు మాత్రమే సరఫరా ఉండేది. కానీ ఇప్పుడు 24 గంటల విద్యుత్ సరఫరా చేస్తున్నారు. ఇలా 24 గంటల సరఫరాతో వ్యవసాయ విద్యుత్ డిమాండ్ నాలుగు రేట్లు పెరిగిపోయిందని విద్యుత్ పంపిణీ సంస్థలు (డిస్కంలు) ఇటీవలే విద్యుత్ నియంత్రణ మండలి (ఈఆర్సీ)కి నివేదించాయి. ఈ నేపథ్యంలోనే పంజాబ్ తరహాలో మన రాష్ట్రంలోనూ పైలట్ ప్రాజెక్టును చేపట్టాలని.. ఫలితాలను బట్టి విస్తరించాలని విద్యుత్ రంగ నిపుణులు సూచిస్తున్నారు. మొత్తం రాష్ట్రానికి సరఫరా చేస్తున్న విద్యుత్‌లో మూడో వంతు వరకు వ్యవసాయానికే ఖర్చవుతోందని.. ఈ పథకాన్ని అమలు చేస్తే విద్యుత్‌తోపాటు భూగర్భ జలాలు ఆదా అవుతాయని చెప్తున్నారు. దీనివల్ల అటు కరెంటు సంస్థలు, ఇటు రైతులకు కూడా ప్రయోజనమని పేర్కొంటున్నారు. విద్యుత్, భూగర్భ జల వినియోగం తగ్గించుకోవాలి ‘‘రాష్ట్రంలో వ్యవసాయానికి విద్యుత్, భూగర్భ జలాల వినియోగం బాగా పెరిగిపోయింది. చాలాచోట్ల భూగర్భ జల మట్టాలు అడుగంటిపోయి బోరుబావుల్లో నీళ్లు రావడం లేదు. విచ్చలవిడి వినియోగాన్ని తగ్గించుకోవాల్సిన అవసరం ఉంది. రైతులకు కొత్తసాగు పద్దతులు, విధానాల పట్ల అవగాహన కల్పించాలి. విద్యుత్ పొదుపు కోసం పంజాబ్ అమలు చేస్తున్న పథకాన్ని మనదగ్గర అమలు చేయగలమా పరిశీలించాలి. అయితే ఏ పంట సాగుకు ఎంత నీళ్లు, ఎంత విద్యుత్ అవసరమన్న అంశాలను ఖరారు చేయడంలో సమస్యలు రావచ్చు. భూగర్భ జలాలు ఎక్కువ ఉంటే తక్కువ విద్యుత్‌తోనే అవసరం తీరుతుంది. కానీ భూగర్భ జలాలు తక్కువగా ఉన్నచోట రైతులు విద్యుత్ పొదుపు చేయడం కుదరకపోవచ్చు. -డి.నరసింహారెడ్డి, విద్యుత్ రంగ నిపుణుడు -
‘నేనే వెనక్కి తీసుకోమన్నాను’
న్యూఢిల్లీ: ‘రాజీవ్‌ఖేల్‌రత్న’ అవార్డు కోసం ఈ ఏడాది భారత సీనియర్ స్పిన్ బౌలర్ హర్భజన్ సింగ్ పేరును ప్రతిపాదించిన పంజాబ్ ప్రభుత్వం ఇప్పుడు దానిని ఉపసంహరించుకుంది. అయితే ఇందులో ప్రభుత్వం తప్పేమీ లేదని, వారు నిబంధనల ప్రకారమే వ్యవహరించారని భజ్జీ వివరణ ఇచ్చాడు. ‘కొంత మంది ఈ అంశాన్ని వివాదం చేయాలని చూస్తున్నారు. ఈ విషయంలో ప్రభుత్వం సరిగానే పని చేసింది. ఖేల్‌రత్న నిబంధన ప్రకారం గత మూడేళ్ల కాలంలో అంతర్జాతీయ ప్రదర్శనను పరిగణనలోకి తీసుకోవాలి. అలా చూస్తే నాకు అర్హత లేదు. అందుకే నేనే దరఖాస్తు వెనక్కి తీసుకోమని వారికి విజ్ఞప్తి చేశాను. ప్రభుత్వం దానికి అంగీకరించింది’ అని హర్భజన్ వెల్లడించాడు. అయితే భారత జట్టు తరఫున 2016 మార్చిలో చివరి మ్యాచ్ ఆడిన హర్భజన్ పేరును అసలు అర్హతే లేకుండా ఇప్పుడు ఎందుకు ప్రతిపాదించారనేదే ప్రాధమిక సందేహం. 40 ఏళ్ల హర్భజన్ భారత్ తరఫున మూడు ఫార్మాట్లలో కలిపి మొత్తం 711 వికెట్లు పడగొట్టాడు. -
సీఎం కోసం రూ.80 కోట్లతో కొత్త వాహనాలు
చంఢీగర్ : పంజాబ్ ప్రభుత్వం దాదాపు 80 కోట్ల రూపాయలు వెచ్చించి 400 లక్జరి కార్లను కొంటున్నట్లు సమాచారం. రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు అంతంత మాత్రంగా ఉన్న సమయంలో ఇంత భారీ మొత్తం ఖర్చు చేయడం పట్ల సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యమంత్రి, అతని మంత్రి వర్గం, అధికారుల కోసం ఈ లక్జరి కార్లను కొంటున్నట్లు సమాచారం. ఇప్పటికే 16 ల్యాండ్ క్రూయిజర్ల కొనుగోలుకు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ 16 వాహనాల్లో రెండు బుల్లెట్ ప్రూఫ్ వాహనాలు కూడా ఉన్నాయి. వీటిని పంజాబ్ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరేందర్ సింగ్ కోసం వినియోగించనున్నట్లు సమాచారం. అలానే ముఖ్యమంత్రి అధికారుల కోసం 13 మహీంద్ర స్కార్పియో వాహనాలను, స్పెషల్ డ్యూటీ అధికారుల కోసం 14 హోండా మారుతీ కార్లను కొనుగోలు చేయనున్నట్లు సమాచారం. ఇదిలా ఉండగా పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి ప్రకాష్ సింగ్ బాదల్‌కు, అకాలీదళ్ అధ్యక్షుడు సుఖ్బీర్ సింగ్ బాదల్‌లకు బుల్లెట్ ప్రూఫ్ వాహనాలను ఇచ్చేందుకు అమరేందర్ సింగ్ ప్రభుత్వం నిరాకరించింది. అంతేకాక మాజీ ముఖ్యమంత్రి, అకాలీదళ్ అధ్యక్షులు బుల్లెట్ ప్రూఫ్ వాహనాలనే వాడుతున్నారని.. అవి మంచి స్థితిలోనే ఉన్నాయని పంజాబ్ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి మన్‌ప్రీత్ సింగ్ బాదల్ వెల్లడించారు. ఈ కొత్త వాహనాల కొనుగోలు వల్ల ప్రభుత్వ ఖజానాపై రూ. 80 కోట్ల అదనపు భారం పడుతున్నట్లు ఆర్థిక శాఖ అంచనా వేసింది. 2018, మార్చి నాటికే ప్రభుత్వ ఖజానా రు. 1,95,978 కోట్ల లోటు బడ్జెట్లో ఉన్నట్లు తెలిసింది. -
బుక్కయిన మహిళల టీ20 కెప్టెన్..!
భారత మహిళల టీ20 కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ చిక్కుల్లో పడ్డారు. ఈ ఏడాది మార్చి 1వ తేదీన హర్మన్‌ప్రీత్ పంజాబ్ డీఎస్పీగా బాధ్యతల చేపట్టిన సంగతి తెలిసిందే. కాగా ఇప్పుడు ఆమె ఆ ఉద్యోగం కొల్పోయే అవకాశం కనబడుతోంది. ఉద్యోగం చేపట్టే సమయంలో ఆమె సమర్పించిన సర్టిఫికెట్లు నకిలీవని పోలీసుల వెరిఫికేషన్‌లో తెలింది. ఆమె సమర్పించిన డిగ్రీ సర్టిఫికెట్ బోగస్ అని నిర్ధారించిన పోలీసులు ఈ విషయాన్ని ఆ రాష్ట్ర హోంశాఖ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో హర్మన్‌ప్రీత్‌ను ఆ ఉద్యోగం నుంచి తొలగిస్తారనే ప్రచారం జరుగుతోంది. దీనిపై పంజాబ్ డీజీపీ ఎంకే తివారీ ఓ జాతీయ దినపత్రికతో మాట్లాడుతూ.. ‘హర్మన్‌ప్రీత్ తాను మీరట్‌లోని చౌదరి చరణ్ సింగ్ యూనివర్సిటీలో డిగ్రీ పూర్తి చేసినట్టు సర్టిఫికెట్ అందజేసింది. కానీ వెరిఫికేషన్‌లో ఆ యూనివర్సిటీ అధికారులు హర్మన్‌ప్రీత్ సమర్పించిన డిగ్రీ సర్టిఫికెట్ రిజిస్ర్టేషన్ నంబర్ తమ రికార్డులో లేదని తెలిపారు. ఈ నివేదికను సంబంధిత శాఖలకు అందజేశామ’ని తెలిపారు. తర్వాత స్పందిస్తాను : హర్మన్‌ప్రీత్ దీనిపై హర్మన్‌ప్రీత్ వివరణ కోరగా.. ‘అలాంటిది ఎం జరగలేదు. మీకు ఎవరు చెప్పారో నాకు తెలియదు. నేను సంబంధిత అధికారులతో మాట్లాడిన తర్వాత మీతో మాట్లాడుతాను’ అని తెలిపారు. -
ఓబీసీల వార్షికాదాయ పరిమితి పెంపు
సాక్షి,చండీఘర్: ఓబీసీల వార్షికాదాయ పరిమితిని రూ 6 లక్షల నుంచి రూ 8 లక్షలకు పెంచుతూ తీసుకున్న నిర్ణయంపై పంజాబ్ సీఎం అమరీందర్ సింగ్ ఆమోద ముద్ర వేశారు.రిజర్వేషన్ల ప్రయోజనాలను ఎక్కువ మంది అర్హులకు వర్తింపచేసే ఉద్దేశంతో సామాజిక న్యాయాన్ని విస్తృతం చేయాలన్న కేంద్ర ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా అమరీందర్ సర్కార్ ఈ నిర్ణయం తీసుకుందని ప్రభుత్వ ప్రతినిధి వెల్లడించారు.ఓబీసీ కింద పరిగణించే వారి వార్షిక ఆదాయ పరిమితిని రూ 6 లక్షల నుంచి రూ 8 లక్షలకు పెంచాలని ఈ ఏడాది ఆగస్ట్‌లో కేంద్ర క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది. 1993లో ఓబీసీ క్రీమిలేయర్ రూ లక్ష కాగా, 2004లో దీన్ని 2.5 లక్షలకు పెంచగా , 2008లో 4.5 లక్షలకు, 2011లో ఓబీసీల క్రీమిలేయర్ పరిధిని రూ 6 లక్షలకు పెంచారు. రిజర్వేషన్ ప్రయోజనాలను ఓబీసీలో సమంగా పంపిణీ చేయడం సవాలేనని అధికారులు పేర్కొన్నారు. -
కోహినూర్ కాంట్రవర్సీ: హైకోర్టు కీలక ఉత్తర్వులు
'కోహినూర్ డైమండ్ ను బ్రిటిషర్లు మన దేశం నుంచి కొల్లగొట్టారని అంటున్నారు. ప్రభుత్వం మాత్రం దాన్ని ఎవ్వరూ ఎత్తుకెళ్లలేదు.. బహుమతిగా ఇచ్చాం అంటోంది. 1849లో లాహోర్ ఒప్పందంలో భాగంగా ఈస్ట్ ఇండియా కంపెనీకి వజ్రాన్ని బహుమతిగా ఇచ్చామని ప్రభుత్వం ప్రకటించింది. పరిశీలించాల్సిన అంశమేమంటే..అసలు ఒక కంపెనీకి, రాజుకు మధ్య జరిగిన ఒప్పందం ఇప్పుడు చెల్లుబాటు అవుతుందా? అసలు అవిభాజ్య పంజాబ్ లో ఎలాంటి నిబంధనలు అమలయ్యాయి? వాటి ప్రకారం కోహినూర్ వజ్రం ఈస్ట్ ఇండియాకు ఇవ్వడం సరైందేనా? ఈస్టిండియాతో ఇక్కడి వాళ్లు ఏమేం ఒప్పందాలు చేసుకున్నారు? వీటికి సంబంధించిన సమగ్రసమాచారాన్ని మాకు ఇవ్వండి' అంటూ కోహినూర్ వజ్రం విషయంలో లాహోర్ హైకోర్టు పంజాబ్ ప్రభుత్వానికి బుధవారం కీలక ఉత్తర్వులు జారీచేసింది. 'కోహినూర్ పాకిస్థాన్ దే..' ప్రపంచఖ్యాతి పొందిన కోహినూర్ వజ్రం పాకిస్థాన్ కే చెందుతుందని, ప్రస్తుతం బ్రిటిష్ రాజవశస్తుల నివాసం 'టవర్ ఆఫ్ లండన్'లో ఉన్న కోహిన్ వజ్రాన్ని పాక్ కు తిరిగి తెప్పించేలా ఉత్తర్వులు ఇవ్వాలంటూ ఒక వ్యక్తి లాహోర్ హైకోర్టులో పిటిషన్ దాఖలుచేశాడు. దానిని విచారణకు స్వీకరించిన కోర్టు పంజాబ్ ప్రభుత్వాన్ని వివరణ కోరింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రతినిధులు బుధవారం కోర్టుకు సమాధానం ఇస్తూ.. 'లాహోర్ ఒప్పందంలో భాగంగా కోహినూర్ వజ్రాన్ని బ్రిటన్ కు బహుమానంగా ఇచ్చినట్లు పేర్కొన్నారు. దీనికి పిటిషనర్.. దులీప్ సింగ్, ఈస్టిండియాల మధ్య జరిగిన ఒప్పందం చెల్లుబాటుకాదని వాదించారు. కామన్ వెల్త్ సభ్యుడిగా పాక్ మళ్లీ కోహినూర్ ను పొందే అవకాశం ఉంటుందని, ఆమేరకు ప్రభుత్వాలను ఆదేశించాలని కోరారు. పిటిషనర్ వాదనతో ఏకీభవించిన కోర్టు పాత ఒప్పందాలన్నింటినీ సమర్పించాలని పంజాబ్ ప్రభుత్వాన్ని ఆదేశించింది. కోహినూర్ మాదేనంటూ భారత్, పాకిస్థాన్ లేకాక ఆఫ్ఘనిస్థాన్, ఇరాన్ లు కూడా వాదిస్తున్న సంగతి తెలిసిందే. ఇదీ కోహినూర్ ప్రస్థానం.. గుంటూరు జిల్లాలోని కొల్లూరు గనులులో ఈ ప్రఖ్యాత వజ్రం లభించింది. మాల్వా రాజు మహలక్ దేవ్ దీని తొలి యజమానిగా కొందరు చరిత్రకారులు భావిస్తారు. తర్వాతికాలంలో కాకతీయుల సామ్రాజ్యానికి చేరింది. క్రీస్తు శకం 1310లో కాకతీయ చక్రవర్తి ప్రతాపరుద్రుడు.. ఢిల్లీ సుల్తాన్‌తో సంధి చేసుకున్న సమయంలో అపార సంపదతో పాటు కోహినూర్ వజ్రాన్ని కూడా సమర్పించుకున్నాడు. 1526లో ఈ వజ్రం మొఘల్ సామ్రాజ్య స్థాపకుడు బాబర్ వశం అయి.. బాబర్ వజ్రంగా పేరు పొందింది. మొఘల్ సామ్రాజ్యం ప్రాభవాన్ని కోల్పోతున్న సమయంలో నాదిర్ షా దీన్ని సొంతం చేసుకోవాలనుకున్నాడు. అది నెరవేరలేదు గానీ దానిని చూసే భాగ్యం మాత్రమే ఆయనకు దక్కింది. నిజానికి కోహినూర్ కు ఆ పేరు (కోహ్-ఇ-నూర్ అంటే కాంతి శిఖరం) పెట్టింది కూడా నాదిర్ షాయే. 1840లో నాటి అవిభక్త పంజాబ్ లో జరిగిన సిక్కుల యుద్ధంలో తనకు సహకించినందుకుగానూ దులీప్ సింగ్ అనే రాజు ఈస్ట్ ఇండియా కంపెనీకి కోహినూర్ వజ్రాన్ని బహుమతిగా ఇచ్చాడని కొందరు చెబుతారు. అయితే దులీప్ నుంచి ఆ వజ్రాన్ని బ్రిటిషర్లు కొట్టేశారని మరొకొందరు వాదిస్తారు. ఏదిఏమైనప్పటికీ 1913లో బ్రిటిష్ గవర్నర్ జనరల్ లార్డ్ డల్హౌసీ ద్వారా ఈ వజ్రం విక్టోరియా రాణికి బహుమతిగా వెళ్లింది. అప్పటి నుంచి లండన్‌లోనే ఉండిపోయిన కోహినూర్ ను తిరిగి తేలేమని కేంద్ర ప్రభుత్వం ఇటీవల సుప్రీంకోర్టుకు తేల్చిచెప్పంది. -
భారత్‌లో దాడులకు ఐఎస్ఐ కుట్ర
♦ లష్కరే, జైషే, హిజ్బుల్లతో పాటు సిక్కు ఉగ్రవాదులకూ శిక్షణ ♦ 15 నుంచి 20 మంది వరకూ ఉగ్రవాదుల సమీకరణ న్యూఢిల్లీ : పాకిస్తాన్ గూఢచర్య సంస్థ ఐఎస్ఐ భారత్‌లో ఉగ్రదాడులు జరపటానికి.. లష్కరే తోయిబా, జైషేమొహమ్మద్, హిజ్బుల్ ముజాహిదీన్ ఉగ్రవాద సంస్థలతో పాటు.. సిక్కు తీవ్రవాద సంస్థలైన బబ్బర్‌ఖల్సా, ఖలిస్తాన్ జిందాబాద్ ఫోర్స్ ఉగ్రవాదులను సమీకరించి శిక్షణనిప్పిస్తోందని నిఘా సమాచారం తెలిసినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. ఆ వర్గాల కథనం ప్రకారం.. ఢిల్లీ, పంజాబ్, జమ్మూకశ్మీర్‌లలో దాడులు జరపటానికి.. 15 నుంచి 20 మంది ఉగ్రవాదులను ఐఎస్ఐ సమీకరించింది. ఆయా సంస్థల్లో పనిచేసే పాక్, ఆక్రమిత కశ్మీర్ వాసులను ఎంపిక చేసింది. పాక్ నుంచి ఎంపిక చేసిన సిక్కు ఉగ్రవాదులకు.. సిక్కు సంప్రదాయాలు, గుర్ముఖీ గ్రంథం గురించి పాక్‌లోని కర్తార్‌పూర్ సాహిబ్ గురుద్వారాలో తర్ఫీదునిచ్చింది. ఇందుకోసం ఖలిస్తాన్ జిందాబాద్ ఫోర్స్ చీఫ్ రంజిత్‌సింగ్ సాయం తీసుకుంది. పంజాబ్ భౌగోళిక స్వరూపస్వభావాలను వివరించింది. ఈ ఉగ్రవాదులందరికీ భారత సరిహద్దు వెంట పాక్ ఆక్రమిత కశ్మీర్‌తో పాటు పాక్‌లోని ఇతర శిబిరాల్లో.. ఆయుధాలు, మందుగుండు సామగ్రిని వినియోగించటంపై శిక్షణనిస్తోంది. శిక్షణ కార్యక్రమం లష్కరే వ్యవస్థాపకుడు హఫీజ్ సయీద్ సాయంతో సాగుతోంది. ఈ ఉగ్రవాదుల్లో కొందరు ఇప్పటికే దాడుల కోసం పంజాబ్‌కు వచ్చి ఉండొచ్చని, లేదా ప్రవేశించే క్రమంలో ఉండి ఉంటారని.. పంజాబ్, కశ్మీర్‌లలోని భద్రతా సంస్థలను భారత నిఘా విభాగం హెచ్చరించింది. ఈ దాడుల కోసం వాడే ఆయుధాలను జమ్ముకశ్మీర్ నుంచి పంజాబ్‌కు వచ్చే ట్రక్కుల చాసిస్‌లలో తొలిచిన పగుళ్లలో దాచిపెట్టి పంపించే అవకాశముందని పేర్కొంది. ఈ సమాచారాన్ని జమ్ముకశ్మీర్ ప్రభుత్వంతో పాటు.. అక్కడ ఉన్న సైన్యం, కేంద్ర బలగాలకు ఈ నెల 24వ తేదీన తెలియజేసింది. పంజాబ్ ప్రభుత్వంతో పాటు అక్కడున్న బీఎస్ఎఫ్, డెరైక్టరేట్ జనరల్ ఆఫ్ మిలటరీ ఇంటెలిజెన్స్, సీఆర్పీఎఫ్ యూనిట్లకు ఈ నెల 26వ తేదీన తెలిపింది.