చండీగఢ్: కోవిడ్ టీకా ఒక్క డోసు కూడా తీసుకోని ప్రభుత్వ ఉద్యోగులను సెలవుపై పంపించాలని పంజాబ్ ప్రభుత్వం కఠిన నిర్ణ యం తీసుకుంది. వైద్య సంబంధ, ఇత రత్రా కారణాలున్న వారికి మినహా అందరికీ ఈ నిబంధన వర్తిస్తుందని స్పష్టం చేసింది. ఈనెల 15వ తేదీ నుంచి ఇది అమల్లోకి వస్తుందని తెలిపింది. మహమ్మారి నుంచి ప్రజలను కాపాడటానికే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సీఎం అమరీందర్ సింగ్ తెలిపారు. ఇప్పటి వరకు టీకా తీసుకోకుండా తప్పించుకుంటు న్న వారిని, కనీసం ఒక్క డోసైనా తీసుకునే వరకు లీవ్‌పై పంపిస్తామని తెలిపారు. రాష్ట్రం లో కోవిడ్ వ్యాప్తిని నివారిం చేందుకు అమల్లో ఉన్న ఆంక్షలను ఈ నెల 30వ తేదీ వరకు పొడిగిస్తున్నట్లు కూడా ఆయన చెప్పారు. అన్ని రకాల సభలు, సమా వేశాల్లో ప్రస్తుతం ఉన్న పరిమితికి సడలింపు ఇస్తున్నట్లు పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment